Saturday, April 25, 2015

పచ్చళ్లు

పచ్చళ్లు


అల్లం నిల్వ పచ్చడి


Ginger Pickle
కావలసిన పదార్ధాలు:
అల్లం ముక్కలు: 100 grm
బెల్లం తురుము: 100 grm
చింతపండు: 100 grm
ఎండుమిర్చి: 10
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: తగినంత
మెంతులు: 1tsp
ధనియాలు: 2tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు: 2 రెమ్మలు
వెల్లుల్లి: 10 రెబ్బలు

తయారు చేయు విధానము:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం ముక్కలను 5 నిమిషాలు వేయించాలి. తర్వాత చల్లారనివ్వాలి.
2. వేడినీళ్లలో చింతపండు నానబెట్టి చల్లారాక గుజ్జు తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో రెండు టీసూన్ల ఆయిల్ వేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మరో మూడు నిమిషాలు వేగనివ్వాలి. చల్లారాక వీటిని పొడి చేసి పెట్టుకోవాలి.
4. చల్లారిన అల్లం ముక్కలను గ్రైండ్ చేసుకుని, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పౌడర్ ను కలపాలి.
5. పాన్ లో కొద్ది ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపును పేస్ట్ చేసిన అల్లం పచ్చడిలో కలపాలి. అంతే అల్లం పచ్చడి రెడీ.
దీనిని గాలి చొరబడని బాటిల్ లో పెట్టి నిల్వచేసుకోవచ్చు. ఈ పచ్చడి దోసె, ఇడ్లీ, అన్నంలోకి మంచి కాంబినేషన్ అవుతుంది.

క్యాప్సికం చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాప్సికం- అర కిలో, ఎండుమిరపకాయలు- 8, సెనగపప్పు- 8 చెంచాలు, మినపపప్పు- 6 చెంచాలు, ఆవాలు-4 చెంచాలు, మెంతులు- ఒకటిన్నర చెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- 8 చెంచాలు, పసుపు- అర చెంచా, చింతపండు- కుంకుడుకాయంత, ఉప్పు- తగినంత, ఇంగువ- అర చెంచా. పోపుని రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో భాగాన్ని అలంకరణకి ఉపయోగించాలి.

తయారీ విధానం : ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు, 3 చెంచాల మినపపప్పు, 2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత పొడి చేస ఉంచుకోవాలి. బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. దీనికి మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ. చివరిలో తగిన ంత ఉప్పు కలుపుకోవాలి.


క్యాబేజీ చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాబేజీ- సగభాగం, వేరుసెనగ పప్పు- పావు కప్పు, ఎండు మిరపకాయలు- 3, మినపపప్పు- 1 చెంచా, సెనగపప్పు- 1 చెంచా, ఇంగువ- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- కొంచెం, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- కొంచెం.

తయారీ విధానం : రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడిచేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దగా నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ వాసన గిట్టని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.


వంకాయ పెరుగుపచ్చడి


కావలసిన పదార్థాలు : పెద్దవంకాయలు-2, పచ్చి మిరపకాయలు-2, ఎండు మిరపకాయలు-2, కొబ్బరి తురుము-2 చెంచాలు, ఆవాలు- అర చెంచా, ఇంగువ- అర చెంచా, నూనె-2 చెంచాలు, పెరుగు- 2 కప్పులు, ఉప్పు తగినంత తయారీ విధానం : వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబబుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి. ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.


పాలకూర చట్నీ


కావలసిన పదార్థాలు : పాలకూర- 2 కట్టలు, కొత్తిమీర- 1కట్ట, పచ్చి మిరపకాయలు- 8, జీలకర్ర- చెంచా, మెంతులు- ఒక చెంచా, పసుపు- చిటికెడు, నూనె- 6చెంచాలు, బెల్లం- 1చెంచా, నువ్వులు- 1 చెంచా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం : ముందుగా పాలకూర కొత్తిమీరను కడిగి సన్నగా తురుముకోవాలి. జీలకర్ర మెంతులను వేడిచేసి గ్రైండర్‌లో పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెపోసి మిరపకాయలను దోరగా వేయించుకోవాలి. తర్వాత పాలకూర కొత్తిమీరను వేసి వేయించాలి. అందులో పసుపు తగినంత ఉప్పు వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేయాలి. దాంతోపాటు జీలకర్ర మెంిపొడి, నువ్వులు, చింతపండు, బెల్లాన్ని కూడా గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంతో పాలకూర చట్నీ సిద్ధమైనట్లే. దీనిని అన్నం, చపాతీ, పూరీలతో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.


టమోటా ఆవకాయ


కావలసిన పదార్థాలు : టమోటాలు- 1 కిలో, నూనె- పావు కిలో, చింతపండు- 150 గ్రా, కారం- 125 గ్రా, ఉప్పు- పావు కిలో, అల్లంవెల్లుల్లి పేస్ట్- పావుకిలో, జీలకర్ర పొడి- 50 గ్రా, మెంతిపొడి-25 గ్రా, జీలకర్ర- 2 టీ చెంచాలు, ఆవాలు- 1 టీ చెంచా, ఇంగువ-చిటికెడు

తయారీ విధానం : చింపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇంగువ, జీలకర్ర, ఆవాలు నూనెలో వేయించి తీయాలి. చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దీంతో టమోటా ఆవకాయ తయారయినట్లే. ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది

బీట్‌రూట్ చట్నీ


కావలసిన పదార్థాలు : బీట్‌రూట్- అర కిలో, చింతపండు- కొద్దిగా, పసుపు- చిటికెడు, ఎండు మిరపకాయలు- 10, ఆవాలు- చెంచా, మెంతులు - కొద్దిగా, ఇంగువ-కొద్దిగా, మినపపప్పు- చెంచా, ఉప్పు- తగినంత, కరివేపాకు- ఒక రెమ్మ, నూనె-50 గ్రాములు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ని పచ్చివాసన పోయేదాక నూనెలో వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకుముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి. ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినపపప్పు, ఆవాలు, కరివేపాకు, తాలింపువేసి కలుపుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.


పైనాపిల్ పచ్చడి


కావలసిన పదార్థాలు : పండిన పైనాపిల్-1, బెల్లం- అరకిలో, కరివేపాకు-ఒక రెబ్బ, ఎండు మిరపకాయలు-5, కొబ్బరికాయ-1, ఆవాలు- అర చెంచా, పసుపు- అర చెంచా, జీలకర్ర-1 చెంచా, ఉప్పు- తగినంత

తయారీ విధానం : పైనాపిల్ చెక్కుతీసి చక్రాలుగా తురుముకోవాలి. ఓ పాత్రలో కొంచెం నీరుపోసి అందులో ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించండి. అందులో పసుపు, కారం ఉప్పు వేయండి. బెల్లం సన్నగా తురమండి. కొబ్బరి కోరులో జీలకర్ర, ఆవాలు కలిపి మెత్తని ముద్దగా నూరండి. ఎండు మిరపకాయలను విడిగా నూరి ముద్ద చేసుకోండి. ఉడుకుతున్న పైనాపిల్ ముక్కలు మొత్తబడగానే బెల్లం వే సి గంటెతో కలుపుతూ ఉండండి. ద్రావణం చిక్కబడుతుండగా కొబ్బరి ముక్క ఎండు మిర్చి ముద్ద, కరివేపాకు వేసి బాగా కలిపి దించండి. సిద్ధమైన పైనాపిల్ పచ్చడిని బ్రెడ్‌టోస్టుతో కలిపి వడ్డించండి.


చింతపండు చట్నీ


కావలసిన పదార్థాలు : చింతపండు- నాలుగు రెబ్బలు, ఎండుమిరప కాయలు- మూడు, మినపపప్పు- మూడు చెంచాలు, నువ్వులు- మూడు చెంచాలు, ధనియాలు-2 చెంచాలు, ఎండు కొబ్బరి పొడి- 2 చెంచాలు, నూనె- చెంచా, బెల్లం లేదా పంచదార- 2 చెంచాలు, ఉప్పు తగినంత.

తయారీ విధానం : ముందుగా చింతపండును నానబెట్టాలి. తర్వాత మినపపప్పు, నువ్వులు, ధనియాలు విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి ఎండు మిర పకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో చింతపండు రసం, చింతపండు రెబ్బలు, మినపపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమున్నవాళ్లు తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో లేదా పూరీ, చపాతీల మీదగాని వేసుకుని తినవచ్చు.


మునగాకు చట్నీ


కావలసిన పదార్థాలు : మునగాకు- 2కప్పులు, ఎండు మిరపకాయలు - 10, సెనగపప్పు- 2 చెంచాలు, మినపపప్పు- 2 చెంచాలు. కొబ్బరి తురుము- 1 కప్పు, చింతపండు- కాస్తంత, వేయించడానికి సరిపడినంత నూనె, ఉప్పు- తగినంత, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- 2 రెబ్బలు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన వెంటనే ఎండు మిరపకాయలు, సెనగపప్పు, మినప పప్పు వేసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరి కొంత నూనెపోసి మునగాకు వేయించాలి. తర్వాత వేయించిన మునగాకు ఎండుమిర్చి, సెనగపప్పు, మినపపప్పు, కొంచెం చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము వేసి అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. చివరిగా బాణలిలో మరో చెంచా నూనెవేసి ఆవాలు కొద్దిగా, మినపపప్పు, కరివేపాకు వేసి పోపు పెడితే సరిపోతుంది. దీంతో రుచికరమైన మునగాకు చట్నీ సిద్ధమైనట్లే.

- పి.రమాదేవి, సిర్సపల్లి, కరీంనగర్ 

మెంతి చట్నీ


కావలసిన పదార్థాలు : మెంతికూర కట్టలు-3, నూనె- 3 చెంచాలు, ఎండు మిరపకాయలు- 5, ఇంగువ- కొద్దిగా, బెల్లం- నిమ్మకాయంత, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, పసుపు-కొద్దిగా.

తయారీ విధానం : మెంతి ఆకుని గిల్లుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. బాణలిలో మూడు చెంచాల నూనె పోసి అందులో మెంతి ఆకుని వేసి కొంచెం నల్లరంగులోకి వచ్చేదాకా వేయించాలి. తర్వాత చింతపండుని వేడినీటిలో వేసినట్లయితే వెంటనే మెత్తపడుతుంది. ఈ లోపు రెండు చెంచాల నూనెని బాణలిలో వేసి అందులో 5 ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి దింపేయాలి. ముందుగా వేయించిన మెంతి ఆకుని గ్రైండర్‌లో వేసి రెండు మూడుసార్లు తిప్పాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం తిప్పాలి. అది మెత్తపడ్డాక మెత్తగా చేసుకున్న బెల్లం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మరలా తిప్పాలి. దీంతో ఘమఘుమలాడే మెంతి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశె, చ పాతీల్లోకీ బాగుంటుంది.

- మద్దాలి అచ్యుత లక్ష్మీకుమారి, సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లా 

* కాస్త ఉప్పు కలిపిన నిమ్మరసంతో తోమితే రాగిపాత్రలకు మెరుపు వస్తుంది. పాత్రలకంటిన నూనె జిడ్డు వదిలించాలన్నా ఇదే మార్గం.
* మైక్రోవేవ్‌లో వండినప్పుడు ఒలికిన పదార్థాలను తొలగించాక కాస్త ఉప్పు జల్లి తడి బట్టతో శుభ్రం చేస్తే మాడువాసన లేకుండా ఒవెన్ శుభ్రపడుతుంది.
* కొంచెం వెనిగర్, ఉప్పు కలిపి జల్లి మెత్తటి పీచుతో తోమితే స్టీలుపాత్రలు మెరుపు సంతరించుకుంటాయి.
* ఎప్పుడూ కాఫీ పెట్టే గిన్నె/పాట్‌కు గోధుమ రంగు మరకలవడం సహజం. అవి పోవాలంటే దానిలో ఒకసారి టీ పొడిని మరిగించి తర్వాత శుభ్రం చెయ్యాలి. తేయాకులో ఉండే టానిక్ యాసిడ్ కాఫీ మరకలను తీసేస్తుంది.
* సబ్బు నీటిలో చిటికెడు అమ్మోనియా పొడి కలిపి తోమితే పాత్రల దుర్వాసన పోతుంది.

వంటలు - పిండివంటలు

వంటలు - పిండివంటలు 

vantalu - pindivantalu



సంపూర్ణ ఆరోగ్యసిరి ఉసిరి
usiri
మానవజాతికి ప్రకతి ప్రసాదించిన గొప్పవరం ఉసిరి. ఉసిరి స్వాంతన, శాంతం చేకూర్చి జీవిత కాలాన్ని పెంచే దివ్యౌషధం. చర్మసంబంధ వ్యాధులను నివారించటంలో ఎంతో ఉపయోగపడే షేతవీర్య అధిక పాళ్ళలో ఉంది. పిత్తను తగ్గించే గుణం ఉండటం వలన చర్మవ్యాధులను అదుపులో ఉంచుతుంది.ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకొంటే శరీరం మెరవటమే కాక ముడతలు మాయమవుతాయి. జుట్టు నిగారింపు మెరగవుతుంది.బాలనెరుపు, చుండ్రును నివారిస్తుంది. కంటి చూపును మెరుగు పరచటమేకాక కళ్ళు ఎరుపెక్కటం, కంటిలో దురద, నీళ్ళుకారటాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కెర శాతాన్ని పెరగకుండా సమపాళ్లలో ఉంచుతుంది. దంతాలను గట్టిపరచి దంతక్షయాన్ని నివారిస్తుంది.ఉసిరిలో విటమిన్‌ సిఅధికంగా ఉన్నందువల్ల అనేక ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.ఉసిరితో పచ్చళ్ళు, చ్యవన్‌ ప్రాశ్‌, జామ్‌, జ్యూస్‌, తలకు రాసుకునేందుకు తైలం, వక్కపొడి లాంటి నిల్వపదార్థాలను కూడా తయారు చేయవచ్చు. అవేమిటో ఈరోజు రుచిలో తెలుసుకుందామా!

చ్యవన్‌ప్రాశ్‌
కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు : 15-18
చక్కెర : 1 కప్పు లేదా రుచికి తగినంత
నెయ్యిలేదా స్వచ్ఛమైన వెన్న : 5,6 టేబుల్‌స్పూన్లు
యాలుకలు : 5-6
జీలకర్ర : 2 టీ స్పూన్లు
నల్ల మిరియాలు : 2 టీస్పూన్లు
తయారుచేయు విధానం
ముందుగా కుక్కర్‌లో అరకప్పునీటిలో ఉసిరికాయలను వేసి ఒక విజిల్‌ వచ్చేవరకు స్టౌవ్‌ మీద ఉంచాలి. ఉడికిన ఉసిరికాయలను గింజలు తీసిమెత్తగా చేసుకోవాలి. నీరు ఉంటే పిండివేయాలి. వెడల్పాటి మూత ఉన్న పాత్రను స్టౌ మీద పెట్టి వేడయ్యాక నెయ్యి వేడిచేసి పిండిన ఉసిరి ముద్దను 5-6 నిమిషాలు కలియపెట్టి తడిపోయేంతవరకు ఇగరనివ్వాలి. ఇగిరిన మిశ్రమానికి చక్కెర వేసి కలియబెట్టాలి. చక్కెర వేసి కలుపుతుండగా లోపలి మిశ్రమము కొద్దిగా విడిపోతుంది. తిరిగి మిశ్రమం కలిసే వరకు అంచులకు అంటకుండా కలియబెడుతుండాలి.

ఇప్పుడు జీలకర్ర పొడి, యాలుకల పొడి, మిరియాల పొడిని వేసి బాగా కలిపి స్టౌమీద నుండి దించి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని సీసాలోకి తీసుకుని నిల్వచేసుకోవాలి. చ్యవన్‌ప్రాశ్‌ను అలాగే లేదా పాలతో కలుపుకొని తీసుకోవచ్చు. చక్కెర ఇష్టం లేనివారు తేనెను కలుపుకోవచ్చు. కాని చ్యవన్‌ప్రాశ్‌ చల్లపడిన తరువాతే తేనె కలుపుకోవాలి.ఈ ఉసిరి చ్యవన్‌ప్రాశ్‌ రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది.

