Saturday, April 11, 2015

శ్రీరామ నామ మహిమ

 శ్రీరామ నామ మహిమ
 శ్లో||    మత్క్వ తాయాభలే ద్భాధమహాదుఃఖౌఘ
        రామనాఓ్నజపాత్సాహిముచ్సతేస్వల్పకాలతః ||
శో||    సర్వోపద్రవనాశార్ధః రామనామజపేద్భుదః
        సత్యంసత్యం నసందేహా మంతవ్యంహమాతాంజనైః ||
1) మహాదుఃఖములను గలిగించునేజేయు (శని) బాధయు రామనామజపముల వలన స్వల్ప కాలంలోనే తొలగిపోవును. 
2) సర్వోప ద్రవ నాశనము కొరకు బుద్ధిమంతుడు రామనామమును జపించవలయును. ఇది సత్యము, సత్యము సందేహము లేదు. ఇది మహామహులమతము, అని శని చెప్పను.

1.     ఎవరి చిత్తమునైతే సమత్వము వుంటుందో యెవరికైతే శత్రుల గాని మిత్రలుగాని వుండరో, యెవరైతే దోసిలి నందునున్న పుష్పముల వలె పువ్వు తనను త్రెంచిన హస్తమును, తనను పదిలపరచుకొన్న హస్తమును సమానముగా సుగంధితము గావింఛును. శత్రువులకును మిత్రులకును సహితమును చేకూర్చదరో అటువంటి సత్‌ పురుషులకు అభివందనమాచరించెదను.
2.    విధాతయీ ధరాధర జగత్తును గుణదోషో దయముగా సృష్టించెను. ఇందుండి సత్‌ పురుషులు హంసవలె దోషరూపమును వర్జించి గుణ రూపక్షరమును మాత్రమే గ్రహించెదరు.
3.    దుష్టరూపవనమును దహించుటకు అగ్ని స్వరూపుడునూ, తన హృదయసౌధము నందుధనుర్బాణధారియైన శ్రీరామ్‌ చంద్రునిప్రతిష్టించుకొన్నవాడును, జ్ఞానమున కాలవాలమును అగుపవనకుమారునికి ప్రణాముగావించెదను.
4.    వాక్కు, దాని అర్ధము, జలము, జలతరంగము యివి వివరించుటకు భిన్మముఉలైనను వాస్తవము గా అవి అభిన్నము (ఒకటియే) అదే విధముగా ఏకతత్వమైన సీతారాముల చరణములకు నేను ప్రణమిల్లెదను.
5.    ప్రభూ! నాకు ధర్మార్ధకామములయందు యిచ్చలేదు. మోక్షమును కూడ కోరను. జన్మ జన్మలకు మీ చరణ కమలములయందు రమించే భక్తిని ప్రసాదించ గల వరమొసగము.
6.    నీలమేఘశ్యామవర్ణ శ్రీరామ! సీతా లక్ష్మణ సమేతుడవై నిరంతరము నా హృదయమున నివసింపుము.
7)    కఠినమైన పాప సంకులమైన ఈ కలికాలము నందు ధర్మ, జ్ఞాన, యోగ, జపములకు తావులేదు. కావున వాటి ఆసక్తిని విడచి శ్రీరామచంద్రుని భజంతు వారే వివేకవంతులు.
8.    ఓ మనసా! దీ పశిఖతో సమానమైన యువతి శరీరమునకు ఆకర్షితమయ్యే కీటకముకారాదు. కామమును, మదమును విడచి, రాచంద్రుని భజించుచూ సదాసత్సంగమునందు వర్తించుము.
9.    ఓ తండ్రీ! స్వర్గము, మోక్షములందు కల్గు సుఖమును, త్రాస్సులోని వొక పళ్ళెమునందుంచి, ఒక్క క్షణమ సత్సంగమ చేయుట వలన లభించు ఆనందమును వెరొక పళ్ళెమునందుంచి తూచినచో సత్సాంగత్యము వలన కలుగు సుఖముతో మోక్ష సుఖము సరితూగలేదు.
10.    నీవు బాహ్యముగను, అంతరంగికముగను ప్రకాశింపగోరుదువేని ముఖమనెడి వావ్‌ ద్వారమునందు గల నాలుక యును గడపపై రామనామ మణిదీపమును వెలిగించుము అని తులసీదాసుగారు నుడువుచున్నారు. అనగా గడపపై నుంచి నదీపము గృహములోపల భాగమును, బయటి భాగమునేవిధముగా ప్రకాశింపజేయునో అదేవిధముగా రామనామము జపించుట వలన అంతరంగిక భావములు, బాహ్య ప్రవర్తన కూడా శుద్ధమనగును.
