Saturday, April 11, 2015

యేసు క్రీస్తు అందరికి ప్రభువు – భజనలు – పాటలు

Jesus Christ Telugu Songs

యేసు క్రీస్తు అందరికి ప్రభువు  –  భజనలు – పాటలు

 పాట – 1
ప||    నీ జీవితములో గమ్యంబు యేదో – ఒకసారి యోచించవా 
    ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు – నీ హృదయంబు నర్పింపవా 
1.    నీ తల్లి గర్భాన నీవుండినపుడే – నినుజూచె ప్రభు కన్నులు 
    యోచించినావా ఏ రీతి నిన్ను – నిర్మించె తన చేతులు 
2.    నీలోన తాను నివసింపగోరి – దినమెల్ల చేజూచెను 
    హృదయంబు తలపు – తెరువంగలేవా – యేసు ప్రవేశింపను 
3.    తన చేతులందు రుధిరంపుధారల్‌ – స్రవించే నీ కోసమే 
    భరియించే శిక్ష నీ కోసమేగా – ఒకసారి గమనించవా 
4.    ప్రభు యేసు నిన్ను సంధించినట్టి – సమయంబు ఈనాడెగా 
    ఈ చోట నుండి ప్రభు యేసు లేక – పోబోకుమో సోదరా 
పాట – 2 
ప||    యెహోవా నీ నీనామము – ఎంతో బలమైనది – ఎంతో బలమైనదీ 
1.    యోషే ప్రార్ధింపగా – మన్నాను కురిపించితివి 
    యోహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి     ||యోహోవా|| 
2.    నిప్రజల పక్షమున – యుద్దములు చేసినదేవా 
    అగ్నిలో పడవేసిన – భయమేమి లేకుండిరి         ||యోహోవా|| 
3.    సింహముల బోనైనను – సంతోషముగా వెల్లిరి 
    ప్రార్ధించినా వెంటనే – రక్షించే నీ హస్తము         ||యోహోవా|| 
4.    చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించిన 
    సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను         ||యోహోవా|| 
5.    పౌలు సీలను బంధించి – చెరసాలలో వేసినా 
    పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె         ||యోహోవా|| 
పాట – 3 
ప||     ఎవరు నన్ను చేయి విడిచినా – నా యేసుడు చేయి విడువడ 
    చేయి విడువడు (2) చేయి విడువడు – నన్ను చేయి విడువాడు 
1.    తల్లి ఆయనే – తండ్రి ఆయనే 
    లాలించును – నిన్ను పాలించును 
    వేదనశ్రమలు – ఉన్నప్పుడెల్లా 
    వేడుకొందును – కాపాడును                 ||ఎవరు||    
2.    రక్తముతోడ – కడిగిన నాడే 
    రక్షణ సంతోషం – నాకు ఇచ్చాడే 
    వాక్యముచే – నడుపుచున్నాడు                 ||ఎవరు|| 
పాట – 4
ప||    నీ వాక్యమే నన్ను బ్రతికించెను 
    భాధలలో నెమ్మది నిచ్చెను
    కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా 
    వాక్యమైయున్న యేసు వందనమయ్యా 
1.    జిగటగఊబి నుండి – లేవనెత్తెను 
    సమతలమగు – భూమిపైన నన్ను నిలిపెను
    నా పాదములకు – దీపమాయెను     
    సత్యమైన మార్గములో – నడుపుచుండెను         ||నీ వాక్య||
2.    వాడిగల రెండంచుల – ఖడ్గము వలెను 
    నాలోని సర్వమును – విభజించి శోధించి 
    పాపమన్యాయమును – తొలగించి వేయుచు 
    అనుక్షణము క్రొత్త శక్తి – నిచ్చుచుండెను… ఆమెన్‌     ||నీ వాక్య||
3.    శత్రువును ఎదురుకునే – సర్వంధకవచమై 
    యుద్ధమునకు సిద్దమనస్సు – నిచ్చుచుండెను 
    అపవాది వేయుచున్న – అగ్నిబాణములను 
    ఖడ్గమువలె అడ్డుకొని – ఆపివేయుచున్నది         ||నీ వాక్య||
4.    పాలవంటిది – జుంటి తేనెవంటిది 
    నా జిహ్వకు – మహామధురమైనది 
    మేలిమి బంగారుకన్న – మిన్నయైనది 
    రత్నారాసులకన్న కోరదగినది                 ||నీ వాక్య||
పాట – 5 
ప||    యెహోవయె మా ప్రభువు – నీవెగా 
    ఆకాశములో మహిమా – నీవెగా 
    కనపరుచు నీ మహిమా – చల్లగా 
    దీవించు మమ్ములను చల్లగా – కలిగి నీ గొఱ్ఱెలుగా     ||యెహోవా|| 
1.    భూమి యందు నీ మహిమ – ఎంతో ప్రభావముంది 
    నీ చేతిలో ఏదియైన – నీ ఆకాశంబులో 
    సూర్యచంద్ర నక్షత్రముల నేను చూడగా 
    నరుడు యేపాటివాడు – ఆ దేవుని సన్నిధిలో         ||యోహోవా|| 
2.    ఒకే కొమ్మ పువ్వువై – ఒకే దువుడవు నీవై 
    పరిశుద్ద ఆత్మతతో – పశువుల పాకలో శిశువుగ జన్మించినావు 
    పాకంత వెలుతురాయే – నీ చల్లని జన్మతో – లోకమంత 
    వెలుగాయె నీ దివ్యజన్మతో                 ||యోహోవా|| 
పాట – 6
ప||    అందాల ఉద్యానవనమా – క్రైస్తవ సంఘమా 
    పుష్పించలేక ఫలియించలేక మాడై మిగిలావు నీవు         ||2|| 
1.    ప్రభు ప్రేమతో బాగుచేసి – శ్రేష్ఠ ద్రాక్షగా నాటేడుగా 
    కాశావు నీవు కారు ద్రాక్షలే     
    యెచించు ఇది న్యాయమేనా (4)             ||అందాల||
2.    ఆకలిగొని నీవైపు చూడ – ఆశ నిరాశయే ప్రభు యేసుకు 
    పెరిగావు నీవు ఫలంపులేక 
    యెచించు ఇది న్యాయమేనా (4)             ||అందాల||
3.    ప్రభు యేసులో నీవు నిలచి 
    పరిశుద్దాత్మలో నీవు పయనించుమా 
    ఇకనై నీవు నిజమైన ఫలముల్‌ 
    ప్రభుకొరకై ఫలయించలేవా (4)             ||అందాల||
పాట – 7 
ప||    ఇది కోతకు సమయం – పనివారి తరుణం 
    ప్రార్ధన చేయుదమా – పైరును చూచెదమా పంటను కోయుదుమా 
1.    కోతెంతో విస్తారమాయెను – కోసేటి పనివారు కొదువాయెను 
    ప్రభుయేసు నిధులన్ని నిలువాయెను                 ||ఇది 
2.    సంఘమా మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా 
    యజమాని నిధులన్ని నికేగదా                     ||ఇది|| 
3.    శ్రమలేని ఫలితంబు నీకియ్యగా వలదంచు వెనుదీసి విడిదోదువా 
    జీవార్ధ ఫలములను భుజింపవా                 ||ఇది||    
పాట – 8 
ప||     ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే ప్రభువా         ||2|| 
    నీ వాక్కుకై వేచి యుంటిని – నా ప్రార్ధన ఆలకించుమా 
    ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా 
1.    నీతోడు లేక నీ ప్రేమలేక – ఇలలోన ఏ ప్రాణినిలువలేదు 
    అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్ధన ఆలకించుమా     
    ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా                 ||ఎన్ని||     
2.    నా ఇంటి దీపం నీవే అని తెలిసి – నా హృదయం నీ కొరకు పదిలపరచితి 
    ఆరిపోయిన నా వెలుగు దీపము – వెలిగించుము నీప్రేమతో 
    ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో 
3.    ఆపదలో నన్ను వెన్నంటియున్న – నా కాపరినీవై నన్నాదుకొంటివి 
    లోకమంతయు నన్ను విడిచిన – నీ నుండి వేరు చేయవు 
    ప్రభువా నీ నుండి వేరు చేయవు                 ||ఎన్ని|| 
పాట – 9
ప||    ఎన్నినాళ్ళ గమనమో – ఎంతదూరమో పయనమో 
    ఈ ధరిత్రిలోన నీ – బ్రతుకు దినము లెన్నియో             ||ఎన్ని|| 
1.    గడ్డిపువ్వు వంటింది – భూనివాస జీవితం 
    ఎంతలోన విరియునో – అంతోనే వాడును             ||ఎన్ని||
2.    నీటి మీద లేచిన – అవిరంటి బ్రతుకాయే 
    క్షణము కూడ నిలువదు – గాలిలోనే కలియును             ||ఎన్ని||
3.    చేదనుండి జూరెడి – నీటి బిందు బ్రతుకాయే 
