Saturday, April 11, 2015

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారాలు

    మొదట  సూర్య భగవాడునికి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇక్కడ సూర్యడ్ని భగవంతుడు అని సంబోధిస్తన్నాను. ఎందుకంటే సృష్టికే వెలుగును, వేడిని ఇచ్చేవాడు. ఈ సృష్టిలో సూర్యుడే లేకపోతే భూమిపైన జీవరాసులకు మనుగడే లేదు. సకల జీవరాశికి అన్నదాత ఆ సూర్య భగవానుడు భగవంతుడు లేడు అనే వారు సైతం కాదనలేని ప్రత్యక్ష దైవం నారాయణు సూర్యభగవానుడు. అలాంటి సూర్యభగవానున ఆరాధించడం అనేది మన దేశంలో పూర్వ కాలము నుండి వస్తున్న సాంప్రదాయం. ప్రాతః కాలవేళ కాకృత్యాలు తీర్చుకొని సాధ్యమైఏ స్నాం ఆచరించ వీలైనంత వరకు తెల్లని వస్త్రములు ధరించి గాలి వెలుతురు చక్కగా ప్రచురింఉ ఆరు భయట ప్రదేశములో సూర్యనమస్కారములు ఆచరించుట శ్రేష్ఠం. సూర్యుని యొక్క మూడు థలు సృష్టి, స్థితి, లయలను సూచిస్తు వుంటాయి. సూర్యోయము సృష్టిని మధ్యాహ్నం స్థితిని సూర్య అస్తమయం లయమవటాన్ని పోలి వుంటాయి. ప్రతి రోజు ఉదయిస్త, ప్రకాశిస్తూ అస్తమిస్తూనే ఉంటాడు. సూర్యుడు ప్రపంచలోని చీకటిని తొలిస్తూ నిద్రపోయిన ప్రపంచాన్ని మేలుకొల్పుతారు. ఇంతటి విశిష్టత ఉండబట్టి సూర్యనమస్కారములు అనేవి అనాధి నుండి మన దేశంలో మొదలు పెట్టబడినవి. ఋగ్వేదంలో యుజుర్వేదంలో కూడ ఉదయం లేవగానే    సూర్యడ్ని యేవిధంఆ ప్రార్ధించాలో చెప్పబడినది. సూర్యనమస్కారములు పాఠ యోగములో ఒక బాఘము అయిఏ సూర్యడ్ని మంత్ర శక్తితో ప్రార్ధిస్తూ నమస్కరిస్తూ చేసే భంగిమలనే సూర్యనమస్కారములు అంటారు. సూర్యనమస్కార సాధన 12 భంగిమలలో, 7 ప్రాణ ప్రవాహక క్రేంద బిందువులను జాగ్రృతి చేస్తూ, పంచత్వ ప్రాప్తి పొంది యోగ సాధన సిద్ధికి నాంది పలుకుతుంది. సూర్యనమస్కారములను అభ్యసించుటకు వలన శరీరంలోని 72000 నాడులు ప్రకంపనం చెంది నాఇ మండలము ఆరోగ్యవంతముగా తయ్యారయి రక్త ప్రసరన చక్కగా జరిగి సాధకునికి ఫలితము త్వరగా లభిస్తుంది.

ఆచరణ సమయం : సూర్య నమస్కారములు సూర్యోదయ సమయము గాని సూర్య అస్తమయ సమయం గాని ఆ సూర్య భగవానునికి ఎదురూ నిల్చొని ప్రశాంతమైన చిత్తం (మనస్సు)లతో, చేయవలయును, శాస్త్ర రిత్యా సూర్యోదయపు వేళలో చెమట ఉత్తమం, ఎందుకనగా ఆ సమయమున గాలిలో ప్రాణ వాయువు అధికంగా ఉండడమే కాక ప్రకృతి ప్రశాంతకు చేరువు వుండుట వలన ప్రాణ వాయువు శరీరంలోకి చేరి త్వరా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుచేయును.
