Monday, July 20, 2015

హెల్త్ టిప్స్

హెల్త్ టిప్స్



సంపూర్ణ ఆహారం


మాంసకృత్తులు
మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా  అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.
గ్ర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :

  • మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.
  • శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను  పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి  పొందవచ్చు.
  • ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
  • వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.
  • 16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల  మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.
  • గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక  రోజుకు
  • పాలిచ్చే తల్లులకు/బాలింతలకు  6 నెలల వరకు   75 గ్రాములు 1 రోజుకు
ఆహార పదార్ధాలు ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో
సోయాబీన్స్ 43.2
శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు 22
వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు 23
చేపలు 20
మాంసము 22
ఆవు పాలు 3.2
గేదె పాలు 4.3
కోడిగుడ్డు  ( సుమారు 44 గ్రాములు) 13.3     (ఒక గుడ్డుకు)

సూక్ష్మ పోషకాలు – సంరక్షక ఆహారాలు
మన శరీరానికి అతి సూక్ష్మమైన మోతాదులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ‘సూక్ష్మ పోషకాలు ‘ అంటారు. వ్యాధులతో పోరాడటానికి, అంటు వ్యాధులు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు అవసరం. అంతేగాక మనం తీసుకొనే అహారం చక్కగా జీర్ణమై, శక్తిని యివ్వడానికి ఇవి తోడ్పడతాయి. ఆరోగ్య పరిరక్షణ, దీర్ఘాయువుకు ఇవి చాల అవసరం.
విటమిన్ ఎ :
కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్  ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది.
విటమిన్ ఎ ప్రాముఖ్యత
:
  • సాధారణ కంటిచూపునకు విటమిన్ – ఎ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి, ఇతర చిక్కులకు దారితీస్తుంది.
  • మహిళలు గర్భవతులుగా ఉన్నప్ఫుడు, అంతకన్నాముందు కూడా విటమిన్ ఎ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కానుపు సమయంలో ఎదురయ్యే వ్యాధులను,మృత్యువు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
  • విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వార ఈ లోపాన్ని నివారించవచ్చు.
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే అహార పదార్ధాలు :
  • ఆకుకూరలు, పసుపురంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ మూలకం) సమృద్ధిగా ఉంటుంది.
  • బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ముఖ్యంగా మంసాహారంలోనే ఇది లభిస్తుంది.
  • పాలు, పాలతో చేసే పదార్ధాలు, గుడ్డులోని పచ్చని సొన, ఎర్రపామాయిల్, చేపలు, చేపనూనెల్లో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
వివిధ ఆహార పదార్ధాలలో బీటా-కెరోటిన్ పరిమాణం
వివిధ ఆహార పదార్ధాలలో బీటా-కెరోటిన్ పరిమాణం
ఆహార పదార్ధం పేరు ప్రతి 100 గ్రాముల్లో లభించే బీటా కెరోటిన్ (మై.గ్రాములు)
కొత్తిమీర 4800
కరివేపాకు 7110
మునగాకు 19690
మెంతికూర 9100
క్యారట్టు 6460
మామిడి పండు 1990
బొప్పాయి పండు 880
గుమ్మడికాయ 1160
విటమిన్ సి
శరీర ఆరోగ్యానికి ప్రధానమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ – సి ఒకటి. ఇది యాంటీ- ఆక్సిడెంట్ గుణం కలది. విటమిన్ సి లోపించినవారు స్కర్వి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి గలవారు శరీరమంతా నీరసంతో, పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ, ఎముకల ఎదుగుదల లేక బాధ పడతారు. గాయాలను మానపటానికి కొన్ని రకాల హార్మోన్ల మేళవింపునకు విటమిన్ సి సహాయపడుతుంది. అమినో యాసిడ్, కార్బో హైడ్రేట్లు (పిండిపదార్ధాలు) జైవికక్రియకు, అహారంలోని ఇనుముధాతువు శరీరంలో ఇమిడిపోవడానికి కూడా తోడ్పడుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు
:-నారింజ, ఉసిరి, నిమ్మకాయ లాంటి పులుపు పండ్లు అన్నిటిలోను విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా తీసుకొనే టమాటా, జామపండ్లు మొలకెత్తిన పప్పు ధాన్యాలు కూడా విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తాయి.
ఇనుము ధాతువు
శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర..ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం.శరీరంలో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50 శాతం జనాభా అనీమియాతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పనిసామర్ధ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్ధ్యం తగ్గుతుంది.
ఇనుముధాతువు ఎక్కువగా ఇచ్చే అహారం తినండి.

  • ఆకుకూరలు, ఎండుఫలాలు, కాయధాన్యములు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యములు కూడా ఇనుముకు చక్కని ఆధారాలు. ఐతే ఆకుకూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం ఇనుమును మత్రమే శరీరం గ్రహిస్తుందని గుర్తుంచుకోండి.
  • మాంసము, చేపలు, కోడి మాంసము/గుడ్డు నుంచి కూడా శరీరం ఇనుమును గ్రహిస్తుంది.
  • ఆకుకూరల ద్వారా లభించే ఇనుము శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి విటమిన్ సి పండ్లు తోడ్పడతాయి.
  • భోజనానికి ముందు/తర్వాత టీ, కాఫీ తాగరాదు.
అయోడిన్
  • థైరాయిడ్ హార్మోన్లు (థైరాక్సిన్) సమపాళ్ళలో చురుకుగా ఉండటానికి ఆహారంలో అయోడిన్ చాలా అవసరం. ఈ హార్మోన్లు శారీరక, మానసిక వృద్ధికి ఎంతో తోడ్పడతాయి.
  • ప్రతీ ఒక్కరికి రోజుకు 100-150 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరం. వయస్సు,శారీరక స్థితిని బట్టి ఈ మోతాదులో మార్పు ఉంటుంది.
  • మన దేశ ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సూక్ష్మ పోషక లోపాల్లో అయోడిన్ లోపం ముఖ్యమైనది.
  • గర్భవతుల ఆహారంలో అయోడిన్ లోపిస్తే పిండం ఎదుగుదల, శిశువు మానసిక పరిస్థితి దెబ్బతింటుంది.
  • అయోడిన్ లోపం హైపోథైరాడిజం, గాయిటర్ అనే వ్యాధులకు దారితీస్తుంది.పెరుగుదలను ఆటంక పరుస్తుంది.
  • మనం తినే ఆహారం ద్వార అయోడిన్ లభిస్తుంది.ముఖ్యంగా చేపలు లాంటి సముద్రపు ఉత్పత్తులు, మంచినీటినుంచి అయోడిన్ పొందవచ్చు.
  • గాయిటర్ వ్యాధి మూలకాలు (గాయిట్రోజెన్స్) క్యాబేజి, క్యాలిఫ్లవర్, కర్రపెండలముల్లో ఉంటాయి. మన ఆహారంలోని అయోడిన్ ఆహారంలో ఇమిడిపోకుండా గాయిట్రోజెన్స్ అడ్డుపడతాయి.
  • అయోడిన్ లోపాన్ని నివారించటానికి మార్కెట్లో లభించే అయోడైస్డ్ ఉప్పును ప్రతి రోజు వాడాలి.