    జారుచున్న బిందువు – ఎవరి తరము నిలుపగా             ||ఎన్ని||
4.    త్రాసుమీద దూళిలా – ఎగిరిపోవు జీవితం 
    కలలుకన్న జీవితం – కలిసిపోయె నేలలో             ||ఎన్ని||
5.    నీటిమీద తేలిన – బుడగవంటి బ్రతుకాయే 
    ఎపుడు పగిలిపోవునో – ఏ నరునికి తెలియదు             ||ఎన్ని||
6.    యేసే సత్యమార్గము – యేసే నిత్యజీవము 
    యేసు నమ్మువారికి – నిత్యజీవ మొసుగును             ||ఎన్ని||
పాట – 10 
ప||    మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నా 
    మదిలో యేసు లేకున్న – ఏది వున్నా అది సున్నా     
1.    చదువులెన్నో చ్వఉన్నా – పదవులెన్నో చేస్తున్నా 
    విద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా         ||మణులు||
2.    అందచందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా 
    విద్యవున్నా – బుద్దివున్నా – జ్ఞానమున్నా అది సున్నా     ||మణులు||    
3.    రాజ్యములు రమణులు వున్నా శౌర్యములు వీర్యములున్నా 
    బలమువున్నా బలగమున్నా – ఎన్నియున్నా అవి సున్నా     ||మణులు||
4.    పూజ్యుడా పుణ్యాత్ముడా – పుణ్యకార్యసిద్ధుడా 
    దానధర్మము తపము జపము యేసులేనిదే అవి సున్నా     ||మణులు||
పాట – 11
ప||     గత కాలమంత నిను కాచిన దేవుడు 
    ఈ రోజు నిన్ను ఎంతో దీవించును 
    యియ్యు నీమనసియ్యు – చేయుస్తోత్రం చేయు 
    యియ్యు కానుకలియ్యు – చేయు ప్రార్ధన చేయు 
1.    మట్టికుంఢగా – పుట్టించినాడు 
    కంపిపాపగా – కాపాడినాడు 
    వందనాలెన్నో – హెచ్చించినాడు 
    అందరిలో నన్నెంతో – హెచ్చించినాడు             ||గత||
2.    కష్టములో నిన్ను – కాపాడువాడు
    వ్యాధులలో నిన్ను – స్వస్ధపరచువాడు 
    నీవు నమ్ముకుంటే – నిను వదలలేడు 
    ఏ క్షణము నిను – ఎడబాసిపోడు             ||గత||
3.    యేసుని నమ్ముకో – ఈ లోకమందు 
    ఓపిక తెచ్చుకో – యేసురాకముందు 
    నీతల నెత్తుకొని – పైపైకి చూడు 
    మరల యేసు ప్రభు – రానైయున్నాడు             ||గత||
పాట – 12 
ప|| ప్రభుయేసుని పిలుపును ఓ ప్రియుడా 
    పెడచెవిని పెట్టెదవా తీర్మాణము చేయకనే 
    వెళ్లెదవా ప్రభు సన్నిధిలో నుండి             ||ప్రభు|| 
1.    లేత వయస్సు నడిప్రాయమును – గతించి పోవునని 
    మన్నైయున్నది వెనుకటి వలెనే – మరల భూమికి చేరున్‌ 
    ఆత్మదాని దయచేసిన (2) దేవుని యొద్దకు పోవున్‌ 
    ఆ లోకములో నీ ముందు గతి ఏ మౌనో ఎరిగితివా     ||ప్రభు||
2.    ఏ పాటిది నీ జీవితమంథా – ఏ పాటిది నీ తనువు – గడ్డిపువ్వుతో 
    సమమిదియేరా – అదియే నీ జీవితము – అంతలోనే 
    మాయమౌఅగు – వింత బుడగయే గాధ 
    అంతలోనే అందరార్ధంబగు – ఆవిరియేగదా         ||ప్రభు|| 
3.    వ్యర్ధము వ్యర్ధము సర్వము ఇలలో అదియే యేసుని మాట     
    నిలువని నీడ ఈ లోకమురా – కలుషాత్మ కనుగొనరా 
    లోకమంత సంపాదించి – లోబి నీ ప్రాణమును 
    నష్టపరచుకొనిన నీకు – నరుడా లాభము కలదా         ||ప్రభు|| 
4.    తామసించా తగదిక నీకు – తక్షణమే తిరుగుమురా 
    విరిగి నలిగిన హృదయము కలిగి 
    వినయముతో ప్రభు జేరి – యేసు ప్రభుని సిలువ చెంత 
    యేసుని రక్తమే కోరి     
    ప్రాలపించు నీదు సకల పాపములొప్పుకొనుమా         ||ప్రభు|| 
5.    నీ రక్షణకై నిలెచెను యేసు – తన రక్తదారలతో 
    కడుగును నిన్ను క్షెమియించును (2) – విడాగి క్షణమందే నీ 
    నామమను పరదైసులో నేడే నిను నేర్చున్‌ 
    రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా         ||ప్రభు|| 
పాట – 13
ప||    క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే క్షణమో 
    నా కన్నీరు తుడచుటకు – నన్నాదరించుటకు 
    నా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము         ||క్రీస్తే||
1.    మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ     
    నా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకు 
    నీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్‌         ||క్రీస్తే||
2.    ధవళ వస్త్రం ధరియించినా – పరిశుద్ధల సంఘమదీ 
    నీధరికి చేరి నేను – హల్లెలూయ పాడుటకు 
    బుద్దిగల నిర్మల కనునోపోలి సిద్దాపడెన్‌             ||క్రీస్తే|| 
3.    సూర్య చంద్ర తారలనే దాటి పరదైసులో 
    ఆస్పటికనది తీరా – జీవవృక్ష నీడలో 
    నిత్యమైన నివాసము చేయుటకు – వేచియుందున్‌         ||క్రీస్తే||
పాట – 14 
ప||    ప్రియుడనీ ప్రేమ పాదముల్‌ చేరితి నెమ్మది నెమ్మదియే 
    ఆసక్తితో నిను& పాడి స్తుతించెద 
    ఆనందం – ఆనందమే                 ||2||
    ఆశ్చర్యమే – ఆశ్చర్యమే 
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా|| 
    నీశక్తికార్యముల్‌ తలంచి తలంచి 
    ఉల్లము పొంగెనయ్యా                     ||2||
    మంచివాడా – మంచిచేయువాడా 
    స్తోత్రము – స్తోత్రమయ్యా                 ||2||
    మంచివాడా – మహోన్నతుడా 
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
    బలమైన గొఱ్ఱగ పాపములను కట్టి 
    మోసి తీర్చితివే 
    పరిశుద్ధ రక్తము నాకొరకెనయ్యా 
    నాకెంతో భాగ్యమయ్యా 
    పరిశుద్దుడా – పరమాత్ముడా 
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
    ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా 
    రక్తము చింది సాక్షిగా వుండెను. 
    నిశ్చయం – నిశ్చయమే 
    రక్షకుడా – యేసునాధ 
    ఆరాధనా – ఆరాధనా                 ||ప్రియుడా||
పాట – 15 
ప||    రెండే రెండుదారులు – ఏ దారి కావాలో మానవా 
    ఒకటి పరలోకం – మరియొకటి పాతాళం 
    పరలోకం కావాలో – పాతాళం కావాలో తెలుసుకో మానవా 
1.    పరలోకం గొప్ప వెలుగుతో – ఉన్నది పరిశుద్దల కోసం 
    రాత్రి ఉండదు – చీకటి ఉండదు – సూర్యుడుండడు – చంద్రుడుండడు (2) 
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును 
    యుగయుగములు పరలోక చెరుతావు
    యేసుప్రభుని నమ్ముకో పరలోకం రాజ్యమేలు చుండును.         ||రెండే||
2.    పాతాళం అగ్ని గుండము – ఉన్నది ఘోర పాపులకోసం 
    అగ్ని ఆరదు పురుగు చావదు – గప్పుగప్పున రగులుచుండెను 
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను అబ్రాహము 
    రొమ్మున లాజరును చూచాడు 
    ధవంతుడు చాచిదాహమని అడిగాడు                 ||రెండే|| 
3.    పుడతావు నీవు దిగంబరిగా వెళ్ళతావు నీవు దిగంబరిగా         ||2||
    గాలిమేడలు ఎన్నో కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు     ||2||
    లోకములో ఘోరమైన పాపాలు చేస్తారు 
    ఆపాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. 