11.    ఏ పాదము నుండి పరమ పవిత్రమైన గంగప్రకటితమైనదో, యే పాదములను పరమశివుడు తన శిరస్సు పై ధరించెనో, ఏ పాదపద్మములకైతే బ్రహ్మపూజ గావించుచుండెనో, ఆ (రామ) పాదములను నా శిరస్సుపై నుంచితిని, అని పల్కి అహల్య పలుమారులు రామచరణమునకు నమస్కరించి తనకు వలయు వరమునూ పొంది ఆనందముతో తమలుతి మాహర్షి లోకమునకెగెను. ఇచ్చట తులసీదాసుగారు భగవన్నామస్మరణమెట్లు అమృతప్రాయమగుచున్నదో అటులనే భగవదర్చన కూడ భక్తులకు సుఖదాయకమగునను విషయమును శ్రీరామపాదపవిత్రతను, మహిమను చక్కని సన్నివేశములతో అతి మనోహరముగా రచనగావించియున్నారు.
12.    సూర్యుని వెలుగు ప్రసరించిన ప్రదేశమును అంధకారము తొలగిపోవుచందంబున సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరాముడుండు లాభేమోహందకారము లేశమాత్రముకూడ నుండదు. ఆయన షడుణ పరిపూర్ణుడు. స్వయం ప్రకాశకుడు. రేయింబవళ్ళ వలె, అత్మజ్ఞానము, విజ్ఞానము అనుథలను మానవాళి పొందుదురేకాని భగవంతుడు నిత్యజ్ఞానస్వరూపడు పొందడు.
13)    భగవంతుడు మాయను సైతము భ్రుకుటి పై నాట్యమాడించును. (మాయాతీతుడు) అటువంటి ప్రభువును విడచి వేరెవరిని భజింపవలెను? కుటిలతత్వమును వీడి మనోవాక్కాయ కర్మములతో భజించినచో శ్రీరాముడు కరుణించును.
14.    గురూపదేశ చింతనము వలన నా మనస్సు రామ చరణములపై స్థిరపడి నిలచినది. నేను క్షణమాతమున కొంగొత్రప్రేమను, అనురాగమును పొందుచూ శ్రీ రఘునాధు నియశమును గానము చేయుచుసంఛరించెదను.
15.    భయంకరములైన సంకటములను ఆదిదైవిక, ఆది భౌతిక అధ్యాత్మికముల హరించునదియు, జనమరణమనెడి భవరోగమునకు ఔషధమైనటు వంటిదియునగు నామము గత శ్రీరాముడు మనందరి యాందుప్రసన్నుడుగానుంఢు గాక.
16.    ఓ రఘువరా! నా భోటిదీనుడను, మీసాటి దీనోర్ధ్దారకుడు, యెవరూలేరను విషయమును గ్రహించిన, నన్ను జనన మరణవిష వలయమునుండి రక్షించుము. 
17.    హే రఘునాథా! కామిపురుషునికి స్త్రీ ప్రియమగు రీతిగ లోభికి ధనము ప్రీతికరముగు విధమున, మీరు నాకు ప్రియతములగుదురుగాక.
18)    భవరోగమునకు ఔషధమగు రఘునాధుని యశమును (రామాయణము) ఏ స్త్రీ, పురుషులైతే ఆలకించెదరో వారి మనోరథములన్నింటిని త్రిశిరాసురవైరియగు శ్రీరాముడు సిద్ధింపజేయును.
19)    సంపూర్ణమును, సుందరమును, మంగళదాయకమునగు శ్రీరఘునాయకుని గుణముల నెవరైతే ఆలకించెదరో వారు మరియేయితర నౌక (సాధనము) ల సహాయము లేకయే భవసాగరము నుండి తరించగలరు.
20.    సాధుపురుషులతో సత్సంగము, ఒక్క ఘడియ లేదా అరఘడియ, పావు ఘడియ కలిగిననూ అది కోటి అపరాధమలను హరించును.

ఓం శ్రీరామ జయ రామ, జయ జయ రామ,
జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ
శ్రీ రఘురామ సీతారామ, శ్రీ రఘు రామ సీతారామ.    

No comments:

Post a Comment