మధ్యవయస్సులో ఎదుర్కొనే సమస్యలు
మధ్యవయస్సులో ఎదుర్కొనే సమస్య మానసిక ఒత్తిడులు. మానసిక ఒత్తిడుల తీవ్రత స్త్రీలలో బాగా కనిపిస్తుంది. పెద్దరికంతో, ఆత్మవిశ్వాసంతో, తమలోని సృజనాత్మక శక్తితో ఏ సమస్యలనుంచి బయటపడవచ్చు? వయస్సు తీసుకొచ్చిన మార్పులను హుందాగా స్వీకరించే పరిణతిని, హుందాతనాన్ని పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా మీరు సాదించాలన్న విజయాలపై దృష్టి పెడితే మిడిల్ ఏజ్ సిండ్రోం నుంచి, దాని సమస్యల నుంచి బయటపడవచ్చు. పౌష్టిక ఆహారం, మానసిక, సామాజిక, శారీరక, ఎమోషన్ల సమస్యలు, ఫిట్ నెస్ ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని సూచనలు ఇక్కడ ఇస్తున్నాము.
- నిత్యం వ్యాయామాలు చేయడం.
- రోజూ పోషకాహారం తీసుకోవడం.
- మీ వయసు మహిళలతో కలసి కమ్యూనిటీ వర్క్స్ లో పాలు పంచుకోవాలి, లేదా మీకునచ్చిన యాక్టివిటీలో ఎప్పుడూ బిజీగా ఉండాలి.
- ప్రతిరోజూ ధ్యానంచేయాలి.
- రోజు స్ట్రెచ్చింగ్ ను రెండు లేదా మూడు సార్లు చేయాలి. మైండ్ రిల్యాక్సేషన్ వ్యాయామాలు చేయాలి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలి.
వన్ లెగ్ హిప్ ఎక్స్ టెన్షన్
నేలమీద చాప పరిచి దానిమీద పడుకోవాలి. రెండు కాళ్ళనూ మడవాలి. మడిచిన ఒక కాలిని మెల్లగా పైకి (గాలిలోకి) లేపాలి. పిరుదులను పైకి, కిందకి మెల్లగా, దించుతూ కదిలించాలి. ఇలా 10-15 మార్లు రెండు సెట్లు చేయాలి.
స్టాండింగ్ వన్ లెగ్ హిప్ ఎక్స్ టెన్షన్
(మోకాలు మడిచి) ఎడమ కాలిమీద నిలబడి మోకాలిని మడవాలి. మజిల్స్ ను కదిలిస్తూ, కుడి కాలిని పైకి లేపాలి. మళ్ళీ కిందకి దించాలి. ఇలా 15 మార్లు మూడు సెట్లు చేయాలి.
మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివరంటా కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.
- పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.
- రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకోనే అవకాశమూ ఉంది.మనకు తెలియకుండానే పక్కవారైకన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది.
- ఒక్కరమే చేస్తుంటే మధ్యలో అప్పుడప్పుడు బద్దకించడం, ఇవ్వాళకిది చాల్లే అనుకోవడం సహజం. అదే సమూహంలో ఉంటే తప్పనిసరిగా అందరితోపాటు ముందుకు వెళ్ళాల్సివస్తుంది. కాబట్టి ఫీజు చెల్లించి మానుకోవడమనే ప్రశ్నే తలెత్తదు.
- సాధారణంగా గ్రూప్ అనగానే ఏదైనా గుంపులో గోవిందయ్య చందమైపోతుంది. వ్యక్తిగతశ్రద్ద చూపరు. అన్న అభిప్రాయం ఉంటూంది. అది తప్పు. వ్యక్తిగా కన్నా బృందంగా ఉన్నప్పుడే శిక్షకులతో ఇంటరాక్షన్ ఎక్కువ. నిజానికి గ్రూపుగా ఉన్నవారికి చెప్పడం శిక్షకులకూ ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్కరిని పేరుపేరునా గుర్తు పెట్టుకొని తప్పనిసరిగా అందరూ ఒకే వేగంతో చేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తారు.
- ఎత్తు, బరువు, శరీర కొలతలు ఎప్పటికప్పుడు చూస్తూ వాటికి తగ్గట్లుగా ఆహారం తీసుకునేలా డైట్చార్ట్ చేసి ఇస్తుంటారు శిక్షకులు. వ్యక్తి కన్నా గ్రూపుగా సాధించిన విజయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
- భోజనం చేసిన తరువాత కనీసం రెండు గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని వ్యాయామ నిపుణులు అంటున్నారు. ఈ రెండు గంటలు చేసే వ్యాయామం తిన్న ఆహారాన్ని సరైన కేమంగా అరుగుదలకు వచ్చేలా చేయడమే కాకుండా, తద్వారా వచ్చిన శక్తిని శరీర భాగాలన్నిటికి సమాంతరంగా చేరుతుంది. ఇలా చేయడంవల్ల ఎలాంటి కీళ్ళ నొప్పులూ ఉండవని పైగా ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే గ్యాస్ సమస్య కూడా ఉండదని వారు చెబుతున్నారు.
