Saturday, April 11, 2015

ఆహారం

ఆహారం
''అన్నాద్భూతానిజాయంతే, జాతాన్యన్నే వర్ధంతే
అద్యతే త్తిచభూతాని, తస్మాదన్నంతదుచ్యతే''
    ఆహారం నుండి ప్రాణ కోటి జనించుచున్నది, జన్మించిన ప్రాణులు అన్నము చేతనే వృద్ధి పొందుచున్నవి. ప్రాణులచే భక్షింపబడుచున్నది. ప్రాణులను భక్షించునది కావున దీనిని అన్నము అను పేరు వచ్చినది.
''అధ్యతే విధి వద్భుక్త మత్తి భోక్తారమన్యధాం
ఆయుష్యం స్వాస్ధ్యధం, పూర్వమన్యదైవేతరత్‌ స్మృతమ్‌''
    మితముగా/హితముగా భుజింపబడిన ఆహారం భోక్తద్వారా భక్షితమగును. దీనికి విరుద్దముగా సేవింపబడిన అన్నము భోక్తనే భక్షించును. అనగా అల్పాయుష్కరము, అనారోగ్యకారకం అగును.
''ఆహారః ప్రాణినః సద్యోబలకృతదేహద్ధారకః
ఆయుస్తేజః సముత్సాహః స్మౄత్యోజో అగ్ని వివర్ధనః'' 
    ఆహారం ప్రాణులకు సేవించినంతనే బలమును ఇచ్చును, శరీరంను వృద్ధి పొందించును. ఆయుష్షును తేజస్సును, ఉత్సాహమును, ఓజస్సును, అగ్నిని వృద్ధి పొందించును. కావున ప్రమాణయుక్తమున ఆహారంను స్వీకరించవలెను. 
''ఆహార శుద్ధౌ సత్వ్యశుద్ధిః
    అంతఃకరణ శుద్ది వలననే ఆలోచనలు, భావములు, శ్రద్ధాదిగుణములు క్రియలు పవిత్రములుగా ఉంఢును. మనుష్యుడు భుజించు ఆహారమును బట్టి అతని అంతఃకరణ స్థితి యేర్పడును. అంతఃకరణమునకు అనుగుణముగా శ్రద్ధయు ఉండును. ఆహారము శుద్దమైనచో అంతఃకరణము గూడ శుద్ధముగా ఉండును.
అన్నోపాసన :  
ప్రాణాలు అన్నమయాలు. అన్నం తినకపోతే ఇంద్రియాలు పనిచేయలేవు. ప్రాణాలు నిలువలేవు. అన్నం నుంచే జీవులు జన్మిస్తున్నారు. అన్నం వల్లే జీవిస్తున్నారు. అన్నంలోనే లయిస్తున్నారు. అందువల్ల 'అన్నమే ఆత్మ' అని ఉపాసన చేయాలి. అన్నమే ప్రాణంగా, ప్రాణమే మనస్సుగా, మనస్సే విజ్ఞానంగా, విజ్ఞానమే ఆనందంగా పరిణామం చెందుతూ ఉన్నది. కాబట్టి అన్నమే పంచవిధ కోశాలకూ మూలం. కాబట్టి అన్నాన్ని నిందిచకూడదు. (ఇది బాగాలేదు. దీన్ని మనుష్యులెవరూ తినరు ఈవిధమైన) అన్న నింద చేయకపోవటాన్ని ఒక వ్రతంగా భావించాలి. అన్నాన్ని పారవేయకూడదు. అలా దాన్ని సద్వినియోగం చేయటాన్ని వ్రతంగా భావించాలి. అన్నాన్ని వృద్ధి చేయాలి. దినదినమూ పెరిగే జీవుల ప్రాణాలు నిలపే అన్నాన్ని విరివిగా, సమృద్ధిగా ఏర్పాటు చేయటం వ్రతంగా భావించాలి. 'అద్యతే ఇతి అన్నమ్‌'. మనం (సకల ప్రాణికోటి) భుజించేది కాబట్టి దీనికి అన్నము అని పేరు. అంతేకాదు 'అత్తిఇతి అన్నమ్‌' (మననే భుజించేది) ఏ నియమం లేకుండా - ఎప్పుడుతలుచు కొంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది, ఎలా దొరికితే అలా - తినేవాడిని ఆ అన్నమే తినివేస్తుంది. అంటే అతని ఆరోగ్యాన్నీ, ఆయువునూ తగ్గించి వేస్తుంది. కాబట్టి కూడా దీనికి అన్నం పేరు అన్నాన్ని కాపాడుకోవాలి.
