Wednesday, March 25, 2015

భక్తీ గీతాలు

భక్తీ గీతాలు 
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా 
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త విని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళ వార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంధర మాట విని మంధర మాట విని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా

అలుక తెలిసి యేతెంచిన భూపతినడిగెను వరములు తన్వి
జరుపవలయు పట్టాభిషేకముభరతునికీ పృధివి 
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని..కూలే భువిపైని 
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా
కౌసలేయు రావించు మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి 
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి 
దోషమని వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి  పినతల్లి పదాల వ్రాలి

వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా 
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా 
గోడుగోడున అయోధ్య గొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకున్నది 
అడుగులబడి రాఘవా.. 
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది 
అడలి అడలి కన్నీరై అరయుచున్నది

--------------------------------------
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 
చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో 
తన కొలువు తీరె రాఘవుడు భామతో.. 
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 
రాము గని ప్రేమ గనె రావణు చెల్లి ముక్కు చెవులు కోసె సౌమిత్రి రోసిల్లి 
రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్ని 
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
 ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ 
ప్రతి ఉపకృతి చేయమని పలికెను కపులా హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా 
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 
నాథా.. రఘునాథా.. పాహి పాహి 
పాహి అని అశోకవనిని శోకించే సీత పాహి అని అశోకవనిని శోకించే సీత 
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
  జనని శిరోమణి అందుకొనీ పావనీ 
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
 దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి 
 దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి 
ఆతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికె 
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి 
అయోనిజ పైనే అనుమానమా 
ధర్మమూర్తి రామచంద్రమూర్తి ఇల్లాలికా పరీక్ష 
పతి ఆనతి తల దాలిచి అగ్ని దూకె  సీత 
పతి ఆనతి తల దాలిచి అగ్ని దూకె  సీత
కుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత 
కుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత 
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా 
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా

--------------------------------------

శ్రీరామ పరంధామ జయరామ పరంధామ 
శ్రీరామ పరంధామ జయరామ పరంధామ 
రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమా 
శ్రీరామ పరంధామ జయరామ పరంధామ 
సూర్యాన్వయాబ్ధి సోమా సుగుణాభిరామ శుభనామ
 సూర్యాన్వయాబ్ధి సోమా సుగుణాభిరామ శుభనామ
కారుణ్యధామ దశకంఠవిరామ రాఘవ రాజలలామ 
శ్రీరామ పరంధామ జయరామ పరంధామ
సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా 
సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా 
అరవిందలోచన సుందర సురుచిర ఇందీవరశ్యామా
శ్రీరామ పరంధామ జయరామ పరంధామ 
రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమా 
శ్రీరామ పరంధామ జయరామ పరంధామ 
జయ జయరాం జయ రఘురాం జయ జయరాం జయ రఘురాం 
జయ జయరాం 

--------------------------------------

జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే 
జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే 
జగదభిరాముడు శ్రీరాముడే 
జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో
వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే 
కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల దొరనే కూలిచి 
సురలను గాచిన వీరాధివీరుడు జగదభిరాముడు శ్రీరాముడే 
ఆలూమగల అనురాగాలకు..
ఆలూమగల అనురాగాలకు పోలిక సీతారాములే అనగా 
పోలిక సీతారాములే అనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు 
జగదభిరాముడు శ్రీరాముడే 
నిరతము ధర్మము నెరసి నిలిపి.. 
నిరతము ధర్మము నెరసి నిలిపి నరులకు సురులకు తరతరాలకు 
ఒరవడి అయిన వరయుగపురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే 
ఇనకులమణి  సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనేలేడని
ఇనకులమణి  సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు 
జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే 
జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు రాముడే 
జయ జయరాం జయ రఘురాం జయ జయరాం జయ రఘురాం 
జయ జయరాం జయ రఘురాం జయ జయరాం జయ రఘురాం

--------------------------------------

హే పాండురంగా హే పండరి నాధా
శరణం శరణం శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
విద్యాబుద్ధులూ వీడిన బాలకూ
అగుపించాడూ విఘ్నేశ్వరుడై
పిల్లా పాపలా కోరిన వారినీ
కరుణించాడూ సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధినే
అరికట్టాడూ విష్ణు రూపుడై
మగస్యా శ్యామాకూ మారుతిగానూ
మరికొందరికీ దత్తాత్రేయుడుగా
యద్భావం తత్భవతని
దర్శనమిచ్చాడూ ధన్యులజేశాడూ
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
పెనుతుఫాను తాకిడిలో అలమటించు దీనులనూ
ఆదరించె తాన నాథ నాథుడై
అజ్ఞానం అలుముకున్న అంధులనూ చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిక్షమెత్తి వారి వారి పాపములనూ
పుచ్చుకొనీ మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకొన్న పాపములనూ ప్రక్షాళన చేసుకొనెనూ
దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరుచేసీ ఖండయోగ సాధనలో
ఆత్మసిద్ధి చాటినాడు సిద్ధుడై
జీవరాశులన్నిటికీ సాయే శరణం సాయే శరణం
దివ్యజ్ఞాన సాధనకూ సాయే శరణం సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం ముక్తికీ సాయే శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
 క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

--------------------------------------

బాబా...సాయి బాబా బాబా...సాయి బాబా
నీవూ మావలె మనిషివనీ
నీకూ మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేదీ అనుకొని ఎలా బ్రతికేదీ
బాబా...సాయి బాబా బాబా...సాయి బాబా

