Saturday, April 4, 2015

జలుబు :

జలుబు :




జలుబుకు వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుందంటారు. పెద్దవెల్లుల్లిపాయను పై పొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. 
అలా నోట్లో ఉంచుకున్న వెల్లుల్లిని మెల్లగా కొరుకుతూ దానినుంచి వచ్చే రసాన్ని మింగుతుండాలి. 
ఇలా మూడు నాలుగు గంటలకి ఓ సారి కొత్త వెల్లుల్లిపాయనునోట్లో ఉంచుకుని రసం మింగితే ఒక రోజులోనే జలుబు నుంచిఉపశమనం కలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగుకలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబునుంచి ఉపశమనం కలుగుతుంది. 

* ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబునుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 

* పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకునిఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తేగోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచిఉపశమనం కలుగుతుంది.

* ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనేసేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతోశరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖంపడుతుంది. 

* తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలోకలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబుమటుమాయం.

జలుబు సహజంగా 2 నుంచి 5 రోజుల మధ్య ఉంటుంది.విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండిరెండు వారాల వరకు వుండవచ్చంటున్నారు వైద్యులు. జలుబుసోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగతవ్యాధి నిరోధక శక్తి పైన, జలుబుకు చెందిన వైరస్ రకాల పైఆధారపడి వుంటుందంటున్నారు వైద్యులు.
--------------------------------------------------------------------------------------------

జలుబు తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం:

జలుబు ఉన్నప్పుడు, కొవ్వు పదార్ధాలు, మాంసము, పాలవుత్పత్తులు తక్కువగా తీసుకోవడం చాలా మంచిదంటున్నారుఆరోగ్య నిపుణులు.

ఇలాంటి సమయంలో తాజా పళ్ళ రసాలను, కాయగూరలనుఆహారం రూపంలో అధికంగా తీసుకోవాలి.

మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్తీసుకుంటే జలుబు నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. 

వేడి నీటి ఆవిరి పట్టడం వలన ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకొంటుంటే జలుబు నుంచి త్వరగాఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.



కాస్త చింతపండు గుజ్జు, టమోటో రసం, మిరియాల పొడి, ఒకమిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగాతాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.










చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతేఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పేఓ పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినాజలుబుకానీ తగులుకుంటే ఓ వారం పాటు బాధపడక తప్పదుఅనేదే ఈ సామెతలోని అంతరార్థం. 
అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టేనరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకుఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులోఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగామందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అనిప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు... 
వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్లవచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లోమిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండాచేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. ఓగిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కువెంటనే తెర్చుకుంటుంది. 
వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబుతీవ్రత వెంటనే తగ్గుతుంది. ఓ గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయరసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితేజలుబు తగ్గుతుంది. ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైనవాటిని పాటిస్తే జలుబు తీవ్రత ఓ నాలుగైదు రోజుల్లో పూర్తిగాతగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రతతగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.




జలుబు చేయడం సర్వ సాధారణం. అయితే ప్రస్తుతం జలుబుఅంటే స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయోమోనని ఆందోళనకుగురికావడం సహజం. జలుబు చేసిన ప్రతివారికీ స్వైన్‌ఫ్లూఅనుకోవడం పొరపాటు. జలుబు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలుపాటిస్తే జలుబు వెంటనే మటుమాయమౌతుందంటున్నారువైద్యులు.
-------------------------------------------------------------------------------------------------------

** జలుబుతో బాధపడుతుంటే యూకలిప్టస్‌ ఆయిల్‌‌నునుదుటిపైన, రొమ్ముపైన, వీపు, ముక్కుపైన రుద్దండి. తర్వాతకంటినిండా నిద్రించండి. దీంతో కాస్త ఉపశమనంకలుగుతుందంటున్నారు వైద్యులు.

** జలుబుతో సతమతమౌతుంటే ప్రతి రోజూ విటమిన్‌-సిమాత్రలు ఒకటి చొప్పున వాడండి. రెండు వేసుకుంటేచాలు.

** మిరియాల చారు ప్రతి రోజూ ఉదయం రాత్రి త్రాగండి.జలుబుకు ఇది చాలా మంచిందంటున్నారు ఆయుర్వేదవైద్యులు. అలాగే విశ్రాంతి చాలా అవసరమంటున్నారు వారు. 