సాత్త్వికాహారము :  
ఆయువును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందించే రుచికరములైనవి, చమురుతో కూడినవి. మనోహరమైనవి, శరీరంలో చాలాకాలము నిలువ ఉండేవి అయిన పదార్దాలతో కూడిన భోజనం సాత్త్వికాహం, ఇది ప్రశస్తమైనది.
రాజసికాహరము : 
చేదు, పులుప, ఉప్పు, కారపు రుచులతో మిక్కిలి ఉషఅణం కలదై, సారంలేక, దాహాన్ని పెంచుతూ, శారీరకంగానూ, మనసికంగానూ దుఃఖాన్నీ, రోగాలనూ పెంపొందించే వస్తువులతో కూడిన భోజనం రాజసాహారం. 
తామసాహారము : 
చాలా కాలానికి ముందే వండినది, రుచిలేనిది, కంపు కొట్టేది, పాచిపోయినది, క్రిమి కీటకాదులు పశుపక్ష్యాదులు ఎంగిలిచేసి విడిచినది, పూజకు తగనిదీ అయిన భోజనం తాసాహారం. ఇది ఎంతమాత్రం తినుటకు పనికిరానిది. మనుష్యుల్లో కూడా ఈ విభాగం ఉన్నది. అంటే సత్త్వగుణం ప్రధానంగా కలవారూ, రజోగుణ ప్రదానులూ, తమోగుణ ప్రధానులును. వారి వారి గుణాలకు తగినట్లే వారు ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే శ్రద్ధ కలవాడు తన (సహజ) గుణాన్ని (శ్రద్ధను) తామసగుణాన్నుంచి రాజగుణానికీ, రాజసగుం నుంచి సాత్త్వికగుణానికీ మార్చుకోవాలి. అందుకు అహారంలో తగిన మార్పు చేసుకోవాలి. ఇది ఒక తపస్సు.
సమతులాహారం
శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిపడా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌ తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు : 
కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, కొవ్వు పదార్ధాలు, విటమిన్‌లు, ఖనిజ లవణాలు         నీరు, పీచు పదార్ధం.
కార్బోహైడ్రేట్స్‌ : శక్తిని సమకూర్చటం కోసం మనం తిన్న ఆహారంలోని చెక్కర, పిండి పదార్ధం ముక్కలు ముక్కఉ కింద విభజింపబడతాయి. ఇవి త్వరగా హరాయించుకు పోతాయి. అంటే అప్పుడు మీరు తిన్న ఆహారం ఎక్సర్‌సైజులు చేయటానికి ముందు తీసుకోదగ్గ ఆహారంగా భావించవచ్చు.
మాంసకృత్తులు :  మన శరీరంలో మాంసకృత్తులు జీర్ణమయాయ్క అమినోయాసిడ్స్‌ కింద విడుదలయి నూతన కణ నిర్మాణానికి ఇటుకలా ఉపకరిస్తాయి.
క్రొవ్వు పదార్ధాలు : క్రొవ్వు పదార్ధాలు శక్తి కేంద్రీకృతం కావటానికి (్పుళిదీబీలిదీశిజీబిశిలిఖి జూదీలిజీవీగి కింద) ఉపకరిస్తాయి. శరీరంలో హార్మోనులు, ఆజీళిరీశిబివీజిబిదీఖిరిదీరీ లాంటి రసాయన వాహకాలు తయారు కావటానికి సహకరిస్తాయి.