    అగ్నిలోన పడకుండా యేసుప్రభుని నమ్ముకో             ||రెండే|| 
పాట – 16 
ప||    దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించడి         ఆ ||దే||
1.    ఆయన పరిసుద్ధ ఆలయమందు ఆయన సన్నిదిలో         ఆ ||దే||
2.    ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశ విశాలమందు         ఆ ||దే||
3.    ఆయన పరార్కమ కార్యముల బట్టి ఆయన ప్రభావును         ఆ ||దే||
4.    బూర ధ్వనితో ఆయనన్‌ స్తుతియించుడి సర్వమండలముతో         ఆ ||దే||
5.    సన్నని తంతుల సితారతోను చక్కని స్వరములతో             ఆ ||దే||
6.    తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను – ఆ         ||దే||
7.    పిల్లన గ్రోవుల చల్లగ నూది 
    ఎల్ల ప్రజలు జేరి – ఆ ఆ                     ||దే||
8.    మ్రోగు తాములతో ఆయనన్‌ స్తుతించుడి 
    గంభీర తాళముతో – ఆ                     ||దే||
9.    సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి 
    హల్లెలూయాఆమేన్‌ – ఆ                     ||దే||
పాట – 17 
ప||    రాజులకు రాజైన యీ – మన విభుని – పూజసేయుటకు రండి 
    జయశాలి కన్న – మనకింక – రాజెవ్వరును లేరని     ||రాజలలకు|| 
1.    కరుణ గల సోదరుండై – యీయన – ధరణి కేతెంచెనయ్యా తిరముగా 
    నమ్ముకొనిన – మన కొసగు – బరలోక రాజ్యమ్మును     ||రాజలలకు|| 
2.    నక్కలకు బరియలుండె – నాశాక పకక్షులకు గూళ్లుండెను ఒక్కింత 
    స్ధలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను 
3.    అపహాసములు సేయుచు – నాయన యాసనముపై నుమియుచు 
    మాలిన సైనికు-లందరును నెపము లెంచుచు గొట్టిరి     ||రాజులకు|| 
4.    కరమునం దొక్కరెల్లు – పుడకను – దిరముగా నునిచి వారల్‌ – ధరణీపతి 
    శ్రేష్ఠుడా నీకిపుడు – దండ మనుచును – మ్రొక్కిరి 
పాట – 18 
1.    కర్తా మమ్మును దీవించి 
    క్షేమమిచ్చి పంపుము 
    జీవాహార వార్తనిచిచ& 
    మమ్మును పోషించుము     
2.    ఇహ నిన్ను వేడుకొని 
    బహుగా స్తుతింతుము 
    పరమందు చేరి యింక 
    స్తోత్రము చెల్లంతుము 
పాట – 19 
ప||    క్రొత్తయేడు మొదలు బెట్టెను – మన బ్రతుకునందు క్రొత్త 
    మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ దత్తరపడ 
    కుండ జేయు – టత్తమోత్తమంబు జూడ             ||క్రొత్త|| 
1.    పొందయున్న మేలులన్నియు బొంకంబు మీఱ – డెందమందు 
    స్మరణ జేయుడి – యిందు మీరు మొదలు బెట్టు – పందెమందు 
    గెలవవలు – నందముగను రవినిబోలి – నలయకుండ 
    మెలయకుండ                     ||క్రొత్త|| 
2.    మేలు సేయదడ వొనర్పగా – మీరెఱుగునట్లు – కాలమంత నిరుడు 
    గడిచెగా – ప్రాలుమాలి యుండకుండ – జాలమేలు సేవ వల 
    యు – జాల జనముల కిమ్మాను – యేలు నామ ఘనతకొరకు     ||క్రొత్త|| 
పాట – 20 
ప||    సంతోషముతో నిచ్చెడు వారిని – నెంతో దేవుడు ప్రేమించున్‌ – వింతగ వలసిన 
    దంతయు నొసగును – వినయ మనసుగల విశ్వాసులకును           ||సంతో|| 
1.     అత్యాసక్తితో నధిక ప్రేమతో – నంధకార జనులందఱకు – సత్యసువార్తను 
    జూటించుటకై – సతతము దిరిగెడు – సద్భుక్తులకు     ||సంతో||
2.    వేదవాక్యమును వేరువేరు గ్రా-మాదుల నుండెడు బాలురకు – సాధులు ప్రభుని 
    సుబోధలు నేర్పెడి – సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు         ||సంతో||
3.    దిక్కెవ్వరు లేకుండెడి దీనుల – తక్కువలన్నిటి దీర్చుటకై – నిక్కపు రక్షణ నిద్దరలో 
    నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొరకై 
4.     ఇయ్యండి మీకియం బడునని – యియ్యంగల ప్రభుయే సనెను – ఇయ్యది 
    మరువక – మదిని నుంచుకొని – యియ్యవలెను మన యీవుల నికను ||సంతో|| 
5.    భక్తిగలిగి ప్రభు పనికిచ్చుట బహు-యుక్తమటంచును-దారతతో-శక్తికొలది         
మన భక్తి నుండి యా-సక్తితో నిరతము – నియ వలెను ||సంతో|| 
పాట – 21 
ప||    నీ ధనము నీ ఘనము – ప్రభు యేసుదే – నీ థమ భాగమునీయ వెనుదీతువా|| 
1.    ధరలోన ధనధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా 
    పరలోక నాధుండు నీకయగా – మారి యేసు కొరకీయ వేనుదీతువా       ||నీ|| 
2.    పాడిపంటలు ప్రభువు నీకీయగా – కూడు గుడ్డలు నీకు దయచేయగా 
    వేడంగ ప్రభు యేసు నామంబును – గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా      ||నీ|| 
3.    వెలుగు నీడలు గాలి వర్షంబులు – కలిగించె ప్రభు నీకు ఉచితంగా! వెలిగించ 
    ధరపైని ప్రభు నామము – కలిమికొలది ప్రభున కర్పింపవా     ||నీ|| 
4.    కలిగించె సకలంబు సమృద్ధిగా-తొలగించె పలు బాధ భరితంబులు బాలియాయే 
    నీ పాపముల కేసువే – చెలువంగ ప్రభుకీయ చింతింతువా         ||నీ|| 
పాట – 22 
ప||    దేవర నీ – దీవెనలు – ధారళముగను వీరలపై – బాగుగ వేగమె 
    దిగనిమ్ము – పావన యేసుని ద్వారగను 
1.    దంపతులు దండిగ నీ – ధాత్రిలో వెలయుచు సంపదలన్‌ – సొంపుగ 
    నింపుగ పెంపగుచు స – హింపున వీరు సుఖించుటకై                  ||దేవర||
2.    ఈ కవను నీ కరుణన్‌ – ఆకరువరకును లోకములో – శోకము లేకయె 
    యేకముగా – బ్రాకటముగను జేసుకొనుము              ||దేవర||
3.    మెండుగ భూమండలపు – గండములలో వీరుండగను – తండ్రిగ 
    దండిగ నండినుండి – వెండియు వానిని ఖండించవే          ||దేవర||
4.    ఇద్దర వీరిద్ధరును – శుద్ధులై నిన్ను సేవించుటకై – శ్రద్దతో బుద్దిగ 
    సిద్ధపడన్‌ – దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‌              ||దేవర||
పాట – 23 
ప||    పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ     ||పర|| 
1.    చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము     ||పర|| 
2.    సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్‌ – నిజముగ     ||పర|| 
3.    స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము – నిజముగ     ||పర|| 
4.    మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే – నిజముగ     ||పర||     
5.    ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ     ||పర|| 
6.    ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా – దేహము     ||పర|| 
7.    వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే -దుగదా      ||పర|| 
8.    ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్‌ – మింటికి     ||పర|| 
9.    యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా – నిజముగ     ||పర|| 
పాట – 24
రగులుతున్నది విప్లవ జ్వాల కదులుతున్నది క్రైస్తవ సైన్యం 
పాపభారంతో మునిగిపోతున్నావు 
మనసు విప్పి నివు తెలుసుకొరన్న                     ||రగు||
ఎంత కాలం నీవు నశించుతావు 
నాలుగోడల మధ్య నలుగుతున్నావు 
మొద్దుబారిని నీ చెవులు 
రన్న వినగానే నీవు మోసపోతున్నావు                     ||రగు||
ఆస్తిపాస్తులకు ఆడుతున్నది 
వెదుకుతున్నది నీ బ్రతుకురన్న 
గమ్యం తెలియదు నీ జివతానికి 
దారి చూడరా ఓ మానవుడా                     ||రగు||
సత్యమనె వాక్యము కొరకు 
రగలించే నీవు విప్లవ జ్వాల 
మోసపోకు నీవు ఆది దంపతులొలె 
చిగురించు నీవు ఓ మానవుడా 
పాట – 25 
క్రైస్తవుడే జయశాలి జయించువాడురా 
అతివాదుల మితవాదుల జ్ఞానంపై ఎదురునిల్చి 
వాదించి ఒప్పించి క్రీస్తు కొరకు చెరపట్టి 
శాస్త్రవేత్త జ్ఞానమునే తలక్రిందులు చేసేటి 
క్రీస్తు జ్ఞానము మహాజ్ఞానము మహావేదము 
ఎదురులేదు జయశాలికి యేసుక్రీస్తు రాజ్యంలో 
రాజ్యమేలె యేసును సాటిచెప్పె క్రైస్తవుడు 
పాట – 26 
ఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోర 
ఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా 
1.     లోకానికి జ్యోతివి నీవు – ఆనిత్యం వెలుగుగ వెలుగువు నీవు 
    ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర 
2.    నిత్యజీవము నీలో ఉన్నది – సత్యవాక్యము ఎరుగకున్నవు 
    సాతానును చీల్చుతు నీవు – అపవాదికి బాణం వెయ్యు      
3.    మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లర 
    లోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా 
పాట – 27
ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు 
1)    విశ్వసించిన క్రైస్తవులంతా ఏకమై స్థిర ఆస్తులు అమ్మి 
    అక్కర కొలది పంచి పెట్టిరి మొదటి శతాబ్ధపు క్రైస్తవులంతా 
2)    స్వస్థతలంటు వరాలు అంటు 
    పండుగలంటు పబ్బం గడుపుతు – క్రీస్తును అవహేళన చేస్తు
    సాతను భోధకకులుగా మారిపోయిరి 
3)    ఏకమై ఉన్న క్రైస్తవులలో క్రీస్తు విరోధి బయలు దేరెను 
    యేసుకు జయ్‌ జయ్‌ అంటు రాళ్ళ వర్షము రప్పిస్తున్నాడు 
    విరోధ భావము రగిలిస్తున్నాడు 
4)     బోధించే బోదకులెందరో బయలు దేరిరి బోధించె సంస్ధలెన్నో నిర్మించిరి 
    యేసు చెప్పిన బోధను మార్చకు ప్రపంచక్రైస్తవ డినామినేషన్‌ 
5)     తరతరాలుగ నశించిపోయె క్రైస్తవులారా యేసు వాక్యము ప్రజలకు చెప్పుచు 
    లోకరక్షణకు పాటుపడండి ఎల్లవేళలా 
పాట – 28 
ప||    ప్రపంచమా కండ్లు దెరువుమా యేసుక్రీస్తు నీ యెదుట ఉన్నడు 
    సకల జాతులకు రక్షకుడేసు ఎరుగావాయె ఓ పాపప్రపంచమా 
1)    గొఱ్ఱెపిల్లను వదించినట్టు క్రీస్తుప్రాణము బలిగా ఇచ్చెను 
    పాపప్రపంచ విముక్తి కొరకు 
    ప్రపంచమా ఓ ప్రపంచమా కాలగతులను లెక్కించుటకు 
    నీ కన్ను పడింది శకపురుషునిపై 
2)     ప్రపంచమంతా క్రీస్తు పోలికై సృజింపబడెను 
    పుట్టింపడిన ప్రకృతి చక్రం 
    గతిని తప్పని స్థితిలో ఉంది 
    ప్రపంచమాంతా గతిని మరచెను అడ్డదారిన పడిపోతుంది. 
