Saturday, April 11, 2015

ఆసనములు - యోగాసనాలు


ఆసనములు
    ఆసనము అంటే శరీరములో ఏ భాగము కదలకుండా శరీరములో ఏ భాగంలోనూ నొప్పి లేకుండా కూర్చేనే స్థితి. కపిల మహర్షి తన సాంఖ్య దర్శన గ్రంధంలోనూ, పంజలి యోగసూత్రాలలోనూ 'సిథర సుఖమ్‌ ఆసనమ్‌' అని నిర్వచించారు. ఈ ఆసనాలు శరీర స్ధితి స్థాపక శక్తిని, పటిష్టతను, పటుత్వాన్ని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 'ఆరోగ్యమే మహాభాగ్యం' కనుక క్రమబద్ధంగా యమ, నియమాలు పాటిస్తూ ఆసనాలు అభ్యాసం చేస్తే చక్కని ఆరోగ్యము పొందవచ్చు. ఆసనాలు ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయి. ఆటుపోట్లకు తట్టుకునే శక్తిని శరీరానికి కలుగజేస్తాయి.
    ఆసనాలు యోగసాధనకే పరిమితమని పతంజలి అభిప్రాయం. ఇప్పటి అవసరాన్ని బట్టి ఆసనాలు ఆరోగ్యానికీ అత్యంత అవసరమే. అయితే ఆసనాలు కండర బలానికి తోడ్పడవు. ఆసనాలు రక్త ప్రసరణను సాఫీగా చేసి మాలిన్యాలను నివారించి శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. నాడీ మండల చన ప్రగతికి, కార్యతీవ్రతకు దోహదపడతాయి. వివిధ అంతఃగ్రంథులను, అవయవాలను ఉత్తేజరపచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. ఆసనాలు.
    యోగాసనాలకు వెన్నుపాము, మెడ, తల నిటారుగా ఉంచాలి. దాని వలన వెన్ను పాములోని నాడీ మండలంకు ఎట్టి ఒత్తిడి పడకుండా పూర్ణ స్వేచ్ఛ కలిగి యుంటుంది. బూమికి లంబముగా వెన్ను పామును నిలిపినందున నాడీ శక్తి, నాడీ శుద్ధి కలుగుతాయి. ఆసనం యొక్క ముఖ్యోద్ధేశం మనస్సును స్వాధీనంలోనికి తీసుకొని రావడం, కొన్ని ప్రత్యేక రుగ్మతలకు కొన్ని ప్రత్యేక ఆసనాలు గురువుగారి సలహాలు, సూచనలు పాటిస్తూ చేయాలి.
    ఆసనాలవల్ల అంతః గ్రంథులన్నీ తేజస్సుగా పనిచేస్తాయి. ఆరోగ్యం చెక్కు చెదరదు. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు, జీర్ణమండలం, జీర్ణక్రియ, చిన్నప్రేగు, - మొదలైన అన్ని భాగాలు ఆరోగ్యంతో అలరారుతూ తమ విధులను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తూ వుంటాయి. ఫలితంగా వ్యాధులు దరిచేరవు. దరిచేరిన వ్యాధులు క్రమేణా అదృష్యమౌతాయి. ఆహార విహారాలలో నియంత్రణ క్రమం తప్పని అభ్యాసం అంథులేని ఆనందానికి, ఆరోగ్యానికి కారణబూతమన్నది మరచిపోకూడదు.
ఆసనాలు వేసేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు : 
ఆసనాలు వేసే ప్రదేశంగాని, గదిగాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ధారాళముగా వచ్చేటట్లు చూసుకోవాలి. పరిశుభ్రమైన గాలి ఊపిరిత్తులకు చాల మంచిది. కాబటిట& సువాసనలు వచ్చే విధంఘా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తరువాత నేలపై చాపను పరచి, దానిపై మెత్తటి శుభ్రమైన రగ్గుగాని, దుప్పటిగాని వేసి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి. మరీ ఎత్తుగానీ, మరీ పల్చగా గాని ఉండరాదు.
    ఉదయం 4 గం. కాలంలో లేచి, కాలకృత్యాలు ముగించాలి. మలబద్ధకమే అన్ని రోగాలకూ ఆదికరాణం కాబటిట& ఆవిషయంలో అశ్రద్ధ అస్సలు చూపకూడదు.
    ఖాళీపోట్టతో ఆసనాలు వేయాలి. నిశ్శబద్ధాన్ని విధిగా పాటించాలి. ఎంతవరకు వంగాను?