పండ్లరసం
కావలసిన పదార్థాలు

ఉసిరి కాయలు : 10
చక్కెర : 5 టీ స్పూన్లు
తయారుచేయు విధానం
ముందుగా గింజలు తీసివేసిన ఉసిరికాయలను ముక్కలుగా చేసి 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు పోసి మిక్సీలో బాగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఇష్టాన్ని బట్టి చక్కెరకాని, ఉప్పుకాని, తేనెకాని కలుపుకొని తాగాలి.
ఉపయోగాలు
మధుమేహం ఉన్నవారు చక్కెర లేకుండా తాగితే మందులా పనిచేస్తుంది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది. మంచి జీర్ణశక్తినిస్తుంది. వేడి నుండి శరీరానికి ఉపశమనం కలిగిస్తూ చల్లగా ఉంచుతుంది.

2వ పద్ధతికి కావలసిన పదార్థాలు
ఉసిరి ముక్కలు : 1 కప్పు
మంచి నీరు : గ్లాసు
మిరియాల పొడి : 2 స్పూన్లు
తేనె, ఉప్పు : రుచికి తగినంత
తయారుచేయు విధానం 
మిక్సీలో 1 గ్లాసుచల్లటి నీరు పోసి అందులోఉసిరి ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి బట్ట ద్వారా ఒక గ్లాసులోకి వడకట్టి అందులో చక్కెర లేదా తేనె, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. చల్లగా కావాలనుకొనేవారు ఐస్‌ముక్కలతో, లేదా ఫ్రిజ్‌లో రసాన్ని ఉంచి చల్లబరచి తాగవచ్చు.

జామ్‌

కావలసిన పదార్థాలు

ఉసిరికాయ ముక్కలు : 1 కప్పు
చక్కెర : 1 కప్పు
యాలుకల పొడి : 1 టీ స్పూన్‌
తయారుచేయు విధానం
స్టీలు పాత్రలో పావుకప్పు నీరుపోసి స్టౌ మీద వుంచి మరగనిచ్చి చక్కెరవేసి కలపాలి. కరిగిన మిశ్రమంలో ఉసిరి కాయముక్కలు, యాలుకల పొడివేసి కొద్దిగా గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. మిశ్రమంలో కొద్దిగా నీటి తడి మిగిలినపుడు స్టౌ మీద నుండి దింపి మిశ్రమాన్ని చల్లగా అయ్యేంతవరకు ఉంచాలి. చేతికి అంటేలా ఉన్న ఈ జామ్‌ను ఒక గాజుసీసాలో భద్రపరచుకోవాలి.
ఉదయాన్నే ఒక స్పూన్‌ జామ్‌ను ఒక గ్లాసు నీటితోపాటు తీసుకొంటే ఆరోగ్యకరం.

పులిహోర
కావలసిన పదార్థాలు

బియ్యం : 1/2 కప్పు
కొబ్బరి తురుము : 1/4 కప్పు
గింజలు లేని ఉసిరి కాయలు : 3-4
పచ్చిమిరప కాయలు : 2-3
ఎండు మిరపకాయలు 3
సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు
ఆవాలు 2 టీ స్పూన్‌లు
వేయించిన శనగపప్పు 1/2 కప్పు
మినపప్పు 2 టీస్పూన్‌
పసుపు
కొత్తిమీర 1/2 కప్పు
ఉప్పు
ఇంగువ
తయారుచేయు విధానం
అన్నం వండి చల్లారనివ్వాలి. ఉసిరి, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలను మెత్తగా నూరుకోవాలి. కొద్దిగా నీరుపోసి ఉప్పు కలుపుకోవాలి. గిన్నె తీసు కొని అందులో 3 స్పూన్ల నూనెను వేసి కాగిన తరువాత ఎండు మిరపకాయలు, ఆవాలు, ఇంగువ, మినపప్పు, వేరుశనగపప్పు సన్నటి సెగపై కలియబెడుతూ వేయించుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి దోర రంగు వచ్చే వరకు వేయించి ఉసిరి మిశ్రమాన్ని కలిపి కొద్దిసేపు ఉంచాలి. ఇందులో పసుపు, ఉప్పువేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని వండి ఉంచిన అన్నంలో కలిపి తరిగిన కొత్తిమీరను పైన అలంకరించుకోవాలి.

పొడి
ఉసిరికాయలను శుభ్రపరిచి ఆరనిచ్చిగింజలు తీయాలి. ముక్కలుగా చేసి ఎండలో బాగా ఎండిన తరువాత ఉసిరిముక్కల్ని గ్రైండ్‌ చేసి జల్లెడ పట్టుకోవాలి. మెత్తటి పొడిని తడిలేకుండా ఉన్న సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడి నీటిలో బాగా కరిగిపోతుంది.

ఉపయోగాలు
ఉసిరి పొడిని తీసుకోవడం వలన జీర్ణశక్తిని, ఆహార పదార్థాల రుచిని పెంచుతుంది. ఔషధంలా నీటిలో కలుపుకొని తాగవచ్చు. పచ్చళ్ళు, నిల్వ ఉండే పదార్థాలలో కలుపుకోవచ్చు. కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు. నీటిలో కలిపి ఆ నీటితో కళ్ళు శుభ్రపరుచుకోవచ్చు.

తీపి వక్కపొడి
శుభ్రపరిచిన 1 కిలో ఉసిరికాయలను బాగా ఉడక నిచ్చి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. కిలో చక్కెరకు 1 కప్పు నీరు కలిపి, 1 టీ స్పూన్‌ యాలుకల పొడిని కలిపి ముదురు పాకం పట్టాలి. పాకంలో ఉసిరికాయ ముక్కలు వేసి 1 టీస్పూన్‌ యాసిటిక్‌ ఏసిడ్‌ వేసి బాగా కలియబెట్టి ఒక వారం పాటు నిల్వ వుంచాలి. 8వ రోజు పొడి బట్టతీసుకొని పాకాన్ని వడకట్టాలి. పైన ఉన్న ముక్కలను ఒక రోజు పూర్తిగా కప్పి ఉంచి తరువాత రోజు ముక్కలను 3-4 రోజుల పాటు ఎండపెట్టి బాగా ఎండిన తరువాత గాలిజొరబడని సీసాలో ఉంచుకోవాలి. ఇవి చాలా రోజుల పాటు నిల్వవుంటాయి.

పచ్చడి
కావలసిన పదార్థాలు

ఉసిరి కాయలు : ఒక కిలో
చింతపండు : 250 గ్రా, కారం : 250 గ్రా.
ఉప్పు 300 గ్రా
ఆవ పిండి : (పచ్చివి ఎండనిచ్చి పొడి కొట్టాలి) 1/2 కప్పు
వెల్లుల్లి పాయలు : 50 గ్రా.
మెంతిపిండి : (వేయించి, వెల్లుల్లి పాయలతో కలిపి గ్రైండ్‌ చేయాలి) 5 టీ స్పూన్లు
నూనె : 500 గ్రా.
శనగపప్పు : 2 టీస్పూన్లు, ఎండుమిరప కాయలు : 7, 8
తయారుచేయు విధానం
బాణలిలో 100 గ్రా. నూనెలపోసి సన్నసెగతో కాయలు అన్నీ ఒకేసారి వేయించకుండా 2 లేదా 3 వేస్తూ కాయలన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వేడినీళ్ళలో వేసి ఉడకనిచ్చి గింజలు, పిప్పి లేకుండా గుజ్జుతీయాలి. కాయలు వేయించిన బాణలిలో సరిపడా నూనె పోసి ఎండు మిరపకాయలు, శనగపప్పు వేయించి అందులో చింతపండు గుజ్జు వేసి చిక్కగా దగ్గరయ్యేంతవరకు వేయించి దింపాలి.మిగిలిన నూనె వేడి చేసి చల్లారనివ్వాలి. వేయించిన ఉసిరి కాయలకు పోపువేసిన చింత పండు గుజ్జు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి కలిపి చల్లారిన నూనెను పోసి జాడీలో ఉంచుకోవాలి.










































బ్రెడ్‌ రోల్స్‌
Bread-Rolls
కావలసినవి...
బ్రెడ్‌ స్లైసెస్‌ : ఆరు
నూనె : వేయించడానికి సరిపడా
కూర తయారీి...
ఆలు : మూడు
క్యారెట్‌ : 2
బఠాణీ : పావుకప్పు
బీన్స్‌ ముక్కలు: అరకప్పు
ఉల్లిపాయలు : 2 (చిన్నవి)
పచ్చిమిర్చి : పావుటీస్పూను
నూనె : నాలుగు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం...
బంగాళాదుంపలు, క్యారెట్లు, బీన్స్‌... సన్నగా తరగాలి. ఈ ముక్కల్లో బఠాణీ కూడా వేసి ఉడికించాలి. తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి అన్నీ వేసి కూరలా చేసి దించాలి. చివరగా నిమ్మరసం కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు తడిబట్టను ట్రేలో పెట్టి బ్రెడ్‌ స్లైసెస్‌ను ఒకదా ని మీద ఒకటి పెట్టి మధ్యలో కూ ర పెట్టి బట్టను చాక్లెట్‌ మాదిరిగా చుట్టాలి. ఇలా చేయడం వల్ల బ్రె డ్‌ చుట్టచుట్టినట్లుగా అవుతుం ది. ఇప్పుడు పైనున్న క్లాత్‌ను తీసేసి బ్రెడ్‌ రోల్స్‌ను నూనె లో వేయించి తీస్తే కరకరలాడుతున్నట్లుగా వస్తా యి. వీటిని టొ మా టో సాస్‌తో తింటే బాగుంటాయి.
దహీ వడ

Dahi-Vada
కావలసినవి...
బ్రెడ్‌ ప్యాకెట్‌ : ఒకటి
నూనె : సరిపడా
పెరుగు : అరలీటరు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం : చిన్నముక్క
ఉప్పు : తగినంత
జీలకర్రపొడి : అరటీస్పూను
కారం : అరటీస్పూను

తయారు చేసే విధానం...
బ్రెడ్‌ ముక్కలను చిన్న ముక్కలుగా చిదమాలి.
తరువాత కొద్దిగా నీళ్లు చల్లాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్ద మాదిరిగా కలపాలి. ఓ బాణలిలో నూనె పోసి కాగాక బ్రెడ్‌ ముద్దను చిన్న వడలుగా వత్తిన నెలో వేయించి తీయాలి. పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలాలి. వేయించిన వడను పెరుగులో వేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి.
బిస్కెట్లు

Aloo-Toast
కావలసినవి...
వెన్న : 375 గ్రా
పంచదార : 250 గ్రా
ఉప్పు : 5 గ్రా
జీడిపప్పు వెన్న : 375 గ్రా
కోడిగుడ్లు : 125 గ్రా
గోధుమపిండి : 500గా
బేకింగ్‌ సోడా : 5 గ్రా


1. క్రీమ్‌, వెన్న, జీడిపప్పు క్రీమ్‌, పంచదార, కోడిగుడ్లు ఒకటి తర్వా త మరొకటి కలపాలి
2. గోధమపిండిని కొం చెం బేకింగ్‌ సోడా వేసి కలిపి పెట్టుకోవాలి.
3. ఉండలుగా చేసి వాటి ని అరచేతిలో ఒత్తి పైన బి స్కెట్టుకు జీడిపప్పు ము క్కలు పైన అద్ది నూనెలో వేయించి వడ్డించాలి.

కాంచీపురం ఇడ్లీ

కావాల్సినవి:
-------------
బియ్యం - 1కప్పు
మినపప్పు - 1/2కప్పు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2స్పూన్
మిరియాలు - అరడజను
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 1/2స్పూన్
ఉప్పు - తగినంత, నూనె - 1 స్పూన్
కరివేపాకు - కొంచెం
తయారీ విధానం:
---------------------
ముందుగా బియ్యాన్ని సుమారు ఎనిమిది గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. అలాగే మినపప్పును కూడా. అల్లంను చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి. మిరియాలను చితక్కొట్టి పక్కన వుంచాలి. ఆపై బియ్యం, మినపప్పు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తరువాత రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమంలో ఉప్పు వేసి ఒక పూట అలా వదిలేయాలి. నానిన ఆ పిండికి అల్లం, జీలకర్ర, ఇంగువ, దంచిన మిరియాలు కలపాలి. పాన్‌లో నూనె వేసి, కాస్త కాగాక, ఆవాలు, కరివేపాకు వేసి, ఒక్క నిమషం ఆగి, ఆ పోపును తీసి పిండిలో వేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండి మిశ్రమాన్ని వేసి, ఆవిరిపై ఉడికించాలి.

గార్లిక్ జింజర్ చికెన్

కావాల్సిన పదార్ధాలు
చికెన్ - అరకిలో
నెయ్యి- 50గ్రాములు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - అయిదు
వెల్లుల్లి రెమ్మలు - పది
టమాటా - 1
వెనిగర్
సోయాసాస్
మిరియాల పొడి
ఉప్పు ,పసుపు, పెరుగు, నూనె
అన్నీ..తగినంత..రమారమి ఒక స్పూను లేదా ముప్పావు స్పూను
ఇవి కాక అర స్పూను కార్న్ ఫ్లోర్, కొత్తిమీర
తయారీ విధానం
చికెన్‌ను శుభ్రం చేసి, ముక్కలుగా కోసి కాస్త పసుపు పట్టించి పక్కన వుంచాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా, అన్నింటినీ గ్రైండ్ చేసుకుని దానికి తగినంత ఉప్పు కలిపి, ఆ పేస్ట్‌ను చికెన్ ముక్కలకు పట్టించాలి. ముక్కలను అరగంట పాటు అలా వదిలేయాలి. ఆపై పాన్‌లో నెయ్యి వేసి చికెన్ ముక్కలు వేయాలి. కాస్త వేగాక కార్న్‌ఫ్లోర్, సోయాసాస్, వెనిగర్ మూడు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. ఆ తరువాత ఒక స్పూను నూనె, పెరుగు వేయాలి. బాగా కలియపెట్టిన తరవాత మిరియాల పొడి జల్లాలి. మరోసారి కలియపెట్టి సన్నటి సెగపై మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత కొత్తిమీర జల్లి దింపుకోవాలి.

ఎగ్ పరోటా

కావాల్సినవి
గుడ్లు - నాలుగు(ఉడికించినవి)
బంగాళాదుంపలు - మూడు
(ఉడికించినవి)
గోధుమపిండి - అరకిలో
మైదా - పావుకిలో
అరటిపళ్లు - రెండు
అల్లం
పచ్చిమిర్చి
ఉప్పు, కారం..., కొత్తిమీర
అన్నీ తగినంత
తయారీ విధానం
గోధుమపిండి, మైదాపిండి కాస్త వెచ్చటి నూనె, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపాలి. ఈ పిండి కలిపేటప్పుడే అరటిపళ్లు చిన్న చిన్న ముక్కలుగా వేసి, అందులో కలిపాలి. పిండి, పళ్లు బాగా కలిసేటట్టు చేయాలి. ఆ పిండిని తడి క్లాత్ చుట్టి పక్కన వుంచాలి. అల్లం, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర, చిటికెడు కారం వేసి చితకబతకగా దంచాలి. ఆ మిశ్రమాన్ని, ఉడికిన బంగాళాదుంపలు చిదిపి, ఉడికిన గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి, అన్నింటినీ కలిపి మసాలా ముద్దలా తయారు చేయాలి. దీనికి తగినంత ఉప్పు కలపాలి. ఆపై గోధుమ,మైదా పిండి మిశ్రమాన్ని మీడియం సైజు ఉండలుగా చేయాలి. ఉండను చిన్నగా వత్తి మధ్యలో ఆలు-ఎగ్ మిశ్రమం వుంచాలి. నాలుగువైపులా మూసి, మళ్లీ ఉండలా చేయాలి. ఇప్పుడు దాన్ని చేత్తోనే చపాతీలా నెమ్మదిగా తయారచేయాలి. నూనె లేదా నెయ్యివేసి దోశపెనంపై ఎర్రగా కాల్చాలి.