3)    ఎందరెందరినో మహాత్ములను మహానుభావుల కన్నది 
    ఈ భూప్రపంచం 
    క్రీస్తే యుగపురుషునిగా శకపురుషునిగ 
    స్ధిరంగ నిలిచె విశ్వకోటి ఈ మానవ గుండెలో 
పాట – 29 
ప||    జగమంతా చాటనా ఈ వాక్యము దరణిలో
    అంధకార చీకటిలో నిద్రించుచున్నది మానవలోకము 
1)    నీకోసం సృష్టిరా నీకోసం వెలుగురా 
    నీవు లేనిదె సృష్టిలేదురా 
2)     పాపులుగా బ్రతుకుచున్న ఈ లోకంలో 
    బలి ఆయెరా క్రీస్తు అందరి కొరకు 
3)     వాక్యమె ఆయుధమై సువార్తను చేపట్టి 
    విమర్శకులను ఎదిరించు వేగిరపడు క్రైస్తవుడ 
పాట – 30 
ప||    చింతించె మానవా చిగురించె దెన్నడు 
    తండ్రి పనులకై నీవు లేచి పరుగు తీయరా 
1)     జీవించుచున్నావని పేరు మాత్రమే నీవు     
     మృతిని నని ఎరుగక ఎందాక నీ పరుగులు 
2)     వికసించు వాక్యమువలె పరిమళించు యేసులో 
    ప్రపంచ మానవాళికి ప్రకటించుర సత్యము 
3)    మానవ కల్యాణానికి క్రీస్తు సిలువ ఒరిగాడు 
    చిందించిన రక్తమే నీ పాపం కారణం 
పాట – 31 
ప||    యేసుక్రీస్తు తమ్ములం సిలువకు మేము సైనికులం 
    యుద్దానికి వీరులం అపవాదికి శూరులం 
1)     క్రీస్తు వైపు చూచుకుంటు సిలువను మేము మోసుకుంటూ 
    సూచక క్రియలు అడుగువారికి సిలువ వేసిన యేసుని చాటిస్తున్నాం 
2)    సాతాను అనుచారుల బోధను ఎదిరించుటకు 
    బయలుదేరుతున్నాం మేము ఈ లోక యాత్రలో 
3)    భూలోకం తలక్రిందులు చేయుటకు యిక్కడికి వచ్చినాము 
    క్రీస్తుకు మేము సాకక్షులమై సత్యాన్ని ప్రబలించె వీరులం 
పాట – 32 
కన్నీరు కార్చకు ఓ మానవుడా 
కరుణాల యేసు నిన్ను చూసిండు 
1)     దీవి నుండి భువికి దిగివచ్చిండు 
    సిలువలో బలియై తిరిగి లేచిండు 
    జీవ మార్గమునీకు చూపిండు 
    త్యాగశీలి మన అన్న యేసు 
2)    నిను పెంచినాడు నిను చేర్చుకొనెను 
    తండ్రికి నీవు తిరగబడియున్నావు 
    సృష్టి పుట్టక ముందు తండ్రి నిన్ను 
    నియమించుటకొనెను క్రీస్తులో అన్న 
3)     నిను పంపు తండ్రి నిన్ను కన్నడు 
    సృష్టి నంతటిని శాశించురన్న 
    తండ్రికి నీవు వారసుడవు 
    రారాజువై నీవు ఏలుర అన్న 
పాట – 33 
ప||    దివికేగిన త్యాగముర్తివే మా ఏసన్న 
    కల్వరీలో కార్చినావు నీ రక్తం ఏసన్న 
1)    ధారపోసినా రక్తం నలుదిశలా ప్రవహించె 
    ఏసన్నా … ఆ కొరడాలతో కొట్టి నిన్ను సిలువ పైన పరుడబెట్టి 
    ఆరసేతులమేకులేసి సిలువకు దిగకొట్టినారు. 
2)    పదునైన ముళ్ల కిరీటం అల్లిరి – శిరస్సుపైన మోదిరి 
    ఏసన్నా … ఆ ముఖముపైన ఉమ్మివేసి నీ వస్త్రము పంచుకొనిరి 
    సిలువను నీపైన మెపి చిత్రహింసలు పెట్టిరి 
3)    కల్వరి గిరకేగుచుండ కొరడాలతో నిను బాదిరి 
    ఏసన్నా … ఆ… మరణం నిన్ను బంధించుట 
    అసాధ్యం ఏసన్న – మృతిని గెలిచినావన్నా 
    మాకు మార్గమైతివి ఏసన్న 
పాట – 34 
    సకలా శాస్త్రాలను తలదన్ని వెలివెసెను 
    దివ్యమైన యేసు బోధ 
    నింగి నేలకు దిక్కులాయె కరుణమయుని త్యాగఫలం 
    శాస్థ్రమా సమాజమెంత నీకు 
1)     సకలా శాస్త్రాలకు మూలం ఈ విశ్వం 
    విశ్వ ఆవిర్భావమే శబ్దమే క్రీస్తు 
    ఆ శబ్ధం పరమాత్మం జీవగ్రంధమే బైబిల్‌ 
    శాస్త్రమా సమాజమెంత నీకు 
2)    ఎన్నో గ్రంధాలు వెలిసె జీవంలేని గ్రంధాలు 
    అవివేకుల జ్ఞానంతో లికించిరి శాస్త్రాలను 
    కనబడని మాట చేత కలిగింది ఈ విశ్వం 
    శాస్త్రమా సమాజమెంత నీకు     
3)    ఇకనైన కనులు తెరువు అవివేకి శాస్త్రవేత్త 
    విశ్వమంత అవరించె పరమాత్ముని జ్ఞానం 
    జీవగ్రంధంలో నీవు తలచూస్తే 
    నీకన్నులు పచ్చబడతాయి 
    శాస్త్రమా సమాజమెంత నీకు             
పాట – 35 
ప||    వందనమో వందనమన్న మా అన్న యేసన్నా 
    పరిశుద్దలవందనమన్న, దేవదూతల వందనమన్న, దేశనాయకుల 
    వందనమన్న, పంచభూతముల వందన మన్న, ప్రపంచ ప్రజల 
    వందనమన్న జీవరాసుల వందనమన్న …. అరెరె… హా 
    క్రైస్తవుల వందన మన్న మా అన్న యేసన్న 
1.    భూలోకంలో పాడు బ్రతుకులు, చెలరేగిన వ్యభిచారి బ్రతుకులు 
    కుములుచున్న రోగుల బ్రతుకులు, అపవాదితో షికారు బ్రతుకులు 
    చెరచబడ్డ ఆ బ్రతుకులు ఆయె, ఆత్మ రోగులకు మందులు లేవు 
    అరెరె… హా.. మా ఆత్మల రక్షణ నీవన్న మా అన్న యేసన్న 
2)    భూకంపాలు వస్తయన్నవు భవిషత్‌ జ్ఞానం నెరవేరింది. భవంతులన్ని 
    నేలమట్టమై లక్షల ప్రజల అవితులు బాసిరి, భూగర్భలను పరిశోధించిరి 
    శాస్త్రవేత్తలు తల్లక్రిందులై మాడిపోయిరి 
    అరెరె… హా నీవు పలికినవన్ని చరిత్రపుటలే మా అన్న యేసన్న 
3)    వందల వేల సంవత్సరాల చరిత్ర గలది సత్యవేదమను బైబిలు 
    గ్రంధం, మానవులందరి జీవగ్రంధము, యేసే మార్గం 
    యేసే జీవ త్యాగశీలుకు త్యాగశీలవై సమాధి గెలిచిన 
    మృత్యంజయుడు అరెరె….. హా. నీవు చేసినవన్ని 
    యదార్ధగాధలె మా అన్న ఏసన్నా 
పాట – 36
ప||    యేసయ్య చందనాలో ఎన్నల – రాజానీకొందనాలో ఎన్నల 
1)    యేసయ్య వచ్చునప్పుడు ఎన్నెలో ఎన్నల 
    కరువులు భూకంపాలు ఎన్నెలో ఎన్నల 
    అక్కడక్కడ యుద్దాలు ఎన్నెలో ఎన్నల 
    జనం మీద జనం లేచు ఎన్నెలో ఎన్నల 
    ప్రేమలు చల్లారునయ్యా ఎన్నల 
    ప్రభువు రాకడకు సూచన ఎన్నల 
2)    మేఘాల మీద వచ్చు ఎన్నెలో ఎన్నల 
    తన దూత గనము తోడ ఎన్నోలో ఎన్నల 
    గర్జించు సింహాల ఎన్నెలో ఎన్నల 
    మరలా రానై యుండె ఎన్నెలో ఎన్నల 
    కడబూరమ్రోగుతుంది ఎన్నెలో ఎన్నల 
    కడబూర మ్రోగుతుంది ఎన్నల 
    ప్రభువు ప్రేమ కఠనమౌను ఎన్నల 
పాట – 37 
నా తోడు నీవుండగా దేవా – స్తుతిగీతము పాడెదన్‌ 
నాతోడు నీవుండగా నేను – హల్లెలుయపాడెదన్‌ 
రాజుల రాజ ప్రభువుల ప్రభువా 
మరణము జయించిన మహోన్నతుడ 
నాతోడు నీవుండగా దేవా – దేనికి భయపడను 
నా తోడు నీవుండగా నేను – ఎవరికి భయపడను         ||నా||