ఇంతేనా? ఇంక చాలునా?... అంటూ ప్రశ్నలతోనూ, అనుమానాలతోనూ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. 'నిశ్శబ్ధం' మనస్సుకు జ్ఞానదీప్తిని కలిగిస్తుంది. వివిధ అవయవాలపై దృష్టిని కేంద్రీకరించే వీలు కల్పిస్తుంది. నిదానం ప్రధానము. చాలా నెమ్మదిగా, సూచనానుసారం ఆసనాలు వేయాలి. మొదట్లో సెకన్లతోను, నిముషాలతోనూ సరిపెట్టి కాలక్రమేణా సమయం పెంచుకోవచ్చు. ఎక్కువ సమయం వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందనుకోరాదు.
    మనస్సును దివ్యబావాలతో నింపి, అంతరంగిక మౌనం పాటిస్తూ ఆసనాలు వేయడం వల్ల ఆశించిన ఫలితం తప్పక సిద్ధిస్తుంది. సాయంత్రం ఆసనాలు వేసేవారు మూడు, నాలుగు గంటల క్రితం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఏఉండాలి. వేయబోయే సమయానికి పొట్ట ఖాళీగా ఉంచాలి. ఒక గ్లాసుగాని, అరగ్లాసుగాని మంచి నీరు తాగి ఉపక్రమించాలి.
    తరువాత అత్యంత ముఖ్యమైనది : ఆసనాల సమయంలో శ్వాసక్రియ జరిపే విధానం, అసంబద్ధంగా, నియమరహితంఘా శ్వాసిస్తూ ఆశనాలు వేస్తే ఫలితం రాకపోగా ప్రమాదం ముంచుకొస్తుంది. ముందుకు వంగి వేసే ఆసనాలకు మొదట పూర్తిగా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదులతూ, పొట్ట వెనుక్కులాగుతూ నిదానంగా వంగాలి అదే వెనక్కు వంగే సమయంలో పూర్తిగా శ్వాస వదిలేసి నిదానంగా పీల్చుతూ వంగాలి ఈ శ్వాస టెక్నిక్‌ చిక్కిందంటే ఆసనాల్లో మీరు అద్భుతమైన ప్రతిభను కనబరచగలరన్నమాటే. 
ఆసనాలకు సిద్దం చేయండం
ా    మనం అష్టాంగయోగ తరగుల విధంగా యమ, నియమ ఆసన, ధ్యాన ధారణ అని చెప్పుకున్నాము కదా.
ా    అందులో మూడవది అయిన ఆసన విధాన్ని తెలుసుకునేదే క్లాస్‌.
ా    ఆసనాలు 80,000/- ఉన్నాయి
ా    ఇన్ని రకాల ఆసనాలు ఒక యోగ మాస్టర్‌ కి మరియు యోగ సాధనలో నిమగ్నమయ్యె వారికి అవసరం.
ా    నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలో జీవిస్తున్న మనకు అన్ని రకాల ఆసనాల సాధన చెయ్యడానికి ఎంఓ సమయం పడుతుంది.
ా    అయినా దైనందిన జీవితంలో శారీరక మానసిక జీవితానికి సరిపడ ఆసనాలు ఇక్కడ నేర్చుకోబోఉన్నాము
ా    ఆసనాలు అంటే చాలా మంది భయపడతారు.
ా    కాని ఇక్కడ చాలా సులభంఘా నేర్చుకుంటారు.
ా    మరియు మీ శరీరం కూడ ఆసనాలు వేయడాన్కి అనుకూలంగానే ఉన్నది.
ా    ఆసనాలకు కార్పెట్లు, దుప్పట్ల మందం 6 మీ.మీ. ఉండాలి. పరుపుల మీద చేయరాదు.
ా    తల నుండి క్రింది వరకు ఒకే ఎత్లుఓ ఉండాలి. (ఎత్తుపల్లాలు ఉండకూడదు)
ా    దుప్పట్ల మధ్యలో ముడతలు ఉండరాదు.
ా    ఆసనానికి ఆసనానికి మధ్య ఇస్త్రి చేస్తున్నట్లుగా చెయ్యాలి.
ా    శరీరంపై దుస్తులు వదులుగా శరీరాన్ని వంచడానికి వీలుగా అనుకూలంగా ఉండాలి. బెల్డ్‌ ఉంచరాదు, జీన్స్‌ ప్యాంట్‌ మందం బట్టలు వేయవద్దు.
ా    కళ్ళజోడు ఉండరాదు, అండర్‌ గార్‌మెంట్స్‌ సరియిన ఫిట్‌నెస్‌తో ఉండాలి, తప్పని సరిగా ఉపయోగించాలి.
ా    ఖాళీ కడుపుతో ఆసనాలు చేయ్యాలి, ఎప్పుడు చేసినా సరె. 
ా    శరీరంపై గోల్డ్‌ ఆర్నమెంట్స్‌, గాజులు, ఉంగరాలు, ఇబ్బంది కలిగించే వస్తువులు ఉండరాదు.
ా    ప్రతి ఆసనాన్ని నిధానంఘా వెయ్యాలి నిదానంగా బయటకు రావాలి.
ా    మొదటగా నేర్చుకుంటున్న మీకు మేము చూపిన విధంఘా చేయాలని గాని బలవంతంగా చేయరాదు.
ా    ఆసనాలు వేసేటప్పుడు శ్వాసకు సంబంధం లేదు.
ా    ఆసనంలోకి ఎళా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి.
ా    ఆసనాలు వేసేటప్పుడు పళ్ళు బిగించడం, మోహాన్ని బిగించడం చేయకూడదు. 