ఉత్తర భారత తీపిపదార్ధాలు



ఉత్తర భారతంలో ప్రాచుర్యమైన తీపి పదార్ధాలు ఇవి. మన రాష్ట్రంలో కూడా పెద్ద పట్టణాల్లోని స్వీట్ దుకాణాల్లో లభిస్తుంది. వీటిని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
రాబ్రి
కావాల్సినవి
పాలు 2 లీటర్లు
పచ్చి కోవా - 200 గ్రాములు
(ఇది దొరకని వారు మిల్క్‌మెయిడ్ డబ్బా ఒకటి వాడుకోవచ్చు)
పంచదార - 100 గ్రాములు
యాలకుల పొడి - 1/2చెంచా
బాదం పలుకులు - 10
తయారీ విధానం
ముదుగా రెండు లీటర్ల పాలు ఒక లీటరయ్యేలా సన్నటి సెగపై, కలుపుతూ మరిగించాలి. ఆపై స్టవ్‌పై నుంచి దించి పంచదార, కోవా లేదా మిల్క్‌మెయిడ్ పాలు కలపాలి. అన్ని కలిసేలా బాగా కలియపెట్టాలి. మళ్లీ సన్నటి సెగపై వుంచి కలుపుతూ వుండాలి. యాలకుల పొడి, సన్నగా తరిగిన బాదం పలుకులు వేయాలి. స్టవ్ ఆర్పి, ఆ మిశ్రమాన్ని చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో వుంచాలి. బాగా చల్లగా తయారై, మీగడలా తట్టుకట్టిన తరువాత తీసి వడ్డించాలి.
రాబ్రీ నవరంగ్
దీనికి రాబ్రీకి పెద్దగా తేడా వుండదు. రాబ్రీ తయారయ్యాక, కమలాపండు తొనల ముక్కలు, కిస్‌మిస్, అంజూర్ ముక్కలు కోసి, రాబ్రీపై అలంకరిస్తారు.

రాజ్‌భోగ్

రసగుల్లాలాగే వుండే ఈ రాజ్‌భోగ్ తయారీకి కావాల్సినవి
పాలు 1 లీటరు
పంచదార - 1 కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
వెనిగర్ - 1 స్పూన్
బొంబాయిరవ్వ - 1 స్పూన్
పచ్చికోవా - 1 స్పూన్
రోజ్‌వాటర్ - 1 స్పూన్
జీడిపప్పు - ఆరు పలుకులు
బాదం పప్పు- ఆరు పలుకులు
తయారీ విధానం
పాలను మరిగించిన తరువాత, స్పూన్ వెనిగర్‌ను స్పూన్ నీళ్లలో కలిపి, పాలలో వేయాలి. దీంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడా పాలను తీసి సన్నటి మంచి క్లాత్‌లో వేసి నీటిని వేరు చేయాలి. మిగిలిన చిక్కటి మిశ్రమం (చనా)కు రవ్వ కలిపి బాగా మెదాయించాలి. ఇప్పుడా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. జీడిపప్పు, బాదంపప్పును సన్నగా గ్రైండ్ చేసి, కోవా కలపాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న పాల విరుగు వుండలకు మధ్యలో చిన్న కన్నం చేసి, కొద్దిపాటి జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమాన్ని వుంచి, మళ్లీ ఉండను యధాప్రకారం సరిచేయాలి. ఉండలకు పగుళ్లు లేకుండా చేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్‌లో రెండు కప్పుల నీళ్లు, 3/4 కప్పు పంచదార వేసి, సన్నటి సెగపై మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఈ ఉండలను నెమ్మదిగా జారవిడిచి, కుక్కర్ మూత పెట్టి, వెయిట్ వుంచాలి. పది నిమషాలు వుంచి, వెంటనే స్టవ్ ఆర్పి, చల్లటి నీళ్లు జల్లి కుక్కర్‌ను వేగం చల్లారనివ్వాలి. అవసరమైతే నీళ్ల టాప్ కింద వుంచొచ్చు. కుక్కర్ మూత తీయకుండా ఓ అరగంట వదిలేసి, ఆపైన తీసి, కాస్త రోజ్ వాటర్ కలిపి, ఆపై ఫ్రిజ్‌లో వుంచాలి. బాగా చల్లగా తయారయ్యాక సర్వ్ చేయాలి.


గ్రీన్ ఫిష్ మసాలా

కావలసిన పదార్ధాలు:
చేపలు(కొరమీను, జల్ల): 1/2 kg
పాలకూర: 1 కట్ట
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 3
అల్లం వెల్లుల్లి: 2 tsp
కరివేపాకు: 4 రెమ్మలు
కొత్తిమీర: 1 కట్ట
టొమాటో పేస్ట్: 1 cup
కారం: 2 tbsp
పసుపు: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆయిల్: సరిపడ
గరం మసాలా: 1 tsp
పచ్చికొబ్బరి: కొద్దిగా
లవంగాలు, చెక్క: 4, 2
ధనియాలపొడి: 2 tsp

తయారు చేయు విధానము:
1. మొదటగా చేప ముక్కులు బాగా కడిగి పసుపు, ఉప్పు పట్టించాలి.
2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగా ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మసాలా దినుసులు, కొద్దిగా ఉడికించి పాలకూర మిక్సీలో వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి.
4. మంద పాటి గిన్నె లో ఆయిల్ వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
5. పాలకూర మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి.
6 తర్వాత టమోటో పేస్ట్ వేసి కాస్త ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాస్త పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి ఓ ఓ సారి గిన్నె ను తిప్పి నీరంతా ఇగిరే వరకూ తక్కువ మంట మీద ఉడికించాలి.

మంచి వాసన రాగానే కొత్తిమీర చల్లి ప్రక్కకు దించి క్యారెట్ తురుముతో అలంకరిస్తే గ్రీన్ ఫిష్ మసాలా రెడీ!

కొర మీను కబాబ్

కావల్సిన పదార్ధాలు:

చేపలు(కొరమీను) : 1/2 kg
ఉల్లిపాయలు : 1
కారం : 1tbsp
పచ్చిమిర్చి : 4
పెరుగు : 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
మిరియాలు : 1tsp
థనియాల పొడి : 1/4 tsp
మెంతి పొడి : 1/2 tsp
జిలకర్ర పొడి : 1/2 tsp
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానం:

1. ముందుగా చేపలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. ఉల్లిపాయలు, మిరియాలు, పచ్చిమర్చిని మిక్సిలో వేసి మెత్తగా చేయాలి, ఆ మిశ్రమానికి కారం, ఉప్పు, పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాల వేసి కలిపి పెట్టుకోవాలి.
3. ఈ మిశ్రమాన్ని చేపలకు పట్టించి రెండు గంటల పాటు నాననివ్వాలి. రెండు గంటల తర్వాత చేప ముక్కలను తీసి వెన్న రాసి ఇనుప చువ్వలకు లేదా ఇనుప అట్లకాడకు గుచ్చి వేడి మీద కాల్చి ఎర్రగా వేగాక తీసేయాలి. అంతే ఫిష్ కబాబ్ రెడీ.

చెట్టినాడు చికెన్ కర్రీ

కావలసిన పదార్ధాలు:

చికెన్ - 1 kg
ఉల్లిపాయలు - 4
టమోటో - 4
కారం - 4 tsp
ధనియా - 4 tsp
పసుపు - 1 tsp
గరం మసాల - 1 tsp
వెల్లుల్లి రెబ్బలు - 7
అల్లం - 1 పీస్
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర - 1/2 cup
ఆయిల్ - 4 tbsp
ఉప్పు - రుచికి సరిపడా

పేస్ట్ కొరకు మరికొన్ని:

ఎండు మిరపకాయలు - 2
గసగసాలు - 2 tsp
జిలకర్ర - 1 tsp
చెనిగిబాళ్ళు - 1tbsp
కొబ్బరి -1/2 cup
ఆయిల్ - 1 tsp

తయారు చేయు విధానం:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో పేస్ట్ కోసం సిద్దంగా పెట్టుకొన్న పోపులన్నింటిని వేసి వాటికి వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి గ్రైడ్ చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి.
2. అదే పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక, కట్ చేసిపెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు, దనియాల పొడి, కారం, టమోటో లు వేసి బాగా ప్రై చెయ్యాలి.
3. ఉడుకుతున్న మసాల నుండి ఆయిల్ పైకి తేలాక చికెన్ ముక్కలను, గ్రైడ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను, ఉప్పు వేసి 5 నిమిషాలు ప్రై చెయ్యాలి తర్వాత కొద్దిగా నీరు వేసి మీడియం మంట మీద చిక్కబడే వరకూ ఉడికించాలి.
4. గార్నిష్ కోసం కరివేపాకు, కొత్తిమిరతో అలంకరించుకోవచ్చు.

మంచూరియా చికెన్

బోన్ లెస్ చికెన్ - 1/2 kg
కోడిగుడ్లు - 2 no
కార్న్ ఫ్లోర్ - 2 tbsp
మైదా - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి - 2 tsp
పచ్చిమిర్చి పేస్ట్ - 1 tsp
సోయా సాస్ - 1/2 tsp
కారం - 1 tsp
మిరియాల పొడి - 1 tsp
ఉల్లిపాయలు - 1 cup
కొత్తిమిర - 1/4 cup
నూనె - వేయించడానికి సరిపడా

1. చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపేసి తడి అరనివ్వాలి.
2. పైన శుభ్ర పరచి పెట్టుకొన్న చికెన్ లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మైదా,కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, కొత్తిమిర వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి పకోడీల్లా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత వెడల్పాటి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వేయించిన ముక్కలను అందోలో వేసి వేపాలి.
4. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలపొడి, సోయా సాస్ వేసి బాగా కలపాలి.
5. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా ఉండలు కట్టకుండా కలపాలి తర్వాత వేగుతున్న చికెన్ లో వేసి బాగా ఉడికించాలి.
6 ఫైనల్ గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాలు ఉడికించి దింపేయాలి.

హైదరాబాదీ బిర్యాని

కావలసిన పదార్ధాలు:

మాంసం - 1 kg
బాస్మతీ బియ్యం - 1 kg
ఉల్లిపాయలు -250 grms
పెరుగు - 250 grms
అల్లం వెల్లుల్లి ముద్ద - 3 tsp
కొత్తిమిర - 1/2 cup
పుదీన - 1/2 cup
పచ్చిమిర్చి - 3
పసుపు - తగినంత
కారం పొడి - 2 tsp
ఏలకులు - 4
లవంగాలు - 8
దాల్చిన - 2
షాజీర - 2 tsp
గరం మసాలా పొడి - 2 tsp
కేసర్ రంగు - 1/4 tsp
పాలు - 1 cup
ఉప్పు తగినంత
నూనె - తగినంత

తయారు చేయు విధానం:

ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమిర ,పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ,కొత్తిమిర,పుదీనా,పెరుగు,కారంపొడి, పసుపు,మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు,గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు,లవంగాలు,దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నంను మాంసంపై సమానంగా పరవాలి.పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.

కాకినాడ స్పెషల్ పీతల పిడుపు

కావలసిన పదార్థములు:

పీతలు: 6
అల్లం- 10 గ్రా
వెల్లుల్లి- 6 రెబ్బలు
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప- 4
కారం- 2 tsp
గరం మసాలా- 1 1/2 tsp
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమిర- 1/2 కట్ట
కరివేపాకు- రెండు రెబ్బలు
నూనె- 100గ్రాములు
పసుపు- చిటికెడు

తయారు చేయు విధానం:

మొదట పీతలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించి పైన ఉన్న పొట్టు(డొల్ల)ను తొలగించి పిడుపును మాత్రం తీసి పక్కన పెట్టుకొవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం గ్రైడ్ చేసి పేస్టును తయారు చేసి పెట్టుకొని స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసి ఉంచుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు అందులో వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా సన్నని మంట మీద వేపాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, నూనె, పీతలు, కారం, ఉప్పు వేసి కావాలనుకుంటే మరికొద్దిగా నూనెను జత చేసి కొద్దిగా నీరు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా స్పూన్ తో కలియ బెడుతూ 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా తయారైన పీతల పిడుపు గుజ్జుకు కొత్తిమిర చల్లి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పీతల పిడుపును చెపాతీలకి మంచి కాంబినేషన్. మరి మీరు ట్రై చేసి చూడండి.
మటన్ ఖీమా
కావలసిన పదార్థములు:

మటన్ ఖీమా - 250 గ్రాములు
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 3
గరం మసాలా - 1 టిస్పూన్
అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 2 టిస్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర - 2 రెమ్మలు
పసుపు - చిటికెడు
కారం - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంగ
నూనె - 3 టేబుల్ స్పూన్లు

తయారుచేయు పద్దతి:

ముందుగా ఖీమాను కడిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరగాలి, గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి, ఇప్పుడు కరివేపాకు, అల్లం,వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. కడిగి పెట్టుకున్న ఖీమా వేసి తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలిపి మూత పెట్టాలి. అందులోని నీరంతా ఇగిరిపోయాక చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా, గరం మసాలా వేసి కలియబెట్టి ఒక కప్పుడు నీళ్లు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి, నీరంతా ఇరిగిపోయాక కొత్తిమిర చల్లి దింపుకోవాలి.

తెలంగాణ స్పెషల్ పుంటికూర కాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:
పుంటి కూర(గోంగూర)కాయలు: కావలసినన్ని
పచ్చిమిరపకాయలు: 5
జిలకర్ర: 1 tsp
ధనియాలు: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/4 tsp
ఆయిల్: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: 5

తయారు చేసే విధానము:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్ది ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జిలకర్ర, ధనియాలు వేసి దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అన్నింటినీ దోరగా వేపుకోవాలి.
2. ఇప్పుడు అందులో పుంటి కూర కాయలను చిన్న చిన్న గా కట్ చేసి అందులో వేసి అవికూడా బాగా వేగనివ్వాలి.
3. చివరగా అన్నింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి అంతే పుంటికూర కాయ పచ్చడి రెడీ.

కొబ్బరి వడలు

కావలసినవి:-
బియ్యంపిండి: 1cup
మైదా: 1cup
కొబ్బరి చిప్ప: సగం
పచ్చిమిరపకాయలు: 6
జీలకర్ర: 1/2 tsp
ఉప్పు: తగినంత
నూనె: సరిపడా
నీళ్ళు: 11/2 cup

తయారుచేసేవిధానం:
1. ముందుగా కొబ్బరి తురిమి ఉంచాలి. మైదా, బియ్యంపిండి కొబ్బరి తురుముతో కలపాలి.
2. మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి స్టవ్‌మీద పెట్టాలి.
3. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్‌ చేసి నీళ్లలో వెయ్యాలి.
4. నీళ్ళు మరిగిన తరవాత ఒక స్పూను నూనె వేసి పిండి పోసి బాగా కలిపి దించాలి. చల్లారిన తరవాత కొద్దిగా నూనె రాసి నిమ్మకాయంత పిండి తీసుకుని, గుండ్రంగా వత్తి ఎర్రగా కాగిన నూనెలో వేయించి తియ్యాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.

నోరూరించే కాలా జామూన్స్

కావలసిన పదార్థాలు:
కోవా: 500 grm
పన్నీర్: 100 grm
పంచదార: 3 cup
నీళ్లు: 1 కప్పు
మైదా పిండి: 3 tbsp
పాలు: 1 tbsp
యాలకుల పొడి: 1 tsp
నెయ్యి: తగినంత

తయారు చేయు విదానం:
1. మొదటగా ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా నీరు, పంచదార, యాలకుల పొడివేసి స్టౌమీద పెట్టి సన్నని మంట మీద పాకంను రెడీ చేసి పెట్టుకోవాలి.
2. పన్నీర్, కోవాలను సన్నగా తురుముకోవాలి. దీనికి మైదాపిండి, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జామూన్ ఆకారంలో లేదా మనకు కావలసిన ఆకారంలో జూమూన్స్ చేసుకోవాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి బ్రౌ కలర్ వచ్చే వరకు తక్కువ మంట మీద వేయించి తీసి, పంచదార పాకంలో వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.
వీటిని వేడిగాను, లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగానూ అథిదులకు వడ్డించండి. 

కోవా బాదుషా


కావలసి పదార్ధాలు:
కోవా: 1/2 kg
మైదా: 50 grm
పంచదార: 1/2 kg
సోడా: చిటికెడు
యోగర్ట్: 1 cup
యాలకుల పొడి: 1/2 tsp
నెయ్యి: 2 tbsp
ఆయిల్: తగినంత

తయారు చేయు పద్దతి:
1. ఒక బౌల్ లోకి జల్లించిన మైదా, సోడా, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి, నెయ్యి మరియు యోగర్ట్, కోవావేసి మెత్తగా చపాతి ముద్ద కంటే మరికొద్ది సాప్ట్ గా కలుపుకోవాలి. అవసరమనుకొంటే కొద్దిగా నీరు జత చేయవచ్చు.
2. ఇలా తయారు చేసిపెట్టుకొన్న ముద్దను ఒక అరగంట సేపు అలాగే నాననివ్వాలి.
3. తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక కప్పు వేడినీటిలో మిగిలిన పంచదారను వేసి పాకంను సిద్ద చేసుకోవాలి. పంచదార పాకం తయారైయ్యే సమయంలో యాలకల పొడి వేసి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేసి ప్రక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మొదటగా తయారు చేసి పెట్టుకొన్న మైదా ముద్ద నుండి నిమ్మపండు సైజులో కొద్ది కొద్దితా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టి నాలుగు వేళ్ళతో వత్తుకోవాలి.
5. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక, సిద్ద చేసిపెట్టుకొన్న బాదుషాలను అందులో వేసి తక్కువ మంట మీద దోరగా వేగనివ్వాలి అప్పుడే లోపలి బాగం కూడా బాగా కాలివుంటుంది.
6. ఇలా తయారైన బాదుషాలను పంచదార పాకంలో వేసి బాగా నాననివ్వాలి. కొద్దిసేపు నానినతర్వాత వాటిని పంచదార పకం నుండి వేరు చేసి బాగా చల్లారనివ్వాలి.
7. చల్లారిన బాదుషాలపై(మద్యలో) ఎండిన పంచదార పాకంను వేసి గార్నిష్ గా అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన కోవా బాదుషాలు రెడీ.