కౌమారదశలో దూసుకుపోయే పెరుగుదల
భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ లక్షణాలివీ : పెరుగుదలలో పోషకాహారం పాత్ర : -
కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు,ఖనిజాలు,విటమిన్లు,శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం
వయస్సు శక్తి కిలోకాలరీలు
/రోజుకు
మంసకృత్తులు గ్రాములు
/రోజుకు
కొవ్వు గ్రాములు
/రోజుకు
కాల్షియం మిల్లీగ్రాములు
/రోజుకు
ఇనుము మి.గ్రా
/రోజుకు
విటమిన్ ఎ మై.గ్రా /రోజుకు (బీటా -కెరోటిన్)
10-12 ఏళ్ళ బాలురు
10-12 ఏళ్ళ బాలికలు
2190
1970
54
57
22
22
600
600
34
19
2400
2400
13-15 ఏళ్ళ బాలురు
13-15 ఏళ్ళ బాలికలు
2450
2060
70
65
22
22
600
600
41
28
2400
2400
16-18 ఏళ్ళ బాలురు
16-18 ఏళ్ళ బాలికలు
2640 2060 78 63 22 22 500 500 50 30 2400 2400
ఆధారం: భారతీయులకు ఆహార సంబంధమైన మార్గ దర్శ సూత్రాలు. ఎన్.ఐ.ఎన్, ఐ.సీ.ఎం.ఆర్ 1989

మనకు శక్తి ఎందుకు అవసరం?
మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం.శరీర ఉష్టోగ్రతను స్ధిరంగా ఉంచటానికి, జైవిక క్రియకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం,మన దేశంలో 50శాతం మంది మహిళలు,పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.
  • ఆహారంలో లభించే కాలరీలు. పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని ‘ క్యాలరీలు ‘ అంటారు.
  • ఒక మనిషికి ఎంత శక్తి అవసరమనేది అతడు/ఆమె ప్రతి రోజు పడే శారీరక శ్రమ పై ఆధారపడి  ఉంటుంది. వయస్సు ,లింగ భేదం శరీర బరువు, పెరుగుదల, శరీరం పని పాటలు ఒత్తిడిని బట్టి ఇది మారుతుంటుంది. భారత దేశంలో 70-80 శాతం మంది ప్రధాన గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తున్నారు.
  • పిల్లలు ,కౌమార దశ వారు 55-60/శాతం రోజువారి కాలరీలను పిండి పదార్ధాల ద్వారా పొందుతున్నారు.
  • కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగటానికి ఎక్కువ కాలరీలు అవసరం. ఉదాహరణకు 16-18 ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజు కనీసం 2060కిలో క్యాలరీలు గల ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అదే వయస్సు అబ్బాయిలకైతే 2640 కిలో కాలరీలు అవసరం.
  • గర్భవతులకు అదనపు క్యాలరీలు ఆహారం ఇవ్వాలి. పిండం ఎదుగుదలకు,గర్భవతి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం.
  • అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే పోషణ లోపానికి దారి తీస్తుంది.అధికంగా తీసుకుంటే ఊబకాయం (లావు) కు దారి తీస్తుంది.
అధిక శక్తిని ఇచ్చే ఆహర పదార్ధాలు :
  1. ప్రధాన గింజ ధాన్యాలు,చిరు ధాన్యాలు ,పప్పు దినుసులు,దుంప కాయగూరలు,వంట నూనేలు,వనస్పతి,నెయ్యి,వెన్న,నూనెలు విత్తనాలు,గింజకాయలు చెక్కర,బెల్లం తదితరాలు.
  2. మనకు కాలరీలు ఎక్కువగా గింజ ధాన్యాలు నుంచి లభింస్తున్నాయి.కనుక గింజ ధాన్యాలు,చిరు ధాన్యాల్లో వివిధ రకాలను వినియోగించేలా చొరవ చూపాలి.
  3. జోన్నలు,సజ్జలు లాంటి ముతక ధాన్యాలు,రాగులు లాంటి చిరు ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిచ్చేవి.

ఆహార పదార్ధాలు శక్తి (ప్రతి వందగ్రాములకు కి.కాలరిలలో)
బియ్యం
గోధుమ పిండి
జొన్న
సజ్జలు
రాగి
మొక్కజొన్న
345
341

349

361

328

342

కొవ్వుపదార్ధాలు – మనిషి ఆరోగ్యం
కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము
1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.
vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.
కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.
veg-ఆయిల్ – మనము  తీసుకొనే  ఆహారంలొ  చాలా  ముఖ్యమైనది.

దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,
1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)
2. పాలీ ఆన్ సాచ్యురేటడ్

ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils
సాచ్యురేటడ్ కొవ్వు అనగా – వెన్న, నెయ్యిపెద్దవయస్సువారు – కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.

హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.
వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.
తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -

ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -
యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు  సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.
పెద్దవాళ్ళకు – 20గ్రా రోజుకు.
గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు – 30 గ్రా రోజుకు.

గుర్తుంచుకోవలసినవి -
1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.
2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.
3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.
4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.
5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు

స్థూల కాయం మరియు పోషణ
శరీరంలో క్రొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే పరిస్ధితిని స్థూలకాయం అంటారు.వాఛనీయమైన లేదా ఉండవలసిన దానికన్న 20 శాతం  ఎక్కువగా శరీరం బరువు గల వారిని స్థూలకాయులు అనవచ్సు. స్థూలకాయం ఆరోగ్యపరమైన ఎన్నో దుష్ఫలితాలను కలిగిస్తుంది. అకాల మరణానికీ  దారితియవచ్సు. అధిక రక్త పీడనం , రక్తంలో ఎక్కువగా కోలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు చేరడం, గుండెజబ్బు,మధుమేహం,పిత్తాశయంలో రాళ్లు,కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చేప్రమాదాలు స్థూలకాయం వల్ల ఎక్కువవుతాయి.
కారణాలు
: -
  • అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం, తక్కువగా మాత్రమే శారీరకం గా శ్రమపడటం స్ధులకాయానికి దారితీస్తుంది.
  • తాము ఆహారం ద్వార తీసుకోనే శక్తికి, వివిధ పనుల ద్వార ఖర్చు పెట్టే శక్తికి మథ్య సమతుల్యం లేనప్పుడు స్థూలకాయం లేదా అధిక బరువు ఏర్పడుతుంది.
  • ఆహరంలో క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది.
  • వ్యక్తి సంక్లిష్టమైన నడవడిక,మానసిక పరిస్ధితి కూడా అతను అధికంగా ఆహారం తీసుకోవటానికి కారణం అవుతాయి.ఫలితంగా ఇది స్ధూలకాయానికి దారితీస్తుంది.
  • శక్తిని వాడుకొనే విషయంలో జైవికమైన పొరపాట్లు దేహంలో కొవ్వు చేరడానికి అనుకూలించవచ్చు. బాల్యము, కౌమార దశలో శరీర బరువు ఎక్కువగా ఉంటె అది పెద్దవాళ్ళు అయిన తరువాత స్థూలత్వానికి దారితీస్తుంది..
  • గర్భధారణ్కు ముందు, తర్వాత రుతుక్రమం (ముట్టు) ఆగిపోయిన తర్వాత మహిళ ల్లో స్థూలకాయం ఏర్పడుతుంది.
శరీర బరువును తగ్గించడం ఎలా?
  • నూనెలో వేయించిన ( ఫ్రై చేసిన) ఆహార పదార్ధాలను తక్కువ తినాలి.
  • పండ్లు, కూరగాయలను అధికంగా తినాలి.
  • పీచు (ఫైబర్) పదార్ధం ఎక్కువగా ఉండే ప్రధాన గింజ ధాన్యాలు, పప్పులు, మొలకెత్తిన ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • క్రమం తప్పని వ్యాయామం ద్వారా శరీర బరువును పరిమితులలో ఉంచాలి.
  • శరీరం బరువు తగ్గే పద్దతులేవైనా నిదానంగా, స్థిరంగా ఉండాలి.
  • తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యపరమైన దుష్పలితాలకు దారితీస్తుంది. మీ శారీరక పనులకు తగిన విధంగా అవసరమయ్యే వివిధ రకాల ఆహార పదార్ధాలను తీసుకోండి.
  • తక్కువ పరిమాణంలో భోజనాన్ని ఎక్కువ సార్లు తినండి.
  • చక్కెర, కొవ్వు పదార్దాలకు, మద్యసేవనానికి దూరంగా ఉండండి.
  • తక్కువ కొవ్వుగల పాలను వాడండి.
  • బరువు తగ్గించే ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగాను, పిండిపదార్ధాలు (కర్బో హైడ్రేట్లు), క్రొవ్వు తక్కువగాను ఉండాలి.

