Saturday, April 11, 2015

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం

    ''ఆరోగ్యమే మహా భాగ్యం'' ఇది కేవలం సూక్తి మాత్రమే కాదు. ఆచరణీయమైనది మరియు ఆచరించవలసినది. ఆరోగ్యం అనగానే అనారోగ్యం గురించి ఆలోచిస్తాం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోలేనపుడు అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం మన లోపాన్ని మన దృష్టికి తీసుకొచ్చే చర్య. విశ్వాత్మ బృహత్‌ పథకంలో భాగంగా 50 లక్షల సంవత్సరాలుగా ఈ భూమిపై మనుగడను సాగిస్తున్నారు. విశ్వాత&మ ప్రకృతి పరంగా అన్ని జీవరాసులకు స్వయం పోషక యక్తులను జన్యుపరంగా సంక్రమింప జేస్తుంది. 
''స్వయం నిర్ణయ శక్తి'' :
    ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వనరులను అంతర్గతంగా ఏర్పాటు చేసే జీన్‌ లు అనబడే 'బుద్ధికణా'లకు అప్పజెప్పింది. అందవల్లే జీవన ప్రక్రియ ఏకకణ జీవి థనుండి మానవుల స్ధాయివరకు గత 350 కోట్ల సంవత్సరాలుగా నిర్విరామంగా నిరాటంగా కొనసాగుతుంది. జీన్‌ల వ్యవస్థకు సహజ జ్ఞానం ఉంది. అందువల్లనే సృష్టిలో మిగతా జీవరాసులు వాటి సహజ జ్ఞానాన్ని ఉపయోగించి సహజజీవనాన్ని సాగిస్తూ క్రియలు జరుపుతున్నాయి. 
    అందువలనె వలస పకక్షులు వేల కిలోమీటర్ల దూరాన్ని లెక్కలోకి తీసుకొకుండా సహజ జ్ఞానంతో ఆయా ప్రదేశాలకు చేరుకుని వంశాభివృద్ధిని చేసుకోగలగుతున్నాయి. అన్ని జీవరాసులు వాటి ఆరోగ్యాన్ని సహజ జ్ఞానంతో పరిరక్షించుకుంటా తమ సంతతిని పెంచుకోగలుగుతున్నాయి. ప్రకృతి  లో మానవులకు ''జీన్‌'' ల తెలివి తేటలతో పాటు ఇంకొక వసతిని కలుగ జేసింది. అదే ''స్వయం నిర్ణయ శక్తి''. అందు వలనే మానవుడు తన మానవ శక్తితో పాటు యాంత్రిక శక్తిని ఉపయోగించుకొనే అవకాశం కలిగింది. ఇట్టి అవకాశం మిగిలిన జీవరాశులకు లేదు. అట్లాగే కంటి చూపులకు అనుబంధముగా మైక్రోస్కోపును, టెలిస్కోపును కనిపెట్టి అనేక అద్భుతాలను కొనుగొనగలుగుతున్నాం. మానవుడు పక్షిలాగా ఎగరడానికి, చేపలాగా నీటిలో ఈదడానికి సావకాశం స్వయం నిర్ణయ శక్తి ద్వారా లభించింది. 
    స్వయం నిర్ణయ శక్తి అనేక వసతులను అందుబాటులో తీసుకురాగలిగినప్పటికీ వ్యక్తిత్వ లోపాల వల్ల అనేకులు కష్టనష్టాలకు లోనై సుఖశాంతులకు దూరమవుతున్నారు. అట్టివారు అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. అనగా స్వయం నిర్ణయశక్తిని సరిగ్గా ఉపయోగించుకోని వారు తమకు తామే హానిని కలుగచేసుకుంటున్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను సంపూర్ణంగాను, సమర్ధంగాను వినియోగించినపుడు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ కృషికి మనకు మనమే తోడ్పడాలి. 
సంపూర్ణ ఆరోగ్యం : 
    ''సంపూర్ణ ఆరోగ్యం'' అన్నది ఇటీవలి కాలంలో ఆవిర్భవించి, సత్వరం పురోగమిస్తున్న వైద్య విధానం. 1970 లో ప్రత్యేకంగా దీని నిమిత్తం అంతర్జాతీయ సంస్ధ ఒకటి వెలసింది. నేడు వైద్య శాస్త్రంలో సంపూర్ణ ఆరోగ్యం అన్నది ప్రత్యేక శాఖగా భాసిల్లుతున్నది. దేహ రోగ్యం చెడినప్పుడు, వ్యాధులు సంక్రమించినప్పుడు మనిషి దేహానికి మాత్రం చికిత్స చేయడం సరిపోదు. అతడి మనస్సు, ఉద్వేగాలు, అలవాట్లు, అతడి జీవన స్థితి మొదలైన అతడి వ్యక్తిఆ్వన్ని బాధించే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నొక్కి వక్కాణిస్తున్నది. ''సంపూర్ణ ఆరోగ్యం'' చక్కని వ్యాయం, తగినంద నిద్ర, మంచి గాలి, మంచి అలవాట్లు వంటి వాటిని చేబట్టడం ద్వారా అనేక రుగ్మతలను మనంతట మనమే నయం చేసుకోవచ్చు.  