సమోసా రోల్స్

కావలసిన పదార్ధాలు:
మటన్/చికెన్/కూరగాయల ముక్కలు: 250grm
పసుపు: 1/2 tsp
కారం: 1/2 tsp
పచ్చిమిర్చి: 3
జిలకర్ర పొడి: 1/2 tsp
అల్లం: ఒక అంగుళం ముక్క(దంచినది)
కొత్తిమిర: 1/2 cup(తరిగినది)
అల్లం పేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1 tsp
నిమ్మరసం: 1/2 tbsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడ

తడిపిండి (ముద్ద)కోసం:
మైదా పిండి: 150 grm
నెయ్యి: 2 tbsp
పెరుగు: 1 tbsp
ఉప్పు రుచికి తగినంత. రోలో చేసే ముందు కలిపిన ముద్దని అరగంటపాటు ఫ్రిజ్ లో ఉంచాలి.

తయారు చేయు విధానము:
1. మటన్ కీమాలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి తగినంత నీరు చేర్చి మెత్తబడేదాకా ఉడికించుకోవాలి.
2. పాన్ లో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, దంచిన అల్లం వేసి వేగనిచ్చి కైమా వేసి నీరంగా ఆవిరైపోయాక దించి చల్లారనిచ్చి నిమ్మరసం పిండాలి.
3. పిండిముద్దను సమాన భాగాలుగా చేసుకొని చపాతీల్లా వత్తుకొని మధ్యలో కొంత కీమా మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసి అంచుల్ని ఒత్తుకోవాలి.
4. తర్వాత ఒక్కొక్కటి నూనెలో దోరగా వేగించి టమోటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.







కూరగాయలతో ఊరగాయ

నిల్వ పచ్చళ్లు అనగానే ఆవకాయ గుర్తొస్తుంది. ఆవకాయ అంటే ఒక్క మామిడికాయతోనే కాదు కాయగూరలతో కూడా పెట్టుకోవచ్చు. కాయగూరలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిదన్న విషయం అందిరికీ తెలిసిందే. అందుకే కాయగూరలతో కేవలం కూరలే కాకుండా అప్పుడప్పుడు ఆవకాయలు కూడా తయారుచేసుకుంటే బాగుంటుంది. అందుకే మీకోసం కొన్ని కాయగూరల ఊరగాయలు ఇస్తున్నాం చూడండి...

navya.దొండకాయ
కావాల్సిన పదార్థాలు:
దొండకాయలు - పావుకిలో,
ఆవపిండి - 100గ్రాములు,
కారం - 100గ్రాములు,
ఉప్పు - 100గ్రాములు,
నువ్వలనూనె - పావుకిలో,
పసుపు - అర టీ స్పూను,
ఇంగువ - చిటికెడు,
మెంతిపిండి - ఒక టీ స్పూను,
చింతపండు - 50గ్రాములు లేదా
నిమ్మకాయలు(పెద్దవి) - రెండు.

తయారుచేయు విధానం: ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత కాయలకి చిన్న పుల్లతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనెపోసి అందులో ఈ దొండకాయల్ని వేసి స్టౌమీద పెట్టాలి. ఈ గిన్నెపై మరో వెడల్పాటి గిన్నెపెట్టి అందులో నీళ్లుపోయాలి. ఇప్పుడు దీన్ని చిన్నమంటపై మగ్గనివ్వాలి. కాయలు మెత్తపడ్డాక దించేయాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఉడికిన దొండకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఆవపిండిలో వేసి కలుపుకోవాలి. మిగిలిన నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి దొండకాయలపై పోయాలి. ఆవపిండి కాయలకు పట్టేలా బాగా కలుపుకుని ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. మూడవ రోజున తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దొండకాయల ఆవకాయ నెలరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.
navya.బంగాళదుంప
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు - పావుకిలో,
ఆవపిండి - 125గ్రాములు,
కారం - 125 గ్రాములు,
- ఉప్పు - 125గ్రాములు,
నూనె - పావుకిలో,
మెంతిపిండి - అర టీ స్పూను,
చింతపండు - 25 గ్రాములు,
పసుపు - చిటికెడు,
ఇంగువ - చిటికెడు.

తయారుచేయు విధానం: బంగాళ దుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనపెట్టుకోవాలి. తరువాత చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనెని కాచి అందులో ఇంగువా వేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి కలిపి బంగాళాదుంప ముక్కల్ని, చింతగుజ్జుని వేసి ఇంగువ వేసిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. దీన్ని ఒక గాజుసీసాలో పెట్టి మిగిలిన నూనెని సీసాలో పోసేయ్యాలి. మూడవ రోజున తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపల ఆవకాయ కూడా నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.
navya.క్యాలిఫ్లవర్
కావాల్సిన పదార్థాలు:
కాలిఫ్లవర్ - పావుకిలో,
ఆవపిండి - 100 గ్రా ,
కారం - 100 గ్రా ,
ఉప్పు - 100గ్రా ,
నిమ్మకాయలు - రెండు,
పసుపు - అర టీ స్పూను,
ఇంగువ - చిటికెడు.

తయారుచేయు విధానం: కాలిఫ్లవర్ ముక్కల్ని నీళ్లలో ఉడికించి దించుకోవాలి. ముక్కల్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. రెండు టేబుల్‌స్పూన్ల నూనెని కాచి అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, కాలిఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాచిన నూనె వేసి కలిపి నిమ్మరసం పిండాలి. దీన్ని సీసాలో పెట్టుకుని మిగిలిన నూనెని పచ్చడి పైన పోసుకోవాలి. మూడవరోజుకి కాలిఫ్లవర్ ఆవకాయ రెడీ. ఈ కాలిఫ్లవర్ ఆవకాయ రెండు నెలలు పాడవకుండా ఉంటుంది.
navya.చిక్కుడుకాయ
కావాల్సిన పదార్థాలు:
చిక్కుడుకాయలు - పావుకిలో,
ఆవపిండి - 125గ్రాములు,
కారం - 125 గ్రాములు,
ఉప్పు - 125గ్రాములు,
చింతపండు - 25గ్రాములు,
పసుపు - చిటికెడు,
ఇంగువ - చిటికెడు.

తయారుచేయు విధానం: చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కుని కాయని రెండు ముక్కలుగా కోసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టి నూనెలో దోరగా వేయించుకోవాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనె తీసుకుని కాచి, అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చింతపండు గుజ్జుని, చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి కాచిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక మిగిలిన నూనెని కూడా వేసి కలిపి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ చిక్కుడుకాయల ఆవకాయ ఇరవైరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.
navya.క్యారెట్
కావాల్సిన పదార్థాలు:
క్యారెట్లు - పావుకిలో,
ఆవపిండి - 100గ్రాములు,
కారం - 100గ్రాములు,
ఉప్పు - 100గ్రాములు,
నిమ్మకాయలు - రెండు,
నూనె - పావుకిలో,
పసుపు - అర టీ స్పూను,
ఇంగువ - చిటికెడు.

తయారుచేయు విధానం: క్యారెట్లని శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఆరబెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనెని కాచి అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని అందులో నిమ్మరసం వేయాలి. తరువాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఇంగువనూనె మెల్లగా పోస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక సీసాలో పెట్టుకుని మిగిలిని నూనెని పచ్చడిపైన పోసుకోవాలి. మూడవరోజుకి క్యారెట్ ఆవకాయ రెడీ. ఇలా చేసిన క్యారెట్ పచ్చడి నెలరోజులు నిల్వ ఉంటుంది.
navya.వంకాయ
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు - పావుకిలో,
ఆవపిండి - 150 గ్రాములు,
కారం - 150 గ్రాములు,
ఉప్పు - 150 గ్రాములు,
చింతపండు - 50 గ్రాములు,
మెంతిపిండి - ఒక టీ స్పూను,
పసుపు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు.

తయారుచేయు విధానం: ముందుగా వంకాయల్ని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనెపోసి కాగాక ఈ ముక్కల్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చి దించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ వేసి దింపేయాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్ప, మెంతిపిండి, పసుపు వేసి బాగా కులపుకుని చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీన్ని గాజుసీసాలో పెట్టాలి. మిగిలిన నూనెని పచ్చడిపై పోసుకోవాలి. అంతే వంకాయ ఆవకాయ తయారయినట్టే. ఇలా చేసిన వంకాయ ఆవకాయ నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది








ఘుమ.. ఘుమలు
banana-curry
అరటి కూర
కావల్సిన పదార్థాలు: 
రెండు పచ్చి అరటికాయలు, ఒక టీస్పూన్‌ ధనియాలు, ఆరు ఎండు మిరపకాయలు, అరటీస్పూన్‌ జీలకర్ర, ఎనిమిది మిరియాలు, ఒక్కోకప్పు కొబ్బరితురుము, కరివేపాకు అరటీస్ఫూన్‌ ఆవాలు, సాంబారు ఉల్లిపాయలు, బెల్లం తురుము, రుచికి ఉప్పు. ఐదు టేబుల్‌స్పూన్ల నూనె.

తయారీ: 
అరటికాయల చెక్కుతీసి అంగుళం పొడవు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. నీటిలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. మూకుడులో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేడిచేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరితురుము ఒకదాని తరువాత ఒకటిగా వేసి రంగు మారి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. చాలినంత నీరుపోసి రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. మూకుడులో మిగతా నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేయించాలి. అరటికాయ ముక్కలేసి 2 నిమిషాలు వేయించి రుబ్బినపేస్టు. చింతపండు గుజ్జు, బెల్లం, తురుము, ఉప్పు, ఒకకప్పు నీరు కలపాలి. నీరింకాచిక్కబడే వరకు ఉడికించాలి. వేడివేడిగా వడ్డించాలి.

chicken-fry
చికెన్‌ ఫ్రై
కావలసినవి: 
చికెన్‌: 1కెజీ
నిమ్మకాయ: 1
కారం: తగినంత
ఉప్పు: తగినంత
పసుసు: చిటికెడు
కార్న్‌పౌడర్‌: చిన్న కప్పు
మిఠాయిరంగు: చిటికెడు
మంచినూనె: వేయించడానికి సరిపడా
అల్లంవెల్లుల్లిపేస్టు:6టీస్పూన్లు
కొత్తిమీర:2కట్టలు

తయారుచేసేవిధానం : 
చికెన్‌ను బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్ల ంవెల్లుల్లి పేస్టు, కార్న్‌పౌడర్‌, నిమ్మకాయరసంలో చిటికెడు మిఠాయిరంగువేసి బాగా ఒక గంటసేపు నానబెట్టాలి. ఆతర్వాత నూనె బాగా మరగిన తర్వాత ఈ కలిపిన చికెన్‌ వేసి బాగా డీప్‌ ఫ్రైచెయ్యాలి. దించేముందు గార్నిష్‌కోసం కొత్తిమీర వేసుకోవాలి.

moong
మూంగ్‌ కోప్రా బాత్‌
కావలసినవి :
పచ్చి కొబ్బరి చిప్పలు : 2‚
లవంగాలు : 6
పెసరపప్పు : 150 గ్రాములు
ఉల్లిపాయలు : పావుకిలో
ఆవాలు : అరస్పూను
పచ్చిమిర్చి : 100 గ్రాములు
కొత్తిమీర : ఒక కట్ట
కరేపాకు : ఒక కట్ట
వంటసోడా : చిటికెడు
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
నూనె : పోపుకు తగినంత

తయారుచేసే విధానం :
ముందుగా పెసరపప్పును రెండుగంటలపాటు నీళ్లలో నానేసి ఉంచుకోవాలి. తర్వాత కొబ్బరికోరు తయారుచేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరేపాకు, ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలి. తర్వాత పెసరపప్పులో ఉప్పు రుచికి తగినంత కలిపి అందుల పచ్చిమిరపకాయలను తరుగుకుని అన్నీ ప్లేటులో పెట్టుకుని ఇడ్లీ కుక్కర్‌లోనో లేక రైస్‌ కుక్కర్‌లోనో ఉంచి ఉడికించాలి. ఉడికిన తర్వాత కుక్కర్‌లోనుంచి దించుకుని దానిపై చిటికెడు సోడాను చల్లుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాణాలిలో నూనెను కాగనిచ్చి అందులో ఆవాలు తాలింపు పెట్టాక తర్వాత కరేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ తురుమును కొద్దిగా దంచిన మిర్చి కారం వేసి కొద్దిసేపు వేయించాలి.



















బఠాణీ బ్లాస్ట్


కావలసిన పదార్థాలు
-------------------------
పచ్చి బఠాణీ: పావుకిలో
పనీర్: పావుకిలో
టమోటాలు: పావుకిలో
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: చిన్న ముక్క
పెరుగు: ఒక కప్పు
జీడిపప్పు: కొంచెం
ఉప్పు: తగినంత
ఉల్లిపాయ : ఒకటి
అల్లం వెల్లుల్లి: ఒక స్పూను
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: అర స్పూను
గరం మసాలా: చిటికెడు
కారం: ఒకటిన్నర స్పూను
కార్న్‌ఫ్లోర్: మూడు స్పూన్లు
రిఫైన్డ్ ఆయిల్: ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ విధానం
--------------------
గినె్నలో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, త పసుపు వేసి వేయించాలి. దీనిలో తురిమిన పనీర్ వేసి కాస్సేపు వేయంచి తీసి పక్కన పెట్టుకోవాలి. పనీర్ మిశ్రమంలో చిటికెడు ఉప్పుకలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించాలి. ఈ ఉండల్ని నూనెలో ఎర్రగా వేయించి పక్కన వుంచుకోవాలి.
ఓ గినె్నలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము వేయాలి. నూనె పైకి తేలేవరకూ వేయించాలి. ఆపైన అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కారం, మిగిలిన పసుపువేసి మరికొంత సేపు వేయంచాలి. తరువాత గ్రైండ్ చేసిన టమోటా జ్యూస్ పోసి నూనె పైకి తేలేలా వేయించాలి. దీనిలో ముద్దగా నూరిన జీడిపప్పు, పెరుగు కలిపి సన్నని మంట మీద ఉంచితే గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీలో ఉడికించిన పచ్చి బఠాణీ, ఫ్రై చేసిన పనీర్ ఉండలు కలపాలి. తరువాత గరంమసాలా, ఉప్పు వేసి సన్నటి సెగపై కాస్సేపు వుంచాలి.


భలేరుచి చికెన్ షాకుటి


Chicken Shakuti

కావలసిన పదర్థాలు:
చికెన్: 1/2 kg
పచ్చికొబ్బరి తురుము: 1cup
అనాసపువ్వు: 1
సోంపు: 1 tsp
ఎండుమిర్చి: 10
ధనియా పౌడర్: 2 tbsp
లవంగాలు: 5
దాల్చిన చెక్క: చిన్న పీస్
జాజికాయ పొడి: 1/2 tsp
మిరియాలు: 1 tsp
వెల్లుల్లి: పది రెబ్బలు
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 6
చింతపండు గుజ్జు: 1tbsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడ

తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కల్నిశుభ్రంగా వుంచి ఉప్పు కలిపి ఉంచాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేయించాలి. తర్వాత జాజికాయ మిరహాయించి మిగిలిన మసాలా దినుసులన్నీ వేసి వేయించి పొడిచేయాలి.
3. కొబ్బరి, వెల్లుల్లి మొత్తగా పేస్ట్ చేయాలి. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. వేగాక చికెన్ ముక్క లు వేసి వేయించాలి.
4. ఇప్పుడు నూనె తేలుతుండగా కలిపి పెట్టుకొన్న చింతపండుగుజ్జు వేసి విడిగా పొడి కొట్టి పెట్టిన జాజికాయ పొడి వేసి కొద్దిగా నీళ్లు జత చేసి బాగా ఉడకనివ్వాలి.



