1)     కష్టనష్టముల – భయము భీతి 
    శోధన శ్రమలు – నాకు కలుగగా             ||నాతోడు||     2)    నెళవరులు నా – బందుమిత్రులు 
    దూషించి – నిందించినను                 ||నాతోడు||     పాట – 38
ముందుకె సాగెదను – ఇక వెనుకకు నె తిరుగను 
నా మిగిలిన జీవిత దినములన్నియు 
యేసుతో నడిచెదను 
1)     లోకాశలను నేత్రాశలను శరీరాలను చంపెదను 
    పరి శుద్ధులకు తగినట్లుగా ఈ లోకంలో జీవ్‌ితును 
2)    సణిగుగొణిగు – సంశయములను 
    నా హృదయము నుండి తొలగింతును     
    నూతన బ్రతుకు నూతన మనస్సు 
    నూతన మార్గములో నిడదను 
3)    శోధన శ్రమల – కష్టనష్టములు 
    ఈ లోకయాత్రలో ఎదురైనను 
    ఊపిరి నాలో ఉన్నంతవరకు 
    క్రీస్తుతో నేను – నడిచెదను 
4)    క్రీస్తుని నుంచి సైనికునిగను
    అపవాదిని ఎదించుటకై 
    దేవుడిచ్చు సర్వంగ కవచము 
    ధరియంచి నేను పోరాడుదున్‌ 
5)    వెనుక ఉన్నవి అన్నియు మరచి 
    ముందున్న బహుమానము పొంద 
    దేవుడిచ్చు బహుమానము పొంద 
    గురి యొద్దకె నేను పరిగుడుదును
పాట – 39 
ప||    అవని అంత ఆయనదే అయినా స్ధలమేది 
    అందరికి హృదయముంది యేసుకు చోటేది 
1.     పశువులు తమ యజమాని స్వరమెరుగును గాని 
    నరులు దైవతనయుని స్వరమెరుగలేదు అదే శోచనీయం 
2.    సిలువ మీద యేసయ్య కనులు మూయ వేళా 
    సమాధులు తన కనులు తెరచి చూచె నేల? సజీవులైరిచాల 
3.    పసి పాపగ జన్మంప పశుల తొట్టి పరుపాయె 
    తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె లోకం, సిలువనిచ్చె లోకం 
పాట – 40 
ప||    పరలోకము నాదిలే – యేసులోనే ప్రేమతో నన్ను పిలిచెలే 
    కొపతో నన్ను కరుణించలే – యేసు కరుణించలే 
1.    పాపినైన నన్ను పావనుడేసు ప్రేమించెలే – మరణ పాత్రుడనేనూ 
    మహితుడేసు మన్నించెలే 
    ఏమని వివరింథు యేసయ్య ప్రేమను 
    సంతసమున స్తుతియింతులే నేను స్తుతియింతులే         ||పర||
2.    కష్టనష్టములెన్నో కళకాలము నన్ను కభళించిన 
    వ్యాధి బాధలు ఎన్నో విడువక నన్ను వేధించిన 
    పరమున నేను ప్రభువుతో నుందునని 
    సహనము చూపుచు సహియింతులే – నేను సహింతులే     ||పర||
పాట – 41
ప||    నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుము 
    మాకు నీవే సహయుండవు 
1.    దరిచేరంగలెమైతిమి – దారి చూపించి నడిపించుమా 
    మొరలాలించుమా – మమ్ము కరుణించుమా 
    పరిశుద్దాత్మాను తోడియుమా                 ||నిను||    
2.    పావన మూర్తి పాలించుమా – పరమ భాగ్యము మాకియుమా 
    శోధనలేక బాధలు బావుమా 
    పరిశుద్దాత్మను తోడియుమా                 ||నిను||    
పాట – 42 
ప||     వాక్యమే శరీరదారియై వసించెను 
    జీవమే శరీరులను వెలిగించును 
1.    కృపము సత్యముల అల్లేలూయా నీతి నియమములు 
    కలిసి మెలసి భువిలో దివిలో ఇలలో సత్యము మనకై నిలిచెను ||వాక్య||
2.    పాప శాపములు అల్లెలూయా మరణ బంధములు అలెల్లలూయా 
    తొలగిపోయి విడుదలాయే – యేసు నామమే పావన నామము     ||వాక్య|| 
3.    ఆశ్చర్య కరుడు హల్లెలూయా ఆలోచన కర్త హల్లెలూయా 
    నిత్యుడైన తండ్రి దేవుడు నీతి సూర్యడు భువి నుదయించే 
4.    ఉన్నత స్ధలములలో అలెల్లలూయా దేవుని మహిమ అల్లెలూయా 
    పుడమిపైన జనులందరికి శాంతి శుభములు కలుగునూకని. 
పాట – 43 
ప||    మహదేవా మహోన్నతుడా అనంత ఆది ఆమరవణి 
    పరివృత తేజో పరిశుద్దుడా – దివ్యాత్మదేవా మానవుడా 
1.    నీ రక్తం పాప ఫలహరణం – నీ మరణం పాపికేశరణం 
    నీ అర్పణ నిత్య సంపూర్ణం – నీ జీవం నవ్య దివితేజం 
2.    నీ వాక్యం మమ్ము దర్శించె – నీ సత్యం మమ్ము సంధించే 
    నీ ఆత్మయే మమ్ము వెలిగించె – నీ కృపలే మాకు బలమాయె 
3.    నీ పోలిక మాకు నోసగితివి నీ సోత్తుగ మమ్ము చేసితివి 
    నీ సేవకు మమ్ము పిలిచితివి – నీ యాత్మతో మమ్ము పొదగితివి 
4.    పరిపూర్ణత మాకు నీచితం – పరిపూర్ణత మాకు నీ సత్యం 
    పరలోక పట్టణ పౌరులము – ప్రభావమైమకు వారసులం 
పాట – 44 
ప||    ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమా 
    నీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా 
1.    నిరాశతో నిలచితి – పెరాశతో అలసితి 
    కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను 
2.    నామది గైకొని – నా హృది కనుగొని 
    కరుణించు – వెలిగించు నాదు – దివ్వెను     
పాట – 45 
ప||    కరుణమయా – కృపజూపుమయా 
    కనుగొంటిని – నా హృదయవ్యధ ప్రభో రక్షింపుమయా 
1.    లోకములోని కలుషముతో – నిండెను హృదయం మోసముతో 
    శాపముతో బహుశాపముతో – నిండెను హృదయం వ్యాధులతో 
    మదిలో నిత్యము నిన్నుగాంచుట కొరకై 
    నూతన హృదము నాకిమ్ము ప్రభు                 ||2||
2.    రాతి గుండెను కరిగించి – మాంసపు గుండెగ మార్చుమయ్యా 
    శుద్దాత్మ ప్రసాదముతో – నూతన భావము కలిగించుము 
    నీ కట్టడలను గైకొనుట కొరకై – నూతన హృదయము నాకిమ్ము ప్రభు 
పాట – 46 
ప||    యేసులేని ఈ జీవితం – పొందలేవు మోక్ష రాజ్యము 
    దినములు గడుచుచున్నవి – క్షణములు దొర్లుచున్నవి 
    ఆయుష్ష తరుగుచున్దఇ – అంతము పిలుచుచున్నదీ     ||యేసు|| 
1.    అవిరెగిరి పోతున్నట్లు ఎగిరిపోవుచున్నది
    ఆకాశము కదులునట్లు కదులుచున్నది 
2.    అంతమునే దాపునకు చెరనున్నది 
    భూమి విడుచు గడియకు రానున్నది 
3.    కనులు వుండి చూడనైతి నా పపము హృదయముండి ఎరుగనైతి నాశాపము 
    మృత్యుబాట నుండి ఎవరు రక్షించెదరు – నా కొరకు బలియైసెగదా  ||యేసు|| 
4.    పెరుగుతుంది వయస్సని అనుకొన్నావు 
    మరి తరుగుతుంది ఆయుష్షని తెలియకున్నదా 
    పరమార్ధమిదే మనుష్యులకు తెలియకున్నది ప్రభు 
    యేసుని సన్నిధికి రానున్నది. దినములు గుడుచుచున్నవి. 