    రుగ్మతలకు చికిత్స చేస్తూన్నప్పుడు శరీరం మాత్రమే కాక మనస్సు, ఉద్వేగాలు, పరిస్థితులు మొదలైన అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని ఉద్ఘాటిస్తుంది ఇది. ప్రత్యేకంగా నేటి పరిస్థితిల్లో మనస్సును పరిగణలోకి తీసుకొని చికిత్స చేయడం ఎంతో ముఖ్యం. ఎలాంటి రుగ్మతా లేకుండా, శారీరక సంబంధమైన ఎలాంటి సమస్యా లేకుండా ఒక వ్యక్తి జీవించడం నేటి ప్రపంచంలో కుదిరే పనికాదు. అట్లె ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు క్షేమంగా ఉన్నాడని చెప్పలేం. ఎందుకంటే ఈనాటి మనిషి సమస్యలలో అత్యధికపాలు మనస్సుకు సంబంధించినవి నిస్సందేహంగా బుజువయ్యాయి. అందుచేత ఒక ఫలానా వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాలంటే శారీరక ఆరోగ్యంతోపాటు మనస్సు అతడికి సానుకూలంగా ఉండాలి. అంటే మనసు సైతం ఆరోగ్యం ఉండాలన్నమాట. చిన్న చిన్న రుగ్మతులను అతిక్రమించి నూతనోత్సాహంతో, అవగాహనతో, ఆనందంతో మనం జీవించాలి. మన యావచ్ఛక్తులకు పూర్తిగా వినియోగింప సమర్ధులమై వుండాలి, వృద్యాపం సైతం యీ విషయంలో మనలను ఒకింతకూడ బాధించనిదిగా అమరి ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతులమని చెప్పుకోవచ్చు. ఇందుకు మనస్సే సహకరించాలి. అందుచేత మనం ఆరోగ్యవంతులంగా ఉండగోరితే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యమని తేటతెల్లమౌతుంది. 
    ప్రపంచం అంతటా పుట్టుకువస్తున్న యోగాబ్యాస నిలయాలు, ధ్యానకేంద్రాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ విధంగా  శరీరమూ, మనస్సూ ఆరోగ్యవంతంగా ఉండూ, జీవితం గురించిన ఒక నూతన వైఖరిని మనం సంతరించుకొనే స్థితినే సంపూర్ణ ఆరోగ్యం అంటాం. 
సమగ్ర జీవితం : 
శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ కలసి కట్టుగా పనిచేయాలి. అంట్లే దీన్లో మనపూర్తి వ్యక్తితం చోటుచేసుకోవాలన్నమాట. పరిపూర్ణ జీవితమన్నది కొత్త సంగతి కాదు. మన వేదకాలం నాటి బుషులు చూపించిన భారతదేశ లక్ష్యం ఇదే యావత్ప్రపంచంలో ఒకే ఒక్కవ్యక్తి పనిచేయడం వాళ్ళు దర్శించారు. దాని ప్రాణశక్తిగా పేర్కోన్నారు. ఈ ప్రాణశక్తిని 'సత్యం' గాను, భగవంతుని 'సత్యానికి సత్యం'. 
శరీరం - మనస్సుల సంబంధం : 
    అనేక వ్యాధులకు మనసే కారణమని నేడు వైజ్ఞానికంగా ఋజువైంది. కాని మనస్సుకూ శరీరానికీ ఏ విధంగా సంబంధం ఉన్నదో ఇప్పటి వరకూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అయినప్పటికీ హేన్స్‌ సెల్యీ అనే కెనడా దేశ వైద్యుడు 'జీవితపు ఒత్తిడి' అనే తన పుస్తకంలో  అత్యధికమైన రక్తపోటు, కడుపు పుండు వంటి వ్యాధులకు మానసిక ఉద్రిక్తతే హేతువని సూచించినాడు. 
    మానసిక ఉద్రిక్తత ఏర్పడగానే అది పెద్ద మెదడు విభాగంపై దాడిచేస్తుంది. ఈ విభాగమే అనిచ్ఛా నాడీ మండలాన్ని నియంత్రిస్తుంది. ఈ విభాగం దాడికి గురి కాగానే పిట్యూటరీ వంటి పలు గ్రంథులు స్రవిస్తాయి. ఇలాంటి అనే మార్పుల పరిమాణంగా రక్తంలో చెక్కర పరిమాణం అధికరించడం, రక్తపోటు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. 
    దీనినుండి మన కొకటి అర్ధమౌతుంది. మానసిక ఉద్రిక్తత అనుచిత ఉద్వేగాల వలన ఏర్పడుతుంది. అనుచిత ఉద్వేగాల వలన మానసిక ఉద్రిక్తత కలుగుతుందంటే, సముచిత ఉద్వేగాల వలన మనస్సుకు మేలు జరుగుతుందనే కదా అర్ధం! అందుచేత మానసిక ఉద్రిక్తత వంటివి మాత్రమే కాక, దేహంలో ఏ రుగ్మతయైనా, రుగ్మత గురించిన సరైనా అవగాహన, దానిని నయంచేయడానికి అనువైన భావాలను మనస్సులో నింపడం రుగ్మతను తగ్గుముఖం పట్టించడంలో ఎంతో దోహదం చేస్తాయి. దీని కూడ డాక్టర్‌ సెల్యీ పరిశోధనలు ధృవీకరించాడు. 
మనుష్యులలో రెండు కోవలు : 
    మొదటి కోవకు చెందిన వారు పుట్టింది లగాయతు ఉన్నత జీవితాన్ని ఆకాంక్షిస్తారు. దేహోరోగ్యం గురించి వారు అసలు పట్టించుకోరు. ఉన్నతమైన జీవితం గడపాలనే ప్రగాఢ అకాంక్ష వారిలో ఉంటుంది. అందుచేత దేహ రోగ్యం పాడవుతుందనే బీతి చెందక అచంచల విశ్వాసంతో, ధృఢ సంకల్పంతో పోరాడి ముందంజ వేస్తారు. మధ్య వయస్సు దాటాక మునుపే ఆ ఉన్నపతిస్థితిని పొందుతారు. దేహ రుగ&మతలూ, మానసిక సమస్యలూ వారికి ఆటంకాలు కావు. లోకంలోని యావన్నతాలలోని భగవదనుభూతి పొందిన మహాత్ములు యీ కోవకు చెందుతారు. కాని వీరు అత్యల్ప సంఖ్యాకులే. 
    రెండవ కోవకు అత్యధిక సంఖ్యాకులు చెందుతారు. దీర్ఘకాలిక పోరాటాలను, వాటి పర్యవసానంగా ఏర్పడే శారీరక మానసిక సమస్యలను భరించే సంకల్పశక్తి వీరిలో మృగ్యం. ఈ సాధారణ జీవితం చాలదు, ఉన్నత జీవితం గడపాలి అన్న ఓ సామాన్య భావన వీరిలో ఉంటుంది. కాని అలాంటి జీవితాన్ని తమ లక్ష్యంగా చేసుకోవడం వీరితరం కాదు. వీరి విషయంలో సామాన్యమైన ఒక జీవిత ప్రణాళిక ఉండాలి. ఉన్నత పారమార్ధిక లక్ష్యంగా దేహ్యరోగ్యానికీ, ఇతర లౌకిక విషయాలకూ దాన్లో తగినచోటు కల్పింపబడాలి. 
