Saturday, April 11, 2015

మహా గణపతిమ్ మనసా స్మరామి



శ్రీ మహా గణపతిమ్
పల్లవి:     మహా గణపతిమ్ మనసా స్మరామి|
             వశిష్ట వామ దేవాది వందిత||

చరణం:    మహా దేవ సుతం గురుగుహ నుతం|
             మార కోటి ప్రకాశం శాంతం||
             మహా కావ్య నాటకాది ప్రియం|
             మూషిక వాహన మోదక ప్రియం||

||మహా గణపతిమ్ ||

note: సరిగమ మహాగణపతిమ్ 
        పనిస సరిగమ మహాగణపతిమ్
        పమగ మరిస సరిగమ  మహాగణపతిమ్
        పనిసరిస నినిపమస సరిగమ మహాగణపతిమ్
        నిసనిపనిపమ రిసరిస సపమని మహాగణపతిమ్
        నిసరిససస నిసరిసస నిసనిసరిసస నిసరిసస  
        పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ
        నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస
        నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస సని సరి సని సరిస 
        ససరిగ గమపప గమమప మపగని పనిసరిస నిపమ సరిగమ 

||మహాగణపతిమ్||

--------------------
దేవ దేవం భజే అన్నమాచార్య సంకీర్తన
పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం ||
రావణాసుర వైరి రవిపుంగవం రామం||
చరణం1:
రాజ వర శేఖరం రవి కుల సుధాకరం||
ఆజానుబాహువు నీలాగ్రకాయం||
రాజారికోదండ రాజదీక్షాగురుం||
రాజీవ లోచనం రామచంద్రం రామం| ||దేవ దేవం||
చరణం2:
నీలజీమూత సన్నిభశరీరం తన||
విశాలవక్షం నిబల జలజనాభం||
కాలాహినగ హరం ధర్మసంస్థాపనం||
గోలలనాధిపం యోగిశయనం రామం| ||దేవ దేవం||
చరణం3:
పంకజాసన వినుత పరమనారాయణం||
శంకరార్జిత జనక చాపదళనం||
లంకావిశోషణం లాలిత విభీషణం||
వేంకటేశం సాగు వినుత వినుతం రామం| ||దేవ దేవం||
-------------------------
పిబ రే రామరసం రసనే |
పిబ రే రామరసం ||

ధూరీకృత సాతకసంసర్గం |
పూరితనానావిధ ఫలపర్గం 

జననమరణ భయశోకవిదూరం|
సకలశాస్త్ర నిగమాగమసారం 

పరిపాలిత సరసిజగర్భాండం |
పరమపవిత్రీకృత పాషండం 

శుద్ధపరమహంస ఆశ్రమగీతం |
శుకశౌనక కౌశికముఖపీతం
--------------------
మానస సంచరరే బ్రహ్మణి || మానస సంచర రే ||

మదశిఖిపించాలంకృతచికురే |
మహనీయకపోలవిజితముకురే ||

శ్రీరమణీకుచదుర్గవిహారే |
సేవక జనమందిర మందారే ||

పరమహంశముఖచ్చంద్రచకోరే |
పరిపూరితమురళీరవధారే ||
---------------------
నను బ్రోవమని చెప్పవే - సీతమ్మ తల్లీ
ననుః బ్రోవమని చెప్పవే 

నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురా! జననీ జానకమ్మ 

ప్రక్కను జేరుక - చెక్కిలి నొక్కుచు 
జక్కగ మరుకేళి - సొక్కి యుండెడి వేళ 

లోకాంతరంగుడు - శ్రీకాంత నినుగూడి 
యేకాంతమున నేక - శయ్యనున్న వేళ 

అద్రిజవినతుడు - భద్రగిరీశుడు 
నిద్ర మేల్కొనువేళ నేతరో బోధించి
----------------
తీరుగ నను దయజూచెదవో - యినవంశోత్తమ రామా 
నాతరమా భవసాగర మీదను - నళినదళేక్షణ రామా 

శ్రీరఘునందన సీతారమణా - శ్రితజనపోషక రామా 
కారుణ్యాలయ భక్తవరద నిను - గన్నది కానుపు రామా 

మురిపెముతో నా స్వామివి నీవని - ముందుగ దెల్పితి రామా 
మరువకయికనభిమానముంచునీ - మఱుగజొచ్చితిని రామా 

క్రూరకర్మములు నేరక చేసితి - నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముసేవవె - దైవశిఖామణి రామా 

గురుడవునామదిదైవమునీవను - నురుశాస్త్రంబులు రామా 
గురువుదైవమనియెఱుగకతిరిగెడు - క్రూరుడనైతిని రామా 

తాండవమున నఖిలాండకోటి - బ్రహ్మాండనాయకా రామా 
బంధనమున నీ నామముదలచిన - బ్రహ్మానందము రామా 

వాసవకమలభవామరవందిత - వారధిబంధన రామా 
భాసురవరసద్గుణములు గల్గిన - భద్రాద్రీశ్వర రామా 

వాసవనుత రామదాసపోషకా - వందనమయోధ్య రామా 
దాసార్చిత మాకభయమొసంగవె - దాసరధీరఘురామా
-----------------------

ఓం..జై శ్రీరాం...జై సీతారాం...!!

ఓం.శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ....!!

నేను నిజమైతే నా స్వామ నిజమౌనా:

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా 
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా ||నేను నిజమైతే|| 
ఆవువంటివాడు నేనైతే పాలవంటివాడు నా స్వామియే 
ఆవుకు రంగులు ఉన్నవిగాని పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే|| 
జాతివంటివాడు నేనైతే నీతివంటివాడు నా స్వామియే 
జాతికి కులములు ఉన్నవిగాని నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే|| 
పూలవంటివాడు నేనైతే పూజవంటివాడు నా స్వామియే 
పూలకు రంగులు ఉన్నవిగాని పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే|| 
చెరుకువంటివాడు నేనైతే తీపివంటివాడు నా స్వామియే 
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని తీపికి గనుపులు లేవుగా ||నేను నిజమైతే|| 
ఏరువంటివాడు నేనైతే నీరువంటివాడు నా స్వామియే 
ఏరుకు వంపులు ఉన్నవిగాని నీరుకు వంపులు లేవుగా ||నేను నిజమైతే|| 
భజనవంటివాడు నేనైతే భక్తివంటివాడు నా స్వామియే 
భజనకు వంతులు ఉన్నవిగాని భక్తికి వంతులు లేవుగా ||నేను నిజమైతే||
--------------
 పూలకు రంగులు వున్నాయ్ గాని , పూజకు రంగులు ఉన్నాయా ;
పూల వంటిది నీ ఆత్మ, పూజ వంటిది పరమాత్మ ,
ఆవుకు రంగులు వున్నాయ్ గాని, పాలకు రంగులు ఉన్నాయా ;
ఆవు  వంటిది నీ ఆత్మ, పాల వంటిది పరమాత్మ'
-------------------





No comments:

Post a Comment