ఆచరణ నియమాలు : 
1)     కాలకృత్యాలు తీర్చుకొనిన తర్వాత సూర్యనమస్కారములను చేయవలయును.
2)     సూర్య నమస్కారాలు వట్టి నేలపై చేయరాదు. తీవాచి లేదా దుప్పటి పైన చేయడం ఉత్తమం. 
3)     సూర్య నమస్కారాలు ఆచరించుటకు ఎలాంటి వాతావరణ కాలుష్యం వుండని ప్రశాంత ప్రదేశము శ్రేష్ఠము.
4)     ఆహారం తీసుకున్న వెంటనే చేయరాదు.
5)     ఇవి యోగాళనములలోకి రావు. కాని ఆసనాలకు వీటికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇక్కడ ఒకటి చెప్పవలసి వస్తుంది. కొన్ని ఆసనాలు సూర్య నమస్కారాలు లలో కనిపించడం వల్ల అనిపిస్తుంది. ఆసనాలకు, ప్రాణయామాలకు ముందు సూర్యనమస్కారములను చేయవలయును. ఖండరాల బిగుతుదనము తగ్గి మొత్తగా అవుతాయి.
6)     సూర్య నమస్కారాలు లలో విశేషత ఏమిటంటే ప్రతి భంగిమలోను శ్వాసక్రియ అప్రయత్నంగా చక్కగా జరుగుతూ వుంటుంది.
7)     సాధన సమయము నందు ఒక భంగిమ నుండి మరొక భంగిమనకు వెళ్ళుతునప్పుడు స్వచ్ఛముగా భీజమంత్రమును వుచ్ఛరిస్తూ ప్రశాంతంగా వెల్లవలయును.
8)     ఆరోగ్యము సరిగా లేనపుడు ఉత్తరం-దక్షిణం వైపు చేయుట నిల్పి వేయవలయును చక్కబడిన తర్వాత తిరిగి ప్రారంభించవలయును.
    ఈ చరాచర జగత్తులో సకల జన జీవనానికి ప్రాణ ప్రదాత అయిన సూర్య భగవానుని స్త్రీ, పురుష బేధము లేకుండా ఆచరించినచో ఆయుర్‌ వృద్ధి, తేజస్సు, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత,   ఇంద్రియ నిగ్రహణ కలిగి పరిపూర్ణ ఆరోగ్యముతో జీవన యాత్ర సాగించటం అనేది సత్యం. అందుకే సర్య ప్రార్ధనతో ప్రారంభిస్తాము.     సూర్యనమస్కారములను 12 భంఘిమలతో 12 నామమలకు బీజాక్షరములను జతచేసి భీజమంత్రములూ ఉచ్చరిస్త సూర్యనికి అభిముఖముగా నిల్చొని సూర్యనమస్కారములను సాధన చేయాలి.
గమనిక : 
1) మెడ, నడుము సమస్యలున్న వారు సూర్యనమస్కారములను చేయరాదు.
2) గురువులను సంప్రదించి చేయవలయును.
3) 12 ఆసనాలను వరుసనే 12 మంత్రాలు చదువుకుంటూ చక చక చేసుకుంటూ పూర్తి చేస్తే ఒక రౌండ్‌ పూర్తి అవుతుంది. ఇలాంటి రౌండ్‌లు 12 చేయ్యాలి.
చివరి మాట : మనకు ఎంతో ఆకలి వున్నప్పుడు ఎవరైన ప్రేమతో ఆహారమును అందిస్తే ఎలా కృతజ్ఞతలు తెలుపుతామో, మనము నడుచుకుంటూ అలిసి వెలుతున్నప్పుడు వాహనము ఆపి ఎక్కించుకున్నప్పుడు ఎలా కృతజ్ఞతలు తెలుపుతామో గమనించండి. ఏ ఫలితములు ఆశించకుండా ఇన్ని ఫలితములను అందిస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. నీవు ఆ భగవంతుడు అందించిన ఈ సాధనను నీవు ఆచరించి నీవు నీ ధర్మాన్ని ఆచరించుము.
    సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య ఆత్మ స్వరూపమే ''సూర్య భగవానుడు''. జగతిలోని సకల ప్రాణికోటికి సౌభాగ్యాలను ఒసగు ప్రత్యక్షదైవమే 'సూర్యనారాయణుడు'' అరుణకిరణాలు జీవక్తి దాయకాలు. అందువల్ల రోజూ ఆ భానుమూర్తికి అభిముఖంఘా నిల్చోని సూర్యనమస్కారాలు చేసినట్లయితే సర్వసుఖశాంతులు లభించును. సూర్యనమస్కారాలు ఆసనాలలో భాగము కాకపోయినా ఇవి ఆసనములతో నిర్మితమైనవే. ఈ ఆసన స్తితుల వలన శరీరంలో నాడీవ్యవస్థ, కండర వ్యవస్థ ప్రక్షాళనమై సాధకునికి ఆయురారోగ్యం సమకూరును.
        శ్లో||    ఓం మిత్రరవి సూర్యభాను - ఖగపూష హిరణ్యగర్భ
            మరీచాదిత్య సవిత్రార్క - బాస్కరేభ్యో నమః

    సూర్యనారాయణుని ప్రతి కిరణమూ ఆరోగ్యదాయకమే. రోజూ సూర్యోదయాన, సూర్యస్తమయాన సూర్యభగవానునికి అభిముఖంగా నిలుచుని పై తెల్పిన మిత్రది సూర్యనామాలను ప్రణవపూర్వకంగా స్మరించిన (ఉచ్ఛరించిన) సకల శుభాలు కలుగును.
''నమస్కార ప్రియ స్సూర్యః'' 
    సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ప్రతి రోజూ సుందర సూర్యోదయపు వేళ ప్రకృతి రమణీయ ప్రదేశంలో సూర్యభగవానునికి అభిముఖంగా నిల్చుని ప్రశాంతమైన మనసుతో సూర్యనమస్కారాలు ఆచరించినట్లయితే శారీరక శక్తి చేరువై, జీవశక్తి లభ్యమై, మానసిక శక్తి వృద్ధి చెంది సంపూర్ణమైన ఆరోగ్యం, మానసిక శాంతి శారీరక ఉల్లాసం, ఆనందం సాధనకు లభ్యమగును.
    సూర్యనమస్కారాలను 12 విధాలు గా సూర్యభగవానుని 12 నామములకు బీజాక్షరములను జతచేసి బీజమంత్రాలుగా ఉచ్చరిస్తూ సూర్యనమస్కారాలను అభ్యసించుట వలన శరీరంలోని 72 వేల నాడులు ప్రకంపనం చెంది నాడీ మండలం ఆరోగ్యవంతంగా తయారై రక్తప్రసరణ చక్కగా జరిగి సాధకునికి ఫలితం త్వరగా లభ్యమగును. 
ఆచరణ సమయం : 
    సూర్యనమస్కారాలు సూర్యోదయం సమయమునగానీ, సూర్యాస్తమయ సమయమున గానీ ఆ సూర్య భగవానునికి ఎదురుగా నిల్చుని ప్రశాంతమైన చిత్తం (మనస్సు) లతో, చిత్తైకాగ్రతతో చేయవలెను. శాస్త్రరీత్యా సూర్యోదపు వేళలో చేయుట ఉత్తం. ఎందుకనగా ఆ సమయమున గాలిలో ప్రాణవాయువు అధికంగా ఉండుటయే గాక ప్రకృతి ప్రశాంతతకు చేరువుగా ఉండుట వలన ప్రాణవాయువు శరీరంలోకి చేరి త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధనకు కలుగజేయును.