బ్రెడ్‌తో బోలెడు రుచులు

మన జీవితాలలో బ్రెడ్ ఇప్పుడు ఒక ముఖ్యభాగం. పల్లెటూళ్ల దగ్గర నుంచి పట్టణాల వరకూ బ్రెడ్ దొరకని ప్రదేశం ఉండదు. అలాంటి బ్రెడ్‌ను కాల్చుకునో,పాలతోనో మాత్రమే కాకుండా అనేక రుచికరమైన వంటలుగా మార్చుకోవచ్చు. అలాంటి వెరైటీలు కొన్ని ......



బ్రెడ్ వెజ్ బర్గర్
కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ పొడి - ఒక కప్పు,
క్యాబేజీ తురుము - 50 గ్రాములు,
బీన్స్ ముక్కలు - 50 గ్రాములు,
క్యారెట్ తురుము - 50గ్రాములు,
బంగాళాదుంప ముక్కలు - 50 గ్రాములు,
క్యాప్పికమ్ - పావు కప్పు,
ఎండు కారం - అర టీ స్పూను,
ధనియాల పొడి - అర టీ స్పూను,
జీలకర్ర పొడి - పావు టీ స్పూను,
గరంమసాలా పొడి - పావు టీ స్పూను,
మొక్కజొన్నపిండి - 30 గ్రాములు,
పాలు - 60 మి.లీ- బన్నులు - రెండు,
పెరుగు - ఒక టేబుల్ స్పూను,
టమోటా కెచిప్ - ఒక స్పూను,
టమోటా ముక్కలు - రెండు,
చీజ్ స్లైస్ - ఒకటి,
మెయోనేస్ - ఒక కప్పు.
తయారుచేయు విధానం: 
ముందుగా కోల్‌స్లా తయారుచేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్పావుకప్పు కాప్సికమ్‌కి ఒక కప్పు మెయోనేస్‌ని కలపాలి. దీన్నే కోల్‌స్లా అంటారు. తరువాత వెజ్ ప్యాటీస్ తయారుచేసుకోవాలి. సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో కారంధనియాలపొడిజీలకర్రపొడిగరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఉండలుగా చేసుకుని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి.

అంతే వెజ్ ప్యాటీస్ రెడీ. మరో గిన్నెలో మొక్కజొన్న పిండి వేసి అందులో పాలు కలుపుకుని వెజ్ ప్యాటీస్‌ని రెండు వైపులా ముంచివెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బన్ను తీసుకుని ముందు టమోటా కెచిప్ రాయాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల కోల్‌స్లా వేసిదానిపైన టమోటా ముక్కలువెజ్ ప్యాటీస్చీజ్ ముక్కలుపెరుగు వేసి రెండవ బన్ పెన బోర్లిస్తే బ్రెడ్ బర్గర్ తయారయినట్టే.


బ్రెడ్ పూర్ణాలు...
కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ - ఒక ప్యాకెట్ (పెద్దది),
బియ్యం - ఒక కప్పు,
మినపప్పు - అర కప్పు,
క్యారెట్ తురుము - ఒక కప్పు,
పంచదార - ఒక కప్పు,
నూనె - తగినంత,
సోడ - చిటికెడు,
నెయ్యి - అర కప్పు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - సరిపడా,
యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేయు విధానం: 
బియ్యంమినపప్పు కలపి ముందురోజు నానబెట్టుకోవాలి. తరువాతి రోజు వీటని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. క్యారెట్‌ని సన్నగా తురుముకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఇందులో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ని నీళ్లలో ముంచి గట్టిగా పిండేయాలి. దీన్ని క్యారెట్ తరుములో కలుపుకోవాలి. కొద్దిగా వేగాక పంచదార కూడా వేసి బాగా కలిపి దించేయాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బి పెట్టుకున్న బియ్యంమినపప్పు పిండిలో కొద్దిగా సోడాఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి. ఈ పిండిలో బ్రెడ్ ఉండల్ని ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే బ్రెడ్ పూర్ణాలు రెడీ.


స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్
కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - ఐదు,
కోడి గుడ్లు - రెండు,
పంచదార పొడి - 50గ్రాములు,
సోడా - చిటికెడు,
నూనె - తగినంత.
తయారుచేయు విధానం:
ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టిఅందులో పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా సోడా కూడా వేసి స్పూనుతో బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టాలి. బాగా వెడెక్కాక రెండు స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని గోడు గుడ్డు మిశ్రమంలో ముంచి పైనంపైవేసి వేయించాలి. రెండు పక్కలా ఎరుపు రంగు వచ్చే వరకూ కాల్చాలి. అంతే తియ్యటి బ్రెడ్ఆమ్లెట్ రెడీ.



బ్రెడ్ హల్వా
కావాల్సినపదార్థాలు:
పాలు - ఒక లీటరు,
పంచదార - 350 గ్రాములు,
బ్రెడ్ - ఆరు ముక్కలు,
యాలకులు - ఐదు,
నెయ్యి - 350 గ్రాములు,
జీడిపప్పు - 150 గ్రాములు.
తయారుచేయు విధానం: 
ముందుగా యాలకులను పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పుని నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు ఓ పావులీటరు పాలల్లో పంచదారబ్రెడ్ వేసి నానబెట్టాలి. మిగిలిన పాలని బాగా మరిగించాలి. గరిటతో కోవాలా అయ్యే వరకూ తిప్పాలి. ఈ లోపల బ్రెడ్ నాని,పంచదార కరిగిపోతుంది. కోవా తయ్యారవ్వగానే నానినబ్రెడ్పంచదార మిశ్రమాన్ని అందులోవేసేయ్యాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసి సన్నని మంటపై అడుగంటకుండా గరిటతో తిప్పుతూఉండాలి. బాగా దగ్గరికయ్యాక దించేసి యాలకులపొడి వేసి కలపాలి. జీడిపప్పుతోఅలకరించుకుంటే బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది.



బ్రెడ్ దోశ
కావాల్సినపదార్థాలు: 
బ్రెడ్ ముక్కలు - ఆరు,
ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి తురుము - రెండు టీ స్పూన్లు,
కరాచి నూక - 50 గ్రాములు,
జీలకర్ర - అర టీ స్పూను,
నూనె - తగినంత,
ఉప్పు - చిటికెడు.
తయారుచేయు విధానం:
బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీటిలో తడిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బొంబాయి రవ్వలో ఈ బ్రెడ్ పిండితగినంత ఉప్పు వేసి దోసెల పిండిలా కలుపుకోవాలి. దీన్ని పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత స్టౌ వెలిగించి పెనంపెట్టుకోవాలి. రెండు స్పూన్ల నూనె వేసి వేడెక్కాక బ్రెడ్ పిండిని దోసెలుగా పోసుకోవాలి. దానిపై ఉల్లిపాయ ముక్కలుపచ్చిమిర్చి ముక్కల్ని వేసి రెండువైపులా కాల్చాలి. అంతే బ్రెడ్ దోశ రెడీ.

బ్రెడ్ కీమా శాండ్‌విచ్
కావాల్సినపదార్థాలు:
కీమా - పావుకిలో,
బ్రెడ్ - ఎనిమిది ముక్కలు,
ఎండు కారం - రెండు టీ స్పూన్లు,
కాజు పేస్ట్ - రెండు టీ స్పూన్లు,
నూనె - రెండు టేబుల్ స్పూన్లు,
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు,
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,
టమాటాలు - రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి - మూడు,
కరివేపాకు - ఒక రెబ్బ,
కొత్తిమీర - ఒక కట్ట,
షాజీరా - కొద్దిగా,
గరంమాసాలా - ఒక టీ స్పూను,
పసుపు - తగినంత,
ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం:
కుక్కర్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలుపచ్చిమిరపకాయ ముక్కలుకరివేపాకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి పేస్టుషాజీరా కూడా వేయాలి. ఇప్పుడు కీమా వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి. ఇందులో ఎండుకారంపసుపుఉప్పుటమోటాలుకొత్తిమీర,కాజుపేస్ట్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత గరంమసాలా కూడా వేసి దించేయాలి. ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో మూసేయాలి. దీన్ని పైనంపై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. గార్నిష్ కోసం క్యారెట్కీరాకొత్తమీరతో అలంకరించుకోవాలి.

















కోవా బాదుషా



కావలసి పదార్ధాలు:
కోవా: 1/2 kg
మైదా: 50 grm
పంచదార: 1/2 kg
సోడా: చిటికెడు
యోగర్ట్: 1 cup
యాలకుల పొడి: 1/2 tsp
నెయ్యి: 2 tbsp
ఆయిల్: తగినంత

తయారు చేయు పద్దతి:
1. ఒక బౌల్ లోకి జల్లించిన మైదా, సోడా, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి, నెయ్యి మరియు యోగర్ట్, కోవావేసి మెత్తగా చపాతి ముద్ద కంటే మరికొద్ది సాప్ట్ గా కలుపుకోవాలి. అవసరమనుకొంటే కొద్దిగా నీరు జత చేయవచ్చు.
2. ఇలా తయారు చేసిపెట్టుకొన్న ముద్దను ఒక అరగంట సేపు అలాగే నాననివ్వాలి.
3. తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక కప్పు వేడినీటిలో మిగిలిన పంచదారను వేసి పాకంను సిద్ద చేసుకోవాలి. పంచదార పాకం తయారైయ్యే సమయంలో యాలకల పొడి వేసి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేసి ప్రక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మొదటగా తయారు చేసి పెట్టుకొన్న మైదా ముద్ద నుండి నిమ్మపండు సైజులో కొద్ది కొద్దితా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టి నాలుగు వేళ్ళతో వత్తుకోవాలి.
5. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక, సిద్ద చేసిపెట్టుకొన్న బాదుషాలను అందులో వేసి తక్కువ మంట మీద దోరగా వేగనివ్వాలి అప్పుడే లోపలి బాగం కూడా బాగా కాలివుంటుంది.
6. ఇలా తయారైన బాదుషాలను పంచదార పాకంలో వేసి బాగా నాననివ్వాలి. కొద్దిసేపు నానినతర్వాత వాటిని పంచదార పకం నుండి వేరు చేసి బాగా చల్లారనివ్వాలి.
7. చల్లారిన బాదుషాలపై(మద్యలో) ఎండిన పంచదార పాకంను వేసి గార్నిష్ గా అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన కోవా బాదుషాలు రెడీ.

డ్రైఫ్రూట్ పాయసం


కావాల్సినవి:
-------------
అంజూర్ - 2
కిస్‌మిస్ - 10
ఎండుద్రాక్ష - 5
జీడిపప్పు - 5
బాదంపప్పు -5
బటర్ - 1 స్పూను
నెయ్యి - 1స్పూను
పంచదార - తగినంత
బియ్యం - 50గ్రాములు
పాలు - 1/2లీటరు
యాలకుల పొడి - చిటికెడు
తయారు చేయు విధానం:
------------------------------
ముందుగా అంజూర్, ఎండుద్రాక్ష, కిస్‌మిస్, జీడిపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన వుంచాలి. బియ్యం కడిగి ఉడికించి, పక్కన వుంచాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ముక్కలను దోరగా వేయించాలి. వాటిని పక్కన వుంచి అదే బాణలిలో బటర్ వేసి, ఆపై ఉడికిన అన్నం వేసి కాస్సేపు కలియపెట్టాలి. ఆ తరువాత దళసరి పాన్ లేదా గినె్నలో పాలు వేసి, కలుపుతూ పది, లేదా పదిహేను నిమషాల పాటు మరిగించాలి. పాలు మరుగుతుండగానే డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి కలపుతూ, ఉడకనివ్వాలి. ఆపై తగినంత పంచదార వేసి, కరిగాక, ఉడికిన అన్నం వేసి, సన్న సెగన అయిదు, లేదా పదినిమషాల పాటు కలుపుతూ వుంచాలి. ఆపై యాలకల పొడి వేయాలి. సరియైన కుంకుమ పూవు లభిస్తే కనుక ఒక్కటి లేదా రెండు పూసలు వేయాలి. దీంతో మంచి రంగు, సువాసన వస్తుంది.

చికెన్ క్యాప్సికమ్



కావలసినవి:
--------------
చికెన్: 500 గ్రా.
ఉల్లిపాయలు: 150 గ్రా.
వెల్లుల్లి: 4రెమ్మలు
టమోటాలు: 3
గరంమసాలా: 1/2స్పూను
పచ్చిమిర్చి: నాలుగు/ ఉప్పు: తగినంత
క్యాప్సికమ్: 2
అల్లం: చిన్న ముక్క
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
ధనియాల పొడి: 1/2 టీ స్పూన్
పెరుగు: 1/2 కప్పు
నూనె: 75 గ్రా.
తయారుచేసే పద్ధతి:
-----------------------
బోన్‌లెస్ చికెన్ ముక్కలనును చిన్నగా కోసి వాటికి తగినంత ఉప్పు, కారం, పసుపు, పెరుగు కలిపి నానబెట్టాలి.ఆపై క్యాప్సికమ్‌ను ,ఉల్లిపాయలను ముక్కలుగా తరగాలి. అల్లం, వెల్లుల్లి ముక్కలు చాలా చిన్నగా తరిగి ఉంచండి. ప్యాన్‌లో నూనె పోసి పొయ్యిమీద పెట్టి ముందుగా అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసి కొంచెం వేయంచాక- క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని వేసి, అయదు నిమషాలు వేయంచాలి. నానబెట్టి ఉంచిన చికెన్‌ను కలిపి, కొంచెం పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి. చికెన్ మెత్తబడగానే టమోటా ముక్కల్ని కూడా కలిపి మూతపెట్టాలి.ఆపై పచ్చిమిర్చి, గరంమసాలా, ధనియాల పొడులు కలిపి కొంచెం సేపు ఉడికించి, దించేముందు కొత్తమీర జల్లాలి.

బొప్పాయ కూర



బొప్పాయ కూర
---------------
కావలసిన పదార్థాలు
బొప్పాయి కాయ -1
తొక్క తీసి ముక్కలు తరగాలి
ఎండు మిర్చి - 2
ఉల్లిగడ్డ - 1
పచ్చి మిర్చి - 2- 3
అల్లం ముక్క - 1
వెల్లుల్లి రెమ్మలు - 4
కొబ్బరి తురుమ - 1/2 కప్పు
కరివేపాకు - తగినంత
టమోటా - 1
పసుపు - 1/2 స్పూన్
మిరియాలు - 5
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు- తగినంత
నూనె - 2 స్పూనులు
తయారు చేసే విధానం
---------------------
కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి. బాణలిలో నూనె వేసి, ఉల్లితురుము వేయించాలి. దీనికి రుబ్బిన కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు కలిపి దోరగా వేయించాలి. ఆపై బొప్పాయి ముక్కలు వేసి కలిపి, టమోటాముక్కలు, రెండు కప్పుల నీళ్ళు పొయ్యాలి. బొప్పాయి బాగా ఉడికిన తరువాత
కరివేపాకు వేసి, తీసుకోవాలి.
----
ఎగ్ మసాలా
---------------
కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 6
ఉల్లిపాయలు: 3
దాల్చిన చెక్క: చిన్న ముక్క
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
ఉప్పు: త గినంత
నూనె: 50 గ్రా.
లవంగాలు: 5
టొమోటాలు: 2
పసుపు: చిటికెడు
తయారుచేయు విధానం
------------------------
ముందుగా గుడ్లను నీటిలో కొంచెం ఉప్పువేసి ఉడికించాలి. ఉడికిన గుడ్లను పైన పెంకు తీసి, రెండు లేదా నాలుగు ముక్కలుగా కోసి ఉంచాలి. మసాలా దినుసులన్నింటినీ తీసుకొని, ఉప్పుతో కలిపి బాగా నూరాలి. నూరిన మసాలాముద్దను గుడ్ల ముక్కలకు కలిసేలా బాగా కట్టించాలి. టొమోటాలను సన్నని ముక్కలుగా తరగాలి. పాన్‌లో కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, ఉల్లిముక్కల్ని వేసి వేపాలి. వేగిన తరువాత టమోటా ముక్కలు, గుడ్లు వేసి వేగనివ్వాలి. గుడ్లకు పట్టించగా మిగిలిన మసాలాను కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. నీరంతా మరీ ఇగిరిపోకుండా కొంచెం జారుగా గ్రేవీలా ఉండేంతవరకు ఉంచి దింపాలి.





