యోగాసనాలు

1) శవాసనం : 

ఎడమవైపు నుండివెల్లకలా పడుకోవాలి
రెండు అరచేతులను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా శరీరం ప్రక్కన ఉంచాలి.
రెండు పాదాల మధ్య అర అడుగు దూరం ఉండాలి. తలను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉంచి కండ్లు మూసుకొని ఉండాలి.
శరీరాన్ని పూర్తి విశ్రాంతిగా వదలివేయాలి.
ఎడమవైపు తిరిగి చేతుల సపోర్టుగా నిదానంగా బయటకు రావాలి.
2) శరీర మర్ధన : 
చేసిన ప్రతి సారి నిదానంఘా ప్రక్కప్రక్కన నొక్కుతూ గుండె దగ్గరకు చేర్చాలి.
ఎడమ కాలు, కుడి కాలు
ఎడమ చేయి, కటి చేయి
పొత్తి కడుపు, లోయర్‌ స్టమక్‌
లోయర్‌ బ్యాక్‌, అప్పర్‌ బ్యాక్‌
ఫేస్‌ మసాజ్‌, గడ్డం తో మొదలు
3) శవాసనం 
4) రాకింగ్‌, రోలింగ్‌, సైకిలింగ్‌ 
ఎ) రాకింగ్‌ - శవాసనంలో ఉండి కాళ్ళను మడిచి తొడల భాగాన్ని, ఛాతి పైకి తీసుకురావాల. రెండు చేఉలతో బంధించాలి. శరీరాన్ని ముందుకు వెనుకు నిదానంగా 5 సార్లు మ్యూవ్‌ చేయ్యాలి.
బి) రోలింగ్‌ :
పై విధంగా లాక్‌ చేసి శరీరాన్ని ఎడమ వైపుకు పూర్తిగా వాల్చాలి. మరలా కుడి వైపు కూర్చోవలి. ఇలా రెండు వైపులా 6 సార్లు చేయ్యాలి.
సి) సైక్లింగ్‌ :
శవాసనంలోనే రెండు కాళ్ళను జతగా పైకి లేపాలి. రెండు అర చేతులను మోచిప్పలపై ఆనించి సైకిలింగ్‌ చేయాలి.
ఉపయోగాలు : 1) వెన్నుముకను చైతన్య పరచును
2) జీర్ణవ్యవస్ధను సరి చేయును.
5) శవాసనం 
6) ఎ) అర్ధ పశ్చిమోత్తాసనం : 
సుఖానంలో కూర్చొని ఎడమ కాలు చాచి కుడి కాలు మడిచ పాదాన్ని ఎడమ తొడకు ఆనించాలి.
రెండు చేతులను శరీరం ప్రక్క నుండి నిదానంగా పైకి తీసుకురావాలి.
మెల్లగా శరీరాన్ని ముందుకు వంచుత రెండు చేతులతో పాదాన్ని పట్టుకొని తల నుదిటి భాగాన్ని మోకాలుపై ఆనించాలి, మోకాలు పైకి లేవకుండా ఆనించాలి.
బి) అలానే కుడికాలు చాచి, ఎడమ కాలు మడిచి చెయ్యాలి.
సి) పూర్ణ పశ్చిమోత్తాసనం
అలాగే రెండు కాళ్ళు జతగా చాచి, ఉంచి చెయ్యాలి.
ఉపయోగాలు : 
1) పిరుదుల భాగంలోని నరాలను వదులుగా ఉంచును.
2) తొడలు, పొట్ట భాగంలోని క్రొవ్వును తగ్గించును.
3) డయాబెటీస్‌ తగ్గించును.
4) వెన్నుకు రక్త ప్రసరణ కలిగించును.
7) శవాసనం :
8) సర్వాంగసనం : 