ఆచరణా నియమాలు : 
ా    కాలకృత్యాలు తీసుకొని స్నాసంధ్యానుష్ఠానములు ఆచరించిన తరువాత సూర్యనమస్కారాలు చేయవలెను.
ా    సూర్యనమసాకరాలు వట్టి నేలపై చేయరాదు. తివాచీని గాని లేదా ఏదైనా శుభ్రమైన వస్త్రమును వేసుకొని దానిపై చేయుట ఉత్తమం.
ా    సూర్యనమస్కారాలాచరించుటకు కాలుష్యముండని ప్రశాంత ప్రదేశం శ్రేష్టం.
ా    ఆహారం తీసుకొన్న వెంటనే సాధన చేయరాదు. కనీసం భోజనం తరువాత రెండుగంటలు, పానీయములైతే 20 నిముషాల వ్యవధి ఉండవలయును.
ా    సూర్యనమస్కారాలభ్యసించువారు కాఫీ, టీ, మత్తుపానీయాలు, ధూమపానం చేయరాదు. ఎందుకనగా వాటిలో నరాలకు ఒత్తిడి కల్గించే గుణమున్నది. అంతే గాక శరీరంలో విటమిన్లను నశింపజేసి రోగనిరోధక శక్తిని తగ్గించును.
ా    సాధన సమయమునందు ఒక భంగిమ నుండి మరొక భంగిమకు వెళ్ళునపుడు స్వచ్ఛంగా బీజమంత్రమును ఉచ్చరిస్తూ ప్రశాంతంగా వెళ్ళవలయును.
ా    6 సం|| లు పైబడిన పిల్లలందరూ సూర్యనమస్కారాలు అభ్యసించవచ్చు.
ా    ఆరోగ్యం సరిగా లేనపుడు సూర్యనమస్కారాలు చేయుట నిల్పివేసి ఆరోగ్యం చక్కబడిన తర్వాత మరలా ప్రారంభింపవలయును.
ా    స్త్రీలు బహిష్టు (3రోజులు) సమయంలో సాధన చేయరాదు.
ా    గర్భవతులు సూర్యనమస్కారాలు అభ్యసించదలచిన గురువుగారిని సంప్రదించి వారి సలహాలను స్వీకరించి సాధన చేయవలయును.
ా    గుండెజబ్బులు ఉన్నటువంటి వారు సూర్యనమస్కారాలు అభ్యసించకుండుట ఉత్తమం. అభ్యసించదలచిన గురువుగారి సలహానుసారం సాధన చేయవలయును.
ా    సాధన సమయమున మనస్సును పూర్తిగా సాధనపైనే నిలపాలి.
ా    సూర్యనమస్కారాల సాధన పూర్తి అయిన తర్వాత 'శవాసనం' విశ్రాంతి తీసుకొనవలయును.
మంత్ర ఉపయోగం 
ఓం : ఈ బీజాక్షరంతో బిగ్గరగా బొడ్డునుండి 'ఓం' కారాన్ని పూర్ణముగా ఉచ్ఛరింఛుట వలన కంఠనాళాలు, హృదయము, ఉదరము, మెదడు మున్నగునవన్నీ చైతన్యమగును. అంతేగాక నాభియందున్న మణిపూరక చక్రమును ప్రకాశింపజేయును.
హ్రాం : ఈ బీజాక్షరము హృదము నుండ వెలువడును. వాయునాళం, గొంతు, గుండె, పొట్ట మొదలైన వాటికి బలము చేకూరును. పరిశుభ్రమైన రక్తమును శరీర భాగాలకు అందించుటలో సహాకరించును. హృదయ మందున్న అనాహత చక్రమును ప్రకాశింపజేయును.