మీ కోసం... ఈ కరకరలు

navya.
వచ్చేది వేసవి...సెలవులొచ్చాయంటే పిల్లలకు చిరుతిళ్లు సిద్ధం చేయాల్సిందే. స్వీట్ కంటే ఎక్కువగా హాట్‌నే ఇష్టపడతారు పిల్లలు. జంతికల నుంచి కారంపూస వరకూ అన్నీ ఉంటాయి లిస్ట్‌లో. అందుకని వారి కోసం కొన్ని వంటకాలు ఇస్తున్నాం చూడండి.
చెక్కిడాలు
కావాల్సినపదార్థాలు:
వరిపిండి - ఒక కిలో,
పెసరపప్పు - 150గ్రాములు,
వాము - 25 గ్రాములు,
నీళ్లు - తగినన్ని,
నూనె - ఒక కిలో,
ఉప్పు - తగినన్ని.

తయారుచేయువిధానం:
బియ్యాన్ని ముందు రోజు నానబెట్టి మరనాడు మెత్తగా పిండి పట్టించుకోవాలి. తరువాత పెసరపప్పు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇందులోనే వాము, తగినన్ని నీళ్లు, వందగ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక బట్ట మీద గుండ్రంగా చెక్కిడాలు చుట్ి పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా ఆరిన తరువాత స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక ఆరిన చెక్కిడాలు వేసి దోర రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.

జంతికలు
navya.కావాల్సినపదార్థాలు:
వరిపిండి - ఐదు కిలోలు,
శెనగపిండి - అరకిలో,
కారం - 100గ్రాములు,
వాము - 100గ్రాములు,
నూనె - నాలుగున్నర కిలోలు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - తగినన్ని.

తయారుచేయు విధానం:
ముందుగా నీటిని మరగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో వరిపిండి, శెనగపిండి, కారం, వాము, 400 గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ పిండిని జంతికలుగా తిప్పుకోవాలి.

మురికీలు
navya.కావాల్సినపదార్థాలు: 
వరిపిండి - మూడు కిలోలు,
శెనగపిండి - 50గ్రాములు,
నువ్వులు - 50 గ్రాములు,
జీలకర్ర - 25గ్రాములు,
నూనె - మూడున్నర కిలోలు,
ఉప్పు - తగినంత.

తయారుచేయు విధానం:
ముందుగా మనం తీసుకున్న వరిపిండి, శెనగపిండి, నువ్వులు, జీలకర్ర, 25గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మరిగించిన నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టి సరిపడా నూనె పోసుకుని బాగా మరగనిచ్చాక కలిపి పెట్టుకున్న పిండని స్టార్ బిళ్ల పెట్టిన జంతికల గొట్టంలో పెట్టి నూనెలో నొక్కాలి. మురుకుల్ని ఎరుపు రాగానే తీసేయాలి.

చెక్కలు
navya.కావాల్సిన పదార్థాలు:
వరిపిండి - మూడున్నర కిలోలు,
మైదాపిండి - అర కిలో,
పెసరపప్పు - 100 గ్రాములు,
జీలకర్ర - 100 గ్రాములు,
పచ్చిమిర్చి - కిలోన్నర,
నూనె - 150 గ్రాములు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - తగినన్ని,
నూనె - నాలుగు కిలోలు.

తయారుచేయు విధానం:
ముందుగా పచ్చిమిర్చిని ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని మరగపెట్టుకుని అందులో మందుతీసుకున్న వరిపిండి, మైదా, పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, 150 గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని పిండిని ఉక్కపెట్టుకోవాలి. ఇలా ఉక్కబెట్టుకున్న పిండిని చిన్న చిన్న గోళీలుగా చేసుకుని అట్లకాడ తీసుకుని దీనిని చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి మరగబెట్టాలి. ఒత్తుకున్న అప్పాలను నూనెలో వేసి ఎరుపురంగు వచ్చేవరకూ వేయించాలి.

కారపు కాజాలు
navya.కావాల్సినపదార్థాలు:
గోధుమపిండి - రెండు కిలోలు,
సోపు - 50గ్రాములు,
పచ్చిమిర్చి - 100 గ్రాములు,
ఉల్లిపాయలు - 100 గ్రాములు,
ఉప్పు - తగినంత,
నూనె -రెండున్నర కిలోలు,
మైదా - 100 గ్రాములు,
నీళ్లు - తగినన్ని.

తయారుచేయువిధానం:
ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ముద్గగా నూరుకోవాలి. ఒక గిన్నెలోకి గోధుమపిండి తీసుకోవాలి. ఇందులో సోపు, పచ్చిమర్చి ముద్ద, దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, 50 గ్రాముల నూనె, తగినన్ని నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి.

(పూరి పిండికన్నా గట్టిగా ఉండాలి) కలిపిన పిండిని మూడు ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని చపాతీలుగా చేసుకోవాలి. ఈ చపాతీని డైమెండ్ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి కడాయి పెట్టి తగినంత నూనె పోసి బాగా వెడెక్కాక ఈ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.

రింగులు
navya.కావాల్సినపదార్థాలు:
మైదా - రెండున్నర కిలోలు,
వాము - 50 గ్రాములు,
డాల్డ - 50 గ్రాములు,
నూనె - రెండు కిలోలు,
నీళ్లు - 3లీటర్లు,
ఉప్పు - తగినన్ని.

తయారుచేయువిధానం: 
ముందుగా నీటిని మరగబెట్టుకోవాలి. ఇందులో మైదా, వాము, డాల్డ, తగినంత ఉప్పు వేసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండల్ని గచ్చుమీద పాముతూ సన్నగా వచ్చలా చేసుకోవాలి. దానిని గుండ్రగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ రింగులని వేసి ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.

రిబ్బన్ పకోడి
navya.కావాల్సిన పదార్థాలు:
శెనగపిండి - రెండు కిలోలు,
లవంగాల పొడి - 25గ్రాములు,
అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద - 100గ్రాములు,
వరిపిండి - 100గ్రాములు,
ఉప్పు - తగినంత,
నూనె - రెండు కిలోలు,
నీళ్ళు - తగినన్ని.

తయారుచేయువిధానం: 
ముందుగా శెనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా ఉండేలా జల్లించుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడు కలిపి రసంచేసుకుని తుక్కు లేకుండా వడపోసుకోవాలి. ఒక గిన్నెలో సీనాపిండి, లవంగాలపొడి, వరిపిండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి రసం, తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక రిబ్బన్ ఆకారపు బిళ్లవేసిన జంతికల గొట్టంలో ఈ పిండిని పెట్టి నూనెలో నొక్కాలి. అంతే రిబ్బన్ పకోడీలు రెడీ.

వాంపూస
navya.కావాల్సినపదార్థాలు:
శెనగపిండి - రెండు కిలోలు,
వరిపిండి - 100గ్రాములు,
అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద - 100గ్రాములు,
ఉప్పు - తగినంత,
నీళ్లు - తగినన్ని,
వాము - 50 గ్రాములు.

తయారుచేయు విధానం:
ముందుగా శెనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడు కలిపి ఒక గ్లాసు రసం తీసుకుని వడపోయాలి. తరువాత ఒక గిన్నెలో మెత్తగా ఉన్న సీనాపిండి, వరిపిండి, వాము, అల్లంవెలుల్లి, పచ్చిమిర్చి రసం, తగినన్ని నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె లేదా మూకుడు తీసుకుని నూనెని సమానంగా మరగబెట్టుకోవాలి. మరిగిన నూనెలో చిన్న రంధ్రాల బిళ్ల వేసిన జంతికల గొట్టంలో పిండిని పెట్టి నూనెలో వేయాలి.

కర్టెసి: పి.మల్లిబాబు
సురిచిఫుడ్స్, తాపేశ్వరం
ఫోన్: 9885155777
మధుమేహం ఉంది..ఆహారం ఏమిటి?మధుమేహం రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మధుమేహ వ్యాధి నివారణలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమమే. ఏ ధాన్యం తినాలన్నదే ముఖ్యం కాదు, అది ఎంత పరిమాణంలో తీసుకోవాలన్నదే ముఖ్యం. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహార పదార్థాలు మీ వ్యాధిని నివారించడంలో ఉపయోగపడతాయి. పచ్చి పెసలు, బఠాణి, అలసందలు, సెనగలు మొదలైన అన్ని పప్పు దినుసులలో, ఆకు కూరలు, కూరగాయలలో ఈ పీచు పదార్థం అధికంగా ఉంటుంది.

అలాగే మొలకెత్తిన మెంతులు లేక పొడి చేసిన మంతులలో పీచు పదార్థం ఉండడం వల్ల మధుమేహ వ్యాధి నివారణలో బాగా తోడ్పడుతుంది. దీంతోపాటు సరైన వ్యాయామం ద్వారా శరీరం బరువు తగ్గిచుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులు సరైన ఆహార నియమాలు పాటించకపోతే ఇతర అవయవాలు అంటే.. గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా పడుతుంది.

మీరు ఉదయం అల్పాహారంలో ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీలలో ఏదైనా తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలో ఒక కప్పు అన్నం, రెండు గోధుమ రొట్టెలు, ఏదైనా కూర అధికంగా తీసుకుంటే మంచిది. అలాగే రాత్రిపూట భోజనంలో ఎక్కువగా గోధుమ లేక జొన్న లేక రాగి రొట్టెలు తినండి. ప్రతి రెండు గంటలకు ఒకసారి మజ్జిగ, చక్కెర లేని నిమ్మరసం, కూరగాయలతో చేసిన సలాడ్ తినండి.
ఘుమ.. ఘుమలు
Chickenఅవాధి తంగ్రీ
కావలసినవి...
* 8 చికెన్‌ లెగ్‌ పీసెస్‌
* చిటికెడు మిఠాయి రంగు
* చిన్న కప్పు పాలు
* 200 గ్రా పుల్లటి పెరుగు
* 90 గ్రా వేయించిన ఉల్లి పేస్టు
* 30 గ్రా వేయించిన వెలుల్లి పేస్టు
* చిన్న కప్పు క్రీమ్‌
* 2 టీస్పూన్ల కారం
* 30 గ్రా అల్లం, వెల్లల్లి పేస్టు
* 2 టీస్పూన్ల గరం మసాలా
* 70 గ్రా అలంకరణకు బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు, పిస్తాపప్పు

తయారుచేసే విధానం...
ముందుగా లెగ్‌ పీసులను శుభ్రముగా కడిగి వా టికి కత్తితో పొ డుగ్గా గాటు పె ట్టాలి తరువాత పాలల్లో మిఠాయిరంగు వేసి కలిపి ఉంచుకోవాలి. ఒక గిన్నె తీ సుకుని అందులో పె రుగు, ఉల్లిపాయ పే స్టు, అల్లం పేస్టు, క్రీ మ్‌, అల్లం వెల్లుల్ల్లి పే స్టు, కారం, ఉప్పు, గ రం మసాలా అన్ని కలిపి ఉంచాలి. త రువాత కిసమిస్‌, బాదం, పిస్తా మెత్త గా పేస్టు చేసుకోవాలి. తరువాత పాల ల్లో కలపాలి. ఆతరువాత చికెన్‌లో మొ త్తం కలిపి బాణిలిలో నూనెపోసి అది వే డి అవ్వగానే ఆచికెన్‌ మిక్స్‌ర్‌ వేసి సిమ్‌ లో ఉడకనివ్వాలి. 25 నిముషముల తరువాత ఉడకనివ్వాలి. తరువాత బ్రె డ్‌, వెజిటెబుల్‌ సలాడ్‌తో వడ్డించాలి.

Muttonమటన్‌ మునక్కాయ పులుసు
కావలసినవి...
మటన్‌ : పావుకిలో
మునక్కాయలు : రెండు
చింతపండు : 200గ్రా
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి : 5
అల్లంవెల్లుల్లి పేస్టు : 2 స్పూన్లు
కొత్తిమీర : 2 కట్టలు
కారం : సరిపడా
ఉప్పు : సరిపడా
నూనె : సరిపడా
పసుపు : చిటికెడు
తాలింపు దినుసులు : 1 టీస్పూన్‌
మెంతులు : 4
ధనియాల పొడి : 2 టీస్పూన్లు

తయారు చేసే విధానం...
ముందుగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయించి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, మటన్‌, మునక్కాయ వేసి ఉడికించాలి. పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. తరువాత చింతపండు పులుసు వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతూ ఉండ గా కొద్దిగా ధనియాలపొడి, కొత్తిమీ ర వేసి దించుకోవాలి (కుక్కర్‌లో అయితే 5 విజిల్స్‌కి దించుకోవాలి).

Prawns-Egg-Kormaకోడి గుడ్డు రొయ్యల కుర్మా
కావలసినవి...
రొయ్యలు : పావుకిలో
గుడ్లు : 4
కొత్తిమీర : 2 కట్టలు
కారం : సరిపడా
ఉప్పు : సరిపడా
నూనె : సరిపడా
పసుపు : చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్టు : 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి : 4

తయారు చేసే విధానం...
ముందుగా రొయ్యలు బాగా ఉప్పువేసి కడిగి శుభ్రపరుచుకోవాలి. తరువాత నూనె మరిగించి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా దోరగా వేయించాలి. ఆతరువాత రొయ్యలు వేసి వేయించాలి. వేగి న తరువాత కారం, పసుసు, ఉ ప్పు వేసి వేగిన తరువాత చిన్న గ్లా సు నీళ్ళు వేసి ఉడికించాలి. ఉడుకుతూ ఉండగా అందులో గుడ్లు కొట్టి వెయ్యాలి. తరువాత మొ త్తం కలిపి వేయాలి. నూనె బాగా పైకి వచ్చేవరకు వేయించి దించే ముందు కొత్తిమీర వెయ్యాలి






























































షర్బత్



బటర్ కుకీస్




బీరకాయ ఫిల్లింగ్స్


ఫింగర్ చిప్స్



బీరకాయ పాయసం



హనీ కేక్




ఐసిం గ్ కోసం....





చాకొలెట్ కేక్





షాహ్ తురాయ్





పైనాపిల్ కేక్




మసాలా ఆమ్లెట్




మఫిన్స్






వెజ్ ఆమ్లెట్














































































బీరకాయ పచ్చడి





ఆలూ రాజ్మా టిక్కా


కావలసిన పదార్ధాలు:
బంగాళదుంపలు: 3
రాజ్మా గింజలు: 1/2 cup
ఉల్లిపాయ: 1 (తరిగిన)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 tsp
మామిడి పొడి: 2 tbsp
రాజ్మామసాలా పొడి: 1 tsp
ధనియా, జీరాపొడి: 1 tsp
పసుపు: 1/4 tsp
కారం: 2 tsp
ఫుదీనా: 1 కట్ట
కొత్తిమిర: 1 కట్ట
మొక్కజొన్న పిండి: 3 tbsp
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: వేగించడానికి కావలసినంత

తయారు చేయు విధానము:
1. రాజ్మాను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి, ఆరబెట్టి, మెదిపి ప్రక్కన పెట్టుకోవాలి.
2. బంగాళదుంపల్ని మెదిపి అందులో రాజ్మా, ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడి పొడి, రాజ్మామసాల పొడి, దనియా, జీరా పొడి, పసుపు, కారం, తరిగిన పుదీనా, కొత్తిమిర, ఉప్పు వేసి బాగా కలిపి చిన్న, చిన్న ఉండలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
3. ఇలా తయారు చేసుకొన్న ఉండలను మొక్కజొన్న పిండిలో దొర్లించి, కాస్త ఒత్తుతూ పెనం పై రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేగించుకోవాలి. వీటిని వేడి వేడి గా పెరుగు చెట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఫిష్ కోల్బట్


కావలసిన పదార్ధాలు:
చందువా చేపముక్కలు: 4
పాలు: 1 cup
ఉల్లిపాయలు: 2
మిరియాల పొడి: 2 tsp
నిమ్మరసం: 1tsp
మైదా పిండి: 50 grm
బ్రెడ్ పొడి: 100 grm
కోడిగుడ్డు: 1
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: వేయించడానికి సరిపడ

తయారు చేసే విధానం:
1. చందువా చేపలో ఎముక తీసి ముక్కలుగా కోయించి శుభ్రంగా కడగాలి.
2. ఓ వెడల్పాటి ప్లేటులో పాలు పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా ఈ మిశ్రమానంతటిని కల కలపాలి. ఇందులో చేపముక్కలు వేసి అరగంట సేపు నానబెట్టాలి.
3. తర్వాత ఈ ముక్కలను కోడిగుడ్డు సొనలో ముంచి తీయాలి. ఆపైన జారుగా కలిపిన మైదాపిండిలో ముంచి తీసి బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీసి టొమాటో సాస్ తో వడ్డించాలి.