    శారీరక-మానసిక చేరిక మనిషి మనిషికీ విభిన్నంగా ఉంటుంది. కొందరికి మనస్సులో ఏం జరిగినా అది పెద్దగా బాధించని మేరకు శరీరం దార్ద్యవంతమై వుంటుంది. మనోవేదనలు, ప్రగాఢ భావోద్వేగాలు ఇట్టే దాన్ని బాధిస్తాయి. బుద్ధిజీవులు, పారమార్ధిక సాధకులలో పలువులు ఈ రెండవ కోవకు చెందినవారుగా ఉంటారు. దేన్ని కఠోరంగా చేసినా దేహారోగ్యం పాడయ్యెది వీరికే. 'దేహరోగ్యాన్ని పాడుచేసుకోకుండా ఇంద్రియాతీతులం కావడం ఎలా అన్నదే మనం నేర్చుకోవలసింది' అన్నారు స్వామి వివేకానంద.

సంపూర్ణ ఆరోగ్యం కొరకు పది అంశాలు చర్చిద్దాం.   

1. శరీరాన్ని ప్రేమించాలి : 
    మనం ఈ ప్రపంచంలో దేన్ని సాధింపగోరినా, అందుకు ప్రధానమైన పరికరము దేహం, అందుచేత దాన్ని మనం పరిపోషించి, పరిరక్షించాలి. అంటే, దేహాన్ని మనం అభిమానించా లన్నమాట. ఒక వ్యక్తి ఎక్కువగా అభిమానించేది తన దేహాన్నే అయినప్పుడు దీన్లో కొత్తగా అభిమానించడానికి ఏముందని చెప్పాలనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. మనం దేహాన్ని అభిమానించడం లేదు. కాస్త యోచించి చూడండి. 
    నాలుక చుర్రుమంటున్నా, కళ్ళనుండి నీళ్ళు స్రవిస్తూన్నా కారం తింటాం. కళ్ళలో నీళ్ళు స్రవిస్తూన్నాయంటే శరీరం బాధను అనుభవిస్తున్నదనే కదా అర్ధం. దేహాన్ని ప్రేమించేవాడు చేసే పనా ఇది? అమిత పులుపు తీపి, ఉప్పు పదార్ధలను తిని కడుపును ఇతర ప్రధాన అవయవాలను పాడుచేసుకోవడం శరీరాన్ని ప్రేమించడం అవుతుందా? మాదక ద్రవ్యాలను, మత్తు పానీయాలను సేవిస్తూ, ఆ దురభ్యాసాలకు బానిస అయిన వ్యక్తి దేహం ఏలా విల విల్లాడిపోతుంది! ఇది దేహాభిమాని చేసే పనేనా? 
    దీన్ని బట్టి చూస్తే నిజానికి మనం దేహాన్ని అభిమానించడం లేదని తేెలుతోంది. మనం దేహాన్ని అభిమానిస్తే ఖచ్చితంగా మన జీవితానికి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం దేహాన్ని అభిమానిద్దాం. 

దేహానికంటూ ఒక ప్రత్యేక జీవితం ఉంది : మానవ శరీరంలోని ప్రతి కణానికి (సెల్‌) జీవం ఉంది, మన దేహంలోని ప్రతి కణమూ మనలాంటి మరొకరిని ఉత్పన్నంచేసే సమర్ధతను కలిగి ఉందని నేటి విజ్ఞానం చెప్పుతుంది.  ఆనాడే బుషులు మనషిలో ఐదు భాగాలున్నాయి అని చెప్పినారు. ఈ ఐదు కలిసిందే మనిషి అని వారి భావన. 
1) అన్నమయకోశం ఆత్మ - శరీరం,     2) ప్రాణమయకోశ ఆత్మ - ప్రాణం లేక జీవం 
2) మనోమయ కోశ ఆత్మ - మనస్సు,     4) విజ్ఞానమయకోశ ఆత్మ - బుద్ధి 
5) ఆనందమయకోశ ఆత్మ - ఆత్మ. 
    ఇక్కడ మన బుషులు శరీరాన్ని సైతం ఒక ఆత్మగా పరిగణించడం గమనించాలి. శరీరానికి కంటూ ఒక ప్రత్యేక జీవితం ఉంది. దానిని బుషులు గమనించారు. మనం గ్రహించినపుడు దానిని సులువుగా ఉపయోగించవచ్చు. జీవితాన్ని  సానుకూలముగా ఒక పరికరంగా సులభంగా వినియోగించవచ్చు. 
  
దేహమే ఒక దేవాలయం : మానవ దేహాన్ని నమూనాగా తీసుకునే మన దేవాలయాలు సైతం నిర్మింపబడ్డాయి. దేహం దేవాలయం అయితే లోపల దెవుడెవరు? మనమే. ఈ 'మనం' అనేదాన్ని మరింత చక్కగా అవగతం చేసుకోవాలి. 'మనం' అని చెబుతున్నప్పుడు దేన్ని సూచిస్తున్నాం? కాస్త యోచించి చూస్తే మనలో ఇద్దరు వ్యక్తులు ఉండడం గ్రహించగలం. ఒకడు సజ్జనుడుగా, మరోకడు దుర్జనుడుగా కనిపిస్తాడు. ఒకడు మంచి, మరొకడు చెడు అలా చేశాక దాన్ని సమర్ధిస్తూ మనలను సతతం చెడుదారిలో పంప ప్రయత్నిస్తూ వుంటాడు. దీనినే భగద్గీత మనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని తెల్పింది. ఈ ఇద్దరి మధ్య సమరస్యం లోపించినపుడే సమస్య తలెత్తుతుంది. కనుక దుర్జనుడిగా కానవచ్చే మనలోని విభాగాన్ని పరిశుద్దపరచి, మంచి విభాగంతో జతపరచాలి. పూజ, జపం, ధ్యానం, శాస్త్రాల అధ్యయణం చేయడం, బోధించడం, పెద్దల బాటలో జీవించడం,  ఇతరులకు సేవచేయడం, ఇతర ప్రాణులకు మంచి చేయడం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్టిండం. వీటిని స్మరించడం ద్వారా మన దేహం దివ్యత్వం సంతరించుకొంటుంది.
