YOGA JUICES IN TELUGU - జ్యూస్
YOGA - JUICE in Telugu - జ్యూస్
క్యారెట్ స్వీట్ జ్యూస్ : క్యారెట్(2), ఫైన్ ఆఫిల్ లేదా ఆరెంజ్ లేదా మౌసంబి, (పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్క, బనానా - ఫ్యాట్ లేని వారికి), బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్, సాల్ట్, వాటర్. క్యారెట్ చిన్న ముక్కలు చేసి ఫైన్ ఆపిల్ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, బనానా మిక్సీలో మిక్స్ చేసి బెల్లం ముక్క, నిమ్మకాయ రసం కొద్దిగా, ఇలాచి పౌడర్, సాల్ట్, వాటర్ కలిపి త్రాగాలి.
క్యారెట్ హాట్ జ్యూస్ : క్యారెట్ (2), నిమ్మ రసం, సాల్ట్, నల్ల మిరియాలు (2), 300 ఎం.ఎల్. వాటర్ లో క్యారెట్ ముక్కలు వేసి 300 ఎం. వాటర్ 150 ఎం.ఎల్ వచ్చు వరకు బాయిల్ చేయ్యాలి. ఫిల్టర్ చేసిన వాటర్ లో లైట్‌గా నిమ్మరసం, మిరియాలు కలిపి త్రాగాలి.
బీట్ రూట్ స్వీట్ జ్యూస్ : సపోటా సైజ్ బీట్రూట్, బ్లాక్ గ్రేప్, బూడిద గుమ్మడికాయ ముక్క, బెల్లం ముక్క, ఇలాచి పైవి అన్ని మిక్సీలో వేసి త్రాగాలి.
బూడిదగుమ్మడికాయ జ్యూస్ : బూడిదగుమ్మడికాయ చెక్క, గింజలు తీసిన కండల కల చిన్న ముక్కలు, గ్రేప్ కొంచెం, జ్యూస్ చేసి బత్తాయి, నిమ్మ రసం, బెల్లం కలిపి త్రాగాలి.
దోసకాయ జ్యూస్ : మీడియం సైజు దోసకాయ, టమాట, చిన్న కొబ్బరి ముక్క, కొత్తిమీర, జిలకర్ర, ఉప్పు అన్ని మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి త్రాగాలి. ష పొట్టని క్లీనింగ్ చేస్తుంది.
దోసకాయ జ్యూస్ : మీడియం సైజు దోసకాయ, టమాట, చిన్న కొబ్బరి ముక్క, కొత్తిమీర, జిలకర్ర, ఉప్పు అన్ని మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి త్రాగాలి. ష పొట్టని క్లీనింగ్ చేస్తుంది.
పూదీనా జ్యూస్ : పూదినా ఒక కట్ట ఆకులు, కొత్తిమీర ఆకులు, 1 1/2 గ్లాస్ వేడి వాటర్ లో ఈ ఆకులు వేసి బాగా మరిగిన తర్వాత దానిలో చిటికెడ్ ఉప్పు కొంచెం షుగర్ వడకట్టి నిమ్మకాయ పిండి త్రాగాలి. ఇన్జైజేషన్, పుడ్ అరగకపోవడం.
డేప్రూట్ జ్యూస్ : ఎండు కర్జూరాలు రెండు, కిస్మిస్ బ్లాక్ (6), జీడిపప్పు (4), బాధం పప్పు (రెండు), బెల్లం లేదా తేనె నానబెట్టాలి. మిక్స్ చేసి తినాలి. ష సన్నగా వున్నవారికి
గోధుమ పాలు : గోధుమలు 50 గ్రా|| 24 గం|| నాన బెట్టాలి. నీళ్ళు వడకట్టి మళ్ళీ గోధుమలను గుడ్డలో కట్టి పెట్టాలి. మొలకలు వచ్చిన తరువాత మిక్సిలో వేసి అఫ్ అరటిపండు లేదా ఆపిల్ లేదా సపోటా వేసి మిక్స్ చేయ్యాలి. వాటిని వడకట్టి కొద్దిగా బెల్లం వేసుకొని త్రాగాలి.
వీక్ పేషంట్, శరీరం ముడతలు, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్.
బ్లాక్ గ్రేప్ ను నానబెట్టి మార్నింగ్ తినటం నరాల బలహీనతనకు, వంకరలకు.
రాగి పాత్రలో దాల్చిన చెక్క, తులసి ఆకుల నానబెట్టి మార్నింగ్ తాగాలి నీరు, ఆకులు తినాలి, చెక్క పారేయ్యాలి. చాలి మంచి ఆరోగ్యం కడుపులో.

హరిత రక్తం : ''హరిత రక్తం'' అనబడే గోధుమ గడ్డికి వైద్యపరంఘా ఉపయోగాలెన్నో దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యంఘా ఉన్న గోధుమ గింజల్ని యిసుక ముట్టిని నింపిన కుండలో నాటితే 5,6 రోజులలో మొలకలు వస్తాయి. వాటిని అలాగే తినవచ్చు లేదా వాటిని నూరి రసంలా చేసుకొని త్రాగవచ్చు.
ఉషాపానం : రాగి చెంబులో నీళ్ళు యుంచి వాటిని ప్రొద్దునే త్రాగాలి. అప్పటి వరకు ఏమి తినరాదు.