పాట – 47 
ప||    రెండే రెండు మార్గములు నీ యెదుటనే యున్నవి 
    జీవమార్గము మరి మరణ మార్గము 
    ఓ సహోదరా ఓ సహోదరి ఏది నీ మార్గము         ||రెండే||
1.    జీవ మార్గము ఇరుకైన దనుచు – జీవితాన్ని బలిచేయకు జీవితంలో 
    ఈ తరుణము మల్లిరాదు నీకెన్నడు – జీవజలములు నిచ్చు యేసును 
    జీవితాంతము కీర్తించుము – జీవహరము నిచ్చు క్రీస్తును ఆత్మతో ఆరాధించము 
    ఓ సహోదరి ఓ సహోదరా ఏది నీ మార్గము         ||రెండే||
2.    పాపు జీవితము మరణమని – మరణ మార్గము నరకమని 
    ఆరని నరకాగ్నిలోనికి ఎందుకునీ ప్రయాణము- క్రీస్తులో సాక్షిగ జీవపు బాటలో     
3.    జీవితాన్ని సరిదిద్దుకో – రక్షకుడేసుని శరణు వేడెగ నిత్య జీవాన్ని పొందుకో 
    ఓ సహోదరి – ఓ సహోదరా ఏది నీ మార్గము         ||రెండే||
పాట – 48
ప||    ఆ… ఆ… స్తుతింతు యేసు రక్షకా 
    యేసు రక్షకా నిన్నె స్తుతింతు రక్షకా నిన్నే స్తుతింతు రక్షకా 
1.    కష్టాల యందు స్తుతింతు – నష్టాల యందు స్తుతింతు రక్షకా 
    నిష్ట అదే కదా! స్పష్టమదే కదా! శ్రేష్ట మదేకదా 
2.    అనుమాన మున్న స్తుతింతు – అవమానమున్న స్తుతింతు 
    అపవాదురాని – అపవాదుకాని – కృపనీదేయని 
3.    కరువు దుఃఖములో స్తుతింతు – ఇరుసు వ్యాధులలో స్తుతింతు 
    నన్ను చంపుకొని – వినుకొందునని – కనుమూసుకోని
పాట – 49 
ప||    ఆత్మలో అనందించినచో మహిమ కలుగును దేవునికి 
    ఈ రీతిగా మనము ఫలియించినచో ప్రభుని శిశ్యులైయుండెదము 
1.    అజ్ఞాపించి ప్రభువు సృజించెను భూమి ఆకాశ జలమునులను 
    అందున్నవి ప్రభువును – స్తుతియించును 
    నీ స్తుతులు ప్రభునకు సమర్పించు                 ||ఆత్మ||
2.    ఆదిలో హేబేలు అర్పించెను – హృదపూర్వకమైన అర్పణము 
    అర్పించుము నీవు నీ హృదయమును – వెనుదీయుటేల సోదరా     ||ఆత్మ||     
3.    ఆ ప్రభువు అజ్ఞానుపాలించుము – అధికానందము కలుగును నీకు 
    అందరు ప్రభుమహిమను చూచెదరు – చెప్పశక్యము కాని ఆనందమో ||ఆత్మ||     
4.    ఆ ప్రభు వాక్యము ప్రభాలామయె – శిష్యులు బహుగా విస్తరించిరి 
    ఆయత్తమా శిశ్యుడవ్వుటకు – మహిమా నుండి అధిక మహిమానొంద ||ఆత్మ|| 
    పాట – 50 
ప||    వేలలో పదివేలలో నీవెనా ప్రియ యేసయ్యా 
    మదిలోన నిన్నే నిలిపానయ్యా – నీ ప్రేమ బందినయా     ||వేల|| 
1.    ఓనా ప్రియ యేసయ్యా – రక్షింపనను నీ ప్రాణము 
    అర్పించినవా – యీ పాపికై – స్తుతులు సదా నీకే 
2.    ప్రభువా నారై నీ సర్వము – త్యాగంబు చేసినావయ్యా 
    అంకితం నా జీవితమంత – నాదా నీవే నా ప్రభువడవు 
పాట – 51 
ప||    నీవు పరదేశివాని యెరియుంటెనీకు మేలు – పరిదశివని యెరిగి 
    ఎరిగియుండి ఎరుగకున్నావు – నీ స్వంతం కాదేమి?     
    నీ హక్కులేదేమి పరలోకమే స్ధిరము             ||నీవు|| 
1.    ఆత్మీయ గర్వము అది పురుషునికి ప్రతినామం 
    ఆయనలో నిర్వహించినన్‌ ప్రయోజుడననవలెను 
    ఆరని అగ్ని తప్పించుకొని పరమును చేరుకొనుము             ||నీ||
2.    స్వస్థపర్చ యేసుడుండగా నీవు యేమి చేయలేవుగా – స్వస్థపరచువాడు 
    మహిమనొందును – స్వస్ధడు మహిమపరుచను             ||నీ||
3.    నీ శరీరం ప్రభుని ఆలయం – దాని పాడు చేయబోకు
    నీ శరీరం పాడు చేసినా, దేవుడున్ను పాడు చేయును 
    నీ శరీరం అగ్నిపాలె భద్రముగా కాచుకొనుము             ||నీ||
4.    ఆత్మీయ యుద్దము – నిస్వార్ధమైనది అది 
    ఆత్మ ఐక్యత కలిగి – వర్ధిలుచుండ వెలను 
    ఆ ప్రభుని కార్యలు గ్రహ్యము కానివి – ఉహకు అందనివి         ||నీ|| 
పాట – 52
ప||    ఆలయంలో ప్రవేశించండి అందరు 
    స్వాగతం సుస్వాగతం యేసు నామములో 
    మీ బ్రతుకులో పాపము – కలతల    
    మీ హృదయంలో భాదల కన్నీరా 
    మీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం             ||ఆ||
1.    దీక్షా స్వభావము ప్రాణాస్వభామై 
    వేతికే వారికంత కనబడు దీపం 
    యేసురాజు మాటలే – వినుట ధన్యము 
    వినుట వలన విశ్వాసం – అధిక మదీకమై 
    ఆత్మలో దాహం – తీరును రారండి 
    ఆనందం మనందం హల్లెలూయా 
2.    ప్రభుయేసు మాటలే పెదవిలో మాటలై 
    జీవ వృక్షంబుగ ఫలించాలని 
    పెదవితో పెలికెదం మంచి మాటలే 
    హృదయం అంత యేసు ప్రభుని ప్రేమ మాటలే 
    నింపెదం – నింపెదం – కోరెదం – పొందెదం 
    ఆనందం – మానందం – హల్లెలూయా             ||ఆల|| 
పాట – 53 
ప||    నాదు యేసుని ప్రేమ 
    మధురాతి – మధురం కాదా 
    నన్ను మార్చిన – ప్రేమ 
    మరపురానిది కాదా! 
1.    నజరేయుడ నిన్ను చూడాలని 
    ఆశ కలిగెను నా మదిలో 
    సుందరుడు ఒకసారి నా ఆశ తీర్చవా మనసార 
    ప్రియుడా నీ ఆత్మలో నన్ను చెంత చేర్చుమయ ఇలలో 
    హల్లెలూయా – హలెల్లలూయ 
పాట – 54
ప||    సంతోషం పొంగింది (2) సంతోషం పొంగుతున్నది – హల్లెలూయ 
    యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. 