జైపూర్ మటన్


కావలసిన పదార్ధాలు:
మటన్: 250 grm
కారం: 2 tsp
గరం మసాలా: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
టమాటాలు: 1-2
సోంపు పొడి: 1/2 tsp
జిలకర్ర పొడి: 1/2 tsp
పసుపు: 1/2 tsp
ఆయిల్: తగినంత
పచ్చిమిర్చి: 3-4
కొత్తిమీర: 1/4 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2-3 tbsp
పాలక్రీమ్: 2 tsp

తయారు చేయు విధానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి.
2. తర్వాత మటన్ ముక్కలు, జిలకర్ర పొడి, సోంపు పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికనివ్వాలి.
3. ఫైనల్ గా పాలక్రీమ్, టమాట ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు ఉడికిన తర్వాత ప్రక్కకు దింపుకొని వేరే గిన్నెలోనికి తీసుకుని ఉల్లి, క్యారెట్, కొత్తిమీరలతో గార్నీష్ చేసుకోవాలి.






నోరూరించే ధమ్ బిర్యాని


కావలసిన పదార్ధాలు
మాంసం - 1 kg
బాస్మతి బియ్యం - 1 kg
ఉల్లిపాయలు -1/4 kg
పెరుగు - 1 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 tsp
కొత్తిమిర - 1/2 cup
పుదీన - 1/2 cup
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
ఏలకలు - 6
లవంగాలు - 10
దాల్చిన చెక్క - 2 ముక్కలు
షాజిర - 2 tsp
గరం మసాలా - 1 tsp
కేసర్ రంగు - 1/2 tsp
పాలు - 1/2 cup
ఉప్పు - రుచికి సరిపడ
నూనె - 2 కప్పులు

తయారు చేయు విధానము
1. ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా వేయించి పెట్టుకోవాలి.
2. తరిగిన కొత్తిమిర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి పెట్టకోవాలి. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. నిమ్మరసం, ఎండిన గులిబి రేకులు, మాంసానికి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, గ్రైడ్ చేసిన పేస్ట్, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం ఒక గంట నాననివ్వాలి.
5. బియ్యం నీటిలో కడిగి ఒక అర గంట నాననివ్వాలి. మందపాటి గిన్నె తీసుకొని కొద్దిగా నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకొవాలి.
6. మరొక గిన్నెలో (బియ్యానికి మూడింతలు) నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకలు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయాలి.
7. బియ్యంలోని నీరంగా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే త్వరత్వరగా జల్లెడలో వడకట్టి మాంసంపై సమానంగా పరవాలి.
8. తర్వాత ఆ అన్నం పైన ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, యాలకుల పొడి, రెండు చెంచాలా నెయ్యి, పాలు, కేసరి రంగు, వేసి తడిపిన గోధుమ పిండిని లేదా శుభ్రమైన తడి గుడ్డను చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. బిర్యానీ మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. అంతే ఘుమఘుమలతో దమ్ బిర్యాని రెడీ. దీనికి కాంబినేషన్ పెరుగుపచ్చడి, బగారా బైగన్.

వెజిటేబుల్ గోల్డ్ కాయిన్


కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ పీసెస్: 6
కార్న్ ప్లోర్: 1/2 cup
క్యారెట్స్: 1/2 cup
ఆలు: 1/2 cup
బీన్ప్: 1/2 cup
పచ్చిబఠాణి: 1/2 cup
నువ్వులు: 1/4 cup
పచ్చిమిర్చి: 6
గరం మసాలా: 3tbsp
అజినోమోటో: 1tsp
నూనె: వేయించడానికి సరిపడ
సోయాబిన్ సాష్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకుని వాటిని కాయిన్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత క్యారెట్స్, బీన్స్, ఆలు, పచ్చిబఠాణి లను కొద్దిగా తీసుకుని ఉడికించి పేస్ట్ లా చేసుకోవాలి.
3. ఈ పేస్ట్ లో గరం మసాల, అజినోమోటో, ఉప్పు, సోయాబీన్ సాస్ వేసి బాగా కలుపుకుని కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి ముద్దగా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి.
4. ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ ప్లోర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి కలిపి అందులో ముందుగా కాయిన్ లా కట్ చేసిన పెట్టుకొన్న బ్రెడ్ పీసెస్ ను ముంచి తీసి దానిపై లేయర్ లా పైన చేసి పెట్టుకున్న మసాలా ముద్దలోని కొద్ది భాగాన్ని వేసి బాగా అద్ది పైన నువ్వులు, జీడిపప్పు వేసి బాగా అద్ది మళ్లీ కార్న్ ఫ్లోర్ లో ముంచి పెట్టుకోవాలి.
5. ఇప్పుడ స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో కార్న్ ప్లోర్ లో ముంచిన మసాల బ్రెడ్ కాయిన్స్ ను అందులో వేసి దోరగా వేగనివ్వాలి, కాలిన తర్వాత ప్లేటులోనికి తీసుకొంటే

మద్దూర్ వడ


కావలసిన పదార్ధాలు:
మైదా: 150 grm
బియ్యప్పిండి: 150 grm
బొంబాయిరవ్వ: 150 grm
వేరుశెనగలు: 50 grm
వెన్న: 10 grm
ఉల్లిపాయలు: 50 grm
పచ్చిమిర్చి: 8
ఎండుమిర్చి: 4
ఉప్పు: రుచికి సరిపడ
కరివేపాకు: 4 రెబ్బలు
నూనె: వేగించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ఉల్లి పచ్చిమిర్చి, కరివేపాకులను సన్నగా తరిగి, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో కరిగించిన వెన్న, మైదా, బియ్యప్పిండి, రవ్వ వేసి తరిగిన మిశ్రమాన్ని, వేరుశెనగ గింజలు కూడా అందులో వేసి నీరు చేరుస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
3. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరటాకుపైన వడల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. అంతే మద్దూర్ వడ రెడీ.

రొయ్యల వేపుడు


కావల్సిన పదార్ధాలు:
పచ్చి రొయ్యలు: 1/2 kg
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 6
గసగసాల పొడి: 2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tsp
జిలకర్ర పొడి: 1 tsp
టమోటో పేస్ట్: 2 tsp
కొబ్బరి తురుము: 1/2 cup
కారం: 2 tsp
ఆవాలు: 1 tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక కట్ట
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: తగినంత

తయారు చేయు విధానము:
1. రొయ్యలను ముందుగా శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి ఎర్రగా తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుము వేసి వేయించాలి.
3. ఇప్పుడు రొయ్యలను వేసి ఎర్రగా వేగనివ్వాలి తర్వత గసగసాల పొడి, కారం పొడి, జిలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
4. అందులో నీరంతా ఇమిరాక కొద్దిగా గరం మసాలా చల్లి, తరిగిన కొత్తిమీర వేసి దింపుకోవాలి అంతే టేస్టీ రొయ్యల వేసుడు రెడీ.

జైపూర్ మటన్


కావలసిన పదార్ధాలు:
మటన్: 250 grm
కారం: 2 tsp
గరం మసాలా: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
టమాటాలు: 1-2
సోంపు పొడి: 1/2 tsp
జిలకర్ర పొడి: 1/2 tsp
పసుపు: 1/2 tsp
ఆయిల్: తగినంత
పచ్చిమిర్చి: 3-4
కొత్తిమీర: 1/4 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2-3 tbsp
పాలక్రీమ్: 2 tsp

తయారు చేయు విధానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి.
2. తర్వాత మటన్ ముక్కలు, జిలకర్ర పొడి, సోంపు పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికనివ్వాలి.
3. ఫైనల్ గా పాలక్రీమ్, టమాట ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు ఉడికిన తర్వాత ప్రక్కకు దింపుకొని వేరే గిన్నెలోనికి తీసుకుని ఉల్లి, క్యారెట్, కొత్తిమీరలతో గార్నీష్ చేసుకోవాలి.

మష్రూమ్ జింజర్ చికెన్



కావలసిన పదార్ధాలు:
ఉడికించి చికెన్ ముక్కలు: 500gms
ఎండిన మష్రూమ్స్: 4
ఉల్లిపాయలు: 1(చిన్నగా కట్ చేసినవి)
చికెన్ స్టాక్: 1/4 ltr
సోయా పేస్ట్: 3/4 cup
అల్లం ముక్కలు: 1 tbsp
వెల్లుల్లి రెబ్బలు తురిమినవి: 1
వెనిగర్: 4 tbsp
పంచదార: 1tsp
కార్న్ ఫ్లోర్: 1 tbsp
శెర్రీ: 1 tbsp
టమోటో పూరీ: 1tsp
కారం: 2 tbsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడ

తయారు చేయు విధానము:
1. పాన్ లో సోయా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, వెనిగర్, పంచదార, టమోట పూరి, ఉప్పు మరియు కారం వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత 2నిమిషాలు స్విమ్ లో అలాగే ఉంచాలి.
2. వేడి నీటిలో మష్రూమ్స్ ని అర గంట నానబెట్టి తర్వాత నీరు వడిపి మష్రూమ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చికెన్ ముక్కలను అందులో వేసి, 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి.
4. చికెన్ ముక్కలు కొద్ది గా బ్రౌన్ కలర్ వచ్చే సరికి చికెన్ స్టాక్, మరియు మొదటగా తయారు చేసుకొన్న సోయా మిశ్రమం, కార్న్ ఫ్లోర్, శెర్రీ, వేసి బాగా ప్రై చేయాలి.
5. ఫైనల్ గా మష్రూమ్స్ ని జతచేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడేదాక ఉడకనివ్వాలి. అంతే కొత్తిమిరతో గార్నిష్ చేస్తే మష్రూమ్ జింజర్ చికెన్ రెడీ.







చికెన్ మసాలా బాల్స్


కావల్సిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్ : 1/2 kg
ఉల్లిపాయలు: 1/4 kg
జీడిపప్పు: 1/4 cup
పచ్చిమిర్చి: 10
ఎండుమిర్చి: 6
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tsp
ధనియాలు: 2 tsp
జిలకర్ర: 1 tsp
లవంగాలు, యాలకులు: 4 each
చెక్క: ఒక అంగులం
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత

తయారు చేయు విధానము:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి అది వేడైన తర్వాత అందులో జిలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి.
2. అవి చల్లారిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, చికెన్, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండటుగా చేస్తూ వేడైన నూనెలో డీప్ ఫ్రైచేయాలి. అంతే చికెన్ మసాలా బాల్స్ రెడీ. వీటిని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.







తందూరి మష్రూమ్


కావలసిన పదార్ధాలు:
మష్రూమ్స్- 300 grms
పాలు- 1/2 cup
కార్న్ ప్లోర్- 1/2 tsp
ఎండిన మెంతి ఆకులు- 1/2 tsp
ఆయిల్ - 1 tsp
ఉప్పు- రుచికి సరిపడా
ఎండుమిర్చి- 4
వెల్లుల్లి రెబ్బలు- 4
అల్లం- అంగుళం ముక్క
ధనియాలపొడి- 1 tsp
జిలకర్ర పొడి- 1 tsp

తయారు చేయు విధానము:
1. ముందుగా మష్రూమ్స్ ను రెండు బాగాలుగా కట్ చేసుకొని, శుభ్రపరిచి ఆరబెట్టాలి.
2. పాలల్లో కార్నప్లోర్ ను కలిపి పక్కనపెట్టుకోవాలి.
3. ఇప్పుడ నాన్ స్టిక్ పాన్ లో ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, పేస్ట్, మెంతి ఆకుల్ని వేసి వేగించాలి.
4. తర్వాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పుని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ధనియాలు, జీరా పొడులను కూడా కలిపి 5 నిమిషాలు ఉడికించి తర్వాత దింపేయాలి. తందూరి మష్రూమ్స్ వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

గ్రిల్డ్ చికెన్


కావలసిన పదార్దాలు:
చికెన్ లెగ్ - 1
కారం - 1/2 tsp
పెరుగు - 1/2 cup
గరం మసాలా - 1/2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
నిమ్మకాయ - 1/2 pease
మిరియాల పొడి - 1/2 tsp
కొత్తిమిర, పుదీనా ఆకుల పేస్ట్ - 1 tsp
ఉప్పు - రుచికి సరిపడ
కేసరి కలర్ - చిటికెడు
నూనె - తగినంత

తయారు చేసే విధానం:
1. చికెన్ లెగ్ కు చాకుతో గాట్లు పెట్టి ఉప్పు, నిమ్మరసం అద్ది నానబెట్టాలి.
2. ఓ గిన్నెలో పెరుగు వేసి అందులో గరం మసాలా, మిరియాలపొడి, కారం, కేసరి కలర్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ , తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి మిశ్రమానంతటినీ బాగా కల కలిపి చికెన్ లెగ్ కి పట్టించాలి. దీనిని అరగంటసేపు నానబెట్టాలి.
3. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాని మీద చికెన్ లెగ్ పెట్టి మపాలా కూడా దాని మీద పోసి మూత పెట్టాలి. తక్కువ మంట మీద 10 నిమిషాలు ఒక వైపు, మరో పదినిమిషాలు మరో వైపు వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత దించి పుదీనా చట్నీ లేదా ఏదైనా సాస్ తో తింటే బాగుంటుంది.









ఫిష్ కట్ లెట్



కావలసిన పదార్ధాలు:

చేపలు -500 grm (చిన్నగా కట్ చేసినవి)
ఉల్లిపాయలు - 2(కట్ చేసినవి)
అల్లం - 1/4 పీస్, (కట్ చేసినవి)
పచ్చిమిర్చి - 4
లవంగము పౌడర్ - 1 tsp
వెల్లుల్లి -3 (కట్ చేసినవి)
కొత్తిమిర - 1 cup(సన్నగా తరిగినవి)
కారం -1 tsp
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా- 1 tsp
బ్రెడ్ పొడి - 1/2 cup
గ్రుడ్లు - 2(బాగా గిలకొట్టినది)
పొటాటో - 1 (ఉడికించి చితిమినది)
పచ్చి బటానీలు - 1/2 cup(ఉడికించినవి)

తయారు చేయు విధానము:

1. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న చేప ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వాటికి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి డీప్ ప్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌనిష్ గా వేగనివ్వాలి, తర్వాత అల్లం మరియు వెల్లుల్లి వేసి మరికొద్ది సేపు ఫ్రై చేయాలి. దీనికి కొద్దిగా గరం మసాలా, ఉప్పు చేర్చి మరి కొద్ది సేపు ప్రై చేయాలి.
3. ఇప్పుడు కట్ చేసిన పచ్చి మిర్చి మరియు కొత్తిమిర వేసి 2 నిమిషాలు ప్రై అయిన తర్వాత పచ్చి బటానీ, చితిమిన పొటాటో వేసి మరికొద్ది సేపు ప్రై చేసిన తర్వాత మొదటగా తయారు చేసి పెట్టుకొన్న చేప ముక్కలు అందులో వేసి బాగా కలపాలి.
4. ఈ మిశ్రమాన్ని కట్ లెట్ ఆకారంలో తయారు చేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక ఒక్కొక్క కట్ లెట్ తీసుకొని దాన్ని గిలకొట్టిన గ్రుడ్డులో ముంచి వెంటనే బ్రెడ్ పౌడర్ లో రెండు వైపుల అద్ది పాన్ లో వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటిని పేపర్ మీద లేదా కాటన్ టవల్ మీద వేసి చల్లారనివ్వాలి. అంతే ఫిష్ కట్ లెట్ రెడీ వీటిని ఉల్లిపాయ పొదీనా సలాడ్ లేదా చింతకాయ చెట్నీతో సర్వ్ చేయవచ్చు.