గర్భవతులకు – పోషకాహారం
గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు - భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న  జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని
సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను,  ఓకే  విధమైన ఆహారం
తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది.
బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన  – అవసరం చాలా ఉంది.
నష్టాలు -

1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం – ఇది – తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం  చాలా దోహద పడుతుంది.
3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం -
1. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
2. గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు  దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి -
1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. .
3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం అదనంగా తీసుకొవాలి.
4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు
ఇచ్చేంతవరకు పోడిగించాలి.
8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు,
అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు

Health Tips


బరువు తగ్గటానికి తేలిక పాటి ఆహారం:


       చాలామంది తమ శరీర బరువు తగ్గించుకోవటానికి సులభమైన మార్గం భోజనం మానెయ్యటమే అనుకుంటారు.కానీ ఇలా చేస్తే రోగాలపాలవటం ఖాయం.శరీరకాంతి విహీనమవుతుంది. ఏ పని చెయ్యలేక నీరసమవుతారు. ముందు పచ్చళ్ళు,అప్పడాలు,స్వీట్లు,చాక్లెట్లు,ఆల్కహాలు మానెయ్యాలి. ఉప్పు చాలా తగ్గించాలి. వంటాకాలు ఆలివ్ ఆయివ్ తో చెయ్యాలి. నాన్‌స్టిక్ పాన్‌లోనే తయారు చెయ్యాలి. రోజూ 5 లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి.

ఈ దిగువ ఇచ్చిన పట్టిక ప్రకారం ప్రతి 4 రోజులకూ అదే ఆహారం రిపీట్ చేస్తూ ఎక్సరసైజులు చేస్తుండాలి.అప్పుడు చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.


బ్రేక్‌ఫాస్టు లంచ్

కప్పురాగిమాల్ట్ కప్పు అన్నం, కప్పు మొలకెత్తిన పెసలు కప్పు పాలు నిమ్మరసం--ఉల్లిముక్కలు ఒక యాపిల్ కప్పు ఉడికించిన జొన్నరవ్వ.

సాయంత్రం డిన్నర్

రెండు బ్రెడ్ పీసులు ఒక కప్పు అన్నం,ఆకుకూర దోసకాయ ముక్కలు అన్ని కూరగాయలతో ఉడికించిన కూర ఒక కప్పు, కొంచెం ద్రాక్షపళ్ళు

2. బ్రేక్‌ఫాస్టు లంచ్

జొన్నరొట్టె కప్పు అన్నం, ఆకుకూర 10 ద్రాక్షపళ్ళు (నిమ్మకాయతో ఉడికించినది) కప్పుపాలు రెండు పైనాపిల్ ముక్కలు

సాయంత్రం రాత్రి

రెండు కప్పులు పెరుగు కప్పు అన్నం,కందిపప్పు, కూరగాయ (కూరగాయ ముక్కలతో)ముక్కలు, జొన్నరొట్టె

3. ఉదయం లంచ్

రెండు కప్పుల బొప్పాయి, అన్నం కప్పు, చపాతీ, అన్ని కూర ముక్కలు, గ్లాసు పాలు, ముక్కలతో ఉడికించిన కూర, ఒక నిమ్మకాయ కలిపి ఉడికించిన ఆకుకూర, 3 టమోటాలు,1క్యారెట్

సాయంత్రం డిన్నర్

రెండు దోసకాయ ముక్కలు కప్పు అన్నం, జొన్నరవ్వ అన్నం, రెండు క్యారెట్లు ఆకుకూర,కందిపప్పు,జొన్నరొట్టె

4. ఉదయం లంచ్

కప్పు ఉడికించిన జొన్నరవ్వ, కప్పుఅన్నం, కప్పు క్యారెట్ కోరు గ్లాసు పాలు,యాపిలు (పెరుగుతో)కప్పు కూరముక్కలు ఉడికించి నిమ్మరసం కలిపినవి, ఉడికించిన పెసలు

సాయంత్రం

రెండు బ్రెడ్ పీసులు, రెండు దోసకాయముక్కలు

డిన్నర్

కప్పు చిక్కుళ్ళు ఉడికించినవి టమోటాతో ఒక ఉడికించిన ఆలుగడ్డ ఒక కప్పు ఆకుకూర ఒక యాపిలు

ప్రథమ చికిత్స

ప్రథమ చికిత్స

ప్రథమ చికిత్స

        పథమ చికిత్స అనగా జబ్బు వచ్చినప్పుడుగాని, ప్రమాదము సంభవించినప్పుడు గాని తాత్కాలికముగా చేయు సహాయము. వైద్య సహాయము లభించే వరకు సేదదీర్చుటయే దాని ముఖ్యోద్దేశము.

గాయపడిన వారికి ప్రథమ చికిత్స అను శాస్త్రము ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స అను వాని ముఖ్య సిద్ధాంతముల ననుసరించియున్నది. ఈ శాస్త్ర జ్ఞానము వలన ఆకస్మికముగా దెబ్బగాని, గాయముగాని తటస్థించినపుడు డాక్టరు వచ్చే లోపల రోగి ప్రాణమును నిలుపుటకు శిక్షణ నొందిన వారికి సాధ్యపడుచున్నది.