మన శరీరానికంటూ రెండు శక్తులున్నాయి : ఈ శక్తులను వినియోగించుకోవాలి. 
1) నవీన శక్తి : ప్రతి ఏటా మనం దేహయం యావత్తు ఒకసారి నవీకరణ చెందుతుంది. అంటే సంవత్సరానికొకసారి మనం ఒక నూతన దేహాన్ని పొందుతాం. పాత కణాలు నశించి వాట స్ధానంలో కొత్త కణాలు వస్తాయి. ఎముకలలో గాయం ఏర్పడితే అవి మళ్ళీ పెరగడం మనకు తెలిసిన విషయమే అంటే మన దేహం నవీకరణ చెందుతుంది. మనం సంకల్పిస్తే మన శరీరాన్ని నవీకరించుకోవచ్చు. మన మౌలిక స్వభావాలను, జీవిత విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన దేహాన్ని మనం సంతరించుకోవచ్చు. 
2) వ్యాధినిరోధక శక్తి : మన శరీరమూ, దాని వివిధ శక్తులు ఏ రకంగా పనిచేస్తాయో, లోపల ఏఏ రసాయనిక మార్పులు జరుగుతాయో గ్రహించిన వ్యక్తికి జీవితపు ప్రతి క్షణమూ ఒక అద్భుతమే. ఆ అద్భుత్శక్తులలో ఒకటే వ్యాధినిరోధక శక్తి. మానవదేహంలోని వ్యాధి నిరోధక శక్తి ప్రపంచపు అద్భుతాలలో ఒకటి. ఈ నిరోధక శక్తి నలుగురు సైనికిలు ఉన్నారు. రెండు - రక్తంలోని రెండు విధాలైన తెల్లకణాలు, రెండు విధాలైన రసాయన పదార్ధాలు, అంటే ప్రోటీనులు. ఒక వ్యాధి మన దేహంలో ప్రవేశిస్తే ఈ నలుగులు సైనికులు అప్రమత్తులవుతారు. ఈ నలుగురు ఆ వ్యాధిక్రిమిని ఎదుర్కొంటారు.     
    ఇటువంటి వ్యాధి నిరోధక శక్తి శరీరానికంటూ ప్రత్యేకంగా ఉండడం చేత చిన్న విషయాలకై మందుమాకులకోసం పరుగెత్తరాదు. కాస్త ఓర్పువహిస్తే అనేక సందర్భాలలో పలు వ్యాధలు వాటంత అవే నయమవడం చూడవచ్చు. ఈ విషయం కాస్త వివేకంతో వ్యవహరించండ అవశ్యకమై ఉంది.      
    బాహ్య పరిశుభ్రతకూడ ఎంతో ఆవశ్యకం స్నానాలదుల వంటి వాటిలో శ్రద్ధ వహించాలి.   అన్నిటికంటే ముఖ్యం మన శరీరారోగ్యానికి మనమే బాధ్యులం అని గ్రహించాలి. వైద్యుని బాధ్యత కాదు. రోగగ్రస్తుడవడానికి రోగియే బాధ్యుడు, దానినుండి బయటపడడానికి అతడే బాధ్యుడు.  
2. శరీరంతో కలసిమెలసి జీవించాలి : 
    శరీరనికంటూ ఒక ప్రత్యేక జీవితం ఉంది, ప్రత్యేక శక్తి ఉంది, అది దివ్యమైనదని తెలుసకొన్నాం. మన ఆరోగ్య జీవితాము సానుకూలంగా వుండాలంటే కలిసిమెలసి జీవించడం మనం నేర్చుకోవాలి. ఇందుకు మనకు రెండు సత్యాలు సహకరిస్తాయి. 
    ఒకటి పురాతన సత్యం. ఆయుర్వేదం 2500 సం|| పూర్వపు చికిత్సాపద్దతి లో వాతం, పిత్తం, కఫం అనే మూడు విషయలు మానవ శరీరంలో మూడు విషయాలు మానవ శరీరంలో పనిచేస్తున్నట్లు ఆయుర్వేద నిపుణలు చెబుతారు. ఇవి ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన లక్షణాలు గలవి. ఇవి మూడు సమతౌల్యంలో ఉన్నంతవరకు మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. సమతౌల్యానికి భంగం వాటిలినప్పుడు వ్యాధిగ్రస్తుడవుతాడు. ప్రతి మానవ దేహంలో ఏదో ఒకటి ఆధిపత్యం చలాయిస్తుంది. దీన్ని అవగతం చేసుకొంటే శరీరానికి తగ్గ ఆహరం ఎంచుకోవడాని, వ్యాధిగ్రస్తమైనప్పుడు తగిన చికిత్స చేయడానికి సులువుగా ఉంటుంది. 
    రెండవది సత్యం. మన శరీరం ఒక ప్రత్యేకమైన గడియారం ప్రకారం పనిచేస్తుందని పాశ్చాత్య విజ్ఞానం తెలుపుతోంది. ఒక రోజును 24 గంటలుగా విభజించి, అందుకు తగ్గట్లుగా మనం మన జీవిత విధానాన్ని మలచుకోవడం తెలసిన సంగతే. కాని మనలోపల గడియారం పనిచేస్తూ ఉంది. అందుకు తగ్గట్లుగా జీవన సరళిని మలచుకొన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం సానుకూలమవుతుంది. 
    ఒక రోజుకు 24 గంటల సమయమని అందరి విషయంలోను చెప్పలేం. ఒక రోజు కొందరికి 25 గంటల సేపు, కొందరికి 36 గంటల సేపు మరి కొందరికి 36 గంటల సేపు మరి కొందరికి 48 గంటల సేపు అయి ఉండవచ్చు. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ముఖ్యమైన పనులు చేస్తున్నపుడు ఈ శరీర గడియారాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని చేస్తే చక్కగా పనిచేయవచ్చు. దీనికి తగట్లు మన జీవితాన్ని రూపొందిచుకోవడం ఆవశ్యకం.    