- వ్యాయామానికి ముందు తీసుకొనే ఆహారం చాలా తక్కువ పరిమాణంలో ఉండాలి. దీనివల్ల వ్యాయామం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఈ పద్దతి ఉపకరిస్తుంది. ఎంతసేపు వ్యాయామం చేసినా అనవసరమైన అలసట లేకుండా ఇంకా చేయాలనే ఉత్సాహం పుడుతుంది.
- ఒక్కోసారి వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తి మీకు లేదనిపించినా, రాత్రి నిద్ర సరిపడినంత లేక నీరసంగా ఉన్నా ఆరోజు తప్పకుండా మీ వ్యాయామం సమయాన్ని తగ్గించుకోండి. కాస్త కష్టంగా ఎక్కువ శక్తిని ఉపయోగించనవలసిన వ్యాయామాలను కూడా ఆరోజుకి పక్కన పెట్టండి. లేదంటే మరింత నీరసం తోడవుతుంది.
- మీరు మంచి, సంతృప్తికరమైన నిద్రను అనుభవించిన తరువాత ప్రశాంతంగా లేచి వ్యాయామాన్ని అశ్రద్ద చేయకండి. ఎందుకంటే మీకు అంత మంచి నిద్రను అందించైంది వ్యాయామమేనన్న విషయాన్ని విస్మరించకండి. మంచి నిద్రకు సంబంధించి ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. అయితే వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి కచ్చితంగా ప్రశాంతమైన మంచి నిద్ర అందుతుంది.
- మీ వయసు 35 సంవత్సరాలు నిండినట్లయితే వ్యాయామానికి వెళ్ళే ముందు డాక్టరును సంప్రదించటం మరిచిపోకండి. మీ కుటుంబంలో ముందు తరం వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఫ్యామిలీ డాక్టరు ద్వారా తప్పనిసరిగా ర్తెలుసుకోవాలి. అధిక రక్తపోటు, గుండెదడ వంటి సమస్యలు మీకుటుంబంలో అంతకు ముందు ఎవరినైనా వేధించాయా అనేది ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం. ఈ సమాచారానికి అనుగుణంగా మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్న తరువాతే వైద్యుని సలహామేరసు వ్యాయామానికి సిద్దంకండి.
- వ్యాయామంలో ఎప్పుడూ వేగంగా ఫలితాన్ని ఆశించకండి. ఆ ఉద్దేశ్యంతో మీశక్తికి మించి కూడా చెయ్యకూడదు. క్రమంగా చేసుకుంటూ పోతే కాస్త సమయం పట్టినా వచ్చే ఫలితాలు మీకు జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని ప్రసాదిస్తాయి.
- హాయిగా నవ్వడం, నచ్చిన మ్యూజిక్ వింటూ వచ్చిన డ్యాన్స్ చేయడం ఇవి కూడా వ్యాయామంలో భాగమే. ఇవి ఒత్తిడిని ఇట్టే తరిమి కొడతాయని మరచిపోకండి.
- వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు మెత్తగా ఉండే కాటన్ సాక్సులు వేసుకొని, సాధారణంగా వాడే బూట్లకంటే కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్నవి వేసుకుంటే వ్యాయామానికి ఉపకరించడమే కాక ఎలాంటి కీళ్ళ నొప్పులు రాకుండా ఉపకరిస్తుంది.
- వదులుగా చక్కగా శరీరానికి గాలి తగిలేలా, వ్యాయామ భంగిమలకు ఇబ్బంది లేకుండా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి వస్త్రధారణ వ్యాయామం మరింతగా చేయాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది.
- ఒక రకమైన వ్యాయామం చేసిన వెంటనే ఇంకొకటి మొదలు పెట్టకుండా కాస్త రిలాక్స్ అవ్వాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. వ్యాయామాన్ని నెమ్మదిగా మొదలు పెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అంతే కాని అప్పటి వరకు విశ్రాంతిగా ఉన్న శరీరాన్ని ఒక్కసారిగా ఒత్తిడికి గురి చేయకూడదు.
No comments:
Post a Comment