ప్రథమ చికిత్స పరికరాల పెట్టె 

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
  • వివిధ రకాల సైజుల్లో అతుక్కునే గుణం గల బ్యాండేజీలు
  • పీల్చుకునే గుణం గల (అబ్జార్బెంట్) నూలు బ్యాండేజీ,లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్ ప్యాడ్లు
  • అతుక్కునే టేపులు
  • త్రికోణపు బ్యాండేజీ రోలు (చుట్ట)
  • ఒక చుట్ట దూది
  • బ్యాండ్ -ఎయిడ్స్ (ప్లాస్టర్స్)
  • కత్తెర
  • పెన్నుసైజు టార్చిలైటు
  • చేతులకు వేసుకునె తొడుగులు / లేటెక్స్ గ్లోవ్స్ (రెండు జతలు)
  • ట్వీజర్స్ (పట్టుకర్ర)
  • సూది
  • తడిగా గల టవలు మరియు శుభ్రమైన పొడి బట్ట ముక్కలు
  • యాంటీ -సైప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
  • థర్మోమీటర్
  • ఒక చిన్న వాజ్లీన్ (ప్రెట్రోలియం జెల్లీ) ట్యూబ్ లేదా
  • ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీమ్లు)  
  • వివిధ రకాల సైజుల్లో పీన్నీసులు ( సేఫ్టీ పిన్నులు )
  • సబ్బు లేదా డిటర్జెంట్ పొడి

ఔషధాలు
  • ఆస్పిరిన్ లేదా నొప్పి తగ్గించే పారాసెటమాల్ మాత్రలు
  • విరేచనాలు అరికట్టే (యాంటీ – డయోరియా)  ఔషధాలు
  • తేనెటీగలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టామిన్ క్రీము ( అలర్జీలు/ దురదలు మంటలు దగ్గేందుకు క్రీమ) 
  •  
  • అజీర్తికి, అసిడిటికి మాత్రలు ( ఆంటాసిడ్ మాత్రలు)
  • విరెచనం సాఫిగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలు


సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి.

ప్రథమ చికిత్స పరికరాల పెట్టె


ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
  • వివిధ రకాల సైజుల్లో అతుక్కునే గుణం గల బ్యాండేజీలు
  • పీల్చుకునే గుణం గల (అబ్జార్బెంట్) నూలు బ్యాండేజీ,లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్ ప్యాడ్లు
  • అతుక్కునే టేపులు
  • త్రికోణపు బ్యాండేజీ రోలు (చుట్ట)
  • ఒక చుట్ట దూది
  • బ్యాండ్ -ఎయిడ్స్ (ప్లాస్టర్స్)
  • కత్తెర
  • పెన్నుసైజు టార్చిలైటు
  • చేతులకు వేసుకునె తొడుగులు / లేటెక్స్ గ్లోవ్స్ (రెండు జతలు)
  • ట్వీజర్స్ (పట్టుకర్ర)
  • సూది
  • తడిగా గల టవలు మరియు శుభ్రమైన పొడి బట్ట ముక్కలు
  • యాంటీ -సైప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
  • థర్మోమీటర్
  • ఒక చిన్న వాజ్లీన్ (ప్రెట్రోలియం జెల్లీ) ట్యూబ్ లేదా
  • ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీమ్లు)  
  • వివిధ రకాల సైజుల్లో పీన్నీసులు ( సేఫ్టీ పిన్నులు )
  • సబ్బు లేదా డిటర్జెంట్ పొడి

ఔషధాలు
  • ఆస్పిరిన్ లేదా నొప్పి తగ్గించే పారాసెటమాల్ మాత్రలు
  • విరేచనాలు అరికట్టే (యాంటీ – డయోరియా)  ఔషధాలు
  • తేనెటీగలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టామిన్ క్రీము ( అలర్జీలు/ దురదలు మంటలు దగ్గేందుకు క్రీమ) 
  •  
  • అజీర్తికి, అసిడిటికి మాత్రలు ( ఆంటాసిడ్ మాత్రలు)
  • విరెచనం సాఫిగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలు


సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి.

స్థూలకాయం మల బద్ధకం మధుమేహ వ్యాధి తలనొప్పి/మైగ్రేన్ థైరాయిడ్ గ్రంధి రక్తపోటు సాధారణ జలుబు జుట్టు రాలడం

స్థూలకాయం




  


ఒక  వ్యక్తి వయస్సు , ఎత్తులను పరిగణనలోకితీసుకొని , సాధారణ బరువుకన్నా , అధిక బరువు ఉండడాన్ని  స్థూలకాయులు అంటారు. వీరు సాధారణంగా 20% అధికంగా బరువు ఉంటారు.
కారణాలు: -
  • అవసరానికి మించి ఆహారము తీసుకొనుట -  అధిక పోషక విలువలు గల ఆహారం.
  • శారీరక వ్యాయామము లేకపోవుట.
  • అధికశాతము కొవ్వు పదార్ధాలు ఆహారంలో తీసుకోవడం.
  • శరీరకదలికలు లేని ఉద్యోగ,వ్యాపార కార్యక్రమాలు నిర్వహించు వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
  • సాధారణంగా స్త్రీలలో గర్భధారణ సమయంలో ,నెలసరి రుతుక్రమాలు పూర్తిగా నిలిచిపోయిన వయస్సులో స్థూల కాయులు కావడం జరుగుతుంది.
  • మానసిక వ్యాధులు,మందుల వలన స్థూలకాయం రావచ్చును.
  • ఆహార జీర్ణ ప్రక్రియ సమస్యులున్నా కొవ్వు పదార్ధాలు శరీరములో అధిక శాతం నిల్వ వుండుట వలన స్థూలకాయం రావచ్చును.
స్థూలకాయాన్ని గుర్తించడం ఎలా?


సాధారణంగా ఎత్తు,బరువుల ఆధారంగా నిర్ధారించిన సూచిక ప్రకారము (Body Mass Index)స్థూలకాయాన్ని గుర్తించవచ్చును.
  • బి.యం.ఐ :-    18.5 కు తక్కువగా బి.యం.ఐ వుంటే పౌష్టికాహార లోపము అని గుర్తించాలి.
  • బి.యం.ఐ 30 అంతకంటే ఎక్కువ వున్న స్థూలకాయులు అని గుర్తించాలి.    
తీసుకోవలసిన జాగ్రత్తలు: -
  • పండ్లు,కూరగాయలు అధికంగా తీసుకోవాలి.
  • అధికంగా పీచు పదార్ధాలు.
  • క్రమం తప్పక వ్యాయామం చేయాలి.
  • మత్తు పానీయాలు తీసుకోరాదు.
  • కొవ్వు,తీపి పదార్ధాలు తక్కువ పాళ్ళలో తీసుకోవాలి.
  • ఆహారంలో పిండి పదార్ధాలు తక్కువగా తీసుకోవాలి.
  








  

మల బద్ధకం


మల బద్ధకం అనగా నేమి?
       ప్రతిరోజు క్రమబద్దంగా అలవాటు ప్రకారంగా కాకుండా దీనిలో ఎటు మార్పు వచ్చినా,ఆ మార్పు మలం తక్కువ కావటం.గట్టిగా గాను,తక్కువ సార్లు మలవిసర్జన కావటం,మలవిసర్జన సమయంలో చాలా ముక్కడం,కష్టంగా ఉండటం.సామాన్యంగా మల విసర్జనలో మనిషికి మనిషికి అలవాట్లు వేరుగా ఉంటాయి.అనగా కొంత మందికి ప్రతి రోజూకు లేక ప్రతి రెండు రోజులకు ఒక్క సారి కావటం జరుగుతుంటుంది.లక్షణాలు :-   కడుపు ఉబ్బరం లేదా కడుపులో ఇబ్బందికరంగా ఉండటం
కారణాలు :-
1. తీసుకొనే ఆహారంలో పీచుపదార్ధం తక్కువగా ఉన్నచో.
2. శరీరంలొ నీరు తక్కువ అయినా.
3. శరీరం కదలికలు తక్కువ అయినా.
4. ఏవైనా మందులు వాడుతున్నా.
5. ప్రేగులలో ఏదైనా సమస్య ఉన్నచో .ఉదా:(ప్రేగులలో క్యాన్సర్ వ్యాధి)
6. థైరాయిడ్ హర్మోన్ తక్కువ అయినా.
7. కాల్షియం,పోటాషియం తక్కువ అయినా.
8. మధుమేహ వ్యాధి వలనా,జీర్ణకోశ వ్యాధి అయినా.
9. పార్కిన్ సన్   వ్యాధి అయినచో.








