Wednesday, April 22, 2015

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు,లక్షణాలు మొదలగు వాటి గురించి తెలుసుకుందాము

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు,లక్షణాలు మొదలగు వాటి గురించి తెలుసుకుందాము

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో వడపోత సామర్థ్యం తగ్గి ఆరోగ్యం దిగజారుతుంది. అందువల్ల ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్స అందించినట్లయితే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు : శారీరక శ్రమ తక్కువగా ఉండటం రోజూ తగినన్ని నీళ్లు తాగకపోవడం గౌట్ రకం కీళ్ల వ్యాధి కుటుంబచరిత్రలో కిడ్నీ సంబంధిత వ్యాధులు / కిడ్నీలో స్టోన్స్ సమస్య ఉండటం స్థూలకాయం శరీరంలో రాళ్లు ఏర్పడే లక్షణం (లిథియాక్ టెండెన్సీ) చలికాలం మద్యపానం వంటివి ముఖ్య కారణాలు. ఇక సీకేడీ (దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి), పుట్టుక నుంచి ఒకటే కిడ్నీ ఉండటం లేదా చిన్న కిడ్నీలు ఉండటం, పీసీకేడీ (పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్) లాంటి వ్యాధులతో బాధపడేవారు తక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలోనూ కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 

లక్షణాలు : కిడ్నీలు నడుముభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. పిండేస్తున్నట్లు, భరించలేని నొప్పి ఉంటుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పితో పాటు వికారంగా ఉండటం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం లేదా వెళ్లవలసి రావడం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు కావడం, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.

నివారణ : రోజూ శారీరక వ్యాయాయం, నడక, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు. చిన్నపిల్లలు, ఎదిగే వయసులోని పిల్లలు తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిలో ఆకలి తగ్గి, జీర్ణక్రియ మందగించడం వల్ల ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల తొలిదశలోనే గుర్తించి, వ్యాధి పూర్తిగా తగ్గేలా చికిత్స తీసుకోవడం ఉత్తమం. 

చికిత్స : సెలైంట్ స్టోన్స్, క్రానిక్ స్టోన్స్ అనేవి దీర్ఘకాలం పాటు ఉంటాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్ల మళ్లీ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది శాశ్వత పరిష్కారం కాదు. హోమియో వైద్యవిధానం ద్వారా వీటిని మళ్లీ మళ్లీ రాకుండా తగ్గించవచ్చు. 

హోమియోతో కిడ్నీలో రాళ్ళకు చెక్

Sakshi | Updated: December 29, 2013 23:00 (IST)
కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు అనేకం. అవి ఎక్కువ కాలం ఉండిపోతే, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సర్జరీతో ఒకసారి తొలగించినా  అవి ఏర్పడటానికి అసలు కారణమైన శరీరతత్వాన్ని మార్చనంతవరకు అవి మళ్లీ  మళ్ళీ వస్తాయి.  శరీరతత్వాన్ని మార్చి కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా తొలగించడం కేవలం హోమియో వైద్యానికే సాధ్యం అంటున్నారు ప్రముఖ హోమియోనిపుణులు డాక్టర్ వాణీ రవికిరణ్.

 మూత్రపిండం, పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ల వల్ల తీవ్రనొప్పి వస్తుంటుంది. సాధారణంగా చిన్న రాళ్ళు అయితే వాటంతట అవే బయటకు వస్తుంటాయి. కాని పరిమాణంలో పెద్దగా అంటే కనీసం 2 - 3 మీల్లిమీటర్ల కంటే పెద్దగా ఉన్న రాళ్ళు కిడ్నీలోని వివిధ భాగాల్లో చిక్కుకుపోయి తీవ్ర నొప్పి మొదలవుతుంది. రోగికి వాంతులు కావటం, వికారంగా ఉంటుంది.
 