విటమిన్లు : విటమిన్లు శరీరంలోని వివిధ కణాల చర్యలకు ఉపయోగపడాతయి. గ్లూకోజ్‌లోని శక్తి రిలీజ్‌ కావటానికి ఉపయోగపడతాయి.
ఖనిజ లవణాలు : ఎదుగుదల, రిపేరు మోకానిజాలకి ఉపకరించే 16 రకాల ఖనిజ లవణాలున్నాయి. ఇవి పోషక పదార్ధాల నుంచి శక్తిని విడుదల చేయించటానికీ, కొత్త  కణ నిర్మాణానికీ సహకరిస్తాయి.
పీచుపదార్దం : జీర్ణక్రియ మీద ప్రభావాన్ని చూపుతూ, శక్తిని సమకూర్చే మిగతా పోషక పదార్దాలను శరీరం హరాయించుకునేట్లు చేయటం ద్వారా ఫైబర్‌ మన శరీరపు కణ పునర్నిర్మాణాన్ని (్పులిజిజి ఖలిశిబిలీళిజిరిరీళీ ని) క్రమబద్దీకరించాటనికి ఉపకరిస్తుంది.
నీరు : మనకు ముఖ్యావసరాలన ఆహారం, ఆక్సిజన్‌, రోగనిరోధక కణాల్ని దేహమంతటికీ అందిస్తూ ప్రవహించే రక్తంలో 83 శాతం నీరు ఉంది.
    దేహం తనలోని మలిన పదార్ధాలను చెమట, మూత్రం రూపాలలో నీటి ద్వారానే బయటికి విసర్జిస్తుంది. దేహంలో సరిపడా నీరు లేకపోతే ఈ మలిన పదార్దాలు లోపలే ఉండిపోయి శరీరాన్ని విషపూరితం చేస్తాయి. ఆహారం జీర్ణం కావడానికి నీరు ఎంతో అవసరం. సరిపడా నీరు తీసుకోకపోతే మలబద్దకం ఏర్పడుతుంది.
    మనం తాగే నీటిలో కొంత భాగం తప్పనిసరిగా కిడ్నీలగుండా ప్రయాణించి కిడ్నీలలోనూ, మూత్రకోశంలోనూ, ముత్రనాళంలోనూ ఉండే మలినాలను బయటకి పారదోలుతుంది. ప్రతిరోజూ మనలోని కిడ్నీలు అయిదు గ్లాసుల నీటిని ఉపయోగించుకుంటాయి. శరీరానికి సరిపడా నీరు లభించకపోతే చర్మం పొడిబారుతుంది. రక్తంలో నీటి శాతం తక్కువ అయినపుడు రక్తం లవణపూరితమై తనకు అవసరమైన నీటిని నోటిలోని లాలాజల గ్రంధుల నుంచి గ్రహిస్తుంది. ఫలితంగా నోరు పొడిగా అయి మనకు 'దప్పిక' అనుభూతి కలుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌
    ఇనుముకు తుప్పు పట్టడం ఆక్సీకరణ అనే రసాయన ప్రక్రియవల్ల జరుగుతుంది. ఆక్సీకరణ ప్రభావం వల్ల ఆహార పదార్దాలు గోధుమరంగుకు మారతాయి.
    ఆక్సీకరణ కలిగిస్తున్న పదార్ధంతో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన రసాయన పదార్ధం కలిపినపుడు అది ఆక్సీకరణ ప్రభావాన్ని తొలగిస్తుంది. ఉదారహరణకు నిమ్మరసాన్ని పిండారంటే ఆ పదార్ధం ఆక్సీకరణకు గురి కాకుండా చూస్తుంది. ఇక్కడ నిమ్మరసం యాంటీ అక్సిడెంట్‌గా పని చేస్తుంది.
    మన శరీరంలో కణజాలంలో సహజ సిద్దంగానే ఆక్సీకరణ ప్రక్రియ 'ప్రీ రాడికల్స్‌' అనే పదార్దాల ఉత్పత్తి జరుగుతుంది.