మీరు తీసుకొనే ఆహారము : పెసర్ల నీళ్ళు, బియ్యం నీళ్ళు, బార్లీ నీళ్ళు, చనగల నీళ్ళు, దొడ్డు గోధుమ రవ్వ ఖిచిడీ, పాలు (ఆవుపావలు), బియ్యం, రొట్టె నువ్వుల నూనె, నెయ్యి, చనగలు, మురమురాలు, ఉప్పు, గోధుమహల్య (హలువా) మొదలగునవి.
ఫలాలు : ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఆపిల్, ఫైనిఫిల్, బిల్వపండు నిమ్మకాయ, ఆనిమ్మ, కొబ్బరి నీళ్ళు, ఖర్జూరం, జీడిపప్పు, పండిన మామిడి పండ్లు, అత్తిపండు ఆఖరోట్ మొదలగునవి.
కూరగాయలు : కందమూలాలు, గింజలు, తాజా మూలి, గింజలు లేని బెండ, కాకర, మెంతి, పాలకూర, బీరకాయలు, దోసకాయ, బీట్రూట్, కోహడా.
పెసర్ల నీళ్ళు : 50 గ్రాముల పెసర్లను వేసి అందులో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. ఎప్పుడైతే పెసర్లు నీళ్ళతో కలిసిపోతాయో, అనగా ఒక కప్పు అయ్యేంతవరకు ఉడికింఇ అంధులో మసాలా వేసి తినాలి.
పెసర్లు : 50 గ్రాముల పెసర్లను వేసి అంఉలో 1500 మి.లీ. నీళ్ళును పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత అందులో పసుపు, మిరియాలు, శొంఠి, అల్లం, జీలకర్ర, ధనియాలు మొదలు మసాల వేసి తినాలి.
బియ్యం గంజి : ఒక కిలో నీటిలో 50 గ్రాముల కడిగిన పాత బియ్యంపోసి ఉడికించాలి. ఒకట రెండు సార్లు ఉడికిన తరువాత, జల్లెడ పట్టి రోగి పరిస్థితిని బట్టి అందులో కొంచెం చక్కెర గాని ఉప్పుగాన్వి వేసి త్రాగించాలి.
బార్లీ నీరు : బియ్యం గంజి లాగానే 50 గ్రాముల బార్లీ ఒక కిలో నీటిలో పోసి ఉడికించి ఉడికిన తరువాత జల్లెడ పట్టి త్రాగించాలి.
బార్లీ గటక : 50 గ్రాముల బార్లీ పిండి 650 మి.లీ. నీళ్ళలో పోసి ఉడికించి అందులో పిండి నెమ్మదిగా పోసి ఉడికించి 10-15 నిముషాల వరకు ఉడకనిచ్చిన తరువాత, కొంచెం వేడి పాలను పోసి, చల్లబరిచిన తరువాత రోగికి తాగించాలి.
మహెరీ : ఒక పిడికెడు బియ్యాన్ని పెనంపై కొంచెం వేంచి, ఒక కిలో నీరు పోసి, అవసరమైన ఉప్పును చేర్చి, బియ్యాన్ని పోస, సగం నీరు పోయేవరకు ఉడికించాలి. తరువాత పుల్లటి మజ్జిగ పోయాలి. తరువాత అందులో నువ్వులు, జిలకర, ధనియాలు, లవంగాలు, మిరియాలు పోసి ఉడికించాలి.
జాపలు : బియ్యం, గోధుమలు, జొన్నలు వేరు వేరూ పెనంపై మామూలూ వేంచి, రువాత నీటిలో ఒక కిలో నీరు పోసి కావాలసినంత ఉప్పును వేసి చిన్నమంటపై ఉడికింఛాల. అందులో జీలకర్ర, మెంథులు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు పోసి తిరగమూత పెట్టుకోవచ్చు.
ధనియాల పంచకం : ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్లద్రాక్ష, పటిక బెల్లం ఈ అయిదు వస్తువులను ఒకే విధంఘా తీసుకొని పిండి చేసి, ఇందులోని 20 గ్రాముల మిశ్రమాన్ని రాత్రి 200 మి.లీ. నీళ్ళళో నానబెట్టి వడపోసి తాగాలి.
పాల తీపి : 200 మి.లీ. పాలలో 200 మి.లీ. నీళ్ళను పోసి మీకిచ్చిన చూర్ణాన్ని 1 నుండి 2 గ్రాముల వరకు కలిప, మొత్తం 200 మి.లీ. నీళ్ళు మరిఇపోయేవరకు వేడచేసి చల్లబరచిన మిశ్రమాన్ని తాగాలి. అవసరం అనుకుంటే పటిక బెల్లం వేసుకోవచ్చు.
నల్లద్రాక్ష : కషాయం 20 గ్రాముల నల్లద్రాక్షలో 300 మి.లీ. నీళ్ళను కలిపి కనీసం 8 గంటలైనా నానబెట్టి, తరువాత ఉడికించి, 200 మి.లీ. నీళ్ళు మిగిలే వరకు ద్రాక్షను ఉడికించి వడపోసి తాగించాలి.
చనగల నీళ్ళు : 50 గ్రాముల చనగలను 500 నీళ్ళలో పోసి 6-7 గంటల వరకు నానబెట్టి, ఇత్తడి పాత్రలో పోసి ఉడికించి, పైన కొంచెం సైందవ లవణం, 5-6 మిరియాల గింజలను వేసి, కొంచెం ఉడికిన తరువాత, వడపోసి నీటిని రోగికి తాగించాలి.