 కారణాలు: 40 ఏళ్లు దాటిన మహిళలు కాల్షియం, విటమిన్ డి 3 టాబ్లెట్‌లు ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మాత్రలకు బదులు ప్రకృతి పరంగా లభించే కాల్షియం తీసుకున్నట్లయితే ఎముకలకు మంచిదీ, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. మంచినీరు తక్కువగా తాగటం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడానికి కారణమవుతుంది.
 
లక్షణాలు: మూత్రపిండంలో రాళ్ల వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉంటుంది. ఈ నొప్పి వీపు వెనుక భాగంలో నుంచి బయలుదేరి పొత్తికడుపులోకి వస్తుంది. తెంపరలుగా వచ్చే ఈ నొప్పి జననాంగాలలోకి పాకుతుంది. 20 నుంచి 90 నిమిషాల వరకు ఈ నొప్పి ఉంటుంది. తల తిరగటం, వికారం, వాంతులు కావటం, మూత్రంలో మంట రక్తం చీము రావచ్చు. చెమట, జ్వరం, కంగారుగా, కోపంగా ఉండవచ్చు. ఎటువైపు కదలినా, వంగినా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. కొన్నిసార్లు కాళ్లలో వాపు ఏర్పడవచ్చు.
 
 పిత్తాశయంలో రాళ్లు
 పిత్తాశయం అనేది కాలేయం నుంచి వచ్చే పైత్యరసాలను ఒడిసిపట్టే సంచి లాంటిది. ఇందులో ఉండే పైత్యరసాలు మనం తీసుకునే మాంసకృత్తులు, నూనె పదార్థాలను అరిగింపచేయడానికి ఉపయోగపడతాయి. పైత్యరసం గాఢత పెరిగినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి.
 
 లక్షణాలు: పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ళు కొన్నేళ్ల పాటు లక్షణాలను చూపవు.  ఎప్పుడైతే పెద్దవిగా మారుతాయో అప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల పొట్ట నొప్పి ఉంటుంది. కుడివైపు పొట్టలో నొప్పి మొదలై వీపు వెనుకభాగంలోకి చేరుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, జ్వరం కనిపిస్తాయి.
 
 కారణాలు: పిత్తాశయంలో రాళ్లకు అధిక మాంసాహారం, పీచుపదార్థాలు తగ్గడం, బరువు పెరగడం, వంశపారంపర్యం, బరువు పెరుగతున్నామనే భావనతో ఆహారం తగ్గించడం, అనీమియా, ఆల్కహాల్, ధూమపానం, వేపుడు పదార్థాలు, కాల్షియం, విటమిన్ సి తగ్గడం వంటివి కారణాలు.
 
 హోమియో చికిత్స: కిడ్నీ, పిత్తాశయాల్లో రాళ్లను పూర్తిగా నయం చేయాడనికి హోమియోలో అత్యుత్తమ చికిత్స విధానాలు ఉన్నాయి. ఈ మందుల వల్ల రాళ్లు తొలగిపోవడమే కాకుండా భవిష్యత్‌లో మళ్లీ ఏర్పడకుండా చేయవచ్చు.
 
 డాక్టర్ వాణి రవికిరణ్,
 ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి,
 అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్, విజయవాడ.
 ఫోన్: 7842 106 106 / 9032 106 106

 