హ్రీం : ఈ బీజాక్షరము కంఠం నుండి వెలువడును. కంఠం, అంగలి, ముక్కు రొమ్ము, హృదయం, జీర్ణకోశములకు పుష్టినిచ్చును. కంఠవ్యాధులను తగ్గించును. యవ్వమును పెంపొందింపజేయును. కంఠమందు ఉండు విశుద్ద చక్రమును ప్రకాశింపజేయును.
హ్రూం : ఈ బీజాక్షరము నాభి నుండి వెలువడును. లివరు, ఉదరం, ఆంత్రములు, పొత్తికడుపు, జననేంద్రియాలు, ఆరోగ్యంగా తయారగును. స్త్రీలు ఈ బీజాక్షరంను జపించిన పొత్తి కడుపు నొప్పి, ముట్టుకుట్టు నొప్పి తగ్గును. స్వాదిష్ఠాన చక్రమును ప్రకాశింపజేయును.
హ్రైం : ఈ బీజమంత్రము మూత్రపిండాలకు పుష్టినిచ్చి మూత్ర సంబంధమైన సమస్తవ్యాధులను తగ్గించి నపుంసకత్వం, వంద్యత్వంను తగ్గించును.
హ్రౌం : ఈ బీజాక్షరము మూలాధారం నుండి వెలవడును. మలకోశమును, ఆసనమును, మూత్రపిండాలను ఆరోగ్యపరుచును. మూలాధార చక్రమును ప్రకాశింపజేసి కుండలినీశక్తిని మేల్కొల్పును.
హ్రంః : ఈ బీజాక్షరము శరీరంలోని అన్ని భాగాలకు ప్రయోజనం కల్గించును. కంఠం, రొమ్ము, గుండె ఉదరం, ఆంత్రము, ఉత్తేజమై, ఆరోగ్యంగా పనిచేయును.
సూర్య నమస్కారాలు ఉపయోగాలు :  
ా    సూర్య నమస్కారాలు శరీరానికి సంజీవని వంటిని.
ా    సూర్య నమస్కారాలు చేయుట వలన శరీరంలోని ప్రాక్రియాసిస్‌ చైతన్యవంతమై ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగా జరిగి మధ్యమేహ వ్యాధి (షుగర్‌) త్వరితగతిన తగ్గును.
ా    నాడీవ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది నరాల బలహీనతను, పక్షవాతవ్యాధిని నివారించును.
ా    హృదయ కండరం, కాలేయము, మూత్రపిండాలు ఆరోగ్యంగా, బలంగా తయారై వాటికి సంబంధించిన వ్యాధులను నివారించును.
ా    వెన్ను ఎముకకు రక్తప్రసరణ చక్కగా జరిగి వెన్నెముక దృఢంగా తయారై శరీరానికి నూతన ఉత్సాహాన్ని కల్గించును.
ా    ఉషఃకాల సూర్యకరిణం ఆరోగ్యప్రదాయకం. సూర్యకిరణాల తాకిడికి చర్మవాద్యులు తగ్గును.
ా    శరీంలోని కొలెస్టరాల్‌ శాతం తగ్గి బానపొట్టలు తగ్గి ఉదర, హృదయసంబంధ వ్యాధులు తగ్గిపోవును.
ా    మొదడుకు రక్తప్రసరణ చక్కగా జరిగి తలనొప్పి, మైగ్రేన్‌ (అర్ధ తలనొప్పి) వంటి తలకు సంబంధించిన వ్యాధులు రావు.
ా    కీళ్ళ నొప్పులు, వాత సంబంధమైన వ్యాధులు తగ్గిపోవును. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా తయారై శరీరం తేజోవంతమగును.
ా    అజీర్ణము, గ్యాస్ట్రిక్‌ట్రబుల్‌, మలబద్దకము మొదలైన ఉదరసంబంధమైన వ్యాధులు తగ్గిపోవును.
ా    జ్ఞానేంద్రియములు ఆరోగ్యంగా, చురుకుగా తయారగును.

No comments:

Post a Comment