దలియా : 50 గ్రాముల మంఛ గోధుముల రవ్వను తీసుకొని, కడిగి పాత్రలో వేయించి శనగలు తినకూడదు. ఇందులో 1500 మి.లీ. నీటిని పోసి ఉడికింఛాల. రవ్వ బాగా ఉడికిన తరువాత దింపి మసాల వేయంఢి, తిరిగి దలియా మంచిఆ ఉడిఇన తరువాత తినాల. తియ్యని దలియా తయారుచేయడానికి అవసరమైన పటిక బెల్లం గాని వేసి తయారు చేయాలి. నెయ్యి వేయాలనుకుంటే నీటితో పాటు 20 గ్రాముల నెయ్యిని వేసి ఉడికించాలి.
శొంఠి కషాయం : 200 మి.లీ. నీళ్ళలో 2-5 గ్రాముల శొంఠి పొడి వేసి ఉడికించాలి. ఒక కప్పులో 10-15 మి.లీ. ఆముదం నూనె పోసి మాసిక ధర్మాన్ని 7 రోజులకు ముందుగానే ఉదయం పరగడుపున తాగాలి.
కూరగాయలు రసంతో షర్బత్ : పైన కనబరచిన పచ్చళ్ళను చేయునప్పుడు (తురిమినప్పుడు) వచ్చే కూరగాయలు రసాన్ని సేకరించి దానికి టెంకాయ నీటికి కలిపి, చకెన్రు రుచకి తగిన ప్రమాణంలో చేర్చ తక్షణం ఉపయోగించండి (ఇటువంటి షర్బత్‌ను చాలా సేపు వుంచి ఉపయోంచరాదు).
కాషాయం : ధనియాలు, జీలకర్ర (ధనియాలతో సగభాగం), నిమ్మరసం, పుదినా, అల్లం, యాలుకుపొడి, బెల్లం. కొద్దిగా వెచ్చఆ వేయించిన ధనియాలు జీలకర్ర పొడిఆ దంఛి దానిని కావలసినం నీటిలో కలిపి ఉడకబెట్టాలి. తరువాత దానికి పుదీనా అ్లం యాలులు పొడి బెల్లం వేసి బాగుగా ఉడికింఛి జల్లెడ పట్టి (సోదించి) తరువాత నిమ్మరసం కలపాలి. కాఫీ, టీ త్రాగడానికి బదులు దీనిని త్రాగితే ఆరోగ్యం.
పుష్ఠినిచ్చే పానీయం : రెండు గంటలకాలం నానబెట్టన వేరుశెనగ విత్తనాలు 20 గింజలు తగినంథ బెల్లం లేక తేనె ఏదైనా పండు (అరటి, సపోట, ద్రాక్ష, ఆపిల్, నారింజ లాంటివి) పచ్చి కొబ్బరి కొద్దిగా కలిపి మిక్చర్‌లో రుబ్బేది. ఆ రసం ప్రతి నత్యం ఉదయం ఒక కప్పు సేవిస్తే చాలు ఎంతో ఆరోగ్యం శక్తి నిస్తుంది.
Hanuman Chalisa in Telugu
Sri Hanuman Chalisa in Telugu Language Read Every Saturday and Tues Days Three Times per days.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
1. జయహనుమంత జ్ఞానగుణవందిత జయపండిత త్రిలోకపూజిత |
2. రామదూత అతులితబలధామ అంజనీపుత్ర పవనసుతనామ |
3. ఉదయభానుని మధురఫలమని భావనలీలా అమృతమునుబ్రోలిన |
4. కాంచనవర్ణ విరాజితవేష కుండలామండిత కుంచితకేశ |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
5. రామసుగ్రీవుల మైత్రినిగొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి |
6. జానకీపతి ముద్రికదోడ్కొని జలధిలంకించి లంకజేరుకొని |
7. సూక్ష్మరూపమున సీతను జూచి వికటరూపమున లంకనుగాల్చి |
8. భీమరూపమున అసురులజంపిన రామకార్యమును సఫలముజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
9. సీతజాడగని వచ్చిననినుగని శ్రీరఘువీరుడు కౌగిటనినుగొని |
10. సహస్రరీతుల నినుగొనియాడగ కాగలకార్యము నీపైనిడగ |
11. వానరసేనతో వారిధిదాటి లంకేశునితో తలపడిపోరి |
12. హోరుహోరున పోరుసాగిన అసురసేనల వరుసనగోల్చిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
13. లక్ష్మణమూర్ఛతో రాముడడలగ సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత |
14. రామలక్ష్మణుల అస్థ్రదాటికి అసురవీరులు అస్తమించిరి |
15. తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణసంహారము |
16. ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణుజేసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
17. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి |
18. అంతులేని ఆనందాశ్రువులె అయోధ్యాపురి పొంగిపొరలె |
19. సీతారాముల సుందరమందిరం శ్రీకాంతుపదం నీహృదయం |
20. రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృతాపానా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
21. దుర్గమమగు ఏ కార్యమైన సుగమమేయగు నీకృపజాలిన |
22. కలుగుసుఖములు నినుశరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న |
23. రామద్వారపు కాపరివైన నీ కట్టడిమీర బ్రహ్మదుల తరమా |
24. భూతపిశాచశాఖినీ ఢాఖినీ భయపడి పాదు నీ నామజపమువిని |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
25. ధ్వజావిరాజా వజ్రశరీరా ఋజబలతేజా గదాధరా |
26. ఈశ్వరాంశ సంభూతపవిత్ర కేసరీపుత్ర పావనగాత్ర |
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలు శారద నారద ఆదిశేషులు |
28. యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీకిర్తి గానముల |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
29. సోదరభరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా |
30. సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురులపాలిట కాలుడవన్నా |
31. అష్టసిద్ది నవనిధులకు దాతగ జానకీమాత దీవించెనుగ |
32. రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
33. నీనామభజన శ్రీరామ రంజన జన్మజన్మాంతర దుఃఖభంజన |
34. ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు |
35. ఇతరచింతనలు మనసున మోతలు స్ధిరముగ మారుతిసేవలు సుఖములు |
36. ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగుసుమా |
38. భక్తి మీరగ గానము సేయగ ముక్తికలగు గౌరీశులు సాక్షిగ |
39. తులసీదాస హనుమాను చాలీసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ |
40. పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపుమన్నా |
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు |
మంగళహరతి గొనుహనుమంతా సీతారామలక్ష్మణ సమేత |
నాఅంతరాత్మ నిలువుఅనంత| నీవే అంతా శ్రీ హనుమంతా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
![]() |
Hanuman Chalisa in Telugu Read |

Lord Balaji Vratha Mala - శ్రీ వేంకటేశ్వర గోవింద వ్రత మాల
వేంకటాద్రిసమం స్ధానం బ్రహ్మాణ్ణే నాస్తి కించన| వేంకటేశనమో దేవో న భూతో న భవిష్యతి||
శ్రీవేంకటాచలంతో సమానమైౖనక్షేత్రం ఈ బ్రహ్మాండంలో మరొకటి లేదు. శ్రీవేంకటేశ్వరునితో సమానమైన దేవుడు ఇంతవరకూ లేడు, ఇకముందు ఉండబోడు.మానవులు ఎన్నో కోర్కెలతో ఉంటారు. కోర్కెలు తీరాలంటే దైవాన్నిభజించాలి. అయితే కలియుగంలో శ్రీ”వేంకటేశ్వరుడొక్కడే ఆరాధ్యదైవం.అందుకే ”కలౌవేంకట నాయకః” అనిచెప్పారు. అభీష్ట సిద్ధికొఱకు శ్రీవేంకటాచల యాత్ర ఒకటే పరమ ఉపాయమని ఆదిత్య పురాణం పేర్కొంటున్నది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఉద్దేశించి చేసే యాత్ర ఇహలోకంలోను, పరలోకంలోనూ అభీష్టాలను ప్రసాదిస్తుంది. దీనికి మరొక ఉపాయం లేదు. లక్ష్మీపతి దయాసముద్రుడు. ఆయన బ్రహ్మాదులకు కూడా వరమిచ్చే”ాడు. తిరుపతి యాత్రా విషయంలో సందేహంతగదు. భక్తితో త్వరగా యాత్రచేసి తరించాలి. శ్రీవేంకటేశ్వరుడు సకల దేవతా స్వరూపుడు. భగవదారాధనలో నామ సంకీర్తన చాలా ప్రధానమైనది. నామ సంకీర్తనతో కలియుగంలో సులభంగా తరించవచ్చు అని కలిసంతరణోపనిషత్తు ప్రభోదిస్తున్నది సమస్త పాపాలను పోగొట్టి దుఃఖం తొలగించగలది భగవన్నామమొక్కటే అని భాగవతం చెబుతున్నది.
భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయనవేయినామాల విష్ణుదేవడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమయినది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోశబ్దానికి అనేక అర్దాలున్నాయి. అందువల్ల గోవిందుడు అంటే వేదవాణిని పొందేవాడని, వేదప్రతిపాద్యుడనీ, గోవులను కాపాడేవాడని ఇలా ఎన్నో అర్ధాలు చెప్పవచ్చు. అందుచేత గోవిందనామాంకితమైన మాలను ధరించి శ్రీవేంకటేశ్వరవ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాం లాతీతి మాలా’ అనే నిర్వచనాన్ని అనుసరించి ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్ధం. అంటేఅశుభాలనుతొలగించి సకల సంపదలను కల్గించేది మాల.
శ్రీవేంకటేశ్వర వ్రతమాల వేయు విధానము
”ఓం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమః ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ ్టాసుదేవ పరబ్రహ్మణే నమః ”
భక్తులారా!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వైకుంఠవాసుడు అడుగడుగు దండాలవాడు, ఆపద్భాంధవుడు తిరుమల మందిర సుందరుడు అయిన శ్రీవేంకటరమణస్వామివారి గోవిందమాల వ్రతమును ఆచరించి పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులుకండి.

ముడుపు
ఎవ్వరైతే దీక్షాధారణ ఛేయదలచారోదారు శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆదేవదేవుడు కాపాడగలడు.
కావలసిన వస్తువులు : అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము ఒక మీటరు. 7 రూపాయి బిళ్ళలు + 7 పావలా బిళ్ళలు.
తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది ఆరబెట్టి బాగా ఆరిన తరువాత దీక్షకు కూర్చొని, మొదట మాలను క్రింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూపదీప పూజా కార్యక్రమాలొనర్చి సిద్దపరచుకొనవలయును.తరువాత పసుపు వస్త్రమునుతీసికొని ఎడమఅరచేతిలో వుంచుకొని అందులో రూపాయి పావలా వుంచి శ్రీవేంకటేశ్వరస్వామి సకలాభీష్టసిద్ధి మంత్రమును జపిస్తూ ఒక ముడి”వేయవలెను.అలాగే కొంత స్ధలమిచ్ఛి రెండవ ముడి వేయవలెను.ఇందొక జాగ్రర్త వహించవలెను.రెండవ ముడి వేసేటప్పడు ఇదివరకువేసిన ముడిని ఎట్టి పరిస్ధితుల్లోనూ దాటించి ముడివేయరాదు. ఖాళీగా వున్న వస్త్రమునే త్రిప్పుతూ ముడివేయవలెను. ముడుపు కట్టే సమయములో ఎవ్వరితోను మాట్లాడరాదు. స్వామి అభీష్ట సిద్ధిమంత్రమును జపిస్తూ ఏడు ముడుపులు కట్టవలయును. ఈ ముడుపు కార్యక్రమము అయిన తర్వాత పూజా కార్యక్రమము కావించి మాలధారణ చేయవలెను.

మాలను పవిత్రము చేయు విధానము
1. ఆవు పంచితము 2. ఆవు పాలు 3. ఆవుపెరుగు 4. ఆవు నెయ్యి, 5. తేనె 6. గంధము 7. నీళ్ళు వీనిచే మాలను అభిషేకము గావించి కర్పూర నీరాజనము సల్పి, గోవింద నామమును 108 పర్యాయములు జపించుచూ ధరించవలయును.
వ్రత నియమము
1. వైకుంఠ ఏకాదశికి 7వారములు, 6వారములు, 5వారములు, 4వారములు, మరియు 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2. పవిత్రమాలను తులసి పూసలతో గాని తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రము చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి తమ శక్త్యనుసారము పూజకావించి ధరించవలయును.
3. స్రీలు ఆచరించదలచినచో 7 రోజుల వ్రతమును ఆచరించవచ్చును.
4. వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9-30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామిఆలయంవద్ద ”యాగపూజ -కంకణములు” కట్టుట జరుగును. భక్తులు విధిగా హాజరుకావలెను. భక్తులు యాగమునకు కావలసిన 7 రకముల సమిధలు 5 గ్రాముల నెయ్యి షేవలెను.
5. శ్రీ స్వామివారికి ముఖ్యమయిన పసుపు వస్త్రములను విధిగా ధరించవలయును. నుదుట తిరునామములు పెట్టుకోవలయును.
6. వ్రతకాలములో ధూమము మద్యము, మత్తుపదార్దములు, మాంసాహారము సేవించరాదు.దాంపత్యమునకు దూరముగా ఉండవలెను.సాత్వికాహారము ఉత్తమము.
7. ప్రతి నిత్యము ఉదయము, సాయంకాలము 6-00 గంటలు 7-00 గంటల మధ్య స్నాన కార్యక్రమము ముగించుకొని శ్రీ స్వామి””వారి గోవిందనామము ధ్యానించవలయును. వీలైతే రోజుకు 1008 సార్లు ” ఓంనమోవేంకటేశాయ” అనే సకలాబీష్ట సిద్దిమంత్రమును జపించవలయును. భజనలో పాల్గొన వలయును.
8. ఎదుటి వారిని తనమాటల చేతకాని, చేతలచేతగాని బాదింపరాదు.
9. దీక్షాకాలములో ఇతరులను ”గోవిందా” అని పిలువవలెను.
10. ఉపవాస కార్యక్రమమును తూ.చ. తప్పకపాటించవలయును.పె ౖవ్రతమును అన్ని వర్ణములవారు ఆచరించవచ్చును. ఆచరించినవారు శ్రీవేంకటరమణ స్వామివారి కృపా కటాక్షము వలన తలచిన కోర్కెలు నెరవేర్చుకొని సకల సుఖములు పొందుదురు.

శ్రీవారి హుండి ముడుపు
1. పచ్చకర్పూరము 50 గ్రా. 2. జీడిపప్పు 50 గ్రా. 3. ఎండు ద్రాక్ష 50 గ్రా. 4. ఏలకులు 50 గ్రా.
5. మిరియాలు 50 గ్రా. 6. జీలకర్ర 50 గ్రా. 7. బియ్యము 50 గ్రా. 8. కర్పూరం 50 గ్రా.
5. మిరియాలు 50 గ్రా. 6. జీలకర్ర 50 గ్రా. 7. బియ్యము 50 గ్రా. 8. కర్పూరం 50 గ్రా.
ఇంటికి తెచ్చుకొను ముడుపు
1. బియ్యము 100 గ్రా.
2. టెంకాయ1
3. కర్పూరము 1 ప్యాకెట్టు
పై పదార్ధములు రెండు విడి విడి సంచులలవేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడచి శ్రీ స్వామివారి సన్నిధి చేరవలయును. ఇంటికి తెచ్చుకొను ముడుపు మూటను దగ్గరిలో వచ్చు శనివారము రోజున వారి వారి ఇంటిలో తళిగలువేసికొని ముగించు కొనవచ్చును.

ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
Ayyappa Songs, Bhajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు
Ayyappa Swamy Bajans in Telugu
అయ్యప్ప స్వామి భజనలు – పాటలు
24. భూత నాధ సదానందా
శో|| భూత నాధ సదానందాసర్వ భూత దయాపరా
రక్ష రక్ష మహభాహో
శాస్తే తుభ్యం నమోనమః ..3.. సార్లు
పల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
దేవనే – దేవియే – దేవియే – దేవనే ||భగ||
1. నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా ||భగ||
2. కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా ||భగ||
3. మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా ||భగ||
4. నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా
కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా ||భగ||
25. కార్తీక మాసము వచ్చిందంటే
కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యానియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||
26. అది గదిగో శబరి మలా
అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలాఅది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల ||శరణమయ్యప్ప||
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల ||శరణమ||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది ||శరణమ||
27. శబరిమలై నౌక సాగీ పోతున్నది
పల్లవి : శభరిమలై నౌకా సాగీ పోతున్నదిఅయ్యప్ప నౌక సాగీ పోతున్నది
నామంబు పలికితే నావ సాగి పోతుంది
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది ||శరణం||
కదలండి బాబు మెదలండి బాబు
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||
28. కొండల్లో కొలువున్న కొండదేవరా
పల్లవి కొండల్లో కొలువున్న కొండదేవరామాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1. కార్తీక మసాన కొండదేవరా
మేము మాలలే వేస్తాము కొండదేవరా ||కొం||
2. అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా ||కొం||
3. కరిమలై శిఖరాన కొండదేవరా
మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా ||కొం||
4. పంపానది తీరాన కొండదేవరా
మా పాపములను బాపవయ్య కొందడేవరా ||కొం||
5. పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
మేము పరవశించినామయ్య కొండదేవరా ||కొం||
6. నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా ||కొం||
29. కొండవాడు మా అయ్యప్పా
పల్లవి కొండవాడు మా అయ్యప్పాజాలి గుండె వాడు మా అయ్యప్పా
ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా ..2.. ||కొం||
1. నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
మణికంఠ నామదేయుడు ఓహో.. ||కొం||
2. రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులు అయ్యప్ప
శరణాలే మేలుకొలుపులు ఓహో… ||కొం||
3. పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు ఓహో.. ||కొం||
30. అయ్యప్ప స్వామినీ చూడాలంటే
అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలిఅయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి ||స్వామి||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి ||స్వామి||
యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి ||స్వామి||
ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి ||స్వామి||
ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి ||స్వామి||
పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి
31. కనివిని ఎరుగుని ఘనయోగం
కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రంఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
1. శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం
ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ
ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది
భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది
2. అపితాహార్యం ఒక నియమం
సంస్క ృతిక వర్గవమొక నియమం
అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ
మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది
కర్మేఫలముగా తలచేది తత్త్వమ్ అని తెలిచేది.
32.జిందగీమే ఏకబార్ శబరియాత్ర
పల్లవి జిందగీమే ఏక్‌బార్ శబరియాత్ర ఛలో ఛలోహరిహరపుత్ర అయ్యప్పకో దర్శన్ కర్కే ఆవో
స్వామియే శరణం అయ్యప్ప స్వామియే
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||జిం||
జీవన్‌తో కుచ్ బఢానహీ ఉస్కా ఛోటాతోపాహై
ఉస్కా బేకార్ మత్ కరో భక్తి, భజన్ సే ధ్యాన్ కరో ||జిం||
పాప్ సబ్ కుచ్ మిట్ జాతా హై పంపా నదిమే స్నాన్ కరో
జ్యోతి స్వరూప్‌కో దర్శన్ కో జీవన్ ముక్తి మిల్‌తీహై
తుఝె జీవన్ ముక్తి హోతా హై ||జిం||
33. రాజా రాజా పందల రాజ
రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు ||2||శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి
అలుద పంబ జలములోన తీపివి నీవే
అడవిలోని జీవాల ఆటవు నీవే
బంగారు కొండపైన వేదము నీవే
పంచగిరులు ధ్వనియించే నాధము నీవే ||శరణం అయ్యప్పా||
భూతదయను బోధించిన కరుణామూర్తి
భూతనాధ సదానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించినా సుందరమూర్తి
ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి ||శరణం అయ్యప్పా||
వావరున్ని వాల్మీకిగ మలచినావయా
వనములోన ఘనముగా నిలిచినావయా
గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా
మా కన్నియు సమస్త నీవే కాదా ||శరణం అయ్యప్పా||
తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ
గురువులు గౌరవించు నీ సేవలూ
కలియుగమును రక్షించే అభయ హస్తమూ
ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ ||శరణం అయ్యప్పా||
33. అమితానందం పరమానందం
అమితానందం పరమానందం అయ్యప్పానీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||
హరియే మోహిని రూపం
హరయే మోహన రూపం
హరిహర సంగం అయ్యప్ప జననం
ముద్దులొలుకు సౌందర్యం ||అమితానందం||
నీవు పుట్టుట పంబా తీరము
నీవు పెరుగుట పందళ రాజ్యము
నీ కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామం
పులిపాల్ కడవికి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్పులి వాహనం
ఇచ్చెను శబరికి మోక్షము ||అమితానందం||
ఇరుముడి నీకభిషేకం
పదునెట్టాంబడి ప్రదాయము
మకర సంక్రమణ సంధ్యా సమయం
మకరజ్యోతియే సత్యరూపము ||అమితానందం||
34. శాస్త్రా సన్నిధిలో అభిషేకం
శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకంఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా ||శాస్తా||
అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా ||శాస్తా||
పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా ||శాస్తా||
చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||
విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా ||శాస్తా||
లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా ||శాస్తా||
కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా ||శాస్తా||
35. గురుస్వామి గురుస్వామి
గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామినీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి ||గురు||
36. వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే
వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలేవీల్లాలి వీరనే వీరమణిగండనే
రాజాది రాజనే రాజకుమారనే
స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో ||వీల్లాలి||
ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము
వావరుని చూసినాము – వందనాలే చేసినాము
మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము
పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం ||వీల్లాలి||
అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము
ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము
కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము
ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య
స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో ||వీల్లాలి||
శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము
పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము
శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము
సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము
అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము
మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా
స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో ||వీల్లాలి||
37. స్వామియే శరణం శరణమయ్యప్పా
స్వామియే శరణం శరణమయ్యప్పాశరణం శరణం స్వామి అయ్యప్పా
అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం
అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||
హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని
హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||
గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది
పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్పులి వాహనం స్వామి వారిది ||స్వామి||
శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు
వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు ||స్వామి||
38. పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం
పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కుకట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి
పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా
హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే
భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప
నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే
పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే ||పళ్ళింకట్టు||
39. ఉయ్యాల ఊగుచున్నారు
1. ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు బంగారు ఉయ్యాల ఊగుచున్నారు2. కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా
3. విల్లాలివీరుడే నీలమణికంఠుడే
రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే
4. పంబలో బాలుడే పందళరాజుడే
కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే
5. ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే
6. కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
కారుణ్యశీలుడే కరుణించే దేవుడే
40. నేను నిజమైతే నా స్వామ నిజమౌనా
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనానా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా ||నేను నిజమైతే||
41. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పాభక్తా మనోహరా శరణమయ్యప్పా
దీన దయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా || కామాక్షి సుప్రజా||
హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా
హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా || కామాక్షి సుప్రజా ||
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప
హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా ||క్షామాక్షి సుప్రజా||
పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా
గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా ||క్షామాక్షి సుప్రజా||
42. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పాఅరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా ||అన్న||
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ||శ||
ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా
ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా ||2||
కరిమల వాసుడవే శరణమయ్యప్పా
కలియుగ వరదుడవే శరణమయ్యప్పా ||2|| ||అ||
అలుదాని వాసుడే – శరణమయ్యప్ప
ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప ||2||
పంబా నివాసుడవే శరణమయ్యప్ప
పందలారాజవే శరణమయ్యప్ప ||అన్న||
నీలిమలై వాసుడవే శరణమయ్యప్పా
నిత్యబ్రహ్మచారివే శరణమయ్యప్పా ||2||
కాంతమలై ఈశుడవే శరణమయ్యప్పా
జ్యోతి స్వరూపడవే శరణమయ్యప్పా ||2||
43. గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి
గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి ||2||ఆడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగల గజ్జలు కట్టినా అయ్యప్ప స్వామి ||2||
విల్లాలి వీరుడవయ్యా నా అయ్యప్ప స్వామి
వీరమణికంఠుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహన రూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహినీ బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల ||గలగల|| ||2||
పంపా బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
పందల రాజునువయ్యా నా అయ్యప్ప స్వామి
నీలిమల వాసుడవయ్యా నా అయ్యప్ప స్వామి
నిత్య బ్రహ్మచారుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి ||2||
ఈ పూజలు నీకేనయ్య నా అయ్యప్ప స్వామి
ఈ భజనలు నీకేనయ్యా నా అయ్యప్ప స్వామి
పడిపూజలు నీకే నయ్యా నా అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరి హర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి ||2||
ఆడుకుందామురావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి ||2||
44. శరణం శరణం అయ్యప్పా
శో|| శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పాశబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా శర||
1. సత్యము జ్యోతి వెలుగునయ – నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరురారయ్య – శబరిగిరికి పోవుదుము శర||
2. హరి హర మానస సుతులైన – సురలా మొరలను ఆలకించి
ధరణిలో తాను జన్మించి – పదునాల్గేళ్ళు నివశించి శర||
