తెలుగు సూక్తులు
౧. సంకల్పంతో సత్యాన్ని సాధించడమే నిజమైన మతం
౨. అంతరంగం అందంగా ఉంటే, ఆచరణ అర్ధవంతంగా ఉంటుంది.
౩. సంపద మూర్ఖులకు యజమాని, వివేకవంతులకు బానిసలాంటిది.
౪. మన ప్రవర్తనే మనకు శత్రువుల్ని, మిత్రుల్ని సమకూరుస్తుంది.
౬ మాటకు మాట ప్రతీకారం కాదు. మౌనమే దానికి సమాధానం
౬ పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు. మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు.
౭ ముందు చూపు లోపించినపుడే ముప్పు సంభవిస్తుంది.
౮ అణుకువలేక పోతే అందం కూడా వికారం కలిగిస్తుంది.
౯ మనిషిని చులకన చేసేది తన గొప్పతాను చెప్పుకోవడమే.
౧౦ అసమర్ధుని ఆఖరి అస్త్రమే హింస.
౧౧ మంచి పనికి మించిన పూజలేదు.
౧౨ వందవ్యర్ధ మాటల కంటే శాంతి చేకూర్చే ఒక్కమాట చాలు.
౧౩ విజయం పొందాలను కున్నవారు, ఎన్నడూ నిరాశ చెందరు.
౧౪ మూర్ఖుడి ప్రశంస కన్నా వివేకుడి మందలింపు మిన్న.
౧౫. విమర్శలన్నింటిలోనికి ఉత్తమమైనది ఆత్మవిమర్శ.
౧౬. వెంటపడేది భయం. వెంటవుండేది దైవం.
౧౭. రాపిడి లేని వజ్రం ప్రకాశించదు. అలాగే, కష్టాలు లేనిదే మానవుడు పరిపూర్ణత చెందడు.
౧౮. వికృతమైన మనసు కంటే, వికృతమైన మనిషి మంచివాడు.
౧౯. విజయన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే అసలైన పోరాటం.
౨౦. వివేకుడు వ్యవహార సలహాలకోసం ఎదురుచూస్తే, మూర్ఖుడు పొగడ్తల కోసం ఎదురుచూస్తాడు.
౨౧. వివేకి తనకేమి తెలియదని, మూర్ఖుడు తనకంతా తెలుసునని అనుకుంటాడు.
౨౨. గర్వం శత్రువులని పెంచుతుంది. మిత్రులని పారద్రోలుతుంది.
౨౩. స్నేహం ఆనందాన్ని పెంచుకుంటుంది. విచారాన్ని పంచుకుంటుంది.
౨౪ విజ్ఞానం ఉన్నది అని గర్వించడమంత అజ్ఞానం మరొకటి లేదు.
౨౫ విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు.
౨౬ వాదనలో మహాబలమైన సాధనం మౌనం
౨౭ కొన్ని సందర్భాలలో మాటలే వెండి, మౌనమే బంగారం.
౨౮ తప్పు ద్రోవలో ముందుకు పరుగెత్తుటకంటే, మంచిదారిలో వెనక్కి నడవడమే ఉత్తమం.
౨౯ నీడను చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుతురుంటేనే నీడపడుతుంది.
౩౦ ఎలా నిరీక్షించాలో తెలియడం విజయానికి నాంది.
౩౧. కష్టాలు బలహీనుని పడగొడతాయి. బలవంతుడిని అభివృద్ధి చేస్తాయి.
౩౨. తప్పుని సమర్ధిస్తే, రెండు తప్పులవుతాయి.
౩౩. ధనాన్ని వదిలివేసినవాడు జోగి, ధనాశను వదిలివేసినవాడు యోగి.
౩౪ మనిషి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి.
౩౫ ఒక్కసారి మోసపోతే అది మన తప్పుకాదు. రెండోసారి మోసపోతే అది మనతప్పు.
౩౬ సుఖం మళ్ళీ మళ్ళీ కావలి అనుకోవడమే దు:ఖం
౩౭ జీవితం నిరాడంబరంగాను ఆశయం ఉత్తమంగాను ఉండాలి.
౩౮. తనలో లోపాలే లేవనుకునే లోపానికి మించిన లోపం మరోకటి లేదు.
౩౯ మాట ఇవ్వడానికి తొందరపడకూడదు. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి వెనకాడకూడదు.
౪౦ దీర్ఘజీవితం కంటే దివ్యజీవితం గొప్పది.
౪౧. మంచివాళ్ళకు లోకంలో పాపం కనిపించదు.
౪౨. ఆధ్యాత్మిక పవిత్రతే సత్యం.
౪౩. మానవుడి మహోత్కృష్టమైన లక్ష్యం భగవంతుడు.
౪౪ పవిత్రమైన నిజాయితీని వదలనంతవరకు దు:ఖం దరిచేరదు.
౪౫. ప్రశ్నలేమి అడగకుండా ఇతరులకు తోడ్పడడమే యోగం.
౪౬ అజ్ఞానమనే ప్రవర్తన ఎప్పుడూ మార్పును కోరుకుంటుంది.
౪౭ పగతీరితే అప్పటికి మాత్రమే తృప్తి. ఓర్పువలన ఎప్పటికి తృప్తి.
౪౮. నమ్మకం, ఓర్పు, ఆధ్యాత్మిక కవలలు.
౪౯. శరీరం ఒకరధం అయితే, ఇంద్రియాలు సారధి, గుర్రాలు బుద్ధి. ఇవి ఏవియు సహకరించకపోతే గమ్యాన్ని చేరుకోలేము.
౫౦. అపవిత్రమైన మనస్సుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని చేసినా వృధా.
౫౧. అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి.
౫౨. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గరకావడమే దు:ఖానికి నిదర్శనం.
౫౩. భక్తి మనసులో నిలుపుకొనేదేకాని, బహిర్గతం చేసేదికాదు.
౫౪. ఎక్కువగా మాట్లాడేవారిలో వాక్శుద్ధి, జ్ఞానశక్తి నశిస్తాయి.
౫౫. పుణ్యకార్యాలేవె చేయకుండా పుణ్యం కావాలి అనుకోవడం మూర్ఖతే అవుతుంది.
౫౬. మనస్సు,మాట, క్రియ, అన్నీ ఒకటిగా ఉన్నప్పుడే ధర్మాన్ని, సత్యాన్ని, పాటించినట్లు అవుతుంది.
౫౭. ధనం మనుషుల్ని సృష్టించదు. మనుషులే ధనాన్ని సృష్టిస్తారు.
౫౮. మంచి గుణాలున్న వారిని చిన్నదోషం వున్నంత మాత్రాన విడిచి పెట్టరాదు.
౫౯. భగవంతుడు అన్నిచోట్ల ఉన్నప్పటికిని మానవరూపంలోనే గ్రహించగలము.
No comments:
Post a Comment