నువ్వే మరణించావంటే దేవుడెలా బ్రతికుంటాడూ
నువ్వే మరణించావంటే దేవుడెలా బ్రతికుంటాడూ
నువ్వే దేవుడివైతే మృత్యువెలా శాసిస్తాడూ
తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా
బాబా...సాయి బాబా బాబా...సాయి బాబా

నీవూ మావలె మనిషివనీ
నీకూ మరణం ఉన్నదనీ
అంటే ఎలా నమ్మేదీ అనుకొని ఎలా బ్రతికేదీ
బాబా...సాయి బాబా బాబా...సాయి బాబా

దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చీ రాల్చీ రావయ్యా
గ్రహములు గోళాలిహ పర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకీ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకీ లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోనీ
ముల్లోకాలూ కల్లోలాల్లొ శూన్యం అయిపొనీ
కదిలే కాలాగ్నీ ఎగసే బడబాగ్నీ
దైవం ధర్మాన్నీ దగ్ధం చేసేవీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్నే ఐక్యం అయిపోనీ...పోనీ

--------------------------------------

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపలమతితుల
దీనుల హీనుల పాపలమతితుల
ఉద్ధరించగా యుగయుగాలలో...
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో

త్రేతాయుగమున రాముడిగా
ద్వాపరమందునా కృష్ణుడిగా..
త్రేతాయుగమున రాముడిగా
ద్వాపరమందునా కృష్ణుడిగా
కలిలో ఏసూ బుద్ధుడు అల్లా
కలిలో ఏసూ బుద్ధుడు అల్లా కరుణా మూర్తులుగా....
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో

సమతా మమతలు చాటుటకై
సహనం త్యాగం నేర్పుటకై...
సమతా మమతలు చాటుటకై
సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్థాపన చేయుటకై...
శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై...

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపలమతితుల
దీనుల హీనుల పాపలమతితుల
ఉద్ధరించగా యుగయుగాలలో...
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో

--------------------------------------

మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్మడున్నాడనీ
వాడు పరిశుద్ధుడౌతాడనీ
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు  సాయి
మమ్ము సాకావు  సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి...
మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది  పుణ్యం ఇచ్చు మేలైన పైజన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోశావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
 ద్వారకమాయి నీ వశమాయే
ధన్యులమైనామయా మాకు దైవమై వెళిశావయ్యా..
మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా

--------------------------------------

సాయి బాబా...సాయి బాబా...సాయినాథా..సాయిదేవా..
సత్యం..నిత్యం...నీవే...కాదా..
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
ఇక నీ పరీక్షకూ మేమాగలేమూ ఇటులీ నిరీక్షణా మేమోపలేమూ
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
మా పాలి దైవం అనీ మా దిక్కూ నీవేననీ
కొలిచాము దినం దినం సాయీ..
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయీ..
శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
 దైవమైనా  ధర్మమైనా నీలోనె చూచాము సాయీ
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలూ చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా గురు గోవిందైనా
గురు ద్వారకైనా నీ ద్వారకేనని నీ భక్తులైనామూ సాయీ
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
ఇక నీ పరీక్షకూ మేమాగలేమూ ఇటులీ నిరీక్షణా మేమోపలేమూ
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
కృష్ణ సాయీ కృష్ణ సాయీ రామ సాయీ
కృష్ణ సాయీ కృష్ణ సాయీ రామ సాయీ
అల్లా సాయీ మౌలా సాయీ
అల్లా సాయీ మౌలా సాయీ
నానక్ సాయీ గోవింద్ సాయీ ఏసు సాయీ షిర్డీ సాయీ ఓం
నానక్ సాయీ గోవింద్ సాయీ ఏసు సాయీ షిర్డీ సాయీ ఓం
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ ఓం

--------------------------------------

సాయి బాబా...సాయి బాబా...సాయినాథా..సాయిదేవా..
సత్యం..నిత్యం...నీవే...కాదా..
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
ఇక నీ పరీక్షకూ మేమాగలేమూ ఇటులీ నిరీక్షణా మేమోపలేమూ
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
మా పాలి దైవం అనీ మా దిక్కూ నీవేననీ
కొలిచాము దినం దినం సాయీ..
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయీ..
శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
 దైవమైనా  ధర్మమైనా నీలోనె చూచాము సాయీ
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలూ చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా గురు గోవిందైనా
గురు ద్వారకైనా నీ ద్వారకేనని నీ భక్తులైనామూ సాయీ
రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
ఇక నీ పరీక్షకూ మేమాగలేమూ ఇటులీ నిరీక్షణా మేమోపలేమూ
నువు లేకా అనాథలం బ్రతుకంతా అయోమయం
బాబా... బాబా
కృష్ణ సాయీ కృష్ణ సాయీ రామ సాయీ
కృష్ణ సాయీ కృష్ణ సాయీ రామ సాయీ
అల్లా సాయీ మౌలా సాయీ
అల్లా సాయీ మౌలా సాయీ
నానక్ సాయీ గోవింద్ సాయీ ఏసు సాయీ షిర్డీ సాయీ ఓం
నానక్ సాయీ గోవింద్ సాయీ ఏసు సాయీ షిర్డీ సాయీ ఓం
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ
సాయీ సాయీ బాబా సాయీ సాయీ సాయీ బాబా సాయీ ఓం


No comments:

Post a Comment