3. ఘోర అడవిలో బాలునిగా – సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు – పసిబాలునిగా కనిపింప శర||
4. మణికంఠ అను నామముతో – పెంచిరి రాజులు మురిపెముగా
స్వామి మహిమతో రాజునకు-కలిగెను సుతుడు మరియొకడు శర||
5. గరువాసములో చదివింప – గురుపుత్రుని దీవింప
మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో శర||
6. మాతాపితలను సేవించి – మహిషిని ఆను వధియించి
శబరిగిరిలో వెలసిరాగా – మనలను ధన్యుల చేయుటకు శర||
7. అయ్యప్పా అను నామముతో – శిలారూపమున తానున్నా
జ్యోతి స్వరూప మహిమలతో – భక్తుల కోర్కేలు తీర్తురయ శర||
8. మార్గశిరాన మొదలెట్టి – నలుబది దినములు దీక్షతో
శరణను భజనలు చేయుచు – ఇరుముడి కట్టి పయనింప శర||
9. భోగికి ముందు చేరాలి – పంబలో స్నానం చేయాలి
పదునెట్టాంబడి ఎక్కాలి – స్వామిని మనమూ చూడాలి శర||
10. మకర సంక్రాతి దినమున – సాయం సమయం వేళలో
సర్వం వదలిన సత్పురుషులకు – జ్యోతి దర్శనం మిచ్చునయా శర||
11. మకర జ్యోతిని చూడాలి – తిరువాభరణం చూడాలి
చాలు చాలు మనికింక – వలదు వలదు ఇక మరు జన్మ శర||
12. నెయ్యభిషేకం స్వామికే – తేనాబిషేకం స్వామిక్కే
చందనాభిషేకం స్వామిక్కే – పూలాభిషేకం స్వామిక్కే శర||
13. కూర్పరహరతీ తనకెంతో – పాయసమంటే మరియెంతో
శరణన్న పదములు ఎంతెంతో – యిష్టం యిష్టం స్వామికే శర||
14. హరిహరాసనం స్వామిది – సుందర రూపం స్వామిది
కన్నుల పండుగ మనదేలే – జన్మ తరించుట మనకేలే శర||
15. శరణం శరణం అయ్యప్పా – శరణం శరణం శరణమయా
శరణం శరణం మాస్వామి – దరికి చేర్చుకో మాస్వామీ శర||
45. కొబ్బరికాయలు అయ్యప్పకే
కొబ్బరికాయలు అయ్యప్పకేకోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే ||2||
శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా
నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా ||2||
ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా ||2||
మేము నీ కొండ కొస్తమయ్యా అయ్యప్పా, అయ్యప్పా ||2||
ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా ||2||
మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా ||2||
ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా
మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప
పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా
మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా
కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో
మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో ||కొ||
పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా
మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా
నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో
నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా
మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా
నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా ||కొ||
46. ఎక్కడ చూసిన నీవే అయ్యప్పా
ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పాస్వామి ఎక్కడచూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా
చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్పా
పసిపాపలోన వృద్దులలోనా నీవే అయ్యప్పా || స్వామి ఎక్కడ||
గళగళపారే సెలయేరులలో నీవే అయ్యప్పా
గగనానగిరి పకక్షులలోన నీవే అయ్యప్పా || స్వామి ఎక్కడ||
ఢమఢమ ఢమఢమ ఢమరుక్కనిలో నీవే అయ్యప్పా
ఘణఘణ ఘణఘణ ఘంటానాధం నీవే అయ్యప్పా|| స్వామి ఎక్కడ||
నింగి నేల శూన్యములో నీవే అయ్యప్పా
నీతి జాతి మానవ జాతి నీవే అయ్యప్పా || స్వామి ఎక్కడ||
కన్నె స్వాములలో కత్తిస్వాములలో నీవే అయ్యప్పా
గంట స్వాములలో గధాస్వాములలో నీవే అయ్యప్పా
గురుస్వాములలో మణికంఠులలో నీవే అయ్యప్పా || స్వామి ఎక్కడ||
47. సంతసంబు సంతసంబు సంతసంబహో
సంతసంబు సంతసంబు సంతసంబహోశబరిమలై యాత్రచేయ సంతసంబహో
కార్తికేయ మాసమందు కఠిన నిష్ఠతో
కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం ||సంత||
శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా
ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా ||సంత||
ఆటవిక వేషమంది ఆడిపాడగా
దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా ||సంత||
శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా
పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా ||సంత||
48. కన్నెస్వామి ఓ కన్నెస్వామి
కన్నెస్వామి ఓ కన్నెస్వామివేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ||కన్నెస్వామి||
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ||కన్నెస్వామి||
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ||కన్నెస్వామి||
49. అయ్యా అని పిలిచినా
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినాఅభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే ||అయ్యా||
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని ||అయ్యా||
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని ||అయ్యా||
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని ||అయ్యా||
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి ||అయ్యా||
50. ఈశ్వర నిలయం కైలాసం
ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠంఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల ||ఈశ్వర||
ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు
సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల
కడుపావనం ఇల శబరిమల
శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి
శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి
జీవము నొసగే జ్యోతిర్మూర్తి ||ఈశ్వర||
51. అతి బలవంతా హనుమంతా
అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతాపరమ పురష ఓ పవనసుతా
రామునికే నిజదూత – శ్రీరామునికే నిజదూత
అమితానందము నీ చరితా – బ్రహ్మనందము నీ ఘనతా
పరమానందము నీ ఘనతా ||అతిబలవంతా||
ఎక్కడ భజనలు జరిగిన గాని అక్కడ నీవు వుందువట
నమ్మినబంటువు హనుమంతా ||అతిబలవంతా||
భూతములు నీ పేర్వినినంతనె – భయముతో పరుగెడు అల్లంతా
శ్రీరామదూత హనుమంతా – మరామ దూత హనుమంతా ||అతిబలవంతా||
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి
రామలక్ష్మణ జానకి – జై బోలో హనుమాన్‌కి
జై బోలో హనుమాకి – రామ లక్ష్మణ జానకి ||జయ||
52. ఏమయా దొర వరాల అంజని
ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర ||2||పుట్టగానే పిట్టవలె నింగికెగిరినావట, నింగికెరినావట
నింగికెగిరి సూర్యుణ్ణి మింగ చూసినావట, మింగచూసినావట ||ఏవయా||
సంజీవిని పర్వతాన్ని చేతపట్టినావట, నీచేత పట్టినావట
పెద్ద పెద్ద కొండలను పిండిచేసినావట, పిండి చేసినావట ||ఏవయా||
లంకకెళ్ళి సీతకేమో వార్తలందించినావట, వార్తలందించినావట
రాముడందు భక్తి చూపి జ్ఞానివైనావట, జ్ఞానివైనావట ||ఏవయా||
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి
No comments:
Post a Comment