చికెన్ పిజ్జా



కావలసిన పదార్ధాలు:

పిజ్జా బేస్ - 4
చికెన్ - 125 grm
టమోటో సాస్ - 100 ml
ఉల్లిపాయలు - 3
టమోటో - 3
క్యాఫ్సికమ్ - 3
వెన్న - 20 grms
కారం - 1/2 tsp
నూనె - తగినంత
తయారు చేయు విధానము:

1. పాన్ లో కొద్దిగా నూనె, వేసి వేడయ్యాక శుభ్రపరిచిన చికెన్ అందులో వేసి 5 నిమిషాలు వేయించి తర్వాత కొద్దిగా వేసి ఉడకనివ్వాలి.
2. ఉడికిన తర్వాత మరికొద్ది చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. వెజిటేబల్స్ చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. పిజ్జా బేస్ మీద టమోటో సాస్ ను పూర్తిగా రాయాలి.
5. ఇప్పుడు దీని మీద వెల్లుల్లి, టమోటో, క్యాప్సికమ్ అమర్చాలి.
6. తర్వాత దాని మీద చికెన్ ముక్కలను అమర్చి పైన కూడా టమోటో, వెల్లుల్లి, క్యాప్సికమ్, తురుమిన వెన్న అమర్చాలి.
7. ఇలా తయారైన వాటిని మైక్రోవేవ్/ఓవెన్ లో 10 నిమిషాలు వేడిచేయాలి. తర్వాత తీసి ప్లేట్ లో అమర్చి టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.
దసరా స్పెషల్స్‌ ఘుమఘుమలు
chandrakanth
చంద్రకాంత

కావలసిన పదార్థాలు :

పెసరపప్పు  పావుకిలో
చక్కెర  పావుకిలో
జీడి పప్పు    ఒక కప్పు
ఏలకూల పోడి  ఆఫ్‌ కప్పు
కుంకుమ పువ్వు ఆఫ్‌ కప్పు
పచ్చి కొబ్బరి తురుము   ఒక కప్పు
నెయ్యి లేదా నూనే వేయించడానికి సరిపడా 

తయారీ విధానం....

పెసరపప్పు గంటసేపు నానబెట్టాలి.పెసరట్లకి రుబ్బిన విధంగా పిండి రుబ్బుకోవాలి. ఆ తరువాత స్టౌపై ఒక పాత్రలో రబ్బుకున్న పిండిని అందులో చక్కెర, పచ్చి కొబ్బరి తురుము, వేసి ఉండలు కట్టకుండా గరిటతో తిప్పు తూ ఉండాలి. చక్కెర పాకం అయి, పెసరముద్దలోని నీరు ఇంకి, గట్టిపడుతుం ది. అప్పుడు జీడిపప్పు, ఏలకులపొడి, కుంకుమపువ్వు, వేసి దించాలి.
ఒక తడి బట్ట మీద ఉడికిన పెసరపిండిని వేసి చోత్తో మామూలుగా వత్తాలి. ఆ తరువాత కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. వీటిని ఒక బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి వాటిని వేయించుకోవాలి. అంతే వేడి వేడి చంద్రకాంతలు రెడీ.

basundi
బాసుంది

కావలసిన పదార్థాలు...

చిక్కటి పాలు  ఒక లీటరు,
చక్కెర :పావుకిలో,
కుంకుమ పువ్వు:2 స్పూన్స్‌,
ఏలకులపొడి:2 స్పూ న్స్‌,
చారపప్పు  ఆఫ్‌ కప్పు,
సీమబాదం పప్పు. ఆఫ్‌ కప్పు,

తయారీ విధానం...

ఒక వెడల్పాటి కళాయిగిన్నె తీసుకొని అందులో పాలు పోసి మీగడ ట్టకుండా సన్నని సెగమీద బాగా కాగనివ్వాలి.చిక్కని మజ్జిగ మాదిరి పాలు కాగాక, అలా చిక్క గా అయిన పాల ల్లో చక్కె వేసి మరికాసేపు కలియబెట్టాలి. పాలు కాస్త పల్చబడతాయి. అప్పుడు దించి కుంకుమపువ్వు, ఏలకులపొడి వెయ్యాలి. ముందుగానే చారపప్పు,జీడిపప్పు, బాదం పప్పు, నేతిలో వేయించుకొని బాసుంది దించాక ఈ వేయించిన పప్పులు కూడా వేసి కలియబెట్టాలి.

chandra
చంద్రపురి

కావలసిన పదార్థాలు :

కొబ్బరికాయలు      :మూడు
కోవా           :125 గ్రా
పచ్చిశనగపప్పు     :125 గ్రా
చక్కెర          : పావుకేజీ
ఏలకులపొడి        : 2 స్పూన్స్‌
పచ్చకర్పూరం       :1 స్పూన్స్‌

తయారీ విధానం...

పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పదార్థాన్ని ఒక పల్చని గుడ్డలో వేసి వడకడితే పాలు వస్తాయి.ఆ పాలు పక్కన పెట్టాలి.తరువాత మూకుడులో కోవా, చెనా, చక్కెరా కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపాలి 25 నిమిషాలు సన్నని సెగమీద గరిటతో తిప్పుతూ ఉడనివ్వాలి.
తరువాత కొబ్బరిపాలు పోస్తే మెత్తగా అవుతుంది.అందులో ఏలకుల పొడి, పచ్చకర్పూరం వేసి దించాలి.వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవచ్చును.ఘుమఘుమలేడే చంద్రాపురి రెడీ
ఘుమ.. ఘుమలు 
Biryani
డ్రమ్‌స్టిక్స్‌ బిర్యానీ

కావలసినవి : ములగకాడలు : ఆరు
రైస్‌ : ఆర కెజీ
పచ్చిమిరప : ఎనిమిది
ఉల్లిపాయలు : ఐదు
ఆయిల్‌ : 100 గ్రా
కరేపాకు : ఒక కట్ట
జీడిపప్పు : 100 గ్రా.
అల్లం, వెల్లుల్లి మిశ్రమం : మూడు టీ స్పూన్లు
ఆవాలు :ఒక అరచెంచా
జీలకర్ర : పావు చెంచా
పచ్చిశనగ : ఒక స్పూను
పల్లీలు : ఒక స్పూను
కారం : తగినంత
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
పుదీన : కట్ట
కొత్తిమీర : ఒక కట్ట

తయారుచేసే విధానం :ముందుగా ముల గకాడ లను చిన్న ముక్కలుగా క ట్‌చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, ప చ్చి మిరపలను సన్నగా తురుముకో వాలి. తర్వాత పొయ్యిని వెలిగించి బాణాలిలో నూనె వేసి కాసేపు కాగని వ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ప చ్చిశనగ, వేసి వేయించండి కొద్దిసే పా గిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత ముందుగా కట్‌చేసి ఉంచిన ములగముక్కలు, ఉల్లి, పచ్చిమిరపల మిశ్రమాన్ని కూడా బాణాలిలో వేయా లి. కొద్దిసేపు మూతపెట్టి ఉంచితే ము క్కలు మగ్గుతాయి. ఉడికేటప్పుడే అల్ల ం, వెల్లుల్లి పేస్ట్‌ కూడా కలపాలి. తర్వా త పసుపు, కొద్దిగా కారం, రుచికి తగి నట్టుగా ఉప్పు వేసి బాగా కలియబెట్టా లి. కూర ఉడికాక దించేముందర తురి మిన కొత్తిమీర, కరేపాకు, పుదీనాల మిశ్రమాన్ని కూరమీద జల్లుకో వాలి. తర్వాత రైస్‌ కుక్కర్‌లో బియ్యానికి తగి నంత నీరు పోసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ములగకాడల కూర ను కలిపి కుక్కర్‌ మూత వేసి కుక్కర్‌ విజిల్స్‌ వచ్చినాక...బాగా ఉడికినాక దించేసుకోవాలి.వేడివేడిగా ఉండగానే తింటే చాలా బాగుంటుంది.

Prawn-Malai
ప్రాన్‌ మలాయ్‌

కావలసినవి :
ఉల్లిపాయలు : 6
తాజా పచ్చి రొయ్యలు : అర కెజి
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్‌
టమాట పేస్ట్‌ : రెండు కప్పులు
మిల్క్‌ క్రీమ్‌ : ఒక కప్పు
కారం : తగినంత
కసూరి మేథీ : 1 టీ స్పూన్‌
నూనె : తగినంత
పచ్చి మిర్చి : 6-8
కొత్తిమీర : 1 కట్ట
వెల్లుల్లిరెబ్బలు : 4
అల్లం ముక్కలు : కొద్దిగా
జీడిపప్పు : ఆరు
గరం మసాలా : రెండు చెంచాలు
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేసే విధానం:
ముందుగా తాజాగా ఉన్న పచ్చి రొయ్యలను శుభ్రం చేసి దానికి ఉప్పు కారం కలిపి ఉంచు కోవాలి. టమాట మెత్తగా పిసికి దాని గుజ్జును రెండు కప్పులకు సరిపడ తీసిఉంచుకోవాలి. బాణాలిలో నూనె పోసి కాగినాక అందులో రొ య్యలను దోరగా వేయించి పక్కన ఉంచు కోవాలి. తర్వాత అదే నూనెలో ముద్దగా చేసు కుని ఉంచుకున్న ఉల్లిపాయలను వేయించా లి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలిపి వేయించాలి. కారం, ముద్దగా చేసుకున్న పచ్చి మిర్చిని, అల్లం, వెల్లుల్లి సన్నగా తురుముకుని ఆ మిశ్రమాన్ని కూడా అందులోనే వేసు కోవాలి. తర్వాత టమాట జ్యూస్‌ మిశ్రమాన్ని అందులో కలపాలి. ఇప్పుడు ఆ గ్రేవీలో వేయించి వుం చిన రొయ్యలను వేయాలి. అవ సరం అ ను కుం టే మరికా స్త ఉప్పు రుచి కి సరిపడ వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికినాక అందులో కసూరి మేథీ, గరంమ సాలా, జీడి పప్పు పొడి వేసి బాగా కలియబెట్టాలి. కూర దించుకునేముందు మిల్క్‌ క్రీమ్‌ కలుపు కోవా లి. కూర ను కిం దికిదించిన త ర్వాత దా ని పై తురి మిన కొత్తిమీర జల్లుకోవాలి.

tomoto
టమాటా సాస్‌

కావలసినవి :
టమాట : పావుకెజి
క్యారెట్‌ : పావుకెజి
ఎండుమిర్చి : 4
మిరియాలపొడి : రెండు స్పూన్లు
ధనియాల పొడి : రెండు స్పూన్లు
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : ఒక కట్ట
అల్లం : చిన్న ముక్క
నిమ్మకాయ : 1
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
తయారుచేసే విధానం :
ముందుగా టమాటా ముక్కలుగా కోసుకోవాలి. తరవాత క్యారెట్‌ను సన్నగా తురుముకోవాలి. రెండింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి గిన్నెలో సగానికి నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికేటప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడిని కూడా వేయాలి. తర్వాత అల్లం,కొత్తిమీర, పుదీనా,ఎండుమిర్చిని కలిపి సన్నగా గ్రైండ్‌చేసి ఆ మొత్తం చూర్ణాన్ని కూడా ఉడికే నీళ్లలో వేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి.
తర్వాత స్టౌ మీదనుంచి మిశ్రమం దించేసుకోవాలి. వేడి కొంచెం చల్లారాక...నిమ్మరసం పిండుకోవాలి. దీనిని ఎప్పుడైనా అజీర్తి అనిపించినపుడు...తీసుకున్నా మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఆకలిని కలిగిస్తుంది.

పైనాపిల్ కేక్


కావలసిన పదార్థాలు:
గుడ్లు - 10
పంచదార: అరకిలో
ఫ్రెష్‌క్రీమ్ : పావు కిలో
మైదా: పావుకిలో.
పైనాపిల్ ముక్కలు - సరిపడా
ఐస్ ముక్కలు : కొంచెం
వెనీలా ఎసెన్సు : 1 స్పూను
ఎలా చెయ్యాలో చూద్దాం:ః
గుడ్లలోని తెల్లసొన తీసి బాగా గిలకొట్టాలి. దాంట్లో సగం పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. తరువాత పచ్చసొన కూడా వేసి బాగా కలిపి దానికి మైదా, వెనీలా ఎసెన్స్ జోడించి, నురుగు వచ్చేవరకు కలపాలి. తరువాత ఒక పళ్ళెంలో పేపరు వేసి దానిమీద ఈ మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో పెట్టి అరగంట బేక్ చేయాలి. ఒక గినె్నలో క్రీమ్, సగం పంచదారను వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లార్చాలి. వీటికి మనకు ఇష్టమైన కలర్స్ వేసి కలిపి దాన్ని ఉడికిన కేక్ మీద అందంగా డిజైన్ వేసి కావలసిన సైజులో కట్ చేసి సర్వ్ చేయాలి.
కాకరకాయ కేరళ స్టయల్
చక్రాలుగా కోసిన కాకరకాయ ముక్కలు -
నానబెట్టిన చింతపండు 1 కప్పు
కొబ్బరి తురుము - 1 కప్పు
ధనియాలు- 1 స్పూను
ఎండు మిర్చి- 2
బెల్లంతురుము - కొంచెం
ఉప్పు- తగినంత
మెంతులు- అర స్పూన్
ఆవాలు- అర స్పూన్
పసుపు - చిటికెడు
కరివేపాకు- కొద్దిగా
నూనె
పప్పు, మెంతులు, ధనియాలు వేయించి మిరపకాయలు కొబ్బరితో కలిపి, ముద్దగా నూరుకోవాలి. చింతపండు రసం తీయాలి. బాణలిలో నూనె వేడిచేసి రుబ్బిన ముద్ద తప్ప మిగిలినవన్నీ వేసి సగం ఉడికేవరకు వేయించాలి. ఇప్పుడు పప్పు-కొబ్బరి ముద్దవేసి, మరికాస్సేపు ఉడికించాలి. ఇదిలా వుంచి కాస్త నూనె బాణలిలో వేసి కాకరకాయ చక్రాలు కరకరలాడే వరకు వేయించాలి. ఆపై కాకరకాయ ముక్కలు, ముందుగా తయారైన కొబ్బరి మిశ్రమం కలిపి, ఆవాలు, కరివేపాకుతో పోపువేసి వేడిగా వడ్డించాలి.
పనసపండు పాయసం
కావలసిన పదార్థాలు
గింజలు తీసి, ముక్కలు చేసని పనసతొనలు - ఒక కప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
బెల్లం - తగినంత,
అల్లం పొడి - చిటికెడు
ఏలకులు (పొడిచేసినవి) - 4-5
నెయ్యి - పావు కప్పు,
కిస్‌మిస్‌లు, జీడిపప్పు - కొంచెం
నీళ్ళు - 2 కప్పులు
తయారు చేసే పద్ధతి
ముందుగా కొబ్బరి పాలు తియ్యాలి. నెయ్యిలో పనస ముక్కలు వేయించి, నీళ్ళు పోసి మరగనివ్వాలి. కొబ్బరిపాలు పోసి మళ్లీ మరగనివ్వాలి. పనస ముక్కలు వేసి బాగా కలపాలి. చివరిగా ఏలకులు, కిస్‌మిస్‌లు, జీడిపప్పులు కలిపి వడ్డించాలి.

ములక్కాడ - బంగాళదుంప పులుసు

కావలసిన పదార్థాలు
ములక్కాడలు - 4, బంగాళదుంపలు - అరకిలో, ధనియాలు - 1 స్పూన్‌, అల్లం - చిన్నముక్క ,ఉల్లిపాయలు - 4, వెల్లుల్లి - 4 రెబ్బలు
తాలింపు గింజలు - సరిపడినన్ని, ఎండుమిర్చి - రెండు ,చింతపండు - 100గ్రా, టమాటాలు - 4, కారం - తగినంత, ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా, కొత్తిమీర - చిన్న కట్ట, బెల్లం - చిన్న ముక్క
తయారుచేసే పద్ధతి
ములక్కాడలు, బంగాళదుంపలు, మిర్చి, ఉల్లిపాయలు కడిగి ముక్కలు చేసుకోవాలి. అల్లం - వెల్లుల్లి, టమాటాలను మిక్సీలో వేసి మెత్తని ముద్ద చేసుకోవాలి. కళాయిలో నూనె పోసి కాగాక తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత బంగాళదుంప, మునక్కాడ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. అవి వేగాక అందులో చింతపండు రసం పోసి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా బెల్లం వేసి బాగా మరిగించాలి. ముక్కలు ఉడికాక కొత్తిమీర చల్లుకుని దింపాలి.

నిమ్మ ఆకు కారంపొడి
కావలసిన పదార్థాలు
నిమ్మ ఆకులు - 1 కప్పు,, వెల్లుల్లిపాయలు - 3రెబ్బలు, ఎండు మిర్చి - 5, ధనియాలు - గుప్పెడు ,కరివేపాకు - 2 రెమ్మలు, నిమ్మఉప్పు - కొద్దిగా
నూనె - 2 స్పూన్లు, ఉప్పు - సరిపడినంత, జీలకర్ర - 1 స్పూన్‌
తయారుచేసే పద్ధతి
నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలో నూనెవేసి కాగాక కడిగిన నిమ్మ ఆకులు వేసి వేయించాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఎండుమిర్చి, ధనియాలు వేసి వేపుకోవాలి. ఇలా వేయించిన వాటికి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నిమ్మఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అంతే నిమ్మఆకు కారంపొడి రెడీ.