ఎలా నివారించాలి:-
1. ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉండాలి.
2. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి.




మధుమేహ వ్యాధి



మధుమేహ వ్యాధిని - చెక్కర వ్యాది, షుగర్ వ్యాధి అని సాధారణంగా అంటూ వుంటారు.

కారణాలు

    1. శరీరములో ఉత్పత్తి అయే ఇన్సులిన్ హార్మోను - శరీరములోని షుగర్ ను సమతుల్యము చేసి, అవసరానికి షుగర్ అందుబాటులో వుండునట్లు చేయుటలో ఇన్సులిన్ ప్రధానపాత్ర వహిస్తుంది.

    2. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గిన - మధుమేహం వస్తుంది.

    3. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ శరీరంలోని కణాలు సరిగ వినియోగించుకోక పోవడం వలన - మధుమేహ వ్యాధి వస్తుంది.


సాధారణంగా మధుమేహం ఎవరికి వస్తుంది?

    1. అధిక బరువు వున్న వాళ్ళు - చిన్నవారైన - పెద్దవారికైన రావచ్చు.

    2. మానసిక వత్తిడికి లోనైనవారు.

    3. శారీరక శ్రమ లేనివారికి (sedentary jobs).

    4. కొన్ని సందర్భాలలో - వారసత్వంగా కూడా ఈ వ్యాధి రావచ్చును.

    5. అవసరమైన మోతాదులకన్నా - ఎక్కువగా ఆహారము తినేవాళ్ళకు.

    6. తరచుగా జబ్బులతో బాధపడువారు రోగనిరోధక శక్తిని కోల్పోయి - మధుమేహ వ్యాధి రావచ్చును

    7. కొన్ని రకాల మందులు దీర్ఘకాలం వాడడం వలన ఈ వ్యాధి రావచ్చును.


మధుమేహ వ్యాధి లక్షణాలు

    1. ఆకలి ఎక్కువగా వుండి - చాలా మార్లు, ఎక్కువగా ఆహారం తీసుకోవడం

    2. సాధారణం కన్నా ఎక్కవగా నీరు దప్పికకావడం - ఎక్కువగా నీరు త్రాగడం

    3. ఎక్కువసార్లు మూత్రవిసర్జకు వెళ్ళడం.

    4. కొంతమందిలో బరువు తగ్గడం, గాయం తగిలిన సరిగా మానకపోవడం - త్వరగా తగ్గకపోవడం.

    5. నీరసంగా,నిస్త్ర్రాణంగావుండడం, స్త్ర్రీలలో అసాధారణంగా తెల్లబట్ట(white discharge)

    6. తరచుగా చర్మ వ్యాధులు రావడం

    7. కొందరిలో కాళ్ళు - చేతులు ముఖ్యంగా పాదాలు అరచేతులు తిమ్మిరిగా వుండడం.

    8. ఏదైనా పని చేయాలన్న - చికాకు, అసహనము కలిగి త్వరగా అలసిపోవడం, వంటి లక్షణాలలో ఏ లక్షణాలైనా వుండవచ్చును.


మధుమేహం వలన ఎక్కువ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే
     అవకాశం వుంది.

    ముఖ్యమైన అవయవాలు:-

       1. మూత్ర పిండాలు
       2. గుండె
       3. రక్త నాళాలు
       4. కళ్ళు - కంటిలో రక్త నాళాలు, నరాలు
       5. కాళ్ళు, పాదాల నరాల కు మధుమేహప్రభావం కారణంగా - గాయం అయినా, పుండు అయినా - మానకపోవడం లేదా నిదానంగా మానడం జరుగుతుంది.

    తీసుకోవలసిన జాగ్రత్తలు:-


       1. వీలైనంత త్వరగా లక్షణాలను గుర్తించి, ఏ రకమైన మధుమేహమో, నిర్ధారించుకోవలసిన అవసరం వుంది - డాక్టరును సంప్రదించి వ్యాధినిర్ధారణ, వైద్యం చేయించుకోవడం ప్రధానము.
       2. శారీర కష్టం చేయనివారు, క్రమంతప్పక వ్యాయామం (అంటేనడక) చేయాలి. ప్రతిరోజు సుమారు 30 నిమిషాలు జోరుగా నడవాలి (Brisk walk). కనీసం వారంలో 5-6 రోజులు నడక వ్యాయామం చేయాలి.
       3. బరువులు ఎత్తడం లాంటి ప్రమాదకర వ్యాయామం చేయరాదు.
       4. పాదరక్షల అడుగుభాగము మెత్తగా స్పాంజిలాగా వుండే విధంగా చూడాలి.
       5. పాదాలు ఎల్లప్పుడు శుభ్రంగా వుంచుకొని - వీలైనప్పుడు డాక్టరును సంప్రదించి రక్తపరీక్షలు -మూత్రపరీక్షలు చేయించుకోవాలి.
       6. క్రమం తప్పక వైద్యం చేయించుకోవాలి.
       7. మితంగా అహారం తీసుకోవాలి.
       8. "కడుపు నిండకూడదు - ఖాళీ వుండకూడదు" అన్న నానుడికి అనువుగా ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి.



ఆహారంలో తీసుకోవలసిన పదార్ధాలు


      ఆకు కూరలు, వంకాయ, బెండ, కాకర, పొట్ల, కాబేజి, దొండకాయ, మునగకాడలు, టమాట, కాలిఫ్లవర్ మొదలగునవి -


ఆహారములో తీసుకోకూడని పదార్ధాలు

    పంచదార, తీపిపదార్ధాలు, బెల్లం, జీడిపప్పు, బాదం, కొబ్బరి నీళ్ళు, హార్లిక్స్ లాంటి పొడి పదార్ధాలు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్షవంటి పండ్లు, బిస్కట్లు, చాక్లెట్, కేకులు మొ"నవి,  బంగాళాదుంప, నెయ్యి, ఇతర నూనె పదార్ధాలు.


తీసుకోవలసిన జాగ్రత్తలు :

    చర్మం - ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎందుకు అనగా గ్లూకోస్ రక్తం లో ఎక్కువ మెతాదు లో ఉన్నందున సూక్ష్మ క్రిములు  (అనగా బాక్టీరియా) ఫంగస్ ఎక్కువ ఉత్పత్తి అవడం జరుగుతుంది.  సామాన్యం గా మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గినందువలన సూక్ష్మ క్రిముల తో పోరాడడం తగ్గుతుంది.