    మన శరీరంలో స్వల్పంగా ఏర్పడే పిరాడికల్స్‌ను కొన్ని బాక్టీరియా, వైరస్‌లతో సహజంగానే నశింపజేయ గలుగుతాయి. అధిక పరిమాణంలో ఉత్పత్తి చెందితే కణజాలాలు డామేజ్‌ చెందుతాఇ. ఇలా జరగడం వల్ల అవయవాలు విధులు నిర్వహించలేకపోవడం మరియు మనల్ని త్వరగా వృధాప్యానికి చేరువ చేస్తాయి.
    ఇలాంటి పిరాడికల్స్‌ శరీర భాగాలలోని కములలో అధికముగా ఉత్పన్నమైనప్పుడు  రోగాల తీవ్రత ఎక్కువగా ఉండును. ప్రకృతి అందించిన ఆహారం నుంచి మనకు సహజసిద్దంగా యాంటీ ఆక్సిడెంట్స్‌గా లభించే పోషక పదార్దాలు విటమిన్‌ 'ఎ', 'సి', 'ఇ', కాల్షియం.
    ఎ విటమిన్‌     :    పాలకూర, తోటకూర, మెంతికూర
                              క్యారెట్‌, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయి, రేగిపండ్లు
    సి విటమిన్‌     :    నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, టొమాట
    ఇ విటమిన్‌     :    బాదంపప్పు, మొలకెత్తిన గింజలలో, ఆకుకూరలలో
    నిత్యం అమృతాహారం సేవించడం ద్వారా ఈ ఆక్సీకరణ నుండి ఏర్పడిన పీరాడికల్స్‌ను తొలిగించవచ్చును. 
అమృఆహారం నిజాలు

    మన శరీరంళో ప్రతి రోజు ఎంతో జీవశక్తి వినియోగం అవుతూనే ఉంది. ఆ శక్తి కణముల మొదలు నుండి శరీర నడవడికకు అవసరమయ్యే అవయవాలు మరియు ఇంకా అన్ని వ్యవస్ధల యందు అవసరం. ఈ జీవశక్తి ఈ అమృతాహారంలో పుష్కలంగా ఉంది.
    ప్రకృతి అందించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొలకెత్తించిన విత్తనాలలో సహజమైన జీవము ఉంది. మరియు మాంసకృత్తులు, విటమిన్లు, లవణములు, ఆమ్లమములు, ఖనిజాలు, పీచుపదార్దాలు సంపూర్ణంగా ఉన్నవి. అవి శరీరమునకు సహజముగా అందడం ద్వారా శరీరమును శుద్ది చేయడము మరియు చైతన్యవంతం చేసి తగిన శక్తి ఇవ్వడం జరుగుతుంది.
అధిక బరువు : ప్రకృతి సహజసిద్దమైన ఆహారంలో ఉండే కొవ్వు పదార్దాలు, నూనె పదార్దాలు శరీర సమత్వ బరువుకు సహకరిస్తాయి మరియు అందులో ఉండే పీచుపదార్దాలు శరీరమట్టంలో పేరుకుపోయిన కొవ్వు పదార్దాలు మరియు నీరును క్రమంగా కరిగించగలుగుతుంది.
తక్కువ బరువు : కొన్ని ప్రకృతి పదార్ధాలైన ఉదా - క్యారెట్‌ జూస్‌, అరిటిపండు, కర్జూరము, ఆపిల్‌, డ్రై ఫ్రూట్స్‌ మొదలగునవి. ప్రకృతి పదార్దాలలో ఉండే మాంస కృత్తులు సహజ ప్రోటీన్స్‌ బరువు పెరగడానికి తోడ్పడతాయి.
జీర్ణ వ్యవస్ధ : ఈనాటి మానవుడు కృత్రిమ ఆహారాలకు మాత్రమే అలవాటుపడి నిత్యము సుఖముగా జరగవలసిన విరోచనము జరగడం లేదు. దాని వలన క్రమేణా కడుపులో గ్యాస్‌, మంట, పుండ్లు, ఫైల్స్‌కు కారణమవుతున్నాడు. అలాంటి స్థితి నుంఛి జీర్ణవ్యవస్ధను కాపాడుతుంది. మరియు నిదానముగా జీర్ణమయ్యి పూర్తి శక్తిగా మారుతుంది. మరియు శ్లేష్మాలు మిగలకుండా పూర్తిగా విసర్జించబడుతుంది.