శవాసనంలో ఉండి అరచేతులతో పిరుదులు పట్టుకొని ఒక్క సారిగా, నిదానంగా నడుము వరకు కాళ్ళను పైకి లేపాలి.
ఎ) వైడెనింగ్‌ లెగ్స్‌
బి) వాకింగ్‌ లెగ్స్‌
సి) సిసర్స్‌
డి) సైక్లింగ్‌, రివర్స్‌ సైక్లింగ్‌
ఇ) పద్మాసనం
ఎఫ్‌) నడుము వద్ద ట్విస్టింగ్‌
నిదానంగా కాళ్ళను మడచాలి. రెండు చేతులతో శరీరాన్ని క్రిందకు నిదానంగా వదలాలి.
ఉపయోగాలు : 
1) జీర్ణ వ్యవస్ధ శుద్ధి అగును.
2) నాడి వ్యవస్ధ సమత్వ స్థితికి వచ్చును.
3) రక్తం మొదడుకు సక్రమంఘా అందించబడును.
4) ఆస్దమా, బ్రొంకైటీస్‌ నుండి ఉపశమనం కలిగించును.
5) పొట్ట భాగంలో క్రొవ్వు కరిగించును.
9. శవాసనం
10. హలాసనం 

సర్వాంగసనంలో పూర్తిగా కాళ్ళు పైకి ఎత్తిన తరువా నిదానంగా కాళ్ళను ఛాతి మీదుగా వంచుతూ తల దగ్గర భూమి పైకి ఆనిస్తూ బ్రొటన్‌ వ్రేళును భూమిపై తాకించాలి. చేతులను నడుముకు ముందు భాగములో భూమిఐ బోర్లించి ఉంచాలి.
ఉపయోగాలు : 
1) మూత్రపిండాలు, కాలేయం, పాంక్రియాస్‌ను, మల బద్దకం తగ్గించును
3)పైల్స్‌కు ఉపశమనం కలిగించును
11) మకరాసనం : 
బోర్లాపడుకొని తలను ఎడమ వైపుకు త్రిప్పి ఎడమ కాలు మడచి ఎడమ చేఇని ముఖమునకు ముందు భూమిపై బోర్లించాలి. కుడిచేతిని తలపై భాగంలో భూమిపైన బోర్ల పెట్ట ఉంచాలి.
12) భుజంగాసనం : 
పూర్తి బోర్లా పడుకొని అరచేతులను భుజాల క్రింద, ఛాతి ప్రక్క భూమిపై ఆనించాలి. నిదానంగా బొడ్డు వరకు పాము పడగలాగా సాధ్యమైనంత పైకి ఎత్తాలి.
    ఆ తరువాత చూపు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండవలెను. పాదాలు ఆకాశంవైపు చూస్తుంటాయి.
ఉపయోగాలు : 
1) లైంగిక సమస్యలు ఉండవు. 
2) మలబద్దకం తగ్గించును
3) డిస్క్‌ తప్పిఉంటే దానిని యధాస్ధానము లోకి తెచ్చును.
4) తిమ్మురులు తగ్గించును.
13) మకరాసనం :
14) శలభాసనం : 