        * అందు వలన చర్మం ఎప్పుడు సుభ్రంగా ఉంచాలి
              o చర్మం రంగు మారినా, మందంగా ఉన్నా
              o చర్మం పై బొబ్బలు ఉన్నా
              o చర్మం ఎర్రగా వాపు ఉండి, వేడిగా ఉన్నా ఇది చర్మం ఇన్ ఫెక్షన్ అయిఉండవచ్చు
              o గజ్జలలో దురద స్త్రీ మర్మాంగ అవయవాలలో చంకలలో కాలి వేళ్ళ మధ్య దురదలు ఎక్కువగా ఉన్నా
              o దెబ్బ తగిలి మానకుండా ఉన్నా

    వెంటనే డాక్టర్ సలహా పొందాలి (చర్మవ్యాధి డాక్టర్ )

        * ప్రతి రోజూ క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీళ్ళ తో సున్నితమైన సబ్బు వాడి స్నానం చేయాలి, మరిగే నీళ్ళు వాడరాదు.
        * స్నానం అయిన తరువాత మెత్తటి సుభ్రమైన పొడి బట్టతో తడి అంతా తుడుచుకోవాలి, శరీరం పై ఎక్కడా నెమ్ము ఉండరాదు. ప్రత్యేకంగా చర్మం ముడతలలో, తడి ఉన్నచో చర్మం దురదతో గోకిన చొ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ రావచ్చు.
        * ఎక్కువ నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి , చర్మం ఎండి పోయినట్లు ఉండదు



మధుమేహ వ్యాధి గ్రస్ధులు – తీసుకొవలసిన ఆహారం

మధుమేహ వ్యాధి గ్రస్ధులు – తీసుకొవలసిన ఆహారం

  • నీరు కావలసినంత మొతాదు ( రోజుకు సుమారు 8 గ్లాసులు )
  • వీరు  తీసుకొనే ఆహారంలో పిండి పదార్ధాలు తక్కువగా ఉండి  సంపూర్ణ ఆహారమై ఉండాలి
  • వీరు  తీసుకొనే ఆహారం  వారి చికిత్స పై ఆధారపడి ఉంటుంది
మధు మేహ వ్యాధి గ్రస్ధులు తినకూడని ఆహార పదార్ధాలు
1. దుంప కూరలు (ఉదా: బంగాళ దుంప, చామ దుంప )
2. చాక్ లేట్లు, తీపి పదార్ధాలు, పుడ్డింగులు
3. నూనెలో వేపిన పదార్ధాలు
4.డ్రై ఫ్రుట్స్ ( పండ్లు) (ఉదా: ఎండు ద్రాక్ష, అంజీరా )
5. చక్కెర
6. అరటి పండు, సపోటా, సితాఫలము (కస్థడ్డ్ ఆపిల్)

వీరు తీసుకొనే ఆహారంలో ముఖ్యంగా ఈ క్రింద చూపబడినవి  తగు పాళ్ళలో ఉండాలి : ఉదాహరణకు

పదార్ధాలు
   ( గ్రా )     శాకాహారులు ( గ్రా )     
మాంశాహరము
గింజ ధాన్యాలు
200
250
పప్పు ధాన్యాలు
60
20
ఆకు కూరలు
200
200
పండ్లు
200
200
పాలు
400
200
నూనెలు
20
20
చేపలు/ కోడి మాంసము చర్మం లేకుండా
-
100
మిగతా కూరగాయలు
200
200


పైన చెప్పిన ఆహారం లో శక్తి
మొత్తం  కాలరీస్
1600
మాంసకృత్తులు
65gs
కొవ్వు
40gs
పిండి పదార్ధాలు
245gs


పైన ఇవ్వబడిన ఆహారం రోజులో ఎలా విభజించి తీసుకోవాలి

పదార్ధాలు
  శాకాహారులు
మాంశాహరులు
కాఫీ /టీ  
1 కప్పు 1 కప్పు
ఉదయం – టిఫిన్
ఉ:  ఇడ్లీ- 2
     దోస – 2
     చపాతి – 2
    ఉప్మ- 1 కటొరీ
ఉ: ఇడ్లీ- 2
    దోస – 2
    చపాతి – 2
    ఉప్మ- 1 కటొరీ


కాఫీ /టీ  
1 కప్పు 1 కప్పు
మధ్యాహ్న భోజనం         
అన్నం
సాంబార్
ఆకుకూరలు
పెరుగు
పుల్లటి పండ్లు
పచ్చడి

 2 కటోరీలు
1 కటోరీలు
½  కటోరీ
1
1  ముక్క

 2 కటోరీలు
1 కటోరీలు
½  కటోరీ
1
  1  ముక్క
టీ / కాఫీ 
      ఉప్ప్మ            
1 కప్పు
¾ కటోరీ         
1 కప్పు
    1 కటోరీ
రాత్రి భోజనం           
పుల్కా                
పప్పు                                 
పెరుగు             |
 చేప / కోడి                                
కూరగాయలు/కూర
అప్పడం                        
దోస / టమోటా      

3    
1 కటోరి
½ కటోరి
-
1  కటోరి
1
1                

4
-
-
2 ముక్కలు
1  కటోరి
1
1  
నిద్రకు ముందు పాలు   1 కప్పు 1 కప్పు

తలనొప్పి/మైగ్రేన్



దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే.

సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గుపడకూడదు. వైద్యుడు తలనొప్పి తీవ్రంగ ఉన్నా, మరల -మరల వస్తున్నా లేదా జ్వరంతో పాటువస్తున్నదేమో పరీక్షించాలి.

తలనొప్పి ఎప్పుడు తీవ్రమనిపిస్తుంది?

    ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోక పోవడంలో వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి,  వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.
     మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక  అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం:

        * తీవ్రమైన, ఆకస్మికంగా తలనొప్పి వేగంగా, చెప్పలేని విధంగా  వచ్చి "ఇది నా జీవితము లో దారుణమైన తలనొప్పి" అనిపించేది
        * స్పృహతప్పటం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా యితర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి
        * మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి

    మీరు ఈ క్రిందితలనొప్పి లక్షణాలను కనుక  అనుభవిస్తుంటే మీరు వైద్య సహాయం అవసరం:

        * నిద్ర నుంచి మిమ్మల్ని మేలు కొలిపే తలనొప్పి
        * తలనొప్పి స్వభావములో గానీ లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు
        * మీ తల నొప్పి స్వభావం గురించి మీకు స్పష్టత లేనట్లైతే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.

    ఆందోళన, క్లస్టర్ తలనెప్పి, పార్శ్వశూల అనేవి తలనెప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత, పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి, దానివల్ల తల నెప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనెప్పి పార్శ్వశూల తలనెప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది.

    క్లస్టర్ తలనెప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనెప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరమైనది.


వ్యాధి నిర్ధారణ

    అధికభాగం తలనెప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనెప్పి మరియు యితర తీవ్రమైన తల నెప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరమవ్వవచ్చు.


ఆందోళనవల్ల కలిగే తలనెప్పి

        * ఆందోళన వల్ల లేదా కండరం ముడుచుకోవటం వల్ల కలిగే తలనెప్పి అన్నది అత్యంత సాధారణమైన తలనెప్పి, మరియు అవి వత్తిడి పెరిగే దశలతో తరచూ ముడిపడి ఉంటాయి.
        * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నది స్థిరంగా మరియు మందంగా ఉండిమరియు నుదురు, కణతలు మరియు మెడవెనుక భాగం లో లోనవుతాము.
        * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నదాన్ని తలచుట్టూ గట్టిగా కట్టివేసినట్లుంటుందని ప్రజలు తరచూ వర్ణిస్తారు.
        * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి దీర్ఘకాలం ఉండవచ్చు కానీ వత్తిడి తగ్గగానే సాధారణముగా మాయమవుతాయి.
        * ఆందోళన వల్ల కలిగే తలనెప్పి కి మరేయితరలక్షణాలతో సంబంధం లేదు మరియు పార్శ్వశూలతలనెప్పిలాగా తలనెప్పికి ముందు వ్యాధిలక్షణాలు ఏవీ కనిపించవు. అన్నిరకాల తలనెప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90శాతము.