శ్వాసకోశం : శ్వాసకోశం మానసిక వత్తిళ్ళ వల్లగాని కొన్ని ఆహారపు పద్దతుల వల్లగాని సక్రమంగా జరుపుకోలేక పోతున్నాడు. అక్కడ ఎన్నో రకాల కఫములు, వాతపు నీరు నిలువులుగా పేరుకొని సంపూర్ణ సంకోచ, వ్యాకోచాలకు దూరమవుతున్నాడు. అమృతాహారము వీటిని శుదిధ చేసి స్వస్ధత చేకూర్చును.
మనస్సు : ప్రకృతి అందించిన ఆహారంలో కొన్ని మానసికమైన గ్రంధులను ఉత్తేజపరచగలదు. మరియు మానవ శరీరంలో జరిగే మెటబాలిజం మెదడుకే సుమారు 50 నుండి 60 శాతం అవసరమవుతుంది. అలాంటి మోటబాలిజమ్‌ను సవ్యంగా జరిపే గుణం ఈ ఆహారమునకు కలదు.
నాడీ వ్యవస్ధ : నాడీ వ్యవస్ధలో జరిగే ప్రాణవాయువు సంచలనమునకు ఈ ఆహారము ఎంతగానో సహకరిస్తంది.
చర్మము : రక్తములోని మలినాలను శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మ కాంతివతంగా సృష్టించుకోగలము. మరియు అప్పటి వరకు ఏర్పడిన చర్మ రుగ్మతలకు కారణమైన మలినాలను బయటకు నెట్టిఏసి చర్మరుగ్మతల నుండి కాపాడును. చర్మము తన సహజ సౌందర్యమునకు చేరును.
రక్తం : మన శరీరాన్ని నిలబెట్టే ధాతువులలో ముఖ్యమైన స్ధానం రక్తానిది. మన బలం, కండపుష్టి, జీవనం చివరికి మన ఆయుష్యు వంటివన్నీ కూడా రక్తం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే 'రక్తం జీవస్య ఆధారం' ఈ రక్తం లోపిస్తున్నపుడు ముఖ్యంగా పొట్లకాయ, గుమ్మడికాయ, పచ్చి అరటి, దొండ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, ఖర్జూరం, గోధుమలు, పెసలు, కందులు, రక్త వృద్ధికి తోడ్పడతాయి.
అమృతాహారం ఉపయోగాలు
ా    రక్షిత ఆహారం
ా    తక్కువ సమయంలో పూర్తిగా జీర్ణం అవుతుంది.
ా    ప్రేవులలోని శ్లేష్మాలను పూర్తిగా విసర్జిస్తుంది.
ా    అధిక బరువును (ఒబేసిటి) తగ్గిస్తుంది.
ా    రక్తాని శుద్ది చేస్తుంది.
ా    చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
ా    మెదడును చురుకుగా ఉంచుతుంది.
ా    గాయాలను త్వరితంగా నయం చేస్తుంది.
ా    వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ా    సుఖమైన నిద్రను అందించగలదు.
ా    శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతుంది.
ా    అలసటను ఆమడదూరంలో ఉంచుటుంది.
ా    రక్తపోటు, మధుమేహ వ్యాధులను కంట్రోల్‌ చేయును.
ా    అల్సర్‌, ఎసిటిటీ నుంచి విముక్తి
ా    బూడిదగుమ్మడికాయ రసం విద్యార్ధులలో జ్ఞాపకశక్తిని అమితంగా పెంచును.
ా    సంకల్పబలం ద్విగిణీకృతం అగును.
ా    మీ శరీరం ప్రకృతికి అనుకూలంగా ప్రతి స్పందించి ఎనలేని శక్తిని చేకూరుస్తుంది.    
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

No comments:

Post a Comment