కిడ్నీలో రాళ్లకు పరిష్కారం..
*******************
మూత్రపిండాలు రక్తంలోని విషపదార్థాలను, మలిన పదార్థాలను వడపోసి శరీర సమతుల్యతను కాపాడుతాయి. ఆమ్ల, క్షార సంబంధం చక్కగా ఉండేలా చూస్తాయి.
- కిడ్నీ స్టోన్స్ 30 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లలో ఏర్పడతాయి. మహిళల్లో కన్నా మగవారిలో ఎక్కువ.
- రక్తంలో కాల్షియం ఆక్సలేట్స్, యూరిక్ ఆసిడ్, సిస్టీన్ వంటి పదార్థాలు బయటకు విడుదల అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అవి ఒకచోట పేరుకుపోతుంటాయి. ఇవే రాళ్ల రూపంలోకి మారుతాయి.
- కొన్ని రకాల మందులు (మెగ్నీషియం) వలన కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.
- కాల్షియం ఎక్కువగా పాలు, పాలకు సంబంధించిన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నా (రీనల్ ట్యూబులార్ అసిడోసిస్), ఎముకలకు సంబంధించిన సమస్యలు (పెజెట్స్ వ్యాధి) ఉన్నవారు, హైపర్ విటమిన్-డి కలవారికి, హైపర్‌థైరాయిడిజమ్ వల్ల ఎక్కువగా కదలలేని స్థితిలో ఉన్న రోగులకు కాల్షియం ఎక్కువగా డిపాజిట్ అవుతుంది.
- ఆక్సలేట్స్ ఎక్కువగా క్యాబేజీ, టమాటా, పాలకూర, బ్లాక్‌టీలలో ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోవడం మానేయాలి.
- గౌట్ సమస్య ఉన్నవారిలో యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.
లక్షణాలు
నొప్పి : కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పి ఎక్కువగా ఉండదు గానీ మూత్రాశయంలో ఉంటే మాత్రం తీవ్రమైన నొప్పి ఉంటుంది. నొప్పి వీపు భాగం నుంచి ప్రారంభమై ముందుకు పొట్ట ద్వారా గజ్జల్లోకి వ్యాపిస్తుంది. ఒక్కోసారి ఈ నొప్పి వృషణాల వరకు వస్తుంది. దీనితో పాటు చెమట పట్టడం, వికారం, వాంతి లక్షణాలు కూడా ఉంటాయి.
సాధారణంగా కిడ్నీలో రాళ్లు చిన్న పరిమాణంలో ఉంటే అవి మూత్ర మార్గం గుండా పడిపోతూ ఉంటాయి.
మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణం, అవి ఉండే స్థలాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి.
హైడ్రోనెవూఫోసిస్ : కిడ్నీలో వాపు రావడాన్ని హైడ్రోనెవూఫోసిస్ అంటారు.
హిమచూరియా : ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. దీన్ని హిమచూరియా అంటారు.
కొన్ని రకాల రాళ్లు అంటే ఫాస్ఫేట్ సంబంధించిన రాళ్లు ఉన్నా కూడా బయటకు లక్షణాలు కనబడవు. అవి ఆకస్మికంగా ఎక్స్‌రే తీసుకోవడం వలన తెలుస్తుంది.
పరీక్షలు
రక్తపరీక్షలు - సీబీపీ, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటినిన్
మూత్రపరీక్ష - సీయూఈ
రేడియోక్షిగఫీ - కేయూబీ కి స్ట్రెయిట్ ఎక్స్‌రే, అల్ట్రాసోనోక్షిగఫీ, కంప్యూటర్ టోమోక్షిగఫీ, రీనల్‌స్కాన్ వంటి అధునాతన పరీక్షల ద్వారా రాళ్ల పరిమాణం, నిర్మాణం, పదార్థం అన్నీ తెలుసుకుంటారు.
జాగ్రత్తలు
- కాల్షియం, ఆక్సలేట్ సంబంధించిన పదార్థాలను తీసుకోకూడదు.
- రోజూ తగినన్ని నీటిని తీసుకోవాలి. అంటే 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
- ప్రొటీన్లను తగ్గించాలి.
- విటమిన్ డి తీసుకోవడం తగ్గించాలి.
చికిత్స
హోమియోవైద్యంలో మానసిక, శారీరక లక్షణాలను బట్టి ఔషధాన్ని వాడుతారు. దీనివల్ల డిపాజిట్ అయ్యే తత్వం మారిపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేట్లు చేయవచ్చు. అప్పటికే ఏర్పడి ఉన్న రాళ్లను కూడా లేకుండా చేయవచ్చు.

No comments:

Post a Comment