3. ఆహారానికి కృతజ్ఞత తెలుపాలి 
    మనం దేన్ని తింటున్నాం అన్నదానికంటే దాన్ని ఎలా తింటున్నాం. అన్నదే ప్రధానం. మాంసాహారమైనా ప్రకృత దానికంటూ కొన్ని లక్షణాలను ఇచ్చివుంది. వాటిని ఎరిగి, అది మనకు అవసరమూ అన్న సంగతి విచేచించి, ఆ లక్షణం చెడకుండా దాన్ని భుజించడమే ప్రధానం. 
    శరీరానికి కావలసిన శక్తి ఆహారం నుండే లభిస్తుంది. అందుచేత ఆరోగ్యానికి మొదటి మెట్టు ఆహార నియమం. సమస్త ప్రాణుల అవిర్భావానికి మునుపే ఆహరము ఉద్భవించింది. మన వ్యాధులలో సగపాలు ఆహారనియమం కొరవడిన కారణంగా సంక్రమించే అని రూఢిగా చెప్పవచ్చు. ఆహార నియమం పాటించడం ద్వారా పూరిత& శరీరాన్ని నియంత్రించవచ్చు. నియమం అన్నప్పుడు ఆహార విలువ, పరిమాణం రెంటినీ పరిగణించాలి. మనం ఎంత తింటున్నాం అన్నది కాదు ప్రశ్న. మనం తింటున్న ఆహారంలో ఎంత పాలు మన శరీరానికి అవసరమైన శక్తిగా మారుతున్నది. మన జీవితానికి అవసరమైన మూలాంశం అవుతున్నది అన్నదే చూడాలి. మనం తినే ఆహారం అతిస్వల్ప పరిమాణమే మన పోషణకు ఉపయోగపడుతుంది. తక్కిన భాగమంథా వృధా అవుతుంది. శక్తిని వ్యర్ధం చేస్తుంది. అని ఎన్నో ఎళ్లకు మునుపు సర్‌ విలియమ్‌ ఆస్లర్‌ సూచించి ఉన్నారు. 
1) అన్నం న నింద్యాత్‌ - ఆహారం నిందించకు. ప్రకృతి మనకు ప్రసాదించే ఆహారం అన్ని రకాల పుష్టికరమైనదై ఉంది. దాన్ని అతిగా ఉడకబెట్టడం, నూనె మసాలా వంటి వాటిని మితిమీరి చేర్చడంవంటి కారణాల వలన ఆహారపు సహజత్వం చెడిపోతుంది. ఆహారాన్ని నిందించడం అని దీన్నే అంటారు. 
2) అన్నం న పరిచకక్షుత - ఆహారాన్ని ద్వేషించకు. 
3) అన్నం బహుకుర్వీత - అధికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యి. 
4) న  కంచన వసతౌ ప్రత్యాచక్షీత: అతిథులు ఆహారం స్వీకరించకుండా వెళ్ళిపోయేలా మెలగవద్దు. 
ఆహారం భుజించడాన్ని ఒక పవిత్ర కార్యంగా పరిగణించాలి. హైందవ కుటుంబంలో ఆహారం ముందుగా భగవంతునికి అర్పించి, తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ విధివిహితాలను విశ్వసించకపోయినా, ప్రశాంతంగా అనుభూతి పూర్వకంగా భూజించడం ద్వారా తినడాన్ని ఒక కళగా చేయవచ్చు. ఆహారానికి కృతజ్ఞత తెలుపు అంటున్నారు - స్వామి వివేకానంద. 
4. గాఢంగా నిద్రించాలి :  
    నిద్రలో రెండు రకాలు ఉన్నాయి. 1) కలత నిద్ర (స్వప్న స్ధితి), 2) కళ్లు మూసిన నిద్ర (గాఢ నిద్ర). ఈ ఆవిష్కరణలు నిద్ర స్వభావం, జీవితంలో నిద్రకున్న స్ధానం వంటి క్రొత్త పరిమాణాలను వెల్లడించాయి. 
    వయస్సులో ఉన్న వ్యక్తికి ఆరు గంటలసేపు నిద్ర చాలు మనం సామాన్యంగా నిద్ర అని పేర్కొనే ఆ వేళలో పైన చెప్పిన రెండు స్ధితులలో మారిమారి సంచరిస్తాం. కళ్ళుమూసిన నిద్రస్థితిలో మన శరీరం, మనస్సు రెండు విశ్రాంతి పొందుతాయి. కలత నిద్రలో మనస్సు విశ్రాంతి పొందకుండడమే కాక, ఆ వేళలో మెదడు తీవ్రమైన కార్యకలాపంలో పాల్గొంటుంది. అది నానారకాల ఉద్వేగాలకు, కాంక్షలకు కాలువగా మారుతుందంటారు. విజ్ఞానులు. ఈ ఒక్క కాలువ లేకుంటే అనేకులు పిచ్చి స్థితిలోకి త్రోయబడి ఉండే వారు. మనస్సు ఈ స్థితిలో, అంటే కలద నిద్రలో ఉన్నప్పుడు మనం మేల్కోవడం జరిగితే నిద్రను ఒక విశ్రాంతిగా బావించలేం. అంటే నిద్ర లేచిన పిదప కూడ నిద్ర కలద ఉంటూనే ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నామన్న భావన ఉండదు. పై రెండు నిద్రలు, ఏ విరామంలో మనం వీటిలో సంచరిస్తున్నామనీ సృష్టంగా తెలుసుకోవాలి.  
    మంచి పుస్తకాలు చదవడం, ప్రశాంతమైన పాటలను వినడం, లేకుంటే మంద్రస్వరంళో పాడడం, ధ్యానం చేయడం వంటి అభ్యాసాలు తప్పనిసరి. వీటి మూలంగా మనస్సు ఒక ప్రశాంత స్ధితిని సంతరించుకొన్నాక నిద్రించాలి. 
