Saturday, April 4, 2015

దంత సమస్యలు

దంత సమస్యలు



దంత సమస్యలు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు,నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరంప్రభావితమవుతుంటా యి. మనం తీసుకునే చిన్నచిన్నజాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడతాయి.అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారంగురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపిపదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారంఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సులభంగా నోట్లోమిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగాగొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూఎక్కువగా తీసుకుంటున్న జంక్‌ఫుడ్ పంటిపైన, పంటిసందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలోఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయిహానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాలదంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలోపీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవవిషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసేబ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసంఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు. కొంతమందిఅతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటుతోమేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. రోజూ నిద్రలేవగానే, ఆతర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగునిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది.అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడంసరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైన బ్రష్‌ల మీద కాకుండా బ్రష్చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో వీలైతేఅద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితంఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్యచేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతోశుభ్రపరచుకోవాలి. టూత్‌పిక్స్, పిన్నులు లాంటి వాటితోకెలక్కూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగామౌత్‌వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసంరోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియానుఅదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారిఇంటిల్లిపాదీ డెంటిస్ట్‌ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్‌గాచేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్లదంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు.

No comments:

Post a Comment