** సొంఠి కాఫీ లేదా సొంఠి టీ సేవిస్తే కాస్త ఉపశమనంకలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగుకలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబునుంచి ఉపశమనం కలుగుతుంది. 

* ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబునుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 

* పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకునిఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తేగోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచిఉపశమనం కలుగుతుంది.

* ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనేసేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతోశరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖంపడుతుంది. 

* తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలోకలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబుమటుమాయం.


** రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ నీటిలో రెండు నిమ్మకాయలరసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగండి. ఇలా నాలుగురోజులు సేవిస్తే జలుబు మటుమాయం అవుతుంది. 

** అరకప్పు నీటిలో దాల్చిన చెక్క పౌడర్‌ పావు చెంచాకలుపుకుని మరగబెట్టండి. ఇందులో చిటికెడు మిరియాలపొడి,ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడు సార్లు త్రాగండి. ఇలాసేవిస్తే జలుబు దూరమౌతుంది.

** అరలీటర్‌ నీటిలో 100 గ్రాముల బెండకాయలు ముక్కలుగాతరిగి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చే ఆవిరినిపీల్చండి. జలుబు మటుమాయం అవుతుందంటు్న్నారువైద్యులు. 

** పసుపు కొమ్మును కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కుదిబ్బడతగ్గుతుంది. 

** అరచెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లంపొడి కప్పునీటిలోవేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా సిప్‌ చేయండి.

** కప్పు వేడి పాలలో అరచెంచా సుద్ధమైన పసుపు కలుపుకునిత్రాగండి. ఇలా ప్రతి రోజూ రెండు మూడుసార్లు త్రాగండి.


 * దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతోపాటు ఇనుము,క్యాల్షియం, మాంగనీస్‌, సి, కె విటమిన్లు లభిస్తాయి. ఇందులోఉండే యాంటీమైక్రోబయల్‌ సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపుతాజాగా ఉంచుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలాచేయడమే కాకుండా జలుబును కూడా దాల్చినచెక్కనివారిస్తుంది.* డయేరియా, పంటినొప్పి, కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తీదాల్చిన చెక్కకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తినీపెంపొందిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే దీనినికొన్నిరకాల అరోమా నూనెలు, రూం ఫ్రెషనర్ల తయారీలో కూడాఉపయోగిస్తారు.* మహిళల్లో రుతు సంబంధ వ్యాధుల నివారణకుదాల్చిన దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీన్ని తీసుకోవటంవల్లరుతుస్రావం సరైన సమయంలో వచ్చేలా చేస్తుంది. గర్భదోషాలనుకూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడాఇది మంచి ఔషధం. దాల్చిన చెక్కను ఉడికించి, పేస్టు చేసిదాంట్లో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే జిగటవిరేచనాలను నియంత్రించవచ్చు.

** జలుబుతో ఇబ్బంది పడుతూ...శ్వాస పీల్చుతున్నప్పుడుఛాతీలోనుంచి శబ్దం వస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలోరెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకుని తాగండి. ఇలా మూడురోజలు రెండుపూటలా సేవిస్తుంటే ఫలితంకనపడుతుందంటున్నారు వైద్యులు.

** దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాలపొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారిఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

మిరియాలతో జలుబు పరార్








సాధారణంగా వర్షాకాలం లేదా చలికాలంలో జలుబు, దగ్గు రావడంసహజం.. దీని కారణంగా ఆయా కాలాల్లో ఒక్కోసారి శ్వాసనుపీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అన్పిస్తుంది... అయితేమిరియాలతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్యులుసూచిస్తున్నారు.
కొన్ని మిరియాలను పొడిగా దంచుకుని చక్కెరతో కలిపితీసుకుంటే జలుబు, దగ్గు, గొంతులో దరుదగా ఉన్నట్లుఅనిపించడం గొంతు నెప్పి వంటి సమస్యలను నుంచి ఉపశమనంపొందవచ్చు... ఇలాగే మూడు పూటలా తీసుకంటే ఫలితంకనబడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు..

No comments:

Post a Comment