సరణి(సైనస్)తలనొప్పులు


    సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం(ఎలర్జీ) వల్ల కలుగుతాయి.
    జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత  ముక్కు ఎముకలకు ఎగువన,దిగువున ఉండే గాలి కుహరాలు సరణి మార్గాలు మంటకుగురికావడం, సరణితలనెప్పు కలుగుతుంది.ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నెప్పి కలిగించేకారణమవుతుంది.ఈ నెప్పి తీవ్రంగా,కొనసాగుతూ ఉంటుంది,ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింతదారుణంగా మారుతుంది.
    సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు:

        * చెక్కిళ్ళమీదుగా మరియు నుదుటిపై,కళ్ళచుట్టూ నెప్పి మరియు వత్తిడి,
        * పైపళ్ళు నెప్పిగా ఉన్న భావన   
        * జ్వరము మరియు వణుకు       
        * ముఖం వాయటం

    సరణి(సైనస్)తలనొప్పులలో వచ్చే ముఖం నెప్పులకు  వేడిద్వారా మరియు మంచుద్వారాఉపశమనం కలిగిస్తారు.


గమనిక: మీకు తీవ్రమైన తలనొప్పులుంటే,ఆ లక్షణాలన్నిటిని, నెప్పి యొక్క తీవ్రత మరియు ఆ నెప్పిని మీరు  ఎలా నిభాయించారు అన్న దానిని  గుర్తుంచుకోండి.

మైగ్రేన్

    తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి )ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి కి మనిషి కి వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు
    లక్షణాలు
    మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి.తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురు కు శబ్దాలను భరించలేరు.  కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

        * ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
        * కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.
        *  ఆకలి మందగిస్తుంది.
        * ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
        * స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.

    కారణాలు

        * మానసిక వత్తిడి – తలనొప్పి
        * అధిక శ్రమ
        * ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు
        * రుతు క్రమములో తేడాలు.
        * కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
        * మత్తుపానీయాలు – పొగత్రాగుట
        * మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వచ్చి తలనొప్పి వస్తుంది.

    నివారణ


        * ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి
        * ఇంటిలో వున్నప్పుడు చీకటి రూములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
        * ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.
        * నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.
        * ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి.
        * కొందరు స్త్రీ ల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
        * డాక్టరు ను సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి.

థైరాయిడ్ గ్రంధి


థైరాయిడ్ గ్రంధి
థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో వుండే చిన్న గ్రంధి.ఇది గొంతు ముందు భాగములో వుండును.ఈ గ్రంధి వుత్పత్తి చేయు హార్మోనుల ప్రభావము వలన శరీరములో వున్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహాణ చేసుకొనుటకు తోడ్పడతాయి.

థైరాయిడ్ వ్యాధి అనగానేమి?

* థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకొనేలా చేస్తుంది.
* థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే శరీరములోని జీవకణాలు తక్కువ స్ధాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయునట్లు తోడ్పడతాయి.
ఏ వయస్సు వారిలో థైరాయిడ్ వ్యాధులు వస్తాయి
* అన్ని వయస్సుల వారికి థైరాయిడ్ వ్యాధులు వస్తాయి.
* 5 నుండి 8 పాళ్ళు స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో పనిచేయుటకు కారణాలు - లక్షణాలు
* ములం వాపు.
* చర్మము పొడి బారడం.
* శబ్దములో మార్పు.
* శరీరము బరువు అధికమగుట.
* కీళ్ళ వాపులు, నొప్పులు.
* నెలసరి రుతుక్రమములో మార్పులు.
* మానసిక రుగ్మతలు.
* థైరాయిడ్ గ్రంధి పెద్దది అగుట.
* శ్వాసకు సంబంధించిన,బి.పి కి సంబంధించిన వ్యాధులు రావడం.
* మలబద్దకం.
* చిన్న పిల్లలలో సాధారణ ఎదుగుదల లేక పోవడం.
* యుక్త వయస్సు పిల్లలలో నెలసరి ప్రారంభం ఆలస్యం కావడం.
* మానసిక ఎదుగుదలతో పాటు ఆహారములో అయోడిన్ శాతం తక్కువగా వుండుట, థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి ఆహారములోని అయోడిన్ తోడ్పడుతుంది.
థైరాయిడ్ అధిక స్ధాయిలో పనిచేయుట
కారణాలు: -
* థైరాయిడ్ గ్రంధి అధికంగా పనిచేస్తు - ఎక్కువస్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
* థైరాయిడ్ గ్రంధికి ఇన్ ఫెక్షన్ వచ్చి నొప్పితో కూడిన గడ్డ కావచ్చు.
* ఒక్కొక్క సందర్భములో నొప్పి లేని గడ్డగా కనబడును.
* నొప్పి లేని థైరాయిడ్ గ్రంధి అధిక శాతం స్త్రీలలో వస్తుంది.
* అయోడిన్ శాతం ఎక్కువగా కొన్ని మందుల ద్వారా రావచ్చును.
లక్షణాలు: -
* చికాకు,విసుగుదల.
* కండరాల నీరసం.
* అప్పుడప్పుడు కండరాలు వణకడం.
* నెలసరిలు అధికంగా వుండడం,నెలలో ఎక్కువసార్లు రుతుక్రమాలు.
* నిద్ర సమస్యలు.
* థైరాయిడ్ గ్రంధి పెద్దది కావడం.
* కంటి జబ్బులు ,గ్రేవ్స్ కంటి వ్యాధి వేడిని భరించలేకపోవడం.
తీసుకోవలసిన జాగ్రత్తలు

* థైరాయిడ్ జబ్బును వీలైనంత త్వరగా గుర్తించగలగాలి.
* అయోడిన్ ఉప్పును ఆహారంలో తీసుకోవడం మంచిది.
* వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత జీవిత కాల వైద్యం అవసరం కావచ్చు.
* డాక్టరును సంప్రదించి పూర్తి స్ధాయి పరీక్షలు చేయించుకొని వైద్య సలహా పొందాలి.







రక్తపోటు



గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.ఇలా సంకోచించినప్పుడు (కుచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.
గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు,రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.ఈ రక్త పోటును గాజు గొట్టము లోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.
సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను,డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.
అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంది.
అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.


అధిక రక్తపోటు
  • అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ.అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.