5. శరీరానికి తగిన వ్యాయామం అవసరం : 
    శరీరపు వ్యాదినిరోధక శక్తి పెంపొందడానికి వ్యాయామం దోహదం చేస్తుంది. మనస్సు కార్యకలాపాలలో వ్యాయామం అధికపాలు వహిస్తుంది. మానసికంగా కుంగిపోవడం, మానసిక ఉద్రిక్తత వంటి అనేక మానసిక సమస్యలు శారీరక వ్యాయం మారు ఔషధంగా పనిచేస్తుందని  నేటి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అత్యధిక శక్తి వ్యాయామం మూలంగా బహిర్గమతమవుతుందని. ఇది పావన జీవితానికి, మెదడును చల్లబరడానికి దోహదం చేస్తుంది. సామాన్య ఆహారం, విశ్రాంతి ఉన్నవారికి సాధారణమైన శరీర వ్యాయామం సరిపోతుంది. ఈ వ్యాయామం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. 
6. సముచిత విశ్రాంతి అవసరం : 
సామాన్య జవితంలో నిద్రే తగినంత విశ్రాంతిని ఇస్తుంది. దానికంటూ ప్రత్యేకంగా విశ్రాంతి అవసరం లేదు. కాని నేటి జీవితం నిద్రతో మాత్రం సరిపెట్టుకోగలిగిందిగా లేదు. అందుచేత మానసిక ఒత్తిడితో నిద్రకుపక్రమిస్తాం, పూర్తి విశ్రాంతి నివ్వని కలత నిద్రలో పొర్లాడుతాం, మళ్ళీ అదే మానసిక ఒత్తిడితో మేల్కొంటాం. ఇట్లా జరుగుతూవుంటే శారీరక - మానసిక సంబంధిత అనేక వ్యాధులను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అందుచేత విశ్రాంతి అన్నది ఎంతో ఆవశ్యకమైనది. జీవితంలో మానసిక ఒత్తిడీ ఏదీ లేకుండా సరమైన జీవితం గడిపే వ్యక్తి దేన్నీ సాధించలేడు. జీవితంలో ఏదో ఒకటి సాధించగోరే వ్యక్తి మానసిక ఒత్తిడి వంటి వాటిని ఎదుర్కొనే తీరాలి. అతడు గట్టిగా పనిచేయాలి. ఎన్నో సమస్యలను ఎదుర్కొనాలి. రకరకాల మనుషులతో మెలగవలసివస్తుంది. ఇది తప్పని సరిగా మానసిక వత్తిడని సంక్రమింపజేస్తుంది.మానసిక ఒత్తిడిని తప్పించుకోవడానికి ఎన్నో యోగాభ్యాసాలు ఉన్నాయి. 
1) పడుకొని విశ్రాంతి కాకుండా శరీర కదలికలు, కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. సంకోచించిన కండరాలను సరళీకృతం చేయు వ్యాయామాలు తప్పక అవసరం. యోగాభ్యాసంలో ఆసనాలు ఎంతో సహయం చేస్తాయి ఈ మానసిక వత్తిడిని తగ్గించడానికి. 
2) ప్రతి ఒక్కరికి శరీరంలో కొన్ని భాగాలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. కొందరికి, ఉదరం, గుండె ఇలా ఎన్నో స్ధానాలు. ఆ స్ధానాలకు సంబంధించిన శరీర వ్యాయామాలు చేస్తే అవి ఆ స్ధానాలను చక్కదిద్ది మానసిక ఒత్తిడిని తగ్గింప ఎంతో దోహదం చేస్తాయి. 
3) వీటన్నిటి కంటే చక్కని విశ్రాంతినిచ్చేది శ్వాస అభ్యాసం. శ్వాస అభ్యాసం అంటే శ్వాస గాఢంగా పీల్చడం, ఎంతవరకు శ్వాసను లోపలికి పీల్చగలమో అంత లోపలికి పీల్చాలి. పిదప శ్వాసను లోపలే నిలుపుకోక మెల్లగా బయటకు వదలాలి. ఇది మనస్సుకు శరీరానికి ఎంతో విశ్రాంతి నిస్తుంది. ప్రయాణం చేస్తున్నపుడు, ఆఫీసులలో పనిచేస్తున్నపుడు, ఇతరులతో మాట్లాడుతున్నపుడు ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని చేయవచ్చు. 
    మానసిక ఒత్తిడి కారణంగా సంక్రమిస్తే తలనొప్పి, కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటి అనేక రుగ్మతులను ఈ సరళ అభ్యాసం నయం చేయగలదు. మందు మాకుల కంటే ఇది సులభ చికిత్స. 
7. మానసిక ఆటంకాలను తొలగించాలి : 
    సామాన్యంగా జీవితం అని మనం అంటున్నపుడు మనలను మాత్రమే పరిగణించుకొంటూ, మించిపోతే మన చుట్టూ వున్న ఒకరిద్దరు, మన కుటుంబం అనే మేరకే మన పరిధిని విస్తరిస్తాం. మన చుట్టూ ఒక ప్రపంచం ఉంది, దాన్లో నానారకాల జీవితాలు అత్యంత వేగంతో పరుగిడుతున్నాయన్న విషయం గుర్తించం. మనం ప్రపంచ శక్తుల వలన బాధకు లోనవుతున్నాం. ప్రపంచ శక్తులు మన వలన బాధింపబడుతున్నాయి. ప్రపంచాన్ని నడిపించే శక్తినే ప్రాణం అంటున్నాం. ఈ ప్రాణం మనలో ప్రవేశించి, సంచరించి బయటకు రావడంలో ఆటంకం ఏర్పడినప్పుడే మనం వ్యాధి గ్రస్తులమవుతున్నాం. మన గత కాల కర్మల సంస్కారాలు, అనుభవాలు. వీటిలో అత్యథిక పాలు బాల్యావస్థలోను, యవ్వనంలోను జరిగిన సంఘటనులు ముద్రలు వీటిలో నిమ్నతర సంఘటనల ముద్రలు కూడ ఉండవచ్చు. ఈ మానసిక ఆటంకాలు వీటిని ఎదుర్కొని తొలగించుకోవాలి. వీటిని ఎదుర్కొక మనం జీవితాన్ని చక్కదిద్దుకోవడమన్నది సాధ్యంకాని పని. తీవ్ర ప్రార్ధన చేయడం ద్వారా మనసిక ఆటంకాలను తొలగించుకోవచ్చు. చేదించజాలని అడ్డంకులన్నింటిని చొచ్చుకుపోగలది భగవత్కృప. 
