Tuesday, March 17, 2015

తెలుగు సూక్తులు

తెలుగు సూక్తులు

సంకల్పంతో సత్యాన్ని సాధించడమే నిజమైన మతం

అంతరంగం అందంగా ఉంటేఆచరణ అర్ధవంతంగా ఉంటుంది.

సంపద మూర్ఖులకు యజమానివివేకవంతులకు బానిసలాంటిది.

మన ప్రవర్తనే మనకు శత్రువుల్నిమిత్రుల్ని సమకూరుస్తుంది.

౬ మాటకు మాట ప్రతీకారం కాదుమౌనమే దానికి సమాధానం

౬ పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదుమనిషే పరిస్థితులను సృష్టిస్తాడు.

౭ ముందు చూపు లోపించినపుడే ముప్పు సంభవిస్తుంది.

౮ అణుకువలేక పోతే అందం కూడా వికారం కలిగిస్తుంది.

౯ మనిషిని చులకన చేసేది తన గొప్పతాను చెప్పుకోవడమే.

౧౦ అసమర్ధుని ఆఖరి అస్త్రమే హింస.

౧౧ మంచి పనికి మించిన పూజలేదు.

౧౨ వందవ్యర్ధ మాటల కంటే శాంతి చేకూర్చే ఒక్కమాట చాలు.

౧౩ విజయం పొందాలను కున్నవారుఎన్నడూ నిరాశ చెందరు.

౧౪ మూర్ఖుడి ప్రశంస కన్నా వివేకుడి మందలింపు మిన్న.

౧౫విమర్శలన్నింటిలోనికి ఉత్తమమైనది ఆత్మవిమర్శ.

౧౬వెంటపడేది భయంవెంటవుండేది దైవం.

౧౭రాపిడి లేని వజ్రం ప్రకాశించదుఅలాగేకష్టాలు లేనిదే మానవుడు పరిపూర్ణత చెందడు.

౧౮వికృతమైన మనసు కంటేవికృతమైన మనిషి మంచివాడు.

౧౯విజయన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే అసలైన పోరాటం.

౨౦వివేకుడు వ్యవహార సలహాలకోసం ఎదురుచూస్తేమూర్ఖుడు పొగడ్తల కోసం ఎదురుచూస్తాడు.

౨౧వివేకి తనకేమి తెలియదనిమూర్ఖుడు తనకంతా తెలుసునని అనుకుంటాడు.

౨౨గర్వం శత్రువులని పెంచుతుందిమిత్రులని పారద్రోలుతుంది.

౨౩స్నేహం ఆనందాన్ని పెంచుకుంటుందివిచారాన్ని పంచుకుంటుంది.

౨౪ విజ్ఞానం ఉన్నది అని గర్వించడమంత అజ్ఞానం మరొకటి లేదు.

౨౫ విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు.

౨౬ వాదనలో మహాబలమైన సాధనం మౌనం

౨౭ కొన్ని సందర్భాలలో మాటలే వెండిమౌనమే బంగారం.

౨౮ తప్పు ద్రోవలో ముందుకు పరుగెత్తుటకంటేమంచిదారిలో వెనక్కి నడవడమే ఉత్తమం.

౨౯ నీడను చూసి భయపడకూడదుదగ్గరలో వెలుతురుంటేనే నీడపడుతుంది.

౩౦ ఎలా నిరీక్షించాలో తెలియడం విజయానికి నాంది.

౩౧కష్టాలు బలహీనుని పడగొడతాయిబలవంతుడిని అభివృద్ధి చేస్తాయి.

౩౨తప్పుని సమర్ధిస్తేరెండు తప్పులవుతాయి.

౩౩ధనాన్ని వదిలివేసినవాడు జోగిధనాశను వదిలివేసినవాడు యోగి.

౩౪ మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి.

౩౫ ఒక్కసారి మోసపోతే అది మన తప్పుకాదురెండోసారి మోసపోతే అది మనతప్పు.

౩౬ సుఖం మళ్ళీ మళ్ళీ కావలి అనుకోవడమే దు:ఖం

౩౭ జీవితం నిరాడంబరంగాను ఆశయం ఉత్తమంగాను ఉండాలి.

౩౮తనలో లోపాలే లేవనుకునే లోపానికి మించిన లోపం మరోకటి లేదు.

౩౯ మాట ఇవ్వడానికి తొందరపడకూడదుఇచ్చిన మాటను నెరవేర్చడానికి వెనకాడకూడదు.

౪౦ దీర్ఘజీవితం కంటే దివ్యజీవితం గొప్పది.

౪౧మంచివాళ్ళకు లోకంలో పాపం కనిపించదు.

౪౨ఆధ్యాత్మిక పవిత్రతే సత్యం.

౪౩మానవుడి మహోత్కృష్టమైన లక్ష్యం భగవంతుడు.

౪౪ పవిత్రమైన నిజాయితీని వదలనంతవరకు దు:ఖం దరిచేరదు.

౪౫ప్రశ్నలేమి అడగకుండా ఇతరులకు తోడ్పడడమే యోగం.

౪౬ అజ్ఞానమనే ప్రవర్తన ఎప్పుడూ మార్పును కోరుకుంటుంది.

౪౭ పగతీరితే అప్పటికి మాత్రమే తృప్తిఓర్పువలన ఎప్పటికి తృప్తి.

౪౮నమ్మకంఓర్పుఆధ్యాత్మిక కవలలు.

౪౯శరీరం ఒకరధం అయితేఇంద్రియాలు సారధిగుర్రాలు బుద్ధిఇవి ఏవియు సహకరించకపోతే గమ్యాన్ని చేరుకోలేము.

౫౦అపవిత్రమైన మనస్సుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని చేసినా వృధా.

౫౧అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి.

౫౨మంచివారు దూరం కావడంచెడ్డవారు దగ్గరకావడమే దు:ఖానికి నిదర్శనం.

౫౩భక్తి మనసులో నిలుపుకొనేదేకానిబహిర్గతం చేసేదికాదు.

౫౪ఎక్కువగా మాట్లాడేవారిలో వాక్శుద్ధిజ్ఞానశక్తి నశిస్తాయి.

౫౫పుణ్యకార్యాలేవె చేయకుండా పుణ్యం కావాలి అనుకోవడం మూర్ఖతే అవుతుంది.

౫౬మనస్సు,మాటక్రియఅన్నీ ఒకటిగా ఉన్నప్పుడే ధర్మాన్నిసత్యాన్నిపాటించినట్లు అవుతుంది.

౫౭ధనం మనుషుల్ని సృష్టించదుమనుషులే ధనాన్ని సృష్టిస్తారు.

౫౮మంచి గుణాలున్న వారిని చిన్నదోషం వున్నంత మాత్రాన విడిచి పెట్టరాదు.

౫౯భగవంతుడు అన్నిచోట్ల ఉన్నప్పటికిని మానవరూపంలోనే గ్రహించగలము.

No comments:

Post a Comment