Saturday, April 11, 2015

రోగాలను తగ్గించుచిట్కాలు

రోగాలను తగ్గించుచిట్కాలు

అజీర్ణము : 
ా    కరక్కాయ చూర్ణము, సైంధవ లవణము సమభాగములగా కలుపుకొని పూటకు పావుతులం (3గ్రా||) ఉదయం, సాయంత్రం, భోజనం తరువాత తీసికొంటే అన్ని రకాల అజీర్ణ రోగాలు పోతాయి.    
ా    పచ్చి అరటికాయ ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్ధిగా ఉప్పు కలిపి సేవింఛిన అజీర్ణము, పులిత్రేన్పులు గల అగ్ని మాంద్యము హరించును.
ా    మొలలు
ా    ఆవు వెన్న మరియు నువ్వులు సమానంగా కలిపి ప్రతి రోజు రెండు పూటలా ఒక వారం పాటు తింటే మూల వ్యాది పోతుంది.
ా    ఆవు నెయ్యిని ఒక టీ స్పూను, ఒక గ్లాసు ఆవుపాలలో కలిపి ప్రతి రోజూ త్రాగుతుంటే మొలలు ఊడిపోతాయి.
ఉబ్బసము (ఆస్త్మా) : 
ా    కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ తినుచుండిన ఉబ్బస వ్యాధి నిరోధించబడుతుంది.
ా    పరిశుద్ధమైన వేపనూనె 5 నుండి 10 చక్కులు తమలపాకుల వేసుకొని రోజు ఒకటి నుండి రెండు మారులు తినుచుండిన వారం రోజుల్లో ఉబ్బసం తగ్గిపోతుంది.
కడుపుబ్బరం : 
ఒక గ్రాము సైంధవ లవణము, 5 గ్రాముల అల్లము కలిపి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తే కడుపుబ్బరము శమించును.
కాలిన గాయములు : 
నేరేడు ఆకులను మద్దగా నూరి 100 ర్గఆముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించి ఈ తైలమును కాలిన పుండ్లపై పూస్తుంటే అవి సులభంగా మానిపోతాయి.
కీళ్ళ నొప్పులు మరియు కీళ్ళ వాతము :
ా    నువ్వుల నూనె & నిమ్మరసం సమబాగములు కలిపి కీళ్ళపై మర్ధన చేయాలి.    
ా    వావిలి వేరు చూర్ణము ఒక ్గఆము, నువ్వుల నూనె రెండు గ్రాములు కలుపుకొని రోజుకు రెండు సార్ల తినుచుండిన కీళ్ళవాతము, నడుము నొప్పి తగ్గిపోవును.
ా    గొంతు బొంగురు మరియు గొంతు నొప్పి
ా    ఒకటి రెండు టీ స్పూనులు మంచి తేనెను గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజుకు మూడు, నాలుగు మారులు త్రాగుచుండిన గొంతు బొంగురు పోవుట, నొప్పి, గొంతు పూత హరించిపోవును.
ా    చలువ మిరియాలు నోట్లో వేసుకొని నములుతూ ఆ రసమును మింగుచుండిన బొంగురు  గొంతు పూత వ్యాధి హరించును.
ా    వావిలి చెట్టు వేరు చూర్ణము ఒక గ్రాము మాత్ర నువ్వుల నూనెలో కలిపి ప్రతి దినము సేవించుచున్నచో బొంగురు గంతు నశించుయేకాక కోకిల వంటి ధ్వని కలుగును

No comments:

Post a Comment