  • 120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.
అధిక రక్తపోటు - అనర్ధాలు :
  • అధిక శాతం గుండె జబ్బులకు - అధిక రక్తపోటు ప్రధాన కారణం.
  • మూత్రపిండాల వ్యాధులు.
  • కంటి జబ్బులు.
  • మెదడుకు సంబంధించిన రక్త నాళాల జబ్బులు.
  • పక్షవాతము.
  • గుండె రక్తనాళాల జబ్బులు.
  • విపరీతమైన తలనొప్పులు.
లక్షణాలు: -
  • తలనొప్పి.
  • తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
  • కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
  • సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం
తీసుకోవలసిన జాగ్రత్తలు : -
40 సంవత్సరాలు పైబడి వున్న వారు ప్రతి సంవత్సరం పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు వున్నా ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.
  • మధుమేహ వ్యాధి (Diabetes)తో బాధపడుతున్న వారు రక్తములో అధిక స్ధాయిలో కొవ్వు పదార్ధాలు (Cholesterol) వున్నా తగుజాగ్రత్తలు తీసుకోవాలి.
  • అమితంగా అలసిపోయే విధంగా అధికంగా వత్తిడి కలిగే కార్యక్రమాలు తక్కువగా చేయాలి.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
లో - బిపి
సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.వైద్యభాషలో దీనినే హైపోటెస్షన్ అని అంటారు.దీని వలన ప్రధాన అవయవాలైన గుండె,మెదడు,మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్) ఆహారము సరఫరా తగు పాళ్ళలో జరగదు.
సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు.కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి.బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది  అంటే అది లోబిపి గా పరిగణించాలి.
లోబిపి లక్షణాలు : -
  • నీరసం,అలసట.
  • మానసికంగా కృంగిపోవుట.
  • సరిగ నిద్ర లేక పోవుట.
  • తలనొప్పి.
  • గుండె వేగంగా పని చేయుట.
  • నాడి అధికంగా వుండుట.
  • కళ్ళు బైర్లు కమ్ముట.
  • కళ్ళు తిరుగుట.
  • శరీరం పాలి పోవుట.
  • అరికాళ్ళు,అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
  • ఛాతి నొప్పి.
  • కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంది.
  • మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా,క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
  • ప్రమాదకరమైన లోబిపి లో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.

సాధారణ జలుబు


ఎలా వస్తుంది?
జలుబు తో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా,చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి.ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది.
జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని,చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది.       జలుబు వున్న వ్యక్తి చీదిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి.
చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు.ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు.
ఎంతకాలం వుంటుంది?

  • జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన,ఆ వైరస్ రకాల పైన ఆధారపడి వుంటుంది.
  • సాధారణంగా జలుబు 2 - 5 రోజుల మధ్య ఉంటుంది.విపరీతమైన జలుబు,దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చును.
జలుబు తగ్గించే విధానాలు: -
  • ఆహారం:-జలుబు ఉన్నప్పుడు,కొవ్వు పదార్ధాలు,మాంసము,పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.
  • తాజా పళ్ళ రసాలను,కాయకూరలు అధికంగా తీసుకోవాలి.
  • మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది.
  • వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ,దగ్గు తగ్గుతాయి.
  • గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది.

జుట్టు రాలడం

 జుట్టు రాలడం అనగా ఏమి ?

    జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు. వైద్య పరంగా క్రింది విధంగా విభజించవచ్చు.

        * సాధారణంగా శారీరక ఒత్తిడి – ఉదా: దీర్ఝకాలిక జబ్బులు, శస్త్ర చికిత్సానంతరం , తీవ్రమైన అంటు వ్యాధుల తరువాత రెండు మూడు నెలలు వరకూ జుట్టు రాలిపోవచ్చు. ఒక్క సారిగా హార్మోనుల అసమతుల్యం మూలంగా, ముఖ్యంగా  స్త్రీలలో కాన్పు తరువాత జుట్టు రాలవచ్చు.
        * ఈ స్ధితులలో సుమారుగా జుట్టు రాలవచ్చు, కానీ చాలా కొద్ది మార్లు తీవ్రంగా ఉంటుంది. అటువంటి సమయంలో వైద్య సలహా అవసరం.

    మందుల వల్ల కలుగు దుష్పలితం

        * కొన్ని జబ్బులకు వాడే మందుల వల్ల చాలా జుట్టు రాలిపోవడం,బట్టతల రావడం కూడ జరుగుతుంది.

    జబ్బు లక్షణాలు

        * ధైరాయిడ్ గ్రంధి జబ్బులలో (హార్మోను అధికం కావడం,తక్కువ కావడం) వల్ల వచ్చే పలు లక్షణాలలో జుట్టు రాలడం ఒకటి.
        * సెక్స్ (లైంగిక హార్మోన్లు) హార్మోన్లు అసమతుల్యం
        * తీవ్రమైన పౌష్ఠికాహార లోపం, ముఖ్యంగా
        * ప్రోటీన్లు, ఐరన్ (ఇనుము), జింక్, boiton వంటి విటమినుల లోపం, ఈ లోపాలు ముఖ్యంగా పరిమితంగా ఆహారం తీసుకొను వారిలో, స్త్రీలలో బుతు స్రావం అధికంగా వున్న పరిస్ధితులలో కనబడుతుంది.
        * ఫంగల్  ఇన్ ఫెక్షన్లు, కొన్ని రకాల  ఫంగల్ జబ్బులలో ఇది మచ్చలు, మచ్చలుగా కొద్ది పాటి విసర్జాలలో కనిపిస్తుంది. ఇది చిన్న పిల్లలలో అధికంగా కనిపిస్తుంది.
        * అనువంశికం (లేక) వంశపార పర్యంగా వచ్చు జుట్టు రాలడం పురుషులలో ఇది ఒక క్రమంలో (ముందు భాగం నుంచి పలుచ పడుకుంటు పై భాగంలో పూర్తిగా ఊడిపోవడం – బట్టతల ) కనబడుతుంది. ఇది సర్వ సాధారణంగా కనబడే లక్షణం. ఇది పురుషుల జీవితకాలంలో ఎప్పుడైనా మొదలు కావచ్చు. చాలా చిన్న వయసులో 13 నుంచి 19 సం” ల వయసులో కూడ మొదలు కావచ్చు. ముఖ్యంగా 3 కారణాల సముదాయం కావచ్చు.
        * వంశపారపర్యం
        * పెరుగుతున్న వయసు
        * పురుష హార్మోన్లు

    స్త్రీలలో జుట్టు రాలిపోవడం ముందు బాగం మొదలు కొని కణతల వైపు నుంచి వెనక్కు వెళుతుంది. తల పైభాగంలో తక్కువగా కనబడుతుంది.

లక్షణాలు

    ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.ఇంత కన్న ఎక్కువ రాలిన పక్షంలో వైద్య సలహా అవసరం. జుట్టు పలుచ బడ్డట్టు అనిపించినా,ఒకటి కంటే ఎక్కువ చోట్ల బట్టతల కనపడ్డా వైద్య సలహా తీసుకోవాలి.


నివారణోపాయాలు

        * మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం
        * సమతుల్య పౌష్ఠికాహారం తీసుకోవడం.
        * జుట్టు దువ్వుకొనునప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం.
        * జుట్టు రాలిపోవడానికి కారణమైన మందులను మార్చడం.
        * ఫంగల్ ఇన్ ఫెక్షన్ల మూలంగా జుట్టు రాలుతున్న పక్షంలో
        * జుట్టును పరిశుభ్రంగా వుంచుకోవడం.
        * ఎండుగా, జిడ్డు లేకుండా  వుంచుకోవడం
        * టోపీలు ఇతరులవి పెట్టుకోకపోవడం
        * ఇతరుల దువ్వెనను వాడక పోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. వంశపార పర్యంగా వచ్చే బట్టతలను కూడ కొన్ని సందర్భాలలో నివారించవచ్చు.