1.    దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని 
    ఆయన నన్ను రక్షించి – తనదు రక్తంలో కడిగి జీవితమును 
    మార్చి నిత్య జీవిమిచ్చెను.                 ||సంతో|| 
2.    నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము 
    ఆయనీ నిన్ను క్షమియించి – తనదు రక్తంలో కడిగి జీవితమును 
    మార్చి నిత్య జీవిమిచ్చెను.                 ||సంతో|| 
3.    ప్రభు ప్రేమ మరచితిని – లోకమాశలందు పడిపోతివా 
    యేసువైపు చూడుము నీరిక్షణ పొందుము 
    సాతానుపై గొప్ప విజయము నిచ్చెను             ||సంతో|| 
పాట – 55 
ప||    యేసయ్యా నీ కృప శాశ్వతమైనది 
    ఆకాశము కన్నా ఉన్నతమైనది ఉన్నతమైనది 
1.    దూషకుడనూ హింసకుడనూ 
    హానికరుడను దేవా హానికరుడను దేవా 
    నమ్మకమైన వానిగా నను చేసితివే 
    బలపచితివే స్ధిరపరచితివే             యేసయ్యా 
2.    మంచి రాణవు వాని వలెనే 
    జీవన వ్యాపార మందు నా జీవన వ్యాపమందూ 
    చిక్కుబడనివానిగా పోరాడెదను 
    జెట్టివలే పోరాడెదను                 యేసయ్యా 
3.    ఎపుడు నేను బలహీనుడను 
    అపుడే నీ యందు బలవంతుండనూ (2) 
    నా బలహీనతయందే సంపూర్ణమగు 
    నీ కృప చాలూ! నీ కృప చాలు !            యేసయ్యా 
    మేసయ్యా నీ కృప చాలయ్యా 
    చాలయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా             
పాట – 56 
ప||    ఎందుకో దేవా నా యెదా నీ ప్రేమా  
    వింతమైనది నాదా అంతులేనిది 
1.    సారి సారి జారిపోతి – మేలుగానక దూరమైతి 
    చేరనైతి నీ సన్నిధిని – కోరనైతి నీ చెలిమిని 
    మోసపోతిని యేసూ దోషినైతిని 
    తెగపు చేసి తగని నన్ను చేరిదీసినా 
    నీ ప్రేమ వింతమైనదీ నాధా అంతులేనిది          ఎందుకో 
2.    పెదవులలో నే నిన్ను పొగడి – పదవికైనే ప్రాకులాడి 
    గెలువనైతి నీ పరీక్ష నిలుపనైతి నీ ప్రతిష్ట 
    దొంగనైతిని యేసు భంగపోతిని 
    దందనకు నన్నంపలేక మందలించినా నీ ప్రేమ 
    వింతమైనదీ నాధా అంతులేనిది                 ఎందుకో 
పాట – 57 
ప||    పూవుకింత పరిమళమా – ఒకరోజుకింత అందమా 
    వూస్తున్నది ఉదయాన్నే – రాలిపోతున్నది త్వరలోనే 
1.    ఓ చిన్న పూవు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయ్య 
    ఆ పూవు కంటే మరి గొప్పగా – చేసిన నీలో ఆ పరిమళిముందా     ||పూ||
2.    ఒకనాడు యేసు మన పాపములకై – పరిమళాన్ని వెదజల్లేనూ 
    ఆ యేసు మరణం నీ కోసమేనని – ఇకనైనా గమనించావా         ||పూ||
3.    అతి చిన్న ఆయువు – ప్రతి పూవు కలిగి అందరిని ఆకర్షించెను 
    బహుకాలము బ్రతికి బహుజనులను పలిచి సువార్తను వెదజల్లవా     ||పూ||    పాట – 58
ప||    స్తుతి యించెద నేనామం దేవా అనుదినం 
1.    దయతో కాపాడినావు – కృపనే చూపించినావు 
    నిను నే మరువ నేసు – నినునే ఇడువనేసు         ||స్తుతి||
2.    పాపినై యుండగనేసు – రక్షించి దరిచేర్చినావు 
    నినునే మరువ నేసు – నినునే విడువనేసు        ||స్తుతి||
3.    సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం 
    నినునే మరువనేసు – నినువే విడువనేసు            ||స్తుతి||
పాట – 59 
ప||    అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో 
    పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి 
అ.ప.పాడెదన్‌ నాదు ప్రియుని జీవికాలమెల్ల 
    అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను 
1.    నింద దూషణ ఇరుకులలో – నను సుగంధముగ 
    మార్చెన్‌ నీ కృపలో నన్ను నడిపి నూతన     జీవమిచ్చితివే     ||పాడెదా|| 
2.    నా కష్ట తరంగములలో – దుఖ సాగరములో యుండగా 
    నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే         ||పాడెదా|| 
3.    ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు     
    నీ స్వరము నాకతి మధురం – నీ ముఖము మనోహరము     ||పాడెదా|| 
4.    నీ చిత్తము చేయుటకు – నన్ను నీకు సమర్పించెదన్‌ 
    నా పరుగును తుదముట్టించి – నీ సన్నిధిలో నుండెదన్‌     ||పాడెదా|| 
పాట – 60 
ప||    ఆ… ఆ…. ఆ…. ఆ….         ..2.. 
    దేవాది దేవుడు మహోపకారుడు 
    మహత్యముగల – మహారాజు 
    ప్రబువుల ప్రభువు – రాజుల రాజు
    ఆయన కృప నిరంతరముండును         ||దేవాది||
1.    సునాదవత్సరము – ఉత్సాహసునాదము 
    నూతన సహస్రాబ్ది – నూతన శాతాబ్దము 
    ఉత్తమదేవుని దానములు         ..2..        ఆ..ఆ..
2.    యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు 
    జగమంత ఏలుచున్న – జీవాదిపతి నీవే 
    నీది క్రియలు ఘనమైనవి                 ..ఆ.. దేవాది 
3.    అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు 
    మహిమ మహత్యములు – సర్వాది పత్యమును 
    సదానీకె కలుగును గాక                 … దేవాది.. 
పాట – 61 
ప||    నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకు 
    శ్రీ యేసునామం – నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా 
    ఓ నేస్తమా తెలియునా – ప్రభుయేసు నిన్ను ప్రేమించేను 
    నా నేస్తమా తెలిసికో – ప్రభుయేసునికై మరణించేను 
1.    బలమైన పెనుగాలి వీచి – అలలెంతో పైపైకి లేచి 
    విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా, 
    వలదు భయము – నాకేల కలడు మేసే నీతోడు 
    యేసు మరణించి మరిలిచెను – నిను ప్రేమించి దరిజెర్చును  ||నీ జీవితం||
2.    గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో 
    నడయాడె నీ జీవిత త్రోవ – సుడివడి నీ అడుగులు తడబడెగా     
    ”వలదు భయము 
3.    కనలేని గమ్యంబు కోరి – ఎనలేని కష్టాలపాలై 
    మనలేని నీ జీవిత గాధ – కలలన్ని కన్నిటి వ్యధలే 
    వలదు భయము 
పాట – 62 
ప||    నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున్‌ 
    నీదు పాదములచెంత – నేనేర్చుకొందును, 
    మాదిరి నీవే – నెమ్మది నీవే – దీనుడవు యేసయ్యా 
1.    పాపాంథకారం లో నుండి – రక్షించి వెలిగించితివి     
    పరిశుద్ధమైన పిలుపుతో – నీవెంబడి రమ్మంటివి 
2.    లోకాశలన్ని నీ కోసం      – నేనింక ఆశించను 
    లోపంబులేని ప్రేమతో – నీ కోసం జీవింతును 
3.    పవిత్రపరచుకొందును – అర్పించు కొందును 
    కష్టాలు శ్రమలు రేగినా – నిను వీడిపోనయ్యా
4.    ప్రేమ సువార్త ప్రకటింప – భారంబు మోపితివి 
    సత్యమార్గంబు చాటగ – పంపుము నా ప్రభువా 
పాట – 63 
ప||    నాము లియోరే నాము లీయోరే 
    ఈనుకి ంగళుకరు నాములీయరే 
1.    పాపు హరేగా! తాపు హలేగా                 ..2..
    పావన్‌ బావన్‌ సుందర్‌ 
    మేరా! ఈశుకా నామ్‌                     ..2..