8. చైతన్యతను వికసింపజేయాలి : 
    జీవితం అన్నది ఒక మహా చైతన్యశక్తి ప్రవాహం. ప్రతి ఒక్కరిలోనూ అన్నమయ, ప్రాణమయ అంటూ ఐదు కోశాలు పైన చెప్పుకున్నాం. ఈ ఐదు కోశాలకు ఆధారంగా విరాజిల్లుతున్నది. ఈ ఐదు కోశాలను ఒక చక్రంగాను, ఆత్మను అవి కలిసే కేంద్రంగాను పనిచేస్తాయి. ఈ ఆత్మ సంకల్పమనే మహాశక్తితో ఈ ఐదు కోశాలను, అక్కడ గెంతుతూన్న ప్రాణం వర్తనను నియంత్రిస్తుంది. సామాన్యంగా ఈ సంకల్పం మనలో పవిత్రంగా ఉండదు. అది పవిత్రమై రూపుదిద్దుకున్నప్పుడు మన వల ఈ ఐదు కోశాలను నియంత్రింప వీలవుతుంది. మనం కోరిన కోశంలోకి కోరినట్టే ప్రాణాన్ని పంప మన వలన సాధ్యమౌతుంది. ఈ చైతన్య శక్తి ప్రవాహం మన రుగ్మతులను నివారించి మనలో నూతన శక్తిని ఆహ్లాదాన్ని నింపుతుంది. ఇది అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు. అనేక ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించిన యోగులు మాత్రమే దీన్ని చేయగలరు. కాని మనం ప్రయత్నిస్తే మనం అందరమూ ఒక రకమైన అంతరిక నిఘూ స్థితిని పొందగలం. ఈ స్థితిని పొందడమే 'చైతన్యాన్ని వికసింపచేయడం'. 
9. ఆత్మచేతనతో జీవించాలి : 
    సామాన్యంగా మన జీవిత విధానం, అంగడి వీధిలో నడిచిపోతున్న ఒక దున్నపోతు స్థితిని పోలి ఉంది. ఆ అంగడి వీధిలో ఏవేవో కార్యకలాపాలు జరగుతుంటాయి. కాని ఆ దున్నపోతుకు దాన్ని గురించిన ఎలాటి స్పృహ ఉండదు. అట్లే మనమూ మన చుట్టూ ఈ ప్రపంచంలో జరుగుతూన్న దేన్ని గురించీ పట్టించుకోక ఏదో ఒక శక్తి మనలను యీడ్చుకుపోయే బాటలో వెళుతున్నాం. ఇలా కాక, మన జీవితాన్ని మనం క్రమశిక్షణలోకి తీసుకరావచ్చు. ఇందుకు విపస్సనం వంటి ఎన్నో మార్గాలున్నాయి. అతి శ్రేష్టమైన మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా మనస్సును క్రమబద్దం చేసి, వ్యాధిగ్రస్తమైన చోట దాన్ని పరపినప్పుడు వాతం, కడుపుకు సంబంధించిన రుగ్మతల వంటి వాటినే నివారించవచ్చు. 
10. ప్రపంచ ప్రాణంతో సంసర్గం లేక ప్రార్ధనం అవసరం :
    ప్రార్ధన ద్వారా తమ సమస్యలన్నింటిని పరిష్కరించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిండివున్న ప్రాణంతో మనం కలిగించుకొనే సంసర్గమే అది. శక్తి గనియైన దానితో మనం సంసర్గం పెట్టుకొన్నప్పుడు అది మనలో నిండి మనకు అవసరమైన అన్నిటినీ చేస్తుందిచ అధిగమించలేని అవరోధాల నన్నింటిని అధిగమించి మన పొందవలసిన దాన్ని ప్రాప్తింప చేస్తుంది. ఈ విధంగా దేహారోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత అన్నిటినీ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది జనం ప్రార్ధన ద్వారా పొందుతున్నారు. 
    ఈ పది అంశాలన్నీ చూడాగనే మొదట్లో విస్తుపోతున్నట్లు అనిపిస్తుంది. అందునా కాస్త వయస్సు మీరిన పిదప ప్రారంభిచేవారికి ఇది ఎంతో కఠినమైనదనడంలో సందేహం లేదు. 
    సాధించలేనిదంటూ ఏదీ ఈ లోకంలో లేదు. ప్రశ్న ఏమిటంటే మనకు కావాలా కాదా అన్నదే. కావాలంటే మనం సంపూర్ణ ఆరోగ్యం పొందే తీరుతాం. 

మేలుకోలు (తెల్లవారుజామున) : ఆరోగ్యవంతుడైన మనిషి తన ఆయుర్ధాయాన్ని కాపాడుకొనటానికిగాను బ్రహ్మ ముహూర్తములో అనగా తెల్లవారుజామునే లేవాలి. వెంటనే పాపపరిహారార్ధమై దైవ ప్రార్ధన చేసుకోవాలి. లేచిన వెంటనే అద్ధంలో తన ముఖాన్ని చూచుకోవడం మంగళ కరమైనది. కాంతిన పుష్టిని, బలాన్ని ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. కాంతిని పుష్టిని, బలాన్ని ఆయుర్వృద్ధిని కలిసిస్తుంది. సూర్యుడు ఉదయించుటకు ముందు కాలమును బ్రహ్మ ముహూర్తమని పేరు. బ్రహ్మ శబ్దము జ్ఞానమును జెప్పుచున్నది. జ్ఞాన స్వరూపియగు భగవంతుని ప్రార్ధించుటకు యుక్తమైన కాలగుట చేతను, జ్ఞానాభివృద్ధిని జేసుకొనుటకు తగిన కాలమగుట చేతను ఈ కాలమును బ్రహ్మముహూర్తమనబడుచున్నది. తెల్లవారుజామునే లేచి చదవలెయును నార్యోక్తి లోని రహస్యము ఇదే. తెల్లవారుజాముననే సుమారు ఇరువై ఔన్సుల చన్నీళ్ళు త్రాగు మనిషి వ్యాధి, ముసలితనం లేకుండా నూరేళ్ళకు పైగా జీవిస్తాడు. దీని వలన చాలా రోజులగ బాధించు మలబంధం గూడ పోతుంది. 
