జయ షిరిడీశ జగన్నివాస మనసే హారతి
భక్తుల ఆశల రూపం నీవే సాయీ ఆరతి
అందది కళ్ళు నీ మీదేరా హరిఓం హారతీ
పాలించే మరి పవళించేందుకు తారా హారతి ||జయ||
సాధు రూపం దాల్చిన సాయికి సద్గుణ హారతి
గురువారమున పుట్టిన సాయికి నిగ్రహమే హారతి
వెల్లువలయ్యే నీ వరములకు వందన హారతీ
చల్లని చూపుల సాయి నీకు చంద్రా హారతి ||జయ||
రామనవమిని జన్మించిన శ్రీరామా హారతి
ద్వారకమాయి మెట్టిన ఓ ఘన శ్యామా హారతి
పావన నామ పావన రూప నీకే హారతి
శివ తేజార్చిత గణపతి రూప వరదా హారతి ||జయ||
సకలము నీవే సర్వము నీవే, నేనే నీవయా
నీ లీలలను తెలియగ నేరము నీవే భారము
పంచభూతముల శాసించేటి శక్తే నీవయా
షిరిడీ క్షేత్రము దర్శన భాగ్యము కలుషాహరణము ||జయ||
శ్యామా, నానా, దాసగణుల దయతో కాచితివి
ఇహ పరమొసగే భక్తికి ముక్తిని వరమే ఇచ్చితివి
తల్లివి నీవే, తండ్రియు నీవే, గురువే నీవయా
సర్వ దేవతా నిలయము నీవే కొనుమా హారతి ||జయ||
దుప్పటి పైనా, దుప్పటి పరచి శయ్యే వున్నదీ
అరువది మించిన కళలకు నీవు దిక్కే అన్నది
వెన్నెల మనసుకంటే దైవం వేరేమున్నది
అమృతమూర్తి ఆరాధనలో ముక్తే వున్నది ||జయ||
అరిషడ్వర్గము అన్నిట మించిన మోహము మాయనిది
నానా కనులకు తెరలే కప్పుట దాల్చీ బ్రోచితివి
బ్రహ్మము కోరిన వ్యాపారికి మరి జ్ఞానము తెలిపితివి
లోభికి ఎన్నడు వశమే కానని ఇలలో చాటితివి ||జయ||
నవ మార్గముల భక్తిని తెలిపిన సాయి హారతి
దూషణ, భూషణ సమముగ నెంచే సాయీ హారతీ
సర్వ దేవతా సంగమ రూపా సాయీ హారతి ||జయ||
జయ షిరిడీశ జగన్నివాస మనసే హారతి
భక్తుల ఆశల రూపం నీవే సాయీ ఆరతి
అందది కళ్ళు నీ మీదేరా హరిఓం హారతీ
పాలించే మరి పవళించేందుకు తారా హారతి ||జయ||
---------------
ప. విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా ||విన్న||
చ. మురిపెము తో నువు తిరిపెము నెత్తి మురిసినావు బాబా
కరములతో శ్రీకరముగ మమ్ము బ్రోచినావు బాబా ||మురి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
చ. కరి మొరలే విని మకరిని ద్రుంచిన వాడవు కావా బాబా
మా మొరలే వినరావా బాబా ఓ సాయిబాబా ||కరి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
చ. రావణంతకా ఇనకుల తిలకా రామ సాయిబాబా
దశరథ పుత్ర కోమల గాత్రా పరమ పవిత్రా బాబా ||రావ||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా --------
ప. ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం (2)
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
చ. బ్రహ్మతేజం సాయిరాం సృష్టిమూలం సాయిరాం (2)
జ్ఞానతేజం సాయిరాం రాజయోగం సాయిరాం (2)
ఆనందసారం సాయిరాం అద్వైతరూపం సాయిరాం (2)
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
చ. వేదనాదం సాయిరాం లోకదీపం సాయిరాం (2)
దీనబంధూ సాయిరాం ప్రేమసింధూ సాయిరాం (2)
ప్రశాంతినిలయం సాయిరాం అనంతవిజయం సాయిరాం (2)
ఓం ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం (2)
శాంతి మంత్రం సాయిరాం శక్తిపీఠం సాయిరాం (2)