2.    శక్తి హో దేగా – శాంతి హో దేగా 
    పావన్‌ భావన్‌ సుందర్‌ మేరా – ఈశుకా నామ్‌ 
పాట – 64 
ప||    రక్షకుడు రమ్మంటున్నాడు 
    రండయ్య రండి రండి పోదాము 
    రండయ్య రండి రండి పోదాము 
1.    పాడైనా జీవితాలు – పదిలపరచుకుందాము 
    పరమాత్ముని రాకడకు – ప్రార్ధనలు చేద్దాము  
    దుర్ధినములు రాకముందె – ధరణి విడచి పోకముందె 
2.    ముదురాకు రాలెనని – చిగురాకు నవ్వేనట 
    చిరకాల ముందునని – ధ్యానము సమకూర్చెనట 
    ఈ రాత్రి తన ప్రాణము – పోవు సంగతి మరచెనట 
3.    మొహమాట పడకండి – ముందడుగు వేయండి 
    వెనుదిరిగి చూడకండి – ఎవరు మీతో రారండి 
    పాపములను వదలండి – ప్రభు సన్నిధి చేరండి 
పాట – 65
ప||    క్రొత్తపాట పాడనురారే – క్రొత్తరూపు 
    పొందరారే హల్లెలూయ ..2.. పాట పాడేదం 
    ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం 
1.    శృంగనాదం చేయండి హల్లెలూయ 
    హోసిన్నాయనీ పాడండి హల్లెలూయ 
    ఉల్లసించి పాడరే హల్లెలూయ 
    ఎల్లరూ జై కొట్టరే హల్లెలూయ 
2.    అడుగడుగో మన యేసు రాజు యేసుంలోన 
    రానైయున్నాడు కొంచెం కాలంలోని 
    జేజేలు పాడుచు ఎదురెళదాం 
    ధూతాళి వలె నింగి కెగిరెళదాం 
3.    కొంత కాలమే క్రైస్తవుడా యీ కన్నీరు 
    అంతలో వర్షించునోయి పన్నీరు 
    ప్రతి భాష్పబిందువు తుడిచునులే 
    ప్రతి నోరు హల్లెలూయ పాడునులే 
పాట – 66 
ప||    నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు 
    నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు 
1.    తాగుబోతు వైనోడ – తగాదాలు పడినోడ 
    అటు ఇటు తిరిగినోడ – అల్లరిపాలైనోడ 
    చీట్ల పేకలాడి నీవు చెల్లకుండ పోయినోడ         ||నిన్నే||
2.    ఇంటర్‌మీడియట్‌ తప్పినోడ – ఎటుగాక పోయినొడ 
    10వ క్లాసు పోయినోడ చదువారక తిరిగినోడ 
    బి.ఏ. నీవు చదివేవ – బతకలేకపోయావ         ||నిన్నే||
3.    పార్టీతో తిరిగినోడ పనికిరాకపోయినోడ 
    ఉద్యోగం ఊడినోడ ఎలక్షన్‌లో ఓడినోడ     
    అప్పుల పాలయ్యావ తిప్పలు పడుచున్నావ         ||నిన్నే||
4.    డబ్బులెక్కువైనోడ – నిదరపట్టకున్నవాడ 
    వడ్డీలకు తిప్పేటోడ – వర్రీలో పడ్డవాడ 
    కులము కులము అన్నావ కూడలేక చచ్చావ         ||నిన్నే||
పాట – 67 
ప||    స్తుతినే పాడెద యెసయ్యా 
    దుర్గమా – శైలమా – శృంగమా – నా సర్వమో     
1.     నా రాగానికి – జీవము నీవే 
    నా గానానికి ప్రాణము నీవే 
    నా ధ్యానానికి రూపము నీవే 
    యేసయ్యా యేసయ్య 
2.    నా గమనానికి – దావరము నీవే 
    నా పయనానికి తీరము నీవే 
    నా మార్గానికి – దీపము నీవే 
    యేసయ్యా యేసయ్యా 
3.    నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్ధనకు అర్ధము నీవే 
    నా స్తోత్రానికి పాత్రుడ నీవే యేసయ్యా             ||స్తుతి|| 
పాట – 68
ప||    సరిరారు నీకిల ఎవరు 
    సరిరారు నా యేసూ 
    శరణం శరణం యేసే శరణం 
    శరణం శరణం సిలువే శరణం 
1.    మహాఘనుడా మహియోన్నతమైనా స్ధలములలోనే నివసించువాడా 
    వినయము గలవారు, నలిగిన నరులు దీనులు 
    చెంత నివసించి బలపరచు లేడా             ||శరణం|| 
2.    నా దోషములే, నీకును నాకును అడ్డముగా నిలుచుండెనయ్యా 
    విననేరకుండుటకు మందము కాలేదు నీ చవులు 
    నన్ను మన్నంచి, నా మని వినవా             ||శరణం||
3.    నా పాపములే నీ ముఖమును నాకు కనబడకుండా కప్పెనయ్యా
    రక్షించ నేరకయుండుటకెన్నయ నీ చేతులు     
    కురుచ కాలేదు కరుణా కిరీటి                 ||శరణం||
పాట – 69
ప||    ఇదే నీకు అనుకూలసమయము 
    ఇదిగో ఇదే రక్షణ దినము 
    ఈ దినమే నీకు రక్షణ దినము 
    ఈ క్షణమే నీకు అనుకూల సమయము 
అ.ప    రారే రారే అన్నల్లారా – రారే తమ్ముల్లారా 
    రారే రారే అక్కల్లారా – రారే చెల్లెలారా             ||ఇదిగో|| 
1)    భూదిగంతములానివాసులారా – నావైపే చూసి రక్షణ పొందండి 
    మార్గమూ నేనే – సత్యము నేనే 
    జీవము నేనే అని పిలిచే ఆ యేసుని 
    చేరుకో కోరుకో వేడుకో రక్షణ పొందుకో             ||రారే రారే|| 
2)    ద్వీపములారా నా మాట వినుడి – జనములారా 
    ఇదిగో ఆలకించరండి 
    దీనురును నేనే సాత్వీకుడను నేనే 
    ఆశ్రయమూ నేనే అని పిలిచే ఆయేసుని 
    చేరుకో, కోరుకో, నమ్ముకో నెమ్మది పొందుకో         ||రారే|| 
3.    దారి తప్పి తిరిగిన తమ్ములారా 
    శాంతి మారమెరుగని అన్నలారా 
    మార్గమూ నేనే ద్వారము నేనే 
    తీరము నేనే అని పిలిచే ఆ యేసుని 
    చేరుకో కోరుకో మేలుకో మనస్సు మార్చుకో         ||రారే|| 
4.    లోక పాపము మోసిన గొర్రెప్లిల 
    కలువరిలో యాగమైన గొర్రెప్లి 
    దోషిని నేనే పాపిని నేనే 
    నేరము నాదే భారము నీదే  అని 
    చెప్పుకో ఒప్పుకో తక్షణమే రక్షణ పొందుకో         ||రారే|| 
పాట – 70
ప||    యేసుని నామం ఎంతో మధురం తియ్యగా పాడండీ 
    యేసుని నమ్మిన జీవితమే ఇల ధన్యమనీ చాటండీ 
    యేసే మన గానం – యేసే మన జీవం 
    యేసే మన ధ్యానం – యేసే దైవం 
1.    సత్యము నీవె జీవము నీవె – మము నడిపించే మార్గము నీవే 
    పాపుల బ్రోచే పెన్నిధి నీవే 
2.    కరుణవు నీవే – శాంతివి నీవే – ఇలలో మేపే నిలచే దైవము నీవే 
    ఆరని జ్యోతివి నీవే దేవా                 ||యేసే||
పాట – 71
ప||    యెహోవా నిన్ను పోలియున్నవారెవ్వరు 
    యేసువా నీకు సాటియైన వారెవ్వరు 
1.    సృష్టికి ఆదారుడా అద్వితీయుడా 
    నిత్యము నివసించుచున్న సత్యదేవుడా 
    అందరిలో సుందరుడా కాంక్షనీయుడా 
    వందనముల కర్హుడా పూజ్యనీయుడా             ||యెహోవా||
2.    పాపికొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా 
    లోకపాపమును మోసిన దైవ తనయుడా 
    మరణపు కోరలు పీకిన విజయ 
    వీరుడా, శరణ్ననచోకరుణచూపు పరందాముడా         ||యెహోవా||
పాట – 72
ప||    ప్రియుడ నీ ప్రేమ పాదముల్‌ చేరితే 
    నెమ్మది నెమ్మదియే 
    ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనంద     
    మానందమే 
    ఆశ్చర్యమే – ఆశ్చర్యమే, ఆరాధణ – ఆరాధన 
1.    నీ శక్తి కార్యముల్‌ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా 
    మంచివాడా – మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా 
    మంచివాడా – మహోన్నతుడా – ఆరాధనా ఆరాధన 
2.    బలియైనా గొఱ్ఱెగా పాపములంన్నింటిని మోసీ తీసితివే 
    పరిశుద్ధ రక్తము – నా కొరకేనయ్యా నా కెంతో భాగ్యమయ్యా 
    పరిశుద్దుడా – పరమాత్ముడా ఆరాధనా – ఆరాధనా 
3.    ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా 
    రక్తము చింది సాక్షిగా ఉందున్‌ నిశ్చయం నిశ్చయమే 
    రక్షకుడా – యేసునాధా – ఆరాధనా – ఆరాధనా 
పాట – 73
ప||    కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా 
    యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ 
    ప్రేమను నేర్పేది ఆ ప్రేమ 
1.    దివినే విడచి భువకేతెంచి – కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ 
    కల్వరిలోన రక్తము కార్చి రక్షణ యిచ్చిరి నా క్రీస్తు ప్రేమ 
2.    ఒక తల్లి కడుపులో పుట్టిన వారే ఒకరిని ఒకరు ప్రేమించలేరు 
    ప్రేమించామని చెప్పిన వారు కడవరకు కొనసాగించ      

No comments:

Post a Comment