    తెల్లవారుజాముననే మల విసర్జం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, ప్రేగులరవడం, కడుపుబ్బరించడం, కడుపు బరువుగ తోచడం వుండదు. మల మూత్రాలను విసర్జింఛాలని సూచన కలిగినపుడే వాటిని విసర్జించాలి. మౌనంగాను, ఒళ్ళంతా మూసుకుని అదే మనస్సతో మలమూత్రాలని విసర్జించాలి. మల మూత్రాల వేగం కలిగినపుడు వాటిని విసర్జించకుండా యుండరాదు. మల మూత్రాల వేగం రానప్పుడు వాటిని బలవంతంగా విసర్జించరాదు. ముక్కి ముక్కి మల విసర్జ చేయుట వలన తలనొప్పి, నరముల బలహీనత, రొమ్మునొప్పి, మూల వ్యాధి మొదలగు రోగములు కలుగవచ్చును. 
స్నానం : చన్నీళ్ళ స్నాం మంట, బడలిక, చెమట, దురద, దాహం పొగొడ్తుంది. గుండెకు మంచిది. మురికిని, సోమరితనాన్ని, పాపాన్ని హరిస్తుంది. సంతోషాన్ని, ఇంద్రియాలకు చురుకుతనాన్ని ఇస్తుంది. మగతనాన్ని పెంచుతుంది, ఆకలి కలిగిస్తుంది. వేడి నీళ్ళతో మెడవరకు మాత్రమే స్నానం చేస్తే శరీరమంతా బలం వస్తుంది. తలస్నాం చేస్తే తల వెంట్రుకలకు, కండ్లకు బలం తగ్గుతుంది. 
భోజనం : మనిషి ఉదయం, రాత్రి రెండుసార్లే భోంచేయాలి. మధ్యలో భోంచేయరాదు. ఉదయం భోజనము తొమ్మిది గంటలలకులోగా చేయరాదు. పన్నెండు గంటల తర్వాత చేయరాదు. రాత్రి భోజనాన్ని తొమ్మిది గంటలలోగా చేయ్యాలి. తోచినపుడల్లా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే అవయవాలకు విశ్రాంతి దొరకనందున అవి బలహీనతను చెందుటచేత జీర్ణాశయ సంబంధమైన వ్యాధులు కలిగేందుకు అవకాశం కలుగుతుంది. భోజనం చేయదగిన కాలంలోనే చేయాలి. తనకు సరిపడుట్టిదీ శుభ్రమైనట్టిదీ, నెయ్యిలాంటి క్రొవ్వు పదార్ధం కలిసిందీ, కొంచెం పలుచగా వుండేదీ అగు ఆహారాన్నే తినాలి. మరీ చల్లారి పోయిందీ, తేలికగా జీర్ణం కానిదీ అగు ఆహారాలను తినరాదు. తీపి కొంచెం ఎక్కువగా నుండి అరురసాలూ కలిసిన ఆహారాన్నే తినాలి. మిక్కిలి త్వరత్వరగానూ భోంచేయరాదు. మిక్కిలి మెల్లగానూ భోంచేయకూడదు. స్నానం చేసిన తర్వాతే, ఆకలెత్తిన పిదపే భోంచేయాలి. కాళ్ళు చేతులు కడుకునే, ఏకాంతంలోనే భోంచేయాలి. ఆహార పదార్దాన్ని దేన్నీ దూషించకుండా, మౌనంగా తనకు ఇష్టమైనదాన్ని, ఇష్టమైనవారితో కూడా ఇష్టమైన వారు వడ్డించగా భోంచేయాలి. కడుపు యొక్క నాలుగింట రెండు భాగాలను అన్నం మొదలగు గట్టి ఆహా పదార్ధాలతో నింపాలి. మూడవ భాగాన్ని నీళ్ళు మొదలగు ద్రవ పదార్ధాలతో నింపాలి. నాల్గవ భాగాన్ని వాయువు మొదలగు దోషాలకు తావుగా విడిచి పెట్టాలి. తడి కాళ్ళతోనే భోజనం చేయ్యాలి. దీర్ఘ జీవితాన్ని పొందుతాడు. పొడి కాళ్ళతో నే నిద్రించాలి. భోజనం చేసేటప్పుడు మనస్సుకు మంగళకరమైన వస్తువులు మాత్రమే చూడాలి. దీని వలన అర్ధాయువు, ధర్మం పెరుగుతుంది.
పగటి నిద్ర : వేసవి కాలములో తప్ప మిగిలిన రోఉలలో పగలు నిద్రపోవుట వలన శ్లేష్మపిత్తాలు పెరుగుతాయి. కాబట్టి ఎండాకాలంలో తప్ప మిగతా రోజులలో పగలు నిద్రపోకూడదు. వూబ శరీరం కలవాళ్ళూ, ప్రతి రోజూ నెయ్యి మొదలగు వానిని ఎక్కువగా పుచ్చుకొనేవారూ, కఫ శరీరం కలవారూ, కఫసంబంధమైన రోగాలు కలవారూ, వీర్యహీన విషంతో బాధపడేవారూ ఎప్పుడూ పగలు నిద్ర పోకూడదు. పగలు నిద్ర పోవటం వలన పాండురోగము తలనొప్పి, తిమ్మిరి, శరీరం బరువుగా తోచుట, ఒళ్ళు నొప్పి, ఆకలి, లేకుండుట రొమ్ము నందు నెయ్యి వంటి జిడ్డు పదార్ధము పూసినట్లుండుట, వాపు, అరచి, డోకువచ్చునట్లుండుట, పడిశెము, అరతలనొప్పి, దద్దులు, తలలో చుండు, కురుపులు, దురద, సోమరితనం, దగ్గు, గొంతుకు సంబంధించిన రోగాలు సంభవిస్తాయి.     

No comments:

Post a Comment