Saturday, April 4, 2015

మానసిక వికాసానికి యోగా

మానసిక వికాసానికి యోగా


మానసిక వికాసానికి యోగా

ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించిఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసివాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది. 

యోగ ప్రార్థన క్రియ...
కూర్చొని రెండు చేతులు జోడించినమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి. 
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయిస్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది. 

భస్ర్తిక క్రియ...
భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాసప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలిపీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసిఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలిపీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసికుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలిపీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలిపీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలిపీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగివాటికి చైతన్యం కలుగుతుంది. 

శిరస్సుకు...
ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటిలోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి. 

ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచిఎదురుగా చూస్తూశ్వాసను వేగంగా వదలాలిపీల్చాలి. 
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకుభయం పోయేదానికిశిరస్సును ఎత్తి,శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించివేగంగా శ్వాస పీల్చాలివదలాలి. 
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి,వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపైమెడ కిందభృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచికళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలిపీల్చాలి. 

టెన్షన్‌ తగ్గించే క్రియలు...
టెన్షన్‌ తగ్గాలంటేకనుబొమలు పైకెత్తినుదురుపై ముడుతలు పడేట్లు చేసిఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. 

నేత్రశక్తి క్రియలు...
ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం. 

కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి,పిడికిలి బిగించిబొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలినికుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచిఎడమ చేతినిఎడమవైపు కిందికి దింపిపైబొటన వేలినికింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచికుడి చేయి కిందికి కుడివైపుకు దింపిరెండు బొటన వేళ్లను పైకికిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకిమరో బొటన వేలిని కిందికి ఉంచివేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచిమరో బొటనవేలిని ముందుకు చాచిరెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి. 

అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచిబొటనవేలిని చూస్తూచేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలితెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి

No comments:

Post a Comment