ఔషధ మొక్కలు.. ఆరోగ్య దీపికలు
ఇప్పటి వరకు ఇష్టం ఉండేది కాదు. కానీ వీటిని గురించి తెలుసుకున్నాక తినడం ప్రారంభించాం. ముళ్లతోట కూర ఆకును రసం చేసి పాము కరిచిన చోట పెడితే విషం శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని తెలుసుకున్నాం. మునగాకు వల్ల రక్తహీనత, రేచీకటి నుంచి విముక్తి కలుగుతుంది.షిమరుబా మొక్క తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనల్లో తేలింది. నేలవేము ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. అలాగే కాలేయ సంబంధమైన వ్యాధుల నుంచి నేలవేము ద్వారా దూరంగా ఉండవచ్చు. అశోక ఆకుతో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రదర్శన వల్ల వివిధ వ్యాధుల నుంచి ఎలా బయటపడవచ్చో తెలుసుకోవడమే కాకుండా తోటి విద్యార్థులకు వివరించడం చాలా సంతోషంగా అనిపించింది.కుందేటికొమ్ము రసాన్ని తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు. మిరియాల పొడితో తీసుకుంటే అర్థతలనొప్పి తగ్గుతుంది. అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచుతుంది. అడ్డసరం ఆకుల రసాన్ని అల్లంతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం మటుమాయమవుతుందని వివరించాం.మొక్కలు అనేక వ్యాధుల నివారణకు ఉయోగపడతాయని ప్రాచీన కాలం నుంచి తెలుసు. రోడ్డు పక్కన ఉండే కలుపు మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ఆధునిక వైద్య విధానాలు రాకముందు అందరూ ఆయుర్వేదం ద్వారానే రోగాలను తగ్గించుకునేవారు. గుంటగలగర మురుగునీటి కాల్వల పక్కన పెరుగుతుంది. అలాగే జలబ్రహ్మీ, మురిపిండ, నేలమణి, ఉత్తరాణి మొక్కలను రోజూ చూస్తూనే ఉంటాం. వీటి వల్ల ఆస్తమా, చుండ్రు, జ్వరం, రక్తపోటు వ్యాధులను నిర్మూలిస్తాయి. ఈ మొక్కలను గురించి సమాజానికి అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రదర్శనను రెండేళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తున్నాం. సుమారుగా 100 ఔషధ మొక్కలను, 30 ఉత్పన్నాలను ఈ ప్రదర్శనలో ఉంచాం. కొన్ని మొక్కలను ఉచితంగా అందజేస్తున్నాం.విద్యార్థులు ప్రతి మొక్కలోని చైతన్యవంతమైన రసాయనాలను, వాటి ఔషధ ఉపయోగాలను వివరించాం. దాని మీద అవగాహన కల్పించాం. ప్రదర్శనలో మొక్కల ఔషధాలను గురించి చక్కగా వివరించారు. ఆహారంలో అపరాలు, తృణధాన్యాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. విద్యార్థులను చైతన్యం చేయడం వల్ల సమాజంలో ముందడుగు వేస్తారనేది మా విశ్వాసం.
No comments:
Post a Comment