ఎ) అర్ధశలభాసనం (ఎడమ) : పూర్తి బోర్లా పడుకొని రెండు చేతులను ఆది ముద్రలు చేసి తొడలు క్రింద ఆనించి ఉంచాలి.
తలను ఎడమవైపు తిప్పి ఎడమకాలు మాత్రమే మోకాలు వంగకుండా సాధ్యమైనంత పైక లేపాలి.
బి) కుడివైపు
సి) పూర్ణ శలభాసనం : పూర్తి నేలపై బోర్లాపడుకొని గడ్డం నేలకు ఆనించి రెండు కాళ్ళను జతగా పైకి లేపాలి.
ఉపయోగాలు : 
1) గుండె జబ్బులు వాళ్ళకు చాలా మంచింఇ.
2) సయాటికా ప్రాబ్లం పోతుంది. 
15) మకరాసనం : ఎడమవైపు
16) వక్రాసనం : 
సుఖాసనంలో కూర్చొని ఎడమ కాలు మడచి పాదాన్ని కుడి తొడ కింద ఉంచండి.
కుడి పాదాన్ని ఎడమ కాలు బయట ఉంచాలి.
ఎడమ చేతిని ఛాతి మీదుగా తీసుకువచ్చి కుడి పాదాన్ని పట్టుకోవాలి.
కుడి చేతిని వీపుపైన ఆనించాలి.
తలను కుడి వైపుకు పూర్తిగ వెనుకకు త్రిప్పాలి.
బి) అలానే కుడికాలు మడచి చేయ్యాలి.
ఉపయోగాలు : 
1) నడుము కండరాలను చైతన్యం చేస్తుంది.
2) నాడి వ్యవస్ధలోని 72000 ప్రాణ నాడులను ఉత్తేజం చేస్తుంది.
3) ఎడ్రినల్‌ గ్రంధులు సక్రమంగా పని చేయునట్లు చేయును.
17) మహముద్ర లేదా యో ముద్ర  
పద్మాసనంలో గాని అర్ధపద్మాసనములోగాన లేదా సుఖాసనంలో గాని కూర్చుని చేతులు వెనుక పట్టుకొని ఉంచాలి. తలను నిధానంగా వెన్నుముఖను ముందుకు వంచుతూ తలనుదిటి భాగాన్ని నేలపై ఆనించాలి. (గర్భిణి స్త్రీలు చేయరాదు).
ఉపయోగాలు : 1) పొట్టలోని కండరాలను ఉత్తేజ పరచును. 2) ఛాతి పెరుగుదలకు ప్రోత్సహించును.
18) పాదహస్తాసనం : 
నిల్చుని రెండు చేతులను నిదానంగా శరీరం ప్రక్క భాగం నుంచి పైకి లేపాలి చేతులను కలిపి కలి ముని వేళ్ళపైన స్ట్రెచ్‌ చేయ్యాలి. మెల్లగా చేతులతో సహా శరీరాన్ని ముందుకు వంచూ చేతులతో పాదాలను పట్టుకోవాలి. తల నుదిటి భాగాన్ని మోచిప్పలపై ఆనించాలి.
ఉపయోగాలు : శరీరంలో వ్యాధి నిరోక శక్తి పెంచి మలినాలను శుద్ధి చేయును.
19) భ్రమరి : శవాసనంళో ఉండి పూర్తిఆ శ్వాసను పీల్చుకొని ''ఉమ్‌'' అనే శబ్దం చేస్త శ్వాసను బయటకు వదలాలి.
ఉపయోగాలు : శరీరాన్ని మనసుకు పూర్తి విశ్రాంతిని ప్రశాంతను ఇచ్చును
20) శవాసనం 
21) భ్రమరి : 

శవాసనంలో పడుకొని పూర్తిగా నోరు మూసుకొని ముక్కు ద్వారా గాలిని వదులుతూ శబ్దం చేయాలి.
ఉపయోగములు : గొంతుకు సంబంధించిన లోపాలు నివారింపబడును. స్వరమాధ్యం పెరుగుతుంది.
20) శవాసనం
22). ధనురాసనం : 

ముఖం భూమిపై ఆనించి ఛాతి పై పరుండవలెను. చేతులు ప్రక్కలనుంచవలెను. నెమ్మదిగ్కాఆళ్ళు వెనుకకు మడవవలెను. చేతులను వెనుకవైపున లేపవలెను. చేతులతో చీలమండలం పట్టుకొనవలెను. తల ఛాతిపైకెత్తవలెను. శరీరమంతా పొత్తికడుపుపై మోపవలెను. ఇలా 5 నుండి 6 సార్లు చేయవలెను.
ఉపయోగములు : ప్రేగులలో వాయు సంబంధమైన రుగ్మతులు తొలగిపోవును. సోమరితనం ఉండదు. అభ్యాసకులు శక్తి పూరితంగా, ఉత్సాహంగా పునరుజ్జీవనం పొందెదరు